YSS

స్వామి చిదానంద గిరి నుండి 2017 క్రిస్మస్ సందేశం

20 డిసెంబర్, 2017

పవిత్ర క్రిస్మస్ తరుణం యొక్క ఆనంద కాంతులు మీ హృదయం పరమాత్ముని ప్రేమ చేత ఉత్తేజభరితమైన ప్రేరేపణతో ఇంకా పరివర్తన చేయు, దాని సమన్వయ శక్తిపై విశ్వాసంతో మీ స్వీయ జీవితం మరియు యావత్ప్రపంచం ఉద్ధరించుబడుగాక. ప్రియతమ ప్రభు ఏసు చూపిన దివ్య లక్షణాలను మన హృదయాలలో స్వీకరించడానికి ఒక ప్రత్యేక ప్రయత్నం చేయడం ద్వారా ఈ బాహ్య వేడుక యొక్క అంతర్గత, పవిత్ర పరిమాణాన్ని, మనలో ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా అనుభవించవచ్చు — మరీ ముఖ్యంగా, మన గురుదేవులు శ్రీ పరమహంస యోగానంద ఉద్బోధించినట్లుగా గాఢంగా ధ్యానించడం ద్వారా, విశ్వజనీనమైన క్రీస్తు ప్రేమను, కాంతిని స్వీయ చైతన్యంలో పొందవచ్చు. ఈ పవిత్ర తరుణంలో ఆ ప్రయత్నంలో మన భక్తిని ఐక్యం చేయడం ద్వారా — ఈ ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా — క్రిస్మస్ యొక్క నిజమైన ఆశీర్వాదాలను సంపూర్ణంగా అందుకుంటాము.

ఏసుక్రీస్తు మరియు ఇతర మహాత్ముల ద్వారా, భగవంతుడు మన సంతోషాలను మరియు దుఃఖాలను పాలుపంచుకోవడానికి, మన సంఘర్షణలలో కారుణ్య సహాయం అందించి అలాగే మన సొంతమైన దివ్య వారసత్వం తిరిగి పొందాలనే పట్టుదల, సంకల్పాలే దృష్టాంతంగా మనలో ప్రేరేపించడానికి ఈ ప్రపంచంలో మానవమూర్తిగా ప్రత్యక్షమవుతారు. గురుదేవులు ఉపదేశించినట్లుగా, “క్రిస్మస్ యొక్క నిజమైన వేడుక అనేది క్రీస్తు చైతన్యం యొక్క పుట్టుకను మన స్వీయ చైతన్యములో సాక్షాత్కారించడమే.” మీరు బలహీనమైన మనిషి అనే కల నుండి మీ ఆత్మ సహజమైన దైవత్వం యొక్క వాస్తవికత మేల్కొలుపులో ఈ క్రిస్మస్ మీకు ఒక కొత్త ప్రారంభం అవుతుంది. మీకు ఆటంకం కలిగించే ఏ పరిమిత ఆలోచనలైనా అలగే అలవాట్లు మీ చైతన్యంపై మాయ ద్వారా రుద్దబడిన భ్రాంతి జనకమైన కలలే. క్రీస్తు మరియు మహాత్ములు చూపిన చైతన్యము-విస్తరింపజేసే వినయం, ప్రేమ మరియు దివ్య అనుసంధానం యొక్క మార్గాన్ని మీరు పట్టువిడవ కుండా ఓరిమితో అనుసరిస్తునప్పుడు అవి మీ స్వేచ్ఛా సంకల్పం యొక్క శక్తితోనూ మరియు దేవుని యొక్క కృపతోనూ అవి కరిగిపోతాయి. మీరు దేవునిపై విశ్వాసాన్ని ఉంచి, మీ మనో, హృదయాల భయ, చింతల నుంచి విముక్తమైతే, నిశ్చలత్వం మరియు క్రీస్తు-శాంతి మీ చైతన్యంలోకి ప్రవహిస్తుంది — దేవుని సహాయక శక్తి మరియు సర్వ-స్వస్థత కాంతి యొక్క అంతర్గత భరోసా తెస్తుంది. ఇతరులపట్ల ప్రేమను, దయను విస్తరించడానికి, వారిలో మంచిని వీక్షించడానికీ, ప్రోత్సహించడానికి, ఏసు వలే నిస్వార్థ సేవలో ఆనందాన్ని పొందేందుకు మీరు చేసే ప్రతి ప్రయత్నంతో, శ్రీ పరమహంసగారు ప్రస్తావించిన, “ప్రతి మంచి ఆలోచనలో క్రీస్తు అంతరంగ సదనము,” అనే ఆ అనంతునితో అనుసంధానాన్ని ఇంకా అంతర్గత ఆనందాన్ని కనుగొంటారు.

భగవంతుని దివ్య లక్షణాలను మన జీవితాల్లో ప్రతిబి౦బి౦పచేయడానికి మన౦ ప్రయత్ని౦చినప్పుడు విశ్వజనీన క్రీస్తు మనలో జీవిస్తాడు. కానీ ఆ అనంత చైతన్యం యొక్క యదార్థత పూర్తిగా అనుభూతిచెందడానికి, ఆత్మలోని అగాధమైన మౌన సంసర్గము అనే పవిత్ర ఆలయంలోకి మనం ప్రవేశించాలి, అక్కడ మన అస్తిత్వంలో విస్తరించిన ఆయన ప్రేమ యొక్క పరివర్తన శక్తిని మనం అనుభూతి చెందవచ్చు. దివ్య పితతో ఆ అంతర్గత సంసర్గమే క్రీస్తుకు తన లక్ష్యాన్ని నెరవేర్చే శక్తిని, ధైర్యాన్ని మరియు అన్ని మర్త్య పరిమితులను అధిగమించగలిగిన ప్రేమను ఇచ్చింది. అంతర్గతంగా ఆ దివ్య చేతనని అనుభూతి చెందడం, అలాగే అందరిలో దేవుణ్ణి తిలకించగలిగిన ప్రతీ ఆత్మ ఏసు జీవించిన క్రీస్తు చైతన్యం యొక్క గొప్ప కాంతిలో ఒక చేతన అంశమవుతుంది — దేవుని ప్రేమ యొక్క నిశ్చిత స్వీకారానికి మరిన్ని ఎక్కువ ఆత్మలను ఆకర్షించి, మరింత గొప్ప సామరస్యాన్ని మరియు సద్భావనను ఈ ప్రపంచంలోకి తీసుకురాగలిగే శక్తి కలిగిన ఆ కాంతి.

ఆ దివ్య ప్రేమ యొక్క అనుభూతి ఈ క్రిస్మస్ లో మీకు మరియు మీ ప్రియతములకు దేవుని ఆశీర్వాదంగా ఉండుగాక.

స్వామి చిదానంద గిరి

అధ్యక్ష్యుడు మరియు ఆధ్యాత్మిక నేత, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్

Share this on

Share on facebook
Share on twitter
Share on whatsapp