యువ సాధకుల సంగమం

(రాంచీ ఆశ్రమం)

బుధవారం, 10 సెప్టెంబర్, 2025 – ఆదివారం, 14 సెప్టెంబర్, 2025

కార్యక్రమం గురించి

మనస్సు మరియు భావాలను లోపలికి మళ్లించినప్పుడు, దేవుని పరమానందాన్ని మీరు అనుభవించడం ప్రారంభిస్తారు. ఇంద్రియ సుఖాలు శాశ్వతం కాదు, భగవంతుని ఆనందం శాశ్వతమైనది. అది సాటి లేనిది!

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

ఒక నూతన కార్యక్రమం వికసిస్తోంది

యువ సాధకులు (23-35 సంవత్సరాల వయస్సు) ఆధ్యాత్మికంగా నిమగ్నమయ్యే అనుభవం పొందేందుకు, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) మొట్టమొదటిసారిగా ఒక ప్రత్యేకమైన సాధనా సంగమాన్ని, ప్రశాంతమైన వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో సెప్టెంబరు 10 నుండి 14, 2025 మధ్య నిర్వహించింది.

ఆంతరిక స్పష్టతను, శక్తిని చేకూర్చే పరమహంస యోగానందగారి సార్వత్రిక బోధనలపై యువతలో పెరుగుతున్న ఆసక్తికి ఈ ప్రత్యేక సంగమం ఒక అభివ్యక్తి.

భారతదేశమంతటి నుండి వందలాది మంది యువభక్తులు కలుసుకుని పరమహంస యోగానందగారి బోధనలను లోతుగా అధ్యయనం చేయడానికి, దివ్యమైన స్నేహాలను ఏర్పరచుకోవడానికి మరియు వేగవంతమైన ఆధునిక ప్రపంచానికి సరిపోయే సమతుల్య ఆధ్యాత్మిక జీవనశైలిని కనుగొనే ఒక పవిత్ర అవకాశాన్ని ఈ సంగమం అందించింది.

జీవితంలో యోగ విధానాన్ని పెంపొందించుకునే ఒక ఆధ్యాత్మిక దినచర్య

యోగానందగారి సంతులిత జీవన ఆదర్శంలో పాదుకున్నట్లుగా, సంగమ సమయంలో దైనందిన దినచర్య సరళంగాను, అదే సమయంలో పరివర్తనకారకంగాను ఉంది: ధ్యానాలు, కీర్తనలు, ఆకర్షణీయమైన తరగతులు మరియు వర్క్‌షాప్‌లు, ఆనందకరమైన సేవ, స్ఫూర్తిదాయకమైన సత్సంగాలు, వై.ఎస్.ఎస్. పాఠాల అధ్యయనం, ఆత్మపరిశీలన మరియు విశ్రాంతి, వినోదం మరియు సహవాసం.

ఈ సంపూర్ణ యోగా జీవనశైలి ఆలోచనాత్మకంగా ప్రణాళిక చేయబడింది మరియు యువ అన్వేషకుల కోసం రూపొందించబడింది — వారు ఇంటికి తీసుకువెళ్లి, వారి స్వంతం చేసుకొనగలిగేటటు వంటిది.

సంగమంలోని ముఖ్యాంశాలు

ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఎస్. ధ్యాన ప్రక్రియలపై సమీక్ష మరియు మార్గదర్శక అభ్యాసాలతోపాటు, ముఖ్యంగా యువ అన్వేషకుల కోసం నూతన అంశాలు కూడా పరిచయం చేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో అదనంగా క్రింది అంశాలు కూడి ఉన్నాయి:

  • సామూహిక ధ్యానాలు మరియు కీర్తనలు
  • పవిత్రమైన వై.ఎస్.ఎస్. ధ్యాన ప్రక్రియల సమీక్ష మరియు నిర్దేశిత అభ్యాసం
  • పాఠాల సామూహిక అధ్యయనం మరియు ఆత్మపరిశీలన
  • గురుదేవుల బోధనలు మరియు వాటిని దైనందిన జీవితంలో ఆచరించేందుకు స్ఫూర్తిదాయకమైన సత్సంగాలు
  • వర్క్‌షాప్‌లు మరియు సామూహిక చర్చా కార్యక్రమాలు
    • ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం
    • వేగవంతమైన ప్రపంచంలో ఆంతరిక సమతుల్యతను కనుగొనడం
    • దయ మరియు పరిశీలనతో సంబంధాలను పెంపొందించుకోవడం
    • సఫలత పొందగలిగే సూత్రాన్ని వర్తింపజేయడం
  • రాంచీకి సమీపంలోని ప్రకృతి ప్రదేశానికి విహారయాత్ర
  • హఠ యోగా సమావేశాలు, క్రీడలు మొదలైన వినోద కార్యకలాపాలు
  • ఇతర యువ సాధకులతో సహవాసం

తరగతులు మరియు ఉపన్యాసాలు ఆంగ్లంలో నిర్వహించబడ్డాయి. క్రియాయోగ దీక్షా వేడుక లేనప్పటికీ, క్రియాయోగ ప్రక్రియపై ఒక సమీక్ష నిర్వహించబడింది.

మీరు అందించే ఆర్థిక మద్దతు ప్రశంసనీయం

ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడానికయ్యే వివిధ ఖర్చులను పూరించడానికి మేము మీ సహకారాన్ని అభ్యర్థిస్తున్నాము. పరిమితమైన స్తోమత ఉన్న భక్తులు కూడా పాల్గొనేందుకు వీలుగా నమోదు రుసుములో రాయితీ ఇవ్వబడింది. ఈ రాయితీని అందించడానికి మరియు తద్ద్వారా గురుదేవుల ఆతిథ్యాన్ని చిత్తశుద్ధిగల అన్వేషకులందరికీ విస్తరింపజేసేందుకు మాకు వీలు కలిగిస్తూ, పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వగలిగిన వారికి మేము కృతజ్ఞులమై ఉంటాం.

నమోదు మరియు విచారణల కోసం సంప్రదించాల్సిన వివరాలు

యోగదా సత్సంగ శాఖా మఠం — రాంచీ
పరమహంస యోగానంద పథం
రాంచీ 834 001

ఫోన్: (0651) 6655 555 (సోమ-శని, ఉ. 9:30 నుండి సా. 4:30 గంటల వరకు)
ఈ-మెయిల్: [email protected]

యువత కోసం మేము చేస్తున్న కార్యక్రమాల గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి సంప్రదించండి [email protected].

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో పంచుకోండి