(జనవరి 31, 1914 – నవంబర్ 30, 2010)

నివాళులు

శ్రీ దయామాతగారు పరమపదించిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రేయోభిలాషులు మరియు స్నేహితుల నుండి మదర్ సెంటర్‌కి వేలాదిగా సందేశాలు—ఇమెయిల్‌లు, ఉత్తరాలు మరియు ఫోన్ కాల్స్—వచ్చాయి. కొంతమంది భక్తులు సంవత్సరాలుగా దయామాతో జరిగిన సమావేశాల నుండి స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు, అయితే ఆమెను వ్యక్తిగతంగా ఎన్నడూ కలవనివారు చాలా మంది ఉన్నారు, అయినా కూడా ఆంతరిక అనుసంధానం ద్వారా ఆమెతో సన్నిహిత సంబంధాన్ని అనుభవించారు.

ఇక్కడ అందించిన సారాంశాలు, ఈ ప్రియమైన ఆధ్యాత్మిక నాయకురాలితో ప్రజల వ్యక్తిగత అనుభవాల యొక్క గొప్ప పరిధిని తెలియజేస్తాయి, అయినప్పటికీ అన్నీ కూడా శ్రీ శ్రీ దయామాతగారి తత్వమైన బేషరతైన ప్రేమ మరియు కరుణ యొక్క ఏకీకృత ఇతివృత్తాన్ని ప్రతిబింబిస్తాయి.

“నీవు త్రికరణశుద్ధితో, వివేకంతో, ఆనందంతో ఎస్‌.ఆర్‌.ఎఫ్.కి మరియు దేవుడికి చేసిన సేవ నాకు చాలా సంతోషాన్నిచ్చింది. నీవు జగన్మాతలో జన్మించి, మరియు నీ ఆధ్యాత్మిక మాతృత్వంతో మాత్రమే అందరినీ ప్రేరేపించుగాక — నీ జీవిత ఉదాహరణ ద్వారా ఇతరులను దేవుడి వద్దకు తీసుకురావడానికి మాత్రమే. నీకు అనంతమైన ఆశీస్సులు.”

— పరమహంస యోగానంద

గౌరవనీయులైన భారతదేశ ఉపరాష్ట్రపతి, శ్రీ ఎం.హమీద్ అన్సారీ: “యోగదా సత్సంగ సొసైటీ/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షురాలు మరియు సంఘమాత శ్రీ దయామాతగారు పరమపదించినందున దయచేసి నా హృదయపూర్వక సంతాపాన్ని స్వీకరించండి.

“వ్యవస్థాపకులైన పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక వారసురాలిగా, శ్రీ దయామాతగారు 55 సంవత్సరాలుగా ఆయన లక్ష్యాలను మరియు ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళారు. ప్రపంచ మతాల మధ్య ఆవశ్యకమైన ఐక్యత మరియు సామరస్యాన్ని ప్రోత్సహించడంలో, ప్రజలందరి మధ్య సోదర భావాన్ని వ్యాప్తి చేయడంలో మరియు మానవాళిని తనలోని విశ్వాత్మగా సేవ చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.

“కలహాలతో దెబ్బతిన్న నేటి ప్రపంచంలో, ఈ ఆదర్శాలు సమయోచితంగా ఉన్నాయి. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ఈ ఆదర్శాలను వాస్తవికతలోకి మార్చడానికి మరియు మానవాళి మంచిగా ఉండడానికి మరియు మంచి చేయడానికి ప్రేరేపిస్తాయని నేను విశ్వసిస్తున్నాను.”

గౌరవనీయులైన ఝార్ఖండ్ గవర్నర్ శ్రీ ఎం.ఓ.హెచ్.ఫరూక్: “పరమహంస యోగానందగారి అగ్రశ్రేణి శిష్యురాలైన శ్రీ దయామాతగారు గతించడం పట్ల నేను సంతాపం వ్యక్తం చేస్తున్నాను….శ్రీ దయామాతగారు ప్రేమ, కరుణ మరియు భారతీయ సంస్కృతి యొక్క ఇతర కాలాతీత విలువలను వ్యక్తీకరించారు….నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసుకుంటూ, ఈ తీరని నష్టాన్ని భరించే శక్తిని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులకు ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.”

గౌరవనీయులైన ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ అర్జున్ ముండా: “శ్రీ శ్రీ దయామాతగారు ఇక మన మధ్యలో లేరనేది చాలా విచారము కలిగించే విషయం. ఇది భారతీయ ఆధ్యాత్మిక సమాజానికి తీరని నష్టం. సాధువులు చనిపోరు, పరమాత్మలో విలీనం కావడానికి ఇచ్ఛానుసారంగా తమ మర్త్య రూపాలను వదలివేస్తారని చెప్పబడింది. అలాంటి ఆత్మలు, మానవ శరీరం యొక్క పరిమిత సరిహద్దులను దాటి పూర్ణ విశ్వంలోకి విస్తరిస్తాయి.

“ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక ఆదర్శాలలో పూర్తిగా ఇమిడిపోయి వాటిని వ్యక్తీకరిస్తూ, శ్రీ శ్రీ దయామాతగారి జీవితం ప్రపంచ వేదికపై తూర్పు మరియు పాశ్చాత్య ఆలోచనా ప్రవాహాల యొక్క అద్భుతమైన సామరస్యపూర్వకమైన కలయికను అందిస్తుంది. విశ్వమంతా ఒకే దేవుడి సృష్టి అని మరియు మొత్తం మానవ జాతి ఆ ఒక్కడి సంతానమని ఆమె జీవితం తెలియజేస్తుంది.

“స్వర్గలోకాన్ని అధిరోహించిన ఆ ఆత్మకు నా హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను మరియు ఆమె పారమార్థిక ప్రేమ మరియు ఆశీస్సులు ఎల్లప్పుడూ మనతో ఉండాలని ప్రార్థిస్తున్నాను.”

స్వామి సత్యసంగానంద, రిఖియాపీఠ్: “దయచేసి నా వినయపూర్వకమైన సంతాపాన్ని అంగీకరించండి; శ్రీ దయామాతగారు తన గురుదేవుల కార్యానికి ప్రేరణాత్మకమైన మరియు అంకితమైన శిష్యురాలు. ఆమె బేషరతైన ప్రేమ చాలా మంది జీవితాలను ఆశీర్వదిస్తూనే ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, ఇప్పుడు ఆమె స్థూల శరీరం యొక్క సంకెళ్ళ నుండి విముక్తి పొందారు, ఎందుకంటే ఆమె దివ్య సాన్నిధ్యం సృష్టినంతా వ్యాపించి, మన హృదయాలలో నివసిస్తునే ఉంటుంది. ఓం-తత్-సత్.”

స్వామి విమలానంద, అధ్యక్షులు, ది డివైన్ లైఫ్ సొసైటీ, రిషికేష్: “మన ప్రియమైన మరియు గౌరవనీయమైన దయామాతగారు గతించడం గురించి తెలుసుకున్న మన చిన్న మనస్సు విచారాన్ని మాత్రమే నమోదు చేస్తుంది. అయితే నిజానికి ఆమె పరమాత్మలో కలిసిపోయింది. గొప్పవారు చనిపోరు. వారు మన మధ్యే శాశ్వతంగా జీవిస్తూ, మనకు అంతరంగం నుండి మార్గదర్శనం చేస్తారు. తన మర్త్యమైన శరీరాన్ని విడిచిపెట్టడం ద్వారా ఆ తల్లి, శరీరం యొక్క పరిమితులను అధిగమించి సర్వవ్యాపకత్వాన్ని పొందారు….

“అనేక మంది అన్వేషకులకు అమ్మ సాన్నిధ్యం, గొప్ప ప్రేరణ కలిగించే మూలాధారం. దుఃఖంతో వచ్చిన చాలా మందికి ఆమె ప్రేమ మరియు దయ ఓదార్పును కలిగించేవి. నిస్సహాయతతో వచ్చిన వారికి ఆమె అనుగ్రహం ఆశను కలిగించేది. ఆ తల్లి ఇప్పుడు తన శరీరాన్ని విడిచిపెట్టి, ఆమె భక్తులకు ప్రేరణను మరియు మార్గదర్శనం ఎలా చేస్తారు? చింతించనవసరం లేదు! ఇప్పుడు ఆ తల్లి తన శారీరక పరిమితులను అధిగమించింది, ఆమె ఉనికిని ఇప్పుడు ప్రపంచమంతటా మరియు అన్ని సమయాలలోను అనుభవించవచ్చు. హృదయపూర్వకంగా అన్వేషించే వారందరికీ ఆమె [తప్పకుండా] ఓదార్పు మరియు ఆశను కలిగిస్తునే ఉంటారు.

“అంతిమ సాక్షాత్కారాన్ని పొందే మన ప్రయత్నంలో మనకు మార్గనిర్దేశం చేసేందుకు ఆ తల్లి యొక్క శ్రేష్ఠమైన ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.”

స్వామి వెంకటేశానంద (డివైన్ లైఫ్ సొసైటీకి చెందిన ఒక సన్యాసి): “[పరమహంస యోగానందగారు] ఈ భూమండలాన్ని విడిచిపెట్టడానికి ముందు, ‘నేను గతించిన తర్వాత, ప్రేమ మాత్రమే నా స్థానాన్ని భర్తీ చేయగలదు’ అని పేర్కొన్నారు. ఆయన గతించిన అనంతరం మూర్తీభవించిన ప్రేమ, దయామాత రూపంలో ఆయన స్థానంలో నిలిచింది….ఈ నిష్ఠగల శిష్యురాలు గురుదేవుల కార్యాన్ని నమ్మకంగా కొనసాగించింది, ఆయన చెప్పింది చెప్పడం ద్వారా కాదు, ఆయన ఎలా ఉండేవారో అలా ఉండటం ద్వారా.”

శ్రీ కె. కృష్ణన్ నాయర్, మహాత్మా గాంధీగారి ప్రత్యక్ష శిష్యుడు: “[శ్రీ దయామాతతో] ఆ సమావేశం యొక్క ఆనందం ఇప్పటికీ నా హృదయంలో తాజాగా ఉంది. ఆమె అద్భుతమైన ప్రేమను ప్రసరిస్తుంది: అదే ఆమె సందేశం.”

శ్రీ దయామాతతో కలిసి 1958లో ఎస్.ఆర్.ఎఫ్. ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన తరువాత పూరీ శంకరాచార్యులు, పరమపవిత్రులు, జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ యొక్క వ్యాఖ్యలు:  “నేను సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్‌లో అత్యున్నత ఆధ్యాత్మికత, సేవ మరియు ప్రేమను కనుగొన్నాను. వారి ప్రతినిధులు ఈ సూత్రాలను బోధించడమే కాకుండా వాటికి అనుగుణంగా జీవిస్తారు.”

డాక్టర్. వినయ్ ఆర్. సేన్, యునైటెడ్ స్టేట్స్‌లో భారత మాజీ రాయబారి మరియు ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ డైరెక్టర్ జనరల్: “[పరమహంస యోగానందగారి] వారసత్వం తన సన్యాస శిష్యురాలైన శ్రీ దయామాతలో మించి ఇంతకంటే ఎక్కువ తేజస్సుతో మరెక్కడా ప్రకాశించదు, తాను పరమపదించిన తరువాత తన అడుగుజాడల్లో ముందుకు సాగడానికి ఎవరినైతే సిద్ధంచేశారో…. నాకు కలిగినట్లే పరమహంసగారిని కలిసే అదృష్టం కలిగినవారందరు, దాదాపు నలభై సంవత్సరాల క్రితం సెల్ఫ్-రియలైజేషన్ కేంద్రానికి నా మొదటి సందర్శన సందర్భంగా ఆయనలో నన్ను ఎంతగానో ఆకట్టుకున్న దైవిక ప్రేమ మరియు కరుణ యొక్క అదే స్ఫూర్తి, దయామాతగారిలో ప్రతిబింబిస్తోందని తెలుసుకుంటారు.”

శ్రీ నాని ఎ. పాల్ఖివాలా, యునైటెడ్ స్టేట్స్‌లో భారత మాజీ రాయబారి: “ప్రేమ, దయ మరియు భారతీయ సంస్కృతి యొక్క ఇతర కాలాతీత విలువలను శ్రీ దయామాత వ్యక్తపరుస్తారు….ఆమె ప్రసంగాలు నైరూప్య వేదాంత సూత్రాలపై పొడి పొడి పాండిత్య ప్రదర్శనా వ్యాఖ్యానాలు కావు, అవి సృష్టికర్త యొక్క ఆమె పారవశ్య దర్శనానికి తీవ్ర వ్యక్తిగత శ్లోకాలుగా సాక్ష్యమిస్తున్నాయి.”

సి.వి. నరసింహన్, సెక్రటరీ-జనరల్ క్రింద, ఐక్యరాజ్యసమితి: “శ్రీ దయామాతను అనేకసార్లు కలుసుకునే భాగ్యం నాకు లభించింది….ఆమె సన్నిధిలో ఉన్న ఎవరైనా ఆమె నుండి ప్రసరించే ఆధ్యాత్మిక శాంతి మరియు ప్రశాంతత వల్ల ప్రభావితం కాకుండా ఉండలేరు….శ్రీ దయామాతగారి సందేశం ఈ సందేహాస్పద మరియు సంశయాల యుగంలో చాలా ప్రాముఖ్యత మరియు ఔచిత్యాన్ని కలిగి ఉంది….అవి మానవ జాతి యొక్క ఏకత్వానికి మాత్రమే కాకుండా, దేవునితో మానవుని ఏకత్వానికి కూడా ఒక చాటింపు.”

స్వామి శ్యామానంద గిరి, 1971లో పరమపదించే వరకు ఎస్‌.ఆర్‌.ఎఫ్./వై‌.ఎస్‌.ఎస్. డైరెక్టర్ల బోర్డు సభ్యుడు: “నేను 1958లో మొదటిసారిగా పూజ్యురాలైన తల్లి దయామాతను కలిసినప్పుడు, నేను ఆశ్చర్యపోయాను. ఒక పాశ్చాత్యురాలు భారతదేశంలోని గొప్ప సాధువులలో ఒకరిలా ఎలా ఉండగలదు? అప్పుడు నాకు సెల్ఫ్-రియలైజేషన్ బోధనల శక్తి అర్థమైంది. ఆమెకు దైవ-సాక్షాత్కారం, అనుకోకుండా వచ్చింది కాదు. గురుదేవుల బోధనలను అచరించడంలో ఆమె చేసిన ప్రయత్నాల ద్వారా, ఆమె తనను తాను భగవంతునితో అనుసంధించుకున్నారు, తద్ద్వారా ఆయన జ్ఞానం ఆమెలోకి ప్రవహించింది.”

