స్వామి చిదానందగారి నుండి కృతజ్ఞతార్పిత సందేశం 2017

ఈ ఏడాది కృతజ్ఞతార్పిత దినంకు ముందు వారాల్లో, అత్యంత సౌభాగ్యవంతమైన భారతదేశ యాత్ర చేసివచ్చిన తరువాత, గురుదేవులు పరమహంస యోగానందగారు మన ఆధ్యాత్మిక మాతృభూమి నుండి చేకొనివచ్చిన జీవిత పరివర్తనా బోధనలకు, అలాగే మీ అందరి కోసం — దైనందిన జీవితంలో ఆ ఆదర్శాలను బహు చక్కగా వ్యక్తీకరించే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గురుదేవుల ప్రేమపూర్వక దివ్య సంసారమునకు నా హృదయం ప్రత్యేక కృతజ్ఞతతో నిండిపోయింది.

గురుదేవులు అనేక సంవత్సరాల క్రితం మొదటిసారి అమెరికా వచ్చినప్పుడు, కుటుంబానికి, స్నేహితులకు — అన్నిటికంటే ముఖ్యంగా — మన జీవితంలోని అన్ని మంచి విషయాలకు ఆది మూలము అయిన దైవానికి కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచడానికి ఒక జాతీయ సెలవుదినాన్ని కేటాయించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కృతజ్ఞతార్పిత సెలవు దినాన్ని ఆధ్యాత్మిక ఆచారంగా మన గురుదేవులు స్వీకరించడంతో ఆయన ఆశ్రమాల్లో అది ఒక సంతోషకరమైన సంప్రదాయంగా మారింది. ఆయన ఆరంభించిన ప్రమాణమును౦డి, కృతజ్ఞతాభావ౦ అనే ఆ౦తర౦గ అభ్యాస౦ మన చైతన్యాన్ని ఉద్ధరి౦చడానికి, శాశ్వత౦గా పరివర్తన చేయడానికి ఒక శక్తివ౦తమైన పద్ధతిగా ఎలా