స్మారకోత్సవ ఆరు-గంటల ధ్యానం

(పరమహంస యోగానందగారు మరియు
స్వామి శ్రీయుక్తేశ్వర్ గారి స్మారకార్థం)

శనివారం, మార్చి 8, 2025

ఉదయం 7:40

– మధ్యాహ్నం 2:00

(భారతీయ కాలమానం ప్రకారం)

ఈ కార్యక్రమం గురించి

మీరు నిబ్బరంగా ప్రతి రోజూ సాధించే ఆధ్యాత్మిక ప్రగతికన్న ముఖ్యమైనది మరొకటి లేదు; అందుకు క్రియాయోగాన్ని ఉపయోగించండి.

— స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి

మన ప్రియతమ గురుదేవులైన పరమహంస యోగానందగారు మరియు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. మార్గంలోని భక్తులకు పరమగురువులైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గారి మహాసమాధి ప్రత్యేక దినములను స్మరించుకొనేందుకు ఆరు-గంటల ఆన్లైన్ ధ్యానం వై.ఎస్.ఎస్. సన్యాసులచే శనివారం, మార్చి 8న నిర్వహించబడింది.

శక్తిపూరణ వ్యాయామాలతో ప్రారంభమై తరువాత పార్థన, స్ఫూర్తిదాయక పఠనం, మరియు నియమిత సమయంపాటు భక్తిగానం మరియు ధ్యానం నిర్వహించబడ్డాయి. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమం సమాప్తమయ్యింది.

శనివారం మార్చి 8న ధ్యాన కార్యక్రమం ఈ విధంగా ఉంది:

  • శక్తిపూరణ వ్యాయామాలు – ఉదయం 7:40 నుండి ఉదయం 8:00 (భారతీయ కాలమానం) వరకు
  • మొదటి భాగం – ఉదయం 8:00 నుండి ఉదయం 11:00 (భారతీయ కాలమానం) వరకు
  • రెండవ భాగం – ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2:00 (భారతీయ కాలమానం) వరకు

ఈ ప్రత్యేక సందర్భంలో, వివిధ ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళు కూడా వ్యక్తిగతంగా భక్తులు పాల్గొనే కార్యక్రమాలను నిర్వహించాయి.

ఈ పుణ్యప్రదమైన సందర్భంలో, విరాళం సమర్పించాలని మీరు భావిస్తే, మన వెబ్ సైట్ ను సందర్శించి క్రింద ఇచ్చిన లింక్ ద్వారా సమర్పించవచ్చు. మీ తోడ్పాటు వివిధ మానవతా కార్యకలాపాలను చేపట్టడానికి మాకు సహాయపడడమే కాకుండా, మహనీయులైన గురువుల పట్ల మీ శాశ్వత ప్రేమను మరియు దృఢమైన భక్తిని తెలుపుతుంది.

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో పంచుకోండి