సన్యాసుల పర్యటన, సంబల్పూర్

ఒక-రోజు కార్యక్రమం

)

శుక్రవారం, ఏప్రిల్ 7, 2023

అదనపు సమాచారం

కార్యక్రమ వేదిక:

యోగదా సత్సంగ ధ్యాన మండలి — సంబల్పూర్
భీమా భోయి రోడ్, డాక్టర్ రాజేశ్వరి పాణిగ్రాహి ఇంటి దగ్గర,
శాంతి నగర్, సంబల్పూర్ – 768004, ఒడిశా

సంప్రదించాల్సిన వివరాలు:

ఫోన్:

9937200723, 9078171778
9437050007

ఈ-మెయిల్:

చిరునామా:

కార్యక్రమ వేదిక

ఈ కార్యక్రమం గురించి

ఆనంద వనాన్ని మీ లోపల ఏర్పాటు చేయడం కోసం, నిశ్శబ్ద ద్వారం ద్వారా ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఈ విశ్వ సంరక్షకుడు మీ హృదయ ద్వారాలను తడుతున్నాడు.

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

పరమహంస యోగానందగారి ఆత్మ-విముక్తి బోధనల పట్ల నిరంతరం పెరుగుతున్న ఆసక్తిని ఈడేర్చడానికి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క సన్యాసులు ప్రతి సంవత్సరం భారతదేశంలోని వివిధ నగరాలలో పర్యటిస్తారు. పరమహంస యోగానందగారి బోధనల గురించి తెలుసుకోవాలనే కొత్తవారికి, అలాగే వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్ధులు వై.ఎస్.ఎస్. ధ్యాన ప్రక్రియలపై లోతైన మార్గదర్శకత్వాన్ని పొందేందుకు ఈ సన్యాసుల పర్యటనలు ఒక అద్భుతమైన అవకాశాన్ని కలుగజేస్తాయి.

ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం వ్యక్తిగత సాధనకు ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది కాబట్టి, వీటిలో పాల్గొనడం వల్ల మీ ఆధ్యాత్మిక ఉత్సాహం పునరుత్తేజం పొందుతుంది, అలాగే ఇతర చిత్తశుద్ధిగల సాధకులతో కలిసి ధ్యానం చేయడం, వారి సాంగత్యంలో గడపడం ద్వారా లభించే ఆనందాన్ని, అనుగ్రహాన్ని పొందేందుకు ఇది మీకు తోడ్పడుతుంది.

ఈ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా, అవిశ్రాంత కార్యకలాపాల నుండి మీ దృష్టిని వెనుకకు మరల్చి అంతర్గత నిశ్శబ్దంపై కేంద్రీకరించి, ఆ విధంగా భగవంతుని దివ్య శాంతి మరియు ఆనందామృతాన్ని మీరు ఆస్వాదించాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు, మీ దైనందిన జీవితంలో గురుదేవుల బోధనలను ఆచరించేందుకు వై.ఎస్.ఎస్. సన్యాసుల మార్గదర్శకత్వాన్ని కూడా మీరు పొందవచ్చు.

కార్యక్రమము యొక్క వివరాలలో ఒక ప్రదేశానికి మరొక ప్రదేశానికి మధ్య మార్పు ఉండవచ్చు, ఒక నమూనా వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది:

వివరాలు

ఉదయం 08:00 నుండి ఉదయం 9:15 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఉదయం 10:00 నుండి ఉదయం 11:00 వరకు

హాంగ్-సా ప్రక్రియపై సమీక్ష
(వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థులకు మాత్రమే)

ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు

శక్తిపూరణ వ్యాయామాలపై సమీక్ష
(వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థులకు మాత్రమే)

మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 02:30 వరకు

సన్యాసులతో వ్యక్తిగత సమావేశం
(అభ్యర్థన మేరకు అందుబాటులో ఉంటుంది)

మధ్యాహ్నం 02:30 నుండి మధ్యాహ్నం 03:30 వరకు

ఓం ప్రక్రియపై సమీక్ష
(వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థులకు మాత్రమే)

సాయంత్రం 04:30 నుండి సాయంత్రం 06:30 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు, ధ్యానం మరియు ముగింపు సత్సంగం

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో పంచుకోండి