యోగానందగారు ఇలా తెలిపారు, “భగవంతుని తెలుసుకున్న మహాత్ముల నిజస్వభావపు లోతులు ఎవరూ కొలవలేరు, అది అగాధమైనది. మా గురుదేవులు, స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు ఆ విధంగా ఉండేవారు. ఆయన అన్నిటికన్నా విలక్షణంగా ఉండేవారు. భగవంతునితో ఐక్యత చెంది, ఇతర విషయాలన్నిటి పట్లా మమకార రాహిత్యంతో ఉండడాన్ని యోగం బోధిస్తుంది.”
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులకు పరమ గురుదేవులయిన స్వామి శ్రీయుక్తేశ్వర్ గారి ఆవిర్భావ దినోత్సవాన్ని (జన్మదిన వార్షికోత్సవం) గౌరవించుకొనేందుకు శనివారం, మే 10న యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన ఒక సన్యాసి, ఒక ప్రత్యేక ధ్యానాన్ని నిర్వహించారు. ఈ ఆన్లైన్ కార్యక్రమంలో నియమిత సమయంపాటు భక్తిగీతాలాపన, ధ్యానం, స్ఫూర్తిదాయక పఠనం కూడి ఉన్నాయి.
ఈ రోజున, వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళు కూడా వ్యక్తిగతంగా పాల్గొనే కార్యక్రమాలను నిర్వహించాయి.
మీరు వీటిని అన్వేషించడానికి ఇష్టపడవచ్చు:
భక్తులు తాము పొందిన ఎన్నో ఆశీస్సులకు కృతజ్ఞతగా గురు-ప్రణామి సమర్పించే అవకాశాన్ని స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరిగారి ఆవిర్భావ దినోత్సవ ప్రత్యేక సందర్భం కలుగజేస్తోంది. వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. గురువుల ఆత్మ-విమోచన బోధనలను వ్యాప్తి చేసేందుకు మీ విలువైన విరాళం ఉపయోగించబడుతుంది.
మీరు కోరుకొంటే, క్రింద ఉన్న బటన్ మీద క్లిక్ చేసి ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు.