యువ సాధక శిబిరాలు 2026
(బెంగళూరు మరియు చండీఘర్ లో మూడు-రోజుల కార్యక్రమాలు)
ఈ శిబిరాలలో పాల్గొనేందుకు నమోదు ఇప్పుడు ప్రారంభమయ్యింది!
ఈ కార్యక్రమాల గురించి
మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీ మనస్సును సంపూర్ణంగా భగవంతుడిపై నిమగ్నం చేయండి. అలాగే, మీ విధులు నిర్వర్తిస్తున్నప్పుడు మీ హృదయాన్ని పూర్తిగా దానిపై లగ్నం చేయండి. కాని మీ పని పూర్తయిన వెంటనే మీ మనస్సును ఈశ్వరుడిపై ఉంచండి. మీరు భగవంతుడిని గురించి ఆలోచించడానికి స్వేచ్ఛ లభించిన ప్రతి క్షణంలో ఆయన సాన్నిధ్యాన్ని సాధన చేయడం నేర్చుకున్నప్పుడు, పని మధ్యలో కూడా మీరు దైవానుసంధానం గురించి తెలుసుకుంటారు.
— శ్రీ శ్రీ పరమహంస యోగానంద
2025 సెప్టెంబర్‌లో వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో జరిగిన మొట్టమొదటి యువ సాధక సంగమం భారీ విజయాన్ని సాధించింది. ఇది, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని అభ్యర్థనలకు దారి తీసింది. ఈ అవసరాన్ని తీర్చడానికి, ఫిబ్రవరి 2026లో బెంగళూరు మరియు చండీఘర్ లలో యువ సాధక శిబిరాలను నిర్వహిస్తామని ప్రకటించడం వై.ఎస్.ఎస్.కు సంతోషంగా ఉంది. ఈ శిబిరాల ఇతివృత్తం (థీం) “దైవ సాన్నిధ్యంలో జీవించడం.”
23–35 సంవత్సరాల వయస్సు గల వై.ఎస్.ఎస్. భక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ వారాంతపు సమావేశాలు విజయవంతమైన మరియు సమతుల్యమైన జీవితాన్ని గడపడానికి పరమహంసగారి అద్వితీయమైన జీవించడం ఎలా శిక్షణను అందిస్తాయి. వై.ఎస్.ఎస్. సన్యాసులు సామూహిక ధ్యానాలు మరియు కీర్తన సమావేశాలకు నేతృత్వం వహించి, వ్యక్తిగత ఆధ్యాత్మిక సలహాలను అందిస్తారు; మరియు దైవ సాన్నిధ్యంలో జీవించడానికి ఆచరణాత్మక పద్ధతులను బోధించే సామూహిక చర్చలతో కూడిన వర్క్‌షాప్‌లను నిర్వహిస్తారు.
దయచేసి గమనించండి:
- వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు మాత్రమే ఈ శిబిరాలలో పాల్గొనవచ్చు.
- మొదట నమోదు చేసుకొన్న వారికి మొదటి కేటాయింపు ప్రాతిపదిక.
- ఇందులో కార్యక్రమ అంశాలు చాలా ఎక్కువగా ఉన్నందున, సున్నితమైన ఆరోగ్యం లేదా ప్రత్యేక అవసరాలు ఉన్న భక్తులు దరఖాస్తు చేయవద్దని సూచన.
శిబిరంలోని ప్రధాన అంశాలు
- సామూహిక ధ్యానాలు — వై.ఎస్.ఎస్. ధ్యాన ప్రక్రియలతో నిర్దేశిత సాధన
- శ్రవణం — ఆత్మ పరిశీలనతో వై.ఎస్.ఎస్. పాఠాల సామూహిక అధ్యయనం
- సత్సంగాలు — జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనేందుకు ప్రేరణ
- వర్క్ షాప్ లు — దైవ సాన్నిధ్యంలో జీవించడానికి సహాయపడే సామూహిక చర్చలు, మెళకువలు మరియు పద్ధతులు
- కీర్తన గానం — హృదయం, మనస్సు మరియు ఆత్మలకు ఉన్నతి చేకూర్చే సామూహిక గానం యొక్క భక్తిపూర్వక కార్యక్రమాలు
- ఆధ్యాత్మిక సలహా సమావేశాలు — విజ్ఞప్తి మేరకు అనుభవజ్ఞులైన సన్యాసులచే వ్యక్తిగత మార్గదర్శకత్వం
- గురు-సేవ — శిబిరంలోని వివిధ విభాగాలలో: లోపలికి ప్రవేశపెట్టుట, భోజనాలు, అలంకరణలు, రిజిస్ట్రేషన్ విభాగం, పుస్తకాల గది మొదలైనవి.
- వినోదం — రోజువారీ సామూహిక వ్యాయామాలు మరియు నియమిత సమయం పాటు వినోదం
- సహవాసం — దేశవ్యాప్తంగా ఒకే విధమైన ఆలోచనలు కలిగిన యువసాధకులతో సాహచర్యం
- విహార యాత్ర — సన్యాసుల సహవాసంలో ప్రకృతి ప్రదేశానికి విహార యాత్ర
మీరు మీ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని తిరిగి పొందాలనుకున్నా లేదా ఆధ్యాత్మిక జీవితం పట్ల మీ నిబద్ధతను పునరుద్ధరించుకోవాలనుకున్నా మరియు నూతన ఆధ్యాత్మిక స్నేహితులను సంపాదించుకోవాలనుకున్నా, ఈ శిబిరాల్లో చేరి ఆధ్యాత్మికంగా పునరుత్తేజం పొంది వెళ్ళమని మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నాము.
శిబిరం వివరాలు
బెంగళూరు
తేదీ: ఫిబ్రవరి 20-22, 2026 (శుక్రవారం-ఆదివారం)
భాష: ఆంగ్లం
శిబిరం జరిగే ప్రదేశం:
యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం – బెంగళూరు
పరమహంస యోగానంద రోడ్,
3వ ఏ క్రాస్, దోములూరు II స్టేజి,
ఉడిపి ఫుడ్ హబ్ దగ్గర – దోములూరు,
బెంగళూరు – 560071
కర్నాటక
చండీఘర్
తేదీ: ఫిబ్రవరి 27-మార్చి 1, 2026 (శుక్రవారం-ఆదివారం)
భాష: ఆంగ్లం మరియు హిందీ
శిబిరం జరిగే ప్రదేశం:
యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం – చండీఘర్
సెక్టార్ 28-డి,
గుజ్జర్ భవనం దగ్గర,
చండీఘర్ – 160002
చండీఘర్
కార్యక్రమంలో పాల్గొంటున్నవారిని గురువారం మధ్యాహ్నానికి వేదిక వద్దకు చేరుకొని ఆ సాయంత్రం సన్యాసి నిర్వహించే దీర్ఘ ధ్యానంలో పాల్గొనమని ప్రోత్సహిస్తున్నాం. ఈ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం దాదాపు 12 గంటలకు ముగుస్తుంది.
మరింత సమాచారం
ఈ కార్యక్రమం యొక్క తేదీ సమీపించినప్పుడు కార్యక్రమ అంశాల యొక్క తాత్కాలిక జాబితా లభ్యమవుతుంది.
పాల్గొనడం:
- ఈ శిబిరాలలో వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్ భక్తులు మాత్రమే పాల్గొనవచ్చు. ఒక భక్తుడు ఒక శిబిరంలో మాత్రమే పాల్గొనవచ్చు.
- పాల్గొనేవారందరిని గురువారం మధ్యాహ్నానికి వేదిక వద్దకు చేరుకొని సన్యాసి నిర్వహించే దీర్ఘ ధ్యానంలో పాల్గొనేందుకు ప్రోత్సహిస్తున్నాం. ఈ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు ముగుస్తుంది.
- ఈ శిబిరాలు 23 నుండి 35 సంవత్సరాల వయస్సు గల సాధకుల కోసం మాత్రమే ఉద్దేశించబడినవి.
- మీరు ఈ పరిధికి కొంచెం దూరంగా ఉండి, ఈ శిబిరాల్లో పాల్గొని ప్రయోజనం పొందాలనుకుంటే, దయచేసి [email protected] కు మాకు ఇమెయిల్ చేయండి.
మొదట నమోదు చేసుకొన్న వారికి మొదటి కేటాయింపు ప్రాతిపదిక:
- పరిమితమైన సౌకర్యాల కారణంగా, మొదట వచ్చినవారికి మొదటి కేటాయింపు ప్రాతిపదికన నమోదు నిర్ధారించబడుతుంది.
- నమోదు అభ్యర్థనలు గరిష్ట పరిమితిని చేరుకున్నట్లయితే, ఒక నిర్దిష్ట వేదిక కోసం నమోదు ముందుగానే ముగియవచ్చు.
- మీ నమోదు నిర్ధారించబడినప్పటికీ మీరు హాజరు కాలేకపోతే, నమోదు రుసుము తిరిగి చెల్లించబడదు లేదా మరొక వ్యక్తికి బదిలీ చేయబడదని దయచేసి గమనించగలరు.
పంపిన సొమ్ము:
- నమోదు ఫీజు (భోజన ఖర్చులతో సహా) = ₹2,500
- వసతి ఛార్జీలు (వసతి కోరుకుంటే) = ₹2,250
మీకు నమోదు ఫీజు చెల్లించడం కష్టముగా ఉంటే, దయచేసి మాకు [email protected] కు ఈమెయిల్ చేయండి.
నమోదు సమాచారం
ఈ శిబిరాల కోసం నమోదు ఇప్పుడు ప్రారంభించబడింది!
డివోటి పోర్టల్ ద్వారా ఆన్లైన్ నమోదు:
త్వరగా మరియు సులభంగా నమోదు చేయడానికి, ఆన్లైన ద్వారా నమోదు చేయడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.
సహాయ కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా నమోదు:
రాంచీ ఆశ్రమం సహాయ కేంద్రానికి ఈమెయిల్ లేదా (0651) 6655 555 నెంబరుకు కాల్ చేసి ఈ క్రింది వివరాలను అందజేయండి:
- మీ పూర్తి పేరు
- వై.ఎస్.ఎస్. పాఠాల నమోదు సంఖ్య
- వయస్సు
- మీ ఆగమనం మరియు నిష్క్రమణ తేదీలు
- ఈమెయిల్
- టెలిఫోన్ నెంబర్
- చిరునామా
మీ మొబైల్ లేదా ఈమెయిల్ చిరునామాకు పంపించబడే పేమెంట్ లింక్ ద్వారా రుసుమును మీరు చెల్లించవచ్చు. నమోదు విజయవంతమయ్యాక, ఈమెయిల్ లేదా వాట్సప్ లేదా sms ద్వారా ధ్రువీకరించబడుతుంది. అటువంటి నిర్ధారణ సూచన మీకు రాకపోతే వై.ఎస్.ఎస్. రాంచీ సహాయ కేంద్రాన్ని (0651) 6655 555 ఫోన్ ద్వారా లేదా ఈమెయిల్ ([email protected]) ద్వారా దయచేసి సంప్రదించండి.
ఎస్.ఆర్.ఎఫ్ భక్తుల రిజిస్ట్రేషన్:
- ఈ శిబిరాలలో పాల్గొనేందుకు మరియు వేదిక వద్ద భోజనాలు చేసేందుకు ఎస్.ఆర్.ఎఫ్. భక్తులకు ఆహ్వానం ఉన్నప్పటికీ, తమ వసతి ఏర్పాట్లను వారే చేసుకోవలసినదిగా విజ్ఞప్తి.
- ఆసక్తి ఉన్న ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు వై.ఎస్.ఎస్. సహాయ కేంద్రాన్ని ఈమెయిల్ ద్వారా సంప్రదించి, పైన పేర్కొన్న వివరాలను అన్నిటినీ అందజేయమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
- బెంగళూరు మరియు చండీఘర్ లో బయటి ప్రాంతాల వారికి మొదట వచ్చిన వారికి మొదటి కేటాయింపు ప్రాతిపదికన వసతి ఏర్పాటు చేయబడుతుంది. ఇది గురువారం సాయంత్రం నుండి ఆదివారం (ఉదయం) వరకు అందుబాటులో ఉంటుంది.
- స్త్రీ పురుషులకు విడివిడిగా ఉమ్మడి వసతి ఏర్పాటు చేయబడుతుంది. కుటుంబ సభ్యులు దయచేసి ఆ ప్రకారం ఏర్పాట్లు చేసుకోగలరు.
- ప్రత్యేక ఆహారం లేదా వసతి అవసరమైన భక్తులు దయచేసి తమ స్వంత ఏర్పాట్లు తామే చేసుకోగలరు.
ఎప్పటి లాగానే, రిజిస్ట్రేషన్ విభాగం, వసతి, ఆడియో-విజువల్స్, భోజన వసతి, పరిశుభ్రత, అషరింగ్ మరియు ఇతర విభాగాలలో సేవలందించేందుకు భక్తులు-వాలంటీర్లు అవసరమవుతారు. ఈ విభాగాలు కొన్నింటిలో కార్యక్రమం ప్రారంభానికి ఒకటి లేదా రెండు రోజులు ముందు వాలంటీర్లు రావాల్సి ఉంటుంది. మీరు వాలంటీరుగా ఉండాలనుకుంటే దయచేసి మీ నమోదు ఫారములో తదనుగుణంగా సూచించండి.
నమోదు మరియు విచారణల కోసం సంప్రదించాల్సిన వివరాలు
యోగదా సత్సంగ శాఖా మఠం — రాంచీ
పరమహంస యోగానంద పథం
రాంచీ – 834 001
ఫోన్: (0651) 6655 555 ((సోమ-శనివారం, ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:30 వరకు)
ఈమెయిల్: [email protected]
పూర్వ యువ సాధకుల కార్యక్రమాలు
యువజనుల కోసం మేము ఏర్పాటు చేసే కార్యక్రమాల గురించి మరింతగా తెలుసుకోవాలనుకున్నా లేదా వాలంటీర్లుగా ఉండేందుకు ఆసక్తి ఉన్నా, దయచేసి మాకు [email protected] కి ఈమెయిల్ చేయండి.

















