“సంతులిత జీవనంపై పరమహంస యోగానందగారి ఆదర్శాలు” అనే అంశంపై వై.ఎస్.ఎస్. సాధనా సంగమం ముగింపు సందర్భంగా ఆదివారం, మార్చి 15న వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారు ప్రసంగిస్తారని ప్రకటించడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. అమెరికాలోని లాస్ ఏంజిలిస్ ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం నుండి ప్రత్యక్ష ప్రసారమయ్యే ఈ ప్రసంగంలో పాల్గొనమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.
నేటి వేగవంతమైన, డిమాండ్లతో కూడిన ప్రపంచంలో చాలామంది ఆంతరంగిక శాంతి మరియు ఆధ్యాత్మిక సాఫల్యాలతో తమ బాహ్యమైన బాధ్యతలను నెరవేర్చాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రసంగంలో స్వామి చిదానందగారు, సమతుల్య జీవనంపై పరమహంస యోగానందగారి ఆచరణాత్మక ఆదర్శాలను — భగవంతుడిపై దృష్టిని స్థిరంగా కేంద్రీకరించి ఉంచుతూనే ఈ ప్రపంచంలో ఎలా జీవించాలో తెలియజేస్తారు. శరీరం, మనస్సు మరియు ఆత్మల యొక్క సామరస్యపూర్వకమైన అభివృద్ధి యొక్క యోగ సూత్రాలపై ఆధారితమైన ఈ ప్రసంగం, దైనందిన ధ్యానం, సరియైన చర్య, మరియు సమచిత్తము, జీవితంలోని విధులను ప్రశాంతత, ఆనందం, మరియు ఆధ్యాత్మిక సమతుల్యతతో నిర్వహించదానికి ఎలా దోహదపడతాయో నొక్కి చెబుతుంది. పనిలోకి, సంబంధబాంధవ్యాలలోకి, మరియు సేవలోకి దైవ-అనుసంధానం యొక్క శాంతిని ఎలా తీసుకురావచ్చో తెలుసుకోండి.
ప్రత్యక్ష-ప్రసారం అనంతరం వీక్షించడానికి కూడా ఈ ప్రసంగం అందుబాటులో ఉంటుంది.
ఈ కార్యక్రమం ఇంగ్లీషులో నిర్వహించబడుతుంది. అదే సమయంలో హిందీలో వివరణ (జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసార సమయంలో మాత్రమే) అందుబాటులో ఉంటుంది.
అదే సమయంలో హిందీలో వివరణను పొందడానికి:
- జూమ్ ద్వారా పాల్గొనండి (కార్యక్రమం ప్రత్యక్షప్రసారం సందర్భంలో). కార్యక్రమానికి కొద్ది నిమిషాల ముందు దీనిలో చేరమని సూచిస్తున్నాము.
- మీ జూమ్ విండో దిగువన ఉన్న టూల్ బార్ లో “Interpretation” బటన్ మీద క్లిక్ చేయండి. (మీకు ఆ బటన్ కనిపించకపోతే, “More” బటన్ మీద క్లిక్ చేసి Menu నుండి “Interpretation” ఎంపిక చేసుకోండి.)
- జాబితాలో “హిందీ” ఎంచుకోండి.
- ఒకసారి కార్యక్రమం ప్రారంభమయ్యాక, మీరు హిందీలో ఏకకాల వివరణను వింటారు.
మీకు సాంకేతిక సహాయం అవసరమైతే, దయచేసి మా సహాయ కేంద్రాన్ని ఈ-మెయిల్ ద్వారా (0651) 6655 555 లేదా [email protected] కాల్ చేసి సంప్రదించండి.
వీటిని కూడా పరిశోధించడానికి మీరు ఇష్టపడవచ్చు:
పరమహంస యోగానందగారి జీవించడం ఎలా బోధనలు మరియు ధ్యాన ప్రక్రియలపై స్వామి చిదానందగారి స్ఫూర్తిదాయక ప్రసంగాలు మరికొన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. వీటిని వీక్షించడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.
- “క్రియాయోగా: ద ఆన్సర్ టు ఇన్నర్ అండ్ ఔటర్ టర్మొయిల్స్”
- “ఇంట్రాస్పెక్షన్ — మిరాకిల్ టూల్ ఫర్ స్పిరిట్చ్యువల్ గ్రోత్” అనే అంశంపై స్వామి చిదానంద గిరి గారు
- “చూసింగ్ టు బి ఎ కాంక్వరర్ —దట్ ఈజ్ ద రెమిడీ” అనే అంశంపై స్వామి చిదానంద గిరి గారు
- “క్రియాయోగం: సైన్స్ ఆఫ్ స్పిరిట్చ్యువల్ లివింగ్ ఫర్ ద మోడర్న్ ఏజ్” అనే అంశంపై స్వామి చిదానంద గిరి గారు

















