బాలలు మరియు యుక్త వయస్కుల కోసం వై.ఎస్.ఎస్. శిబిరం — 2026

19 ఏప్రిల్, 2026

యువ హృదయాలలో భగవంతుడి ప్రేమను పెంపొందించడం

శూలిని విశ్వవిద్యాలయ ఆవరణ యొక్క దృశ్యం

బాలలు మరియు యుక్త వయస్కుల వారి కోసం ఒక నూతన అఖిల భారత వేసవి శిబిరాన్ని హిమాలయ పర్వతపాద ప్రాంతంలో నిర్వహిస్తున్నామని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) సంతోషంతో ప్రకటిస్తోంది.

స్థలం: శూలిని విశ్వవిద్యాలయం, సోలన్, హిమాచల్ ప్రదేశ్

తేదీలు: మే 31 నుండి జూన్ 6, 2026 (ఆదివారం నుండి శనివారం వరకు)

12-17 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలురు మరియు బాలికలు పాల్గొనడానికి ఆహ్వానితులు.

ముఖ్యాంశాలు

  1. పైన పేర్కొన్న తేదీలను తల్లితండ్రులు తమ డైరీలలో గుర్తుపెట్టుకోవాలని అభ్యర్థన. పాల్గొంటున్న బాలలు, యుక్త వయస్కులు, శిబిరం యొక్క ప్రదేశానికి శనివారం, మే 30వ తేదీ మధ్యాహ్నానికి చేరుకొని, జూన్ 6వ తేదీ, శనివారం సాయంత్రం వెనుకకు బయలుదేరవచ్చును.
  2. అన్ని పాఠాలు మరియు ధ్యానాలు ఇంగ్లీషులో నిర్వహించబడతాయి.
  3. శిబిరంలో పాల్గొనేందుకు తల్లిదండ్రులు మరియు యువజనులు పూరించవలసిన దరఖాస్తు ఫారం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఫారం పూరించే ముందు అందులో పేర్కొన్న సూచనలను దయచేసి చదవండి.
  4. మీరు ఫారం పూర్తి చేసేందుకు సహాయం అవసరమైతే, శిబిరం యొక్క దరఖాస్తు గురించి ఆంగ్లంలో మరియు హిందీలో స్థూలంగా వివరించే ఈ వీడియోలు చూడవచ్చు. శిబిరం లేదా దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి మరింత సహాయం లేదా సందేహాల కోసం, దయచేసి తరచుగా అడిగే ప్రశ్నలు చూడండి, లేదా వై.ఎస్.ఎస్. సహాయ కేంద్రమును సంప్రదించండి: (0651) 6655 555 / [email protected] కు వ్రాయండి
  5. దరఖాస్తు ఆమోదం పొందిన అనంతరం, నమోదు రుసుముగా ₹5,000 చెల్లించవలసి ఉంటుంది. శిబిరంలో వారంపాటు వసతి, భోజనాలు మరియు అల్పాహారం, కళలు/చేతి పనుల సామగ్రి, క్రీడా పరికరాలు మరియు ఇతర ఏర్పాట్లు ఈ రుసుములో కూడి ఉంటాయి.
  6. తల్లిదండ్రుల కోసం ముఖ్యమైన సమాచారం ఉన్న పత్రం కోసం దయచేసి ఈ లింక్ మీద క్లిక్ చేయండి:
    • శిబిరంలో నమోదు రుసుము చెల్లించడానికి ఆర్థిక సహాయం
    • వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమం మరియు వై.ఎస్.ఎస్. చండీఘర్ కేంద్రం నుండి శూలిని యూనివర్సిటీకి పిల్లలకు ఉచిత రవాణా ఉంటుంది
    • ఈ రెండు ప్రదేశాలలో తీసుకువెళ్ళే (పిక్ అప్) మరియు చేరవేసే (డ్రాప్ ఆఫ్) తేదీలు మరియు సమయాలు
    • తమ పిల్లలు శిబిరంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏకాంత ధ్యాన వాసంలో ఉండే అవకాశాలు

శిబిరం యొక్క వివరాలు

ఈ శిబిరం శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి జీవించడం ఎలా బోధనలపై ఆధారితమై ఉంటాయి; ఇవి శరీరం, మనస్సు మరియు ఆత్మల సమతుల్య అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి.

ఇది వై.ఎస్.ఎస్. సన్యాసుల నాయకత్వంలో, అనుభవజ్ఞులైన గృహస్థ శిష్యులు మరియు సుశిక్షితులైన స్వచ్ఛంద సేవకుల సహాయంతో నిర్వహించబడుతుంది.

స్వామి ఈశ్వరానంద గారితో శూలిని శిబిర బృందంలో భాగమైన సన్యాసులు మరియు భక్తులు

శిబిరం మరియు ఆవరణల విశేషాంశాలు

  • హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ లో ఉన్న శూలిని విశ్వవిద్యాలయానికి చెందిన 25 ఎకరాల ఆవరణలో ఈ శిబిరం నిర్వహించబడుతుంది.
  • భారతదేశంలో ఒక ఉత్తమ పరిశోధనా-కేంద్రిత ప్రైవేటు విశ్వవిద్యాలయమైన శూలిని విశ్వవిద్యాలయం యొక్క సంపూర్ణ సహకారంతో ఈ శిబిరం నిర్వహించబడుతోంది.
  • విశ్వవిద్యాలయ ఆవరణలోని అత్యాధునిక సదుపాయాలు—హాస్టల్ గదులు, తరగతి గదులు, భోజన సౌకర్యాలు, క్రీడా సదుపాయాలు మరియు సమావేశ మందిరాలు (ఆడిటోరియములు) వై.ఎస్.ఎస్. శిబిరం కోసం అందుబాటులో ఉంటాయి.
  • బాలురు మరియు బాలికల శిబిరాలు ఒకే ఆవరణలో, ఒకే వారంలో, విడివిడిగా నిర్వహించబడతాయి. బాలబాలికలు ఇద్దరూ కలిగి ఉన్న కుటుంబాలవారు, ఒకే సమయంలో వారిని శిబిరానికి పంపడానికి ఇది వీలు కలిగిస్తుంది.
  • శిబిరం సందర్భంగా, బాలలు మరియు యుక్తవయస్కులు, సమవయస్కుల బృందాలలో ఒక ఆధ్యాత్మిక స్నేహితుల సంఘంగా, శ్రద్ధగా చూసుకునే పెద్దల మార్గనిర్దేశంలో గడుపుతారు.
శిబిరవాసులకు ప్రకృతి మధ్యలో సౌకర్యవంతమైన వసతి సదుపాయాలు ఏర్పాటు చేయబడతాయి; దీని వల్ల, ఆరుబయటి కార్యక్రమాలను, శిబిరం లోపలి కార్యక్రమాలను సమతుల్యంగా నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుంది.

దైనందిన కార్యక్రమాలు

శిబిరంలో ఒక సాధారణ దినం, బాలలు మరియు యుక్తవయస్కులలో క్రమశిక్షణను మరియు ఆత్మావలోకనాన్ని పెంపొందించడంతో పాటు సరదాగా కూడా ఉండే అనేక రకాల కార్యక్రమాలతో నిండి ఉంటుంది:

  • దైనందిన సామూహిక ధ్యానాలు
  • సంకల్పశక్తి, స్నేహం మరియు నిర్భయం వంటి విషయాలపై జీవించడం ఎలా పాఠాలు
  • ధ్యాన ప్రక్రియలపై సమీక్షా పాఠాలు మరియు సత్సంగాలను సన్యాసులు నిర్వహిస్తారు
  • క్రీడలు మరియు ఆటలు
  • గీతా పఠనం
  • కీర్తన
  • రాత్రి చలనచిత్ర ప్రదర్శన
  • కళలు మరియు చేతిపనుల కార్యకలాపాలు
  • ప్రకృతిలో నడకలు
  • ఆధ్యాత్మిక మేళా
  • సాంస్కృతిక సంధ్య
  • సామూహిక చర్చలు మరియు పాత్ర యొక్క అభినయాలు

తల్లితండ్రుల అనుభవాలు

గతంలో జరిగిన వై.ఎస్.ఎస్. బాలల శిబిరాల గురించి తల్లితండ్రుల అనుభవాలు రెండింటిని ఈ క్రింద చూడగలరు:

తదుపరి దశలు

  • సూచనలు చదవడానికి మరియు ఫారం పూర్తి చేసేందుకు దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఫారం పూర్తి చేసిన అనంతరం, తరువాతి దశలు కనపడతాయి, అలాగే ఫారంలో ఇవ్వబడిన ఈమెయిల్ చిరునామాకు కూడా ఇవి పంపించబడతాయి.
  • ఈ శిబిరం జరుగుతున్న సమయంలోనే కొంతమంది తల్లితండ్రులు, దగ్గరలోనే ఉన్న ఢిల్లీ, నోయిడా, చండీగఢ్, షిమ్లా, సోలన్, లేదా ఆ చుట్టుపక్కల ప్రదేశాలలో వ్యక్తిగత ఏకాంత ధ్యాన వాసం (రిట్రీట్), తీర్థయాత్ర లేదా సెలవుల కోసం ఏర్పాట్లు చేసుకోవచ్చు.

యోగదా కుటుంబాలకు చెందిన బాలలు, యుక్తవయస్కులు ఈ అద్వితీయమైన, అభివృద్ధిదాయకమైన వై.ఎస్.ఎస్. శిబిరంలో పాల్గొని, ఇందులో లభించే ఆధ్యాత్మిక స్నేహాలు, సరదా కార్యక్రమాలు, ఆత్మ-శిక్షణ, పాఠాల నుంచి, మరియు భగంతుడితో తమ వ్యక్తిగత బంధం యొక్క పునర్జాగృతి నుంచి ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాము.

ఇతరులతో పంచుకోండి