భారతదేశం ‘అవేక్’ను ఆదరించింది

18 ఆగష్టు, 2016

న్యూ ఢిల్లీలో ప్రదర్శించబడుతున్న అవేక్

న్యూ ఢిల్లీలో ప్రదర్శించబడుతున్న అవేక్, 16 జూన్, 2016.

పరమహంస యోగానందగారి జీవితం గురించిన అవేక్: ద లైఫ్ ఆఫ్ యోగానంద, కౌంటర్ పాయింట్ ఫిల్మ్స్ అవార్డు గెలుచుకున్న డాక్యుమెంటరీని, భారతదేశం ఉత్సాహంగా స్వీకరించింది.

డాక్యుమెంటరీలు పెద్ద స్క్రీన్‌పై చాలా అరుదుగా ప్రదర్శించబడే దేశంలో, భారతదేశం అంతటా ఇరవై ఐదు ప్రధాన నగరాల్లోని థియేటర్‌లలో నాలుగు వారాలపాటు ప్రదర్శించబడిన అవేక్ దాదాపు 22,000 మంది వీక్షకులను ఆకర్షించింది.

అనేక భారతీయ వార్తాపత్రికలు మరియు సచిత్రపత్రికలు ఈ చిత్రానికి అద్భుతమైన ప్రశంసలను అందించాయి. ది ఎకనామిక్ టైమ్స్ దీనిని “స్ఫూర్తిదాయకమైన, ఆకర్షణీయమైన మరియు సమాచారాత్మకమైన డాక్యుమెంటరీ” అని పేర్కొంది. మిడ్ డే ఇలా తెలిపింది, “అవేక్ అనేది ఒక ప్రత్యేకమైన అనుభవం, ఇది ప్రేక్షకులను పూర్తిగా లీనంచేసే వైవిధ్యభరితమైన మహత్తర చిత్రం.” ది టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్ మరియు ది హిందూ వంటి ప్రముఖ వార్తాపత్రికలలో చలనచిత్ర సమీక్షలు మరియు సినిమా గురించిన నివేదికలతో పాటు పరమహంస యోగానందగారిపై ప్రత్యేక విశేషాలు ఉన్నాయి.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, ముంబై మరియు న్యూ ఢిల్లీలో అవేక్ ప్రీమియర్ ప్రదర్శనలను నిర్వహించడానికి చిత్ర పంపిణీదారుతో కలిసి పనిచేసింది. కళలు, క్రీడలు, సైన్స్ మరియు ప్రభుత్వ రంగానికి చెందిన అనేక మంది ప్రముఖులు హాజరైన ఈ రెండు ప్రదర్శనలలో వై‌.ఎస్‌.ఎస్. ప్రధాన కార్యదర్శి స్వామి స్మరణానంద ఈ చిత్రాన్ని పరిచయం చేశారు. ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రముఖుల జాబితాలో ప్రముఖ శాస్త్రీయ నృత్య ప్రదర్శనకారుడు మరియు కొరియోగ్రాఫర్ రాజా రెడ్డి, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రవిశాస్త్రి, అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ ఛైర్మన్ డాక్టర్ అనిల్ కకోద్కర్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ అలోక్ రంజన్ ఉన్నారు.

న్యూ ఢిల్లీలో ప్రదర్శించబడుతున్న అవేక్

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి స్వామి స్మరణానంద, జూన్ 16న న్యూఢిల్లీలో జరిగిన ప్రీమియర్‌లో అవేక్‌ను పరిచయం చేశారు.

జూన్ 21న రెండవ వార్షిక అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు వారంలో ఈ చిత్రం యొక్క ప్రీమియర్‌లు మరియు థియేట్రికల్ విడుదలలు జరిగేటట్లు ఏర్పాటు చేశారు. ఇది ప్రాచీన యోగా శాస్త్రానికి చెందిన ప్రముఖ విశ్వగురువుగా పరమహంసగారి పెరుగుతున్న పాత్రను గుర్తించి, నొక్కి చెబుతుంది.

సీనియర్ వై‌.ఎస్‌.ఎస్. సన్యాసి స్వామి శ్రద్ధానంద భారతదేశంలో అవేక్ యొక్క విజయవంతమైన అరంగేట్రాన్ని ఈ మాటలతో క్లుప్తంగా వివరించారు: “గురుదేవుల ఈ చిత్రం విడుదల మిరుమిట్లుగొలిపే ఆధ్యాత్మిక కాంతి యొక్క విశాలమైన జ్వాలతో ప్రారంభమైంది.”

జూలై 10న ఝార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి ద్రౌపది ముర్ము రాంచీలోని రాజ్‌భవన్‌లో అవేక్ ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, సైనికాధికారులు హాజరైన ఈ కార్యక్రమానికి గవర్నర్ స్వయంగా అధ్యక్షత వహించారు. స్వామి స్మరణానంద పరమహంస యోగానందగారికి మరియు అవేక్ నిర్మాణానికి సంక్షిప్త పరిచయం అందించారు.

ఎంబసీ డీసీ లో అవేక్ ను పరిచయం చేస్తున్న స్వామి విశ్వానంద

జూన్ 21న వాషింగ్టన్, డి.సి.లోని భారత రాయబార కార్యాలయంలో ప్రత్యేక ప్రదర్శనలో స్వామి విశ్వానంద అవేక్ ను పరిచయం చేశారు.

భారత రాయబార కార్యాలయాలు స్క్రీనింగ్‌ల కు బాధ్యత వహించారు

సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సహకారంతో, భారత రాయబార కార్యాలయాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం 2016లో భాగంగా వాషింగ్టన్, డి.సి., రోమ్, లిమా, జార్జియా, టిబిలిసిలో అవేక్: ది లైఫ్ ఆఫ్ యోగానంద యొక్క ప్రత్యేక ప్రదర్శనలను స్పాన్సర్ చేశాయి.

ప్రముఖ ఆహ్వానిత ప్రత్యేక ప్రేక్షకులు జూన్ 21న వాషింగ్టన్, డి.సి.లో జరిగిన ప్రదర్శనకు హాజరయ్యారు. సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క సీనియర్ సన్యాసి స్వామి విశ్వానంద ఈ చిత్రాన్ని పరిచయం చేశారు. “ఈ క్షణం చాలా గొప్ప వరం,” అని ఆయన అన్నారు. “పరమహంస యోగానందగారు పాశ్చాత్య దేశాలకు మరియు ప్రపంచానికి యోగా యొక్క గొప్ప రాయబారులలో ఒకరిగా గౌరవించబడినందున, ఇక్కడ తన స్వదేశానికి చెందిన రాయబార కార్యాలయంలో ఉండటం గొప్ప అదృష్టం మరియు గౌరవం.”

యునైటెడ్ స్టేట్స్‌లోని భారత రాయబారి, హిస్ ఎక్సలెన్సీ మిస్టర్ అరుణ్ కె. సింగ్, అవేక్ లో కనిపించే నానోబయోఫిజిక్స్ రంగంలో అంతర్జాతీయంగా గౌరవించబడిన హార్వర్డ్ ప్రొఫెసర్ అనితా గోయెల్, ఎం.డి, పి‌హెచ్.డి, హాజరయ్యారు. ఆమె మరియు స్వామి విశ్వానంద అవేక్ చిత్ర ప్రదర్శన తర్వాత ప్రశ్నోత్తరాల సమావేశాన్ని నిర్వహించారు.

భారత రాయబారి సింగ్ మరియు అనిత గార్లతో స్వామి విశ్వానంద

స్వామి విశ్వానందతో యు.ఎస్.లోని భారత రాయబారి హెచ్.ఈ. మిస్టర్. అరుణ్ కే. సింగ్ (కుడి), మరియు డాక్టర్ అనితా గోయెల్ (ఎడమ).

ప్రపంచవ్యాప్తంగా యోగా వ్యాప్తికి పరమహంసగారు చేసిన కృషిని అంబాసిడర్ సింగ్ గుర్తించారు. “మన తీవ్రమైన జీవనశైలిని సమతుల్యం చేయడానికి యోగా ఒక ముఖ్యమైన మరియు సానుకూల అంశంగా నిరూపించబడింది,” అని ఆయన తన పరిచయ వ్యాఖ్యలలో చెప్పారు. “ఇది శరీరాన్ని మాత్రమే కాకుండా మనస్సును కూడా విస్తరిస్తుంది. ఇది మనమందరం ఒకరితో ఒకరు చేరి, సామరస్యంగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది, ఇది మన భవిష్యత్తును రూపొందించి మరియు నిర్వచిస్తుందని నేను ఆశిస్తున్నాను.”

రాయబారి సింగ్ వ్యాఖ్యలను అనుసరించి, అతిథులకు భారత ప్రధాన మంత్రి గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీ మరియు విదేశాంగ మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ నుండి రెండు చిన్న వీడియో సందేశాలు చూపించబడ్డాయి. దీనిలో వారు నేటి ప్రపంచంలో యోగా యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం వెనుక ఉన్న చోదక శక్తి అయిన శ్రీ మోదీ, “యోగా మనకు స్వీయ జ్ఞానాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది,” అని ధృవీకరించారు.

వాషింగ్టన్, డి.సి.లోని భారత రాయబార కార్యాలయం ఈ కార్యక్రమం యొక్క ఫోటో గ్యాలరీని పోస్ట్ చేసింది.

భారత ఇటలీ రాయబారి అనిల్ వాధ్వాగారుఇటలీలోని భారత రాయబారి హెచ్.ఈ.మిస్టర్ అనిల్ వాధ్వా జూన్ 20న జరిగిన ప్రదర్శనలో అవేక్ ను పరిచయం చేశారు. ఈ కార్యక్రమాన్ని రోమ్‌లోని భారత రాయబార కార్యాలయం ఎస్‌.ఆర్‌.ఎఫ్. రోమ్ సెంటర్ సహకారంతో స్పాన్సర్ చేసింది. రాయబారి వాధ్వా పాశ్చాత్య దేశాలలో యోగా బోధనలను వ్యాప్తి చేయడంలో పరమహంస యోగానందగారి సందేశం యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడారు మరియు ఈ గొప్ప గురువు యొక్క కృషిని కొనసాగించినందుకు ఎస్‌.ఆర్‌.ఎఫ్.కు ధన్యవాదాలు తెలిపారు.

భారత పెరు మరియు బొలివియా రాయబారి సందీప్ చక్రవర్తిగారుపెరూ మరియు బొలీవియాలోని భారత రాయబారి హెచ్.ఈ.మిస్టర్ సందీప్ చక్రవర్తి జూన్ 17న పెరూలోని లిమాలోని భారత రాయబార కార్యాలయంలో అవేక్ ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఎస్‌.ఆర్‌.ఎఫ్. యొక్క లిమా ధ్యాన కేంద్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో సహాయపడింది. ధ్యాన కేంద్రం కార్యదర్శి, శ్రీమతి అమేలియా రోమన్, ఎడమవైపు కనిపిస్తున్నారు.

భారత ట్రినిడాడ్ హై కమిషనర్ గౌరి శంకర్ గుప్తాగారుట్రినిడాడ్‌లోని సెయింట్ అగస్టిన్‌లోని వెస్టిండీస్ విశ్వవిద్యాలయంలో జూన్ 21న అవేక్ ప్రదర్శించబడింది. శాన్ ఫెర్నాండో, ట్రినిడాడ్ మరియు టొబాగోలోని ఎస్‌.ఆర్‌.ఎఫ్. యొక్క ధ్యాన బృందం సభ్యులు, ఇండియన్ హై కమీషన్, ట్రినిడాడ్ మరియు టొబాగో సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయం చేశారు. ఇక్కడ హై కమీషనర్, హెచ్.ఇ.మిస్టర్ శంకర్ గుప్తా, యోగా విషయంపై ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించడం చూడవచ్చు.

భారత అర్మేనియా రాయబారి యోగేశ్వర్ సంగ్వన్ గారుహెచ్.ఈ. యోగేశ్వర్ సాంగ్వాన్ (కుడి నుండి ఐదవ), జూన్ 26న జార్జియాలోని టిబిలిసిలో జరిగిన అవేక్ ప్రదర్శనకు కొంతమంది ప్రముఖ జార్జియన్లు మరియు భారతీయులతో పాటు ఆర్మేనియాలో భారత రాయబారి హాజరైయ్యారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం, 2016 వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఆర్మేనియాలోని యెరెవాన్‌లోని భారత రాయబార కార్యాలయం స్పాన్సర్ చేసింది.

ఇతరులతో పంచుకోండి