ఆధునిక భారతదేశంలోని గొప్ప సాధువులలో ఒకరైన ఆనందమయిమాత ఆశ్రమాన్ని శ్రీ దయామాత సందర్శించినప్పుడు, శ్రీ దయామాతతో ఆనందమయి మాత చేసిన వ్యాఖ్యలు: “నేను మీ గురుదేవునిలో చూసిన అదే స్ఫూర్తిని (భావము) మీలో చూస్తున్నాను.”

గురుదేవుల మేనకోడలి మనుమరాలు, శ్రీమతి ముక్తమాల మిత్ర మరియు కుటుంబం, కోల్‌కతా: “మన ప్రియమైన శ్రీ శ్రీ దయామాతగారు పరమపదించిన విషయం విని మా కుటుంబం మరియు నేను చాలా బాధపడ్డాము. ఆమె దివ్యప్రేమ మరియు ఆశీర్వాదాలను, మార్గదర్శకత్వాన్ని పొందినందుకు మరియు నిస్వార్థ ప్రేమ గురించి ఆమె దివ్య రచనలను చదివే అవకాశం లభించినందుకు మేము ఎంతో ఆస్వాదిస్తున్నాము, ఈ కల్లోల సమయాల్లో మా భౌతిక జీవితాలలో అనేక పరీక్షలు మరియు సుఖదుఃఖాలను ఎదుర్కోవటానికి, అవి మాకు సహాయపడ్డాయి….ఆమె గతించిన తరువాత, ఒక పెద్ద మర్రిచెట్టు నీడలో ఇంతకాలం జీవిస్తున్న మన నుండి అకస్మాత్తుగా ఆ నీడ తొలగించబడినట్లుగా మేము భావిస్తున్నాము. నా పెళ్లి సందర్భంగా ఆమె మాకు పంపిన దివ్యమైన అందమైన మరియు ప్రేమపూర్వక లేఖ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఏది ఏమైనప్పటికీ, ఆత్మ అనశ్వరమైనది, దివ్యప్రేమ శాశ్వతమైనదని మనకు తెలుసు, కాబట్టి ఆమె కేవలం తన వస్త్రం మార్చుకున్నదని మరియు ఆమె దివ్యసాన్నిధ్యం మరియు ప్రేమ ఎల్లప్పుడూ మనతో ఉంటాయని మనకు తెలుసు.”

టైమ్ మ్యాగజైన్: “చరిత్ర, వెలిగే మరియు మిణుకుమిణుకుమని పోయిన మతపరమైన శాఖల అవశేషాలతో చిలకరించబడి ఉంది — ఒక ఆకర్షణీయమైన నాయకుడిచే వెలిగించబడిన విశ్వాసం యొక్క క్లుప్త కొవ్వొత్తులు ఆయన పరమపదించిన కొద్ది సమాయనికే ఆరిపోతాయి….సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ కూడా, వ్యవస్థాపకులైన పరమహంస యోగానందగారు 1952లో పరమపదించిన తరువాత బహుశా ముగిసిపోతుందేమో అనిపించింది, కాని బదులుగా అది వృద్ధి చెందింది….1955 నుండి, ఈ శాఖలో దయామాతగా పిలవబడే మిస్ ఫే రైట్ నడపిస్తున్నారు.”

లాస్ ఏంజిలిస్ టైమ్స్ మాజీ మత సంపాదకుడు డాన్ త్రాప్: “నేను [శ్రీ దయామాతగారిని] ఇంటర్వ్యూ చేశాను మరియు వివిధ కారణాలతో ఆమె వల్ల చాలా ప్రభావితుడినయ్యాను: ఆమె తెలివితేటలు, ఆమె చిత్తశుద్ధి, ఆమె నిజాయితీ — వ్యక్తులను ఎప్పుడూ వారి నిజాయితీని బట్టి నేను అంచనా వేస్తాను — మరియు మతం క్షేత్రములో ఆమె యొక్క విస్తృత దృష్టి….పర్వత శిఖరాగ్రం నాకు ఎల్లప్పుడూ దాని స్వంత తేజస్సును, దాని స్వంత ప్రకాశాన్ని ఉత్పత్తి చేస్తుంది. మరియు నాకు, ఎల్లప్పుడూ మౌంట్ వాషింగ్టన్ యొక్క శిఖరాగ్రం దయామాత యొక్క వ్యక్తిత్వంలో ప్రత్యేక ప్రకాశాన్ని కలిగి ఉంటుంది.…నా శాశ్వతమైన గౌరవాన్ని, అభిమానాన్ని మరియు ప్రేమను తెలియజేస్తున్నాను మరియు ఆమె లక్ష్యం కూడా అద్వితీయమైనదనే అంగీకారాన్ని తెలియజేస్తున్నాను. ఆమె దానిని ప్రత్యేకంగా నెరవేర్చగలదు.”

దాతృత్వానికి సంబంధించిన ఒక క్యాథలిక్ సిస్టర్: “ఒక మతపరమైన క్రమంలో సభ్యురాలిగా, దేవుడు మరియు ఇతరుల సేవకు కట్టుబడిన జీవితం ఎలా ఉండాలనేదానికి దయామాత ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ….ఆమె సమక్షంలో కాథలిక్కులు, ప్రొటెస్టెంట్లు , లేదా హిందువులు లేరు, కాని ఒకే తండ్రియైన భగవంతుడి బిడ్డలు మాత్రమే. మరియు వారిలో ప్రతి ఒక్కరినీ ఆమె దయతో స్వీకరిస్తుంది మరియు ఆమె హృదయంలో వారికి స్థానం ఉంది. ఒక క్యాథలిక్ సన్యాసినైన నేను, ఆమె దయ మరియు ఆమె ఆసక్తి మరియు ప్రోత్సాహాన్ని ఎంతగానో పొందాను. ఆమె నన్ను తనవారిలో ఒకరిగా చూసుకుందని నాకు ఎప్పుడూ అనిపించేది. ఒక మతాచార్యురాలిగా నా జీవితం ఎలా ఉండాలనే దానికి, ఆమె నాకు ఎప్పుడూ ఆదర్శంగా ఉంటుంది….ఆమె నుండి భగవంతుడు ప్రసరిస్తాడు.”

ప్రిస్సిల్లా ప్రెస్లీ: “[శ్రీ దయామాత] మృదుస్వభావము మరియు సహజమైనవారు, స్పష్టంగా తనతో తాను శాంతియుతంగా ఉండే వ్యక్తి. ఎల్విస్ ఆమెను కలిసిన వెంటనే ఆకర్షితుడయ్యాడు. అలా ఎల్విస్ మరియు శ్రీ దయామాతగారి మధ్య కొనసాగుతున్న సంభాషణ ప్రారంభమైంది, అది అతని జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది….ఈ మహిళ పట్ల ఆయనకు గొప్ప గౌరవం ఉండేది.”

సంగీతకారుడు జార్జ్ హారిసన్: “ఒక దేవదూత యొక్క తత్త్వము ఏమిటి? దివ్యమైన స్వభావము కలిగి ఉండి,తమలో తాము స్వచ్ఛతను కలిగి ఉండడం. అటువంటి ఉనికినిగల శ్రీ దయామాత వంటి వ్యక్తిని నేను దేవదూతల తత్వమని అంటాను.”

డాక్టర్.ఎస్.డి. జోషి, రచయిత, సాంకేతిక నిపుణుడు మరియు మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, వాల్‌చంద్ ఇండస్ట్రీస్, లిమిటెడ్: “1967లో, సంఘమాత దయామాతగారు భారతదేశాన్ని సందర్శించారు — నేను ఎంతో ఎదురుచూసిన ఒక కార్యక్రమం….నాకు ఆమె ఉనికి, అవగాహన కలిగినప్పుడు నేను ఆమెలో జగన్మాతను చూశాను — దైవికశక్తి, మాతృప్రేమ మరియు కరుణ యొక్క స్వరూపం….దయామాతగారు, ఆమెకు ఉన్న ఓజస్సు, ఉదారత, దయ మరియు కరుణ గుణాలు, ఆమె పట్ల నాకు గౌరవాన్ని ఆజ్ఞాపించాయి.”

రెవరెండ్ ప్రేమ్ అంజలి, పి‌హెచ్.డి., ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సచ్చిదానంద ఆశ్రమం-యోగవిల్లే, వర్జీనియా: “ప్రియమైన మరియు గౌరవనీయులైన శ్రీ దయామాతగారు భౌతిక శరీరాన్ని వదలిపెట్టారని మాకు ఇప్పుడే తెలియజేయబడింది. సచ్చిదానంద ఆశ్రమం-యోగవిల్లే యొక్క ట్రస్టీలు, ఇంటిగ్రల్ యోగా సంస్థ మొత్తం మరియు సంఘం తరపున, మేము మీకు మరియు సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సభ్యులందరికీ మా హృదయపూర్వక ప్రార్థనలను అందిస్తున్నాము. మేము ఇక్కడ సచ్చిదానంద ఆశ్రమం-యోగవిల్లేలో శ్రీ దయామాతగారి స్మారకార్థం మరియు గౌరవార్థం ప్రత్యేక ప్రార్థన సేవను నిర్వహిస్తున్నాము.

“దేవునికి, గురువుకు మరియు ఆత్మల ఆధ్యాత్మిక ఉద్ధరణకు దైవిక నామంలో సేవను ఉదాహరణగా చూపిన గొప్ప ఆత్మలలో ఒకరికి మేము నివాళులర్పిస్తూనే ఉంటాము. శ్రీ దయామాత తన పూజ్య గురువు పరమహంస యోగానందగారికి మరియు ఆయన సంస్థ యొక్క అనుచరులను ప్రేమతో చూస్తూ మానవాళికి చేసిన సేవ అపారమైనది.

“ఈ సమయంలో మరియు ఎల్లప్పుడూ మా ప్రార్థనలు మరియు హృదయపూర్వక భావాలు మీతో ఉన్నాయని దయచేసి తెలుసుకోండి. సెల్ఫ్-రియలైజేషన్ కోసం మీ పవిత్ర గురువు యొక్క గాఢమైన అభిలాషలు మరియు దార్శనికతను నెరవేర్చడానికి మీరందరూ ఆయన గొప్ప సందేశానికి దివిటీదారులుగా కొనసాగండి. మీరు మీ పవిత్ర గురువుకు మీ జీవితాలను సమర్పించడం కొనసాగించండి మరియు భక్తి మరియు అంకితభావానికి శ్రీ దయామాతగారి జీవితకాల ఉదాహరణ నుండి ప్రేరణ పొందడం కొనసాగించండి.”

విలా మరియానా మెడిటేషన్ గ్రూప్, బ్రెజిల్: “మా చిన్న సమూహంలో మేము శ్రీ దయామాతను జగన్మాతతో మాకున్న సంబంధంలా ప్రేమిస్తున్నాము….ఈ వార్తను స్వీకరించడం మాకు చాలా కష్టంగా ఉంది. మేము ఆమె కోసం ధ్యానం నిర్వహించాము. మాకు కన్నీళ్లు మరియు నష్టపోయిన భావము కలిగింది, కాని మా అందరికీ ఒకే అనుభవం కలిగింది. అది ఏమిటంటే దయామాతగారు మమ్మల్ని బాధపడనివ్వలేదు. శాంతి మరియు ఆనందం మా హృదయాలను ఆక్రమించడం ప్రారంభించాయి (అన్నీ ఉన్నాయి—మినహాయింపులు లేవు). మరియు మేమందరమూ ఒక బాధ్యతను కూడా గుర్తించాము. ఆమె పరిపూర్ణ శిష్యురాలిగా జీవించింది. ఇప్పుడు మన బాధ్యత ఏమిటంటే అదే లక్ష్యం కోసం ప్రయతించడం. నేను విచారంగా ఉన్నాను, కాని ఆమె నన్ను విచారంగా ఉండనివ్వలేదు. ఎప్పుడూ అనుభవించని విధంగా ఆమె సాన్నిధ్యం ఇప్పుడు వ్యక్తమవుతోంది.”

డి.జెడ్., కాలిఫోర్నియా: “మన ప్రియమైన దయామాతగారి నిష్క్రమణలో మేము, గాఢమైన ధ్యానాలతో మరియు ప్రేమతో కూడిన అంతర్ దృష్టితో  మాతాజీ మా హృదయాలకు తన సున్నితమైన గొంతులో సూటిగా గుసగుసలాడినట్లు, గాఢంగా దీవించబడినట్లుగా నేను గ్రహించాను, ఇలా అందరికీ జరిగిందని నేను సంశయిస్తున్నాను. ఈ సంతోషకరమైన స్మారక దినాలలో పొందినట్లుగా అపారమైన ప్రేమను నేను ఎప్పుడూ అనుభవించలేదు. మన ప్రియమైన మాతాజీ తన ఆరోహణంలో కూడా మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు మరియు మనము ఎప్పటికీ ఒకేలా ఉండము, ఇది నాకు ఖచ్చితంగా తెలుసు.”

అజ్ఞాత వ్యక్తి, ఫిన్‌లాండ్: “ఆమె పరమపదించుట, చాలా సంవత్సరాలుగా ఆమె అందించిన విపరీతమైన క్లిష్టమైన మరియు ముఖ్యమైన సేవను గురించి గొప్ప అవగాహనను కల్పించింది — మనందరికీ మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి.”

ఎఫ్. బి., బ్రెజిల్: “ఒక గొప్ప సాధ్వి మరియు భగవంతుని ప్రేమికురాలు ఈ భూమిపై ఇక నడవకపోవడం అనేది భక్తులమైన మనకే కాదు, ప్రపంచమంతటికీ తీరని నష్టం. ఆమె జీవితం, ఆమె సందేశం మరియు పరిపూర్ణ శిష్యత్వానికి ఆమె ఉదాహరణగా ఉండడం, దశాబ్దాలుగా మనందరికీ స్ఫూర్తినిచ్చాయి. నా విషయానికొస్తే, నేను ఆమె పుస్తకాలు చదివాను మరియు ఆమె టేపులను చాలాసార్లు విన్నాను, ఆమె గొంతు నా మనస్సులో శాశ్వతంగా నమోదు చేయబడింది మరియు ఆమె మాటలు నా హృదయంలో శాశ్వతంగా ముద్రించబడ్డాయని నేను చెప్పగలను. నా సాధనలో ఆమె ఒక గాఢమైన వనరుగా ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ ఉన్నారు, ఉంటారు. మనతో చాలాకాలంపాటు ఉండమని కోరినందుకు నేను జగన్మాతకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ నష్టానికి చింతిస్తున్నప్పటికీ, దయామాతగారు జగన్మాత యొక్క అనంతమైన బ్రహ్మానంద సాగరంలో ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నందున నేను తన కొరకు సంతోషంగా ఉన్నాను. ఆమె ఇప్పుడు ఉన్న చోటైన గురుదేవుల సన్నిధి నుండి మనకు మార్గనిర్దేశం చేయడం మరియు మన కోసం ప్రార్థించడం కొనసాగిస్తారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను.”

ఏ. ఆర్., ఇటలీ: “నేను ఆమెకు చాలాసార్లు వ్రాశాను మరియు మనలో ప్రతి ఒక్కరి పట్ల ఆమెకున్న వ్యక్తిగత ఆసక్తిని, ఎల్లప్పుడూ ప్రేమ మరియు జ్ఞానం యొక్క ఆలోచనలతో సమాధానమివ్వడం, ఆమె చేసినట్లుగా సాధనను ఓర్పు మరియు ప్రేమతో అనుసరించడానికి ఆచరణాత్మక సూచనలు ఇవ్వడం చూసి నేను ఆశ్చర్యపోయాను.

“ఆమె జగన్మాత ప్రేమ యొక్క స్పష్టమైన వ్యక్తీకరణ—ప్రేమ యొక్క స్వరూపం, మన గురుదేవుల యొక్క ప్రేమ మరియు దైవత్వం యొక్క ప్రేమ!”

ఎస్. బి., జార్జియా: “పరమహంస యోగానందగారు తాను శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత,‘ప్రేమ మాత్రమే నా స్థానాన్ని భర్తీ చేయగలదు’ అని అన్నారు. ‘మత విజ్ఞాన శాస్త్రము’ నుండి ప్రేమ అనేది అత్యంత శక్తివంతమైన సార్వత్రిక ఆకర్షణ శక్తని, సృష్టిని తిరిగి సృష్టికర్త వైపు ఎప్పటికీ లాగుతుందని మనం తెలుసుకున్నాము. ఈ ప్రపంచంలో ఎవరూ ‘ప్రేమను ఇవ్వలేరు’; దైవిక ప్రేమ మనలో ప్రవహించడానికి మరియు ప్రకాశించడానికి మనల్ని మనం కేవలం శుద్ధి చేసుకోగలము. ఈ విధానాన్ని శ్రీ దయామాత అందంగా మరియు సంపూర్ణంగా నెరవేర్చారు. ఆమె ఎక్కడికి వెళ్ళినా, ఆమె నుండి దైవిక ప్రేమ ప్రసరించేది. వార్షిక ఎస్‌.ఆర్‌.ఎఫ్. కాన్వకేషన్‌లో ఆమె మాట్లాడినప్పుడు, ఆమె ప్రేమ ప్రకంపనలు బోనవెంచర్ హోటల్‌లోని కాలిఫోర్నియా బాల్‌రూమ్‌ను పూర్తిగా నింపెసేవి మరియు ప్రతి ఒక్కరూ దానిని గ్రహించేవారు, ఎస్‌.ఆర్‌.ఎఫ్. భక్తులు కానివారు కూడా. అంతేకాకుండా, ఆమె ప్రేమ నిజమైన, అమాయకపు వినయంతో పరిమళించబడి అలంకరించబడింది. మానవజాతి చరిత్రలో అరవై ఏళ్లుగా ఒక ప్రధాన సంస్థకు నాయకత్వం వహించిన వ్యక్తి, సంస్థ యొక్క విజయానికి, గుర్తింపు తీసుకోవడానికి కనీసం ఒక్కసారైనా ప్రయత్నించని వేరొక ఉదాహరణ నాకు తెలియదు. శ్రీ దయామాతగారు అలా ఎప్పుడూ చేయలేదు; ఆమె రచనలు మరియు ప్రసంగాలలో, గుర్తింపు నిజంగా ఎక్కడైతే పొందుతారో — మన గురుదేవులకు మరియు దేవునికి ఎల్లప్పుడూ ఆ గుర్తింపును ఇచ్చారు. భవిష్యత్ తరాల వై.ఎస్.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. సన్యాసులు మరియు సామాన్య శిష్యులు తమ స్వంత జీవితాలను దయతో మరియు ప్రేమపూర్వకంగా జీవించడానికి శ్రీ దయామాత యొక్క ఆదర్శప్రాయమైన జీవితం నుండి ప్రేరణ పొందుతారు.”

జె.సి., పోర్చుగల్: “గొప్ప గురువులు ఉన్నారు: వారు మన ప్రపంచంలోని గందరగోళంలో చీకటిలో మరియు నిరాశలో మానవజాతిని నడిపించే కాంతి కిరణాల వంటివారు; ఆపై మరింత ముఖ్యమైన పనిని కలిగి ఉన్న శిష్యులు ఉన్నారు: వారి పని, ఆ కాంతిని కొనసాగించడం మరియు కాపాడటం, తద్ద్వారా అది ఎప్పటికీ ఆరిపోకుండా లేదా మసకబారకుండా ఉంటుంది, తద్ద్వారా ఇది సమస్యాత్మక సమయాల్లో మనకు మార్గనిర్దేశం చేస్తుంది. మన పూజ్యమైన శ్రీ దయామాతగారి లక్ష్యం అలాంటిదే. ఆమె మన గురుదేవుల బోధనలు మరియు కార్యానికి కాంతి కాపరి లాంటివారు.”

ఈ. ఆర్., న్యూయార్క్: “మనకు అత్యంత ప్రియమైన దయామాత వంటి ఆత్మ యొక్క పరివర్తనతో ముడిపడి ఉన్న భావాలను వ్యక్తపరచడం కష్టం. గురుదేవుల ఆజ్ఞలను మరియు స్వచ్ఛతను చాలా జాగ్రత్తగా ఆమె కాపాడినట్లుగా, ఈ ప్రస్తుత ద్వాపర యుగంలో ఎవరితో పోల్చలేము.

“ఆమె దోషరహితమైన నిస్వార్థత, ఆమె అచంచలమైన అంకితభావం, ఆమె ఆశ్చర్యపరిచే విధేయత, ఆమె అత్యంత చైతన్యవంతమైన ఆధ్యాత్మికత మరియు ఆమె అబ్బురపరిచే సరళత నేటి ప్రపంచంలో చాలా లోపించిన మరియు కనుమరుగైన లక్షణాలు; అయినప్పటికీ, మనమందరం ఎప్పుడైనా, ఏదో ఒక రోజు, ముఖాముఖిగా రావాలని కోరుకునే వ్యక్తి పట్ల ఆమె పూర్తి ప్రేమ మరియు భక్తితో కొనసాగారు — పరిపూర్ణమైన మరియు సాటిలేని ఉదాహరణను అందించడమే కాకుండా, శీఘ్రంగా పునరావృతమయ్యే అవకాశం లేని వారసత్వాన్ని వదిలి వెళ్ళారు.

“దయామాతగారి జీవిత పరిధి సులువుగా మానవ మనస్తత్వం నుండి తప్పించుకుంటుంది. మాటలు చెప్పవచ్చు, పుస్తకాలు వ్రాయవచ్చు, కానీ దేవుడికి మరియు గురుదేవుల కార్యానికి ఆమె చేసిన ఆదర్శప్రాయమైన సమ్మతి ఎప్పటికీ జీవిస్తుంది, మినహాయింపు లేకుండా మనమందరం మన జీవితంలో అనుకరించడానికి మరియు అమలు చేయడానికి చూడాలి.

“ఆమె నిజమైన ప్రమాణ-వాహకురాలు, నిజమైన యోధుని యొక్క శౌర్యంతో భగవంతుని మరియు గురుదేవుల ప్రేమ జ్వాలను మోసుకెళ్ళింది, ఆ ఉద్దేశ్యము కోసం మరియు ఆమె రాజు కోసం అన్నింటినీ ఇవ్వడానికి సిద్ధంగా ఉండింది.”

ఓ. మరియు డి. బి., బల్గేరియా: “ఎవరి ప్రేమ మరియు కరుణ, మా హృదయాలను తాకి వాటిలో దైవిక ఉత్సాహాన్ని నింపిందో, ఆ మాతాజీకి విచారాన్ని తెలియజేసుకొంటున్నాను.”

ఎల్. ఎం., కనెక్టికట్: “దయామాతను వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశం నాకు కలగలేదు, కాని సంవత్సరాల నా సాధనలో ఆమె చాలా సార్లు నా కలల్లోకి వచ్చారు. ఒకసారి ఓ ప్రియమైన స్నేహితుడు చనిపోవడానికి కొన్ని వారాల ముందు అతడి కోసం తీవ్రమైన ప్రార్థన సమయంలో మాతాజీ వచ్చి ఆశీర్వాద రూపంగా తన నుదిటిని నా నుదుటికి నొక్కి, ప్రార్థన సమయంలో నా స్నేహితుడికి అదే విధంగా మానసిక చిత్రణం చేయడానికి శక్తివంతమైన మార్గాన్ని నాకు అంతర్దృష్టితో చూపించారు. మీరు చూడండి, మా జీవితంలో ఆమెను నేను ఎన్నడూ కలవనప్పటికీ, నా జీవితంలో మాతాజీ ఉనికి చాలా సత్యమైన మరియు స్పష్టమైన రీతిలో ఉంది.”

అజ్ఞాత వ్యక్తి, జర్మనీ: “నేను కథను చెప్పదలచుకోలేదు; ఆమె నా హృదయంలో ఉందని మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. ఆమె నా ఆరాధ్యవ్యక్తి. నేను ఆమెలా ఉండాలనుకుంటున్నాను.”

అజ్ఞాత వ్యక్తి, కాలిఫోర్నియా: “2003లో, నా తల్లి మరియు నా భర్తకు ఆరు నెలల వ్యవధిలో మెటాస్టాటిక్ క్యాన్సర్‌ వ్యాధి అని నిర్ధారించబడింది, ఇద్దరికీ జీవించడానికి తక్కువ సమయం ఇచ్చారు. ఒకే సమయంలో ఇరువురూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నేను ఈస్ట్ కోస్ట్‌కి చివరి యాత్ర చేయగలిగాను మరియు నా చేతుల్లో నా తల్లి శాంతియుతంగా మరణించగలిగే బహుమతి నాకు ఇవ్వబడింది. ఆమె మరణించిన రెండు రోజుల తర్వాత, నా భర్త పరిస్థితి క్షీణించడంతో ఇంటికి తిరిగి రావాలని నాకు పిలుపు వచ్చింది. నేను ఇంటికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత, ఆయన ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారు మరియు జీవించగలరని ఆశలేదు. ఆ రాత్రి నేను జగన్మాతకు గాఢంగా ప్రార్థించాను, ఆమె ఎప్పుడూ నాతో ఉందని నాకు తెలుసు, దయచేసి దాన్ని ధృవీకరించడానికి నాకు ఒక మానవ సంకేతం ఇవ్వమని. నేను నా అంతరంగాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడుతున్నాను మరియు కొన్నిసార్లు దుఃఖం చాలా అధికంగా ఉండేది.

“మరుసటి రోజు నాకు మదర్ సెంటర్ నుండి ఫోన్ వచ్చింది. నేను మదర్ సెంటర్‌కి ఫోన్ చేయలేదు లేదా వ్రాయలేదు కాబట్టి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఓ అందమైన స్వరం ఇలా చెప్పింది, ‘దయామాత నుండి మీ కోసం ఒక సందేశం ఉన్నందున, మీరు సన్యాసినితో మాట్లాడటానికి నేను అపాయింట్‌మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను, కానీ అది చేసేముందు, జగన్మాత మీతో ఉన్నారని మీకు నేరుగా చెప్పమని ఆమె నన్ను కోరారు.’ ఆ మాటలు విని నేను మోకాళ్ళపై పడిపోయాను, మాటలకు అందని కృతజ్ఞతతో ఏడ్చాను. కొన్ని క్షణాల తర్వాత ఒక సన్యాసిని ఫోన్‌ దగ్గరకు వచ్చి, ప్రియమైన మాతాజీ సందేశాన్ని చదివి, నా ఆత్మను ఓదార్చారు. ప్రియమైన మాతాజీ, భగవంతుడు మరియు గురుదేవులతో పరిపూర్ణమైన అనుసంధానంలో ఉన్నారని మరియు అందరి పట్ల ఆమె గొప్ప కరుణ మరియు ప్రేమ కలిగి ఉన్నారనేదానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ప్రియమైన మాతాజీని, ఆమె భౌతిక రూపంలో ఉండగా కలుసుకునే అవకాశం నాకు ఎప్పుడూ కలగలేదు, కాని ఆమె ప్రేమ మరియు కరుణ, నా హృదయం మరియు ఆత్మపై చెక్కబడి ఉన్నాయి.”

డబల్యూ.సి., ఆస్ట్రేలియా: “నేను 1993లో కాన్వొకేషన్‌లో మాతాజీని చూడగలిగినందుకు మరియు ఆమె ప్రసంగాన్ని వినగలిగినందుకు నేను చాలా భాగ్యవంతుడిని. ఆ సాయంత్రాన్ని నా జీవితంలోని అత్యంత విలువైన అనుభవాలలో ఒకటిగా నేను ఎల్లప్పుడూ భావిస్తాను. ఆమె గదిలోకి ప్రవేశించగానే ఆ ప్రదేశమంతా స్వచ్ఛమైన ప్రేమతో నిండిపోయిందని మాత్రం నేను వర్ణించగలను. నేను ఆ అనుభూతిని శాశ్వతంగా గుర్తుంచుకోవాలనుకున్నాను.”

అజ్ఞాత వ్యక్తి, కెనడా: “ఆమె సమక్షంలో ఉండడం నేను ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. మేము ఆమె ప్రేమ తరంగాలలో స్నానం చేశాము, అది మాకు ఆనందభష్పాలు కురిపించింది.”

ఎస్.డబల్యూ., ఒరెగాన్: “మన ప్రియమైన దయామాత మరియు ఎస్‌.ఆర్‌.ఎఫ్. బోధనలతో అక్షరాలా ‘పెరిగిన’ మనలోని వారికి, ఆమె మనతో ఉండటం మరియు ఆమె ప్రేమను గతంలో కంటే మరింత స్పష్టంగా అనుభూతి చెందడం అద్భుతంగా ఉంటుంది. ఇన్నాళ్లూ నేను సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నానని, మరియు ఆమె నాతో పాటు పరుగెత్తుతోందని నాకు అనిపిస్తుంది—నేను ఎక్కువ తడబడితే నన్ను నిలబెట్టడానికి ఆమె సిద్ధంగా ఉంది. ఏదో ఒకవిధంగా నేను బాగానే ఉంటానని నాకు తెలుసు; నేను నేర్చుకోవలసినది, ఆమె తన ఉదాహరణ ద్వారా నాకు నేర్పింది—గురు-శిష్యుల సంబంధం పట్ల మరియు పరమహంస యోగానందగారు మనకు అందించిన బోధనల పట్ల అచంచలమైన అంకితభావం మరియు ప్రశంసలు—మరియు మనం ఎప్పటికీ ప్రేమించబడతాము. ఇప్పుడు ఆ ప్రేమను అందరికీ అందించడానికి అంగీకరిస్తాను.”

ఎం.ఎస్., జర్మనీ: “మన ప్రియమైన శ్రీ దయామాత పరమపదించిన వార్త వినగానే నాకు బాధ కలిగింది. ముప్పై సంవత్సరాలకు పైగా ఈ మార్గంలో నా ఆధ్యాత్మిక జీవితమంతా మన ప్రియమైన మాతాజీ యొక్క అధ్యక్షతన మరియు ఆధ్యాత్మిక నాయకత్వంతో కూడి ఉంది. నేను ఫైండింగ్ ద జాయ్ వితిన్ యు అనే పుస్తకంలో, 1948లో ఆమె మృత్యువుకు-సమీపంగా వెళ్ళిన అనుభవాన్ని గురించి చదివాను. ఇది నాకు ఓదార్పునిచ్చింది మరియు మన ఆధ్యాత్మిక కుటుంబానికి మరియు ఎస్‌.ఆర్‌.ఎఫ్. సంస్థకు పునాదిగా ఉండేందుకు మానవ ఊహకు అందని విధంగా ఈ పనిని అరవై రెండు సంవత్సరాలకు పైగా ఆమె చేపట్టినందుకు కృతజ్ఞతతో నిండిపోయింది! గతంలో ఆమె అనుభవించిన అద్భుతమైన ప్రేమలో ఆమె ఇప్పుడు పూర్తిగా లీనమైందని నేను నమ్ముతున్నాను.”

ఎల్.డబల్యూ., ఒరెగాన్: “నేను ఆమెకు వ్రాసిన ప్రతీసారి, ఆమె నాకు తప్పకుండ సమాధానం ఇచ్చేవారు; ఆమె సమాధానం ఇవ్వనవసరం లేదని నేను చెప్పినప్పటికీ, ఆమె అలాగే చేసేవారు. ఆమె ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని కష్టపడి తన రెక్కల కిందకు తీసుకుని, తన జీవితంలోని ప్రతిరోజు వారికి వ్రాస్తూ, సలహాలిస్తూ, ప్రార్థించేవారు! శ్రీ దయామాత ఒక నిజమైన సాధ్వి. నేను కలుసుకున్న వారందరిలో అత్యంత అందమైన ఆత్మ. ఆమె ఉదాహరణ మరియు ఆమె బేషరతైన ప్రేమ కారణంగా నా జీవితం చాలా మారిపోయింది.”

ఎన్.ఎస్., భారతదేశం: “నేను 2001లో నా స్వంత వ్యాపార సంస్థను ప్రారంభించాను. నేను దయామా ఆశీస్సులు కోరుతూ ఆమెకు లేఖ రాశాను, కాని ఆమె అపారమైన బాధ్యతలు మరియు ఆమె సమయంపై ఉన్న అనేక ఒత్తిడులను తెలుసుకుని, సమాధానం ఆశించలేదు. నేను ఆశ్చర్యపోయాను, ఆ యత్నాన్ని ప్రోత్సహిస్తూ మరియు వివరణాత్మక సలహాను అందిస్తూ, కొద్ది సమయంలోనే సమాధానం వచ్చింది. ఆ సమాధానం తీరు మంచిగా మరియు సన్నిహితంగా ఉంది, ఆమెకు నేను యుగాల నుండి తెలిసినట్లుగా, కాకపోతే మేము ఎప్పుడూ కలుసుకోలేదు.

“ఇది నిజంగా,నిజంగా ఇప్పటివరకు నా గొప్ప అదృష్టము—నేను మాతాజీ లేఖను ఫ్రేమ్ కట్టించి, ఇన్నాళ్లూ నా ఆఫీసు గదిలో ఉంచుకున్నాను. ఆమె ఉత్తరం వచ్చినప్పుడు నేను దానిని మంచి శకునంగా చూశాను, బహుశా అది ఊహించనిది. మాతాజీ యొక్క శుద్ధతత్వమైన ప్రవర్తన మరియు సేవా స్వభావం, కార్పొరేట్  ‘అడవి’ లో నాలాంటి వారికి సంకేతదీపాలు. ఆమె మంగళ వాక్యములు ‘ప్రేమించండి, సేవ చేయండి, మరియు మిగిలిన వాటిని, దేవుడికి వదిలివేయండి’ అనేవి, నా వ్యాపార ప్రయాణంలో చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఎనిమిది దశాబ్దాల పాటు ఎలాంటి మచ్చలేని రీతిలో గురుదేవుల ఆదర్శాలను నిలబెట్టినందుకు ఆమెను చూసి గర్వపడుతున్నాను!”

హెచ్. ఎస్., కాలిఫోర్నియా: “నేను దయామాతగారిని వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదు, కాని ఆమె శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రం బాగా తెలిసినవారిలాగా నేను భావించాను. ఆమె, నాకు ఒక పర్వతం లాంటి బలము మరియు భద్రతలా అనిపించేవారు—కేవలం ఆమె ఉన్నారని తెలుసుకోవడమే నాకు ఓదార్పునిచ్చేది….జ్ఞానం, దయ మరియు ప్రేమ యొక్క సారాంశమే ఆమె—అన్నీ కలబోసిన ఒక మనిషి రూపంలో.”

ఈ.బి., కాలిఫోర్నియా: “నా జీవితంపై ఆమె ప్రభావాన్ని నేను పూర్తిగా వర్ణించలేను: ఆమె నాకు, స్త్రీ యొక్క దైవిక సౌందర్యం మరియు ప్రేమ యొక్క ఆదర్శంగా నిలిచారు.”

ఆర్.కే., జర్మనీ: “ప్రియమైన శ్రీ దయామా….సంవత్సరాలుగా మీ ఉత్తరాలకు నేను చాలా కృతజ్ఞుడను. గురుదేవులు మరియు మీరు నా జీవితాన్ని మార్చారు. మీ సలహా, బేషరతైన ప్రేమ మరియు ఎడతెగని ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ సహాయపడుతునే ఉన్నాయి. ఓ మా, నేను మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తునే ఉంటాను. మీ ఆశీస్సుల కోసం నేను ఇప్పటికీ నా హృదయాన్ని, మనస్సును మరియు ఆత్మను తెరచి ఉంచుతాను. మీ పవిత్ర గ్రంథం, ఎంటర్ ద క్వైట్ హార్ట్ (డై స్టిమ్మె డెస్ హెర్జెన్స్) రోజువారీ బైబిల్!”

జి.టి., కాలిఫోర్నియా: “1970వ దశకం చివరిలో శ్రీ దయామాతగారు కాన్వోకేషన్ తర్వాత భక్తుల కోసం నిర్వహించిన సత్సంగానికి హాజరయ్యే అవకాశం నాకు లభించింది. ఆమె ప్రసంగం తర్వాత ప్రార్థనా మందిరం నుండి బయలుదేరుతున్న ప్రతి భక్తుడిని ఆమె పలకరించింది. నేను ఆమెకు ప్రణామం చేసినప్పుడు, నేను ఆమె కళ్ళలోకి చూశాను. అనంతంలోకి, భగవంతుని కళ్ళల్లోకి చూస్తున్నట్లుగా అనిపించింది. అవి అంతులేని లోతులు. నేను ఇలా ఎప్పుడూ అనుభవించలేదు. ఆమె చిరునవ్వుతో నన్ను మదర్ సెంటర్‌కు స్వాగతించారు, మరియు నేను విభ్రాంతిలో ప్రార్థనా మందిరం నుండి బయలుదేరాను. ఈ అనుభవాన్ని నేనెప్పుడూ మర్చిపోలేదు….

“గురుదేవులను గురించి మనలో తెలియనివారికి, ఆయన బోధించిన వాటన్నింటికీ ఆమె సజీవ ఉదాహరణ.”

జి.హెచ్., కాలిఫోర్నియా: “చాలా సంవత్సరాల క్రితం, మదర్ సెంటర్‌లో శ్రీ దయామాతగారిని కలవడానికి భక్త బృందంతో పాటు నన్ను ఆహ్వానించారు. మేము లైబ్రరీలో కూర్చున్నప్పుడు, ఆమె మాకు అనధికారిక సత్సంగాన్ని నిర్వహించారు. దయామాతగారి కళ్ళను చూసి నేను పూర్తిగా పరివర్తన చెందాను. నేను ‘సముద్రపు దృష్టి’ అనే పదబంధాన్ని విన్నాను, కాని నేను ఇంతకు ముందెన్నడూ ఎవరి కళ్ళలోకైనా చూస్తూ ఇంత విపరీతమైన లోతు, శక్తి మరియు సౌందర్యాన్ని చూడలేదు. మన ప్రియమైన దయామా ఈ భూమిపై ఉన్న సమయంలోనే, నేను ఈ భూమి మీద నడవడం గౌరవంగా భావిస్తున్నాను.”

ఎం.పి., నెవాడా: “నేను వర్ణించలేనంతగా దయామా నా జీవితాన్ని ప్రభావితం చేశారు. దాదాపు పదిహేనేళ్లుగా, ఆమె ప్రసంగాలు వినడం లేదా ఆమె మాటలు చదవడం నా దినచర్యలో భాగమైంది, అవి నా జీవితాన్ని నిజంగా తీర్చిదిద్దాయి. తప్పకుండా ఆమె నన్ను ఉత్సాహంతో, ఆధ్యాత్మిక దృఢసంకల్పంతో, భగవంతుని కోసం ఆరాటపడేలా చేసింది. కాని అన్నింటికీ మించి దివ్యప్రియతమునితో ఎంతో సన్నిహితమైన, మధురమైన, ప్రేమగల, నమ్మకమైన మరియు మైమరిపించే స్నేహాన్ని పెంపొందించుకోవడానికి ఆమె నాకు సహాయం చేశారు.

“నా ధ్యానాలను నిజమైన అనుసంధానంగా మార్చడంలో దయామా నాకు సహాయం చేశారు. మరియు ఆమె నా విధులను, నా దేవుని సన్నిధిలో, ప్రేమతో చేయు కార్యాలుగా మార్చడంలో నాకు సహాయపడింది. శిష్యుడిగా ఉండటం అంటే ఏమిటో, స్నేహితుడిగా ఉండటమంటే ఏమిటో, వినయపూర్వకమైన సేవకుడిగా ఉండటమంటే ఏమిటో, నాయకుడిగా ఉండటమంటే ఏమిటో మాతాజీ నాకు చూపించారు — కాని అన్నింటికంటే మిన్నగా ప్రేమికుడు అంటే ఏమిటో నాకు చూపించారు. భగవంతుని భక్తి మత్తులో ఉన్న ప్రేమికుడు.”

అజ్ఞాత వ్యక్తి, మేరీల్యాండ్: “ఆమె సాన్నిధ్యం, సాఫల్యతలు, దృష్టాంతం, అనేక తరాల వరకు నక్షత్రంలా ప్రకాశిస్తుంది. భారతదేశంలోని అత్యుత్తమ వ్యక్తులు, శ్రీ శ్రీ దయామాత రూపంలో లాస్ ఏంజిలిస్ లో నివసించారు.”

ఎస్.ఎల్., టెక్సాస్: “ఆమె జీవిత కథ నాతో ఘన పరిమాణంలో నిర్వచిస్తుంది. గురుదేవులపట్ల ఆమె భక్తి అమోఘమైనది మరియు ఎస్‌.ఆర్‌.ఎఫ్. యొక్క ఆమె నాయకత్వం అద్భుతమైనది. దేవునిలో అఘదమైన ఐక్యము ద్వారా ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా గడపాలనే దానిపై ఆమె నాకు నిరంతర ప్రేరణనిచ్చింది. నా జీవితాంతం నాపై ఆమె ఎంత ప్రభావం చూపిందో మరియు ఇంకా ఎంతగా ఉంటుందో పదాలు వర్ణించలేవు.”

అజ్ఞాత వ్యక్తి, స్పెయిన్: “కేవలం ఆమెను చూడడం ద్వారా, శ్రీ దయామాత కాంతి, ప్రేమ మరియు మంచితనం యొక్క అస్తిత్వమని ఏ సంశయము లేకుండా మీకు తెలిసిపోతుంది. మా కుటుంబానికి, శ్రీ దయామాతగారు ఒక తరగని ప్రేరణకు మూలాధారం. అలాగే పరమహంస యోగానందగారి నిజమైన శిష్యుడు ఎలా ఉండాలనే దానికి ఒక ఉదాహరణ.”

పి. డి., కాలిఫోర్నియా: “నేను మాతాజీ గురించి ఆలోచించిన ప్రతీసారి నేను ప్రేమను అనుభవించాను.”

హెచ్.డబల్యూ., ఆస్ట్రేలియా: “విశాలమైన పసిఫిక్ మహాసముద్రం శ్రీ దయామాతగారి ఆకర్షణీయ సాన్నిధ్యం నుండి నన్ను వేరు చేయలేదు. మన ప్రియతమ అధ్యక్షురాలు, నాయకురాలు, ఉపాధ్యాయులు, స్నేహితురాలు తన గురువు దగ్గరకు, కాంతి లోకంలోకి వెళ్ళిపోయారు. ఆనంద తరంగాలు ఆమె మధురమైన ఆనందంతో మన హృదయాలను నిర్మలం చేస్తున్నాయి. మేము ఒడ్డున మిగిలిపోయినప్పటికీ, మేము దుఃఖించాల్సిన అవసరం లేదు, లేక ఆమె గురుదేవుల పక్కన ఉందని విచారించాల్సిన అవసరం లేదు. గురువు మరియు శిష్యుడు—వారి ప్రేమ-కిరణాలు ప్రపంచవ్యాప్తంగా చేరుకొంటున్నాయి. కరుణగల తల్లి, మీ దయతో కూడిన జీవితానికి ధన్యవాదాలు.”

ఎన్. ఆర్., కెనడా: “భూమిపైన ఉన్నా లేక స్వర్గంలో ఉన్నా, శ్రీ దయామాతగారు నా ముందున్న మార్గాన్ని వెలిగిస్తారు.”

ఇతరులతో పంచుకోండి