రాంచీలోని యోగదా సత్సంగ శాఖా ఆశ్రమాన్ని గౌరవనీయులైన ఝార్ఖండ్ గవర్నర్, శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్ ఫిబ్రవరి 5న సందర్శించారు. పరమహంస యోగానందగారు ఒకప్పుడు ఉపయోగించిన గదిలో ఆయన నివాళులర్పించి, స్మృతి మందిరంలో ధ్యానం చేసి గాఢమైన ఆంతరంగిక శాంతిని అనుభవించారు.
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) సీనియర్ సన్యాసి అయిన స్వామి ఈశ్వరానంద గారు, వై.ఎస్.ఎస్. యొక్క అధ్యాత్మిక, మానవతావాద కార్యకలాపాల గురించి, పవిత్రమైన గురుశిష్య సాంప్రదాయం గురించి మరియు పరమహంస యోగానంద గారి జీవిత-పరివర్తనకారక బోధనల గురించి గవర్నర్ కు వివరించారు. సమాజం యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం వై.ఎస్.ఎస్. చేస్తున్న కృషిని గవర్నర్ ప్రశంసించారు.
గౌరవనీయులైన గవర్నర్ గారికి, ఒక యోగి ఆత్మకథ, గాడ్ టాక్స్ విత్ అర్జున: ద భగవద్గీత, ఆత్మ సాక్షాత్కారం వైపు ప్రయాణం, మరియు వై.ఎస్.ఎస్. ప్రచురించిన క్యాలెండరును బహూకరించడం జరిగింది.
ఆశ్రమాన్ని సందర్శించాలని తాను చాలా కాలంగా కోరుకుంటున్నానని గవర్నర్ వెల్లడించారు. స్వామి ఈశ్వరానందను కూడా రాజ్ భవన్ సందర్శించాలని ఆయన ఆహ్వానించారు. అలాగే, ఆశ్రమాన్ని మరోసారి సందర్శించి ఆశ్రమం యొక్క ప్రశాంత వాతావరణంలో మరింత సమయం గడపాలనే తన కోరికను వెలిబుచ్చారు.
ఒక యోగి ఆత్మకథ మరియు గాడ్ టాక్స్ విత్ అర్జున: ద భగవద్గీత లను శ్రీ గంగ్వార్ కు స్వామి ఈశ్వరానంద బహూకరించి…




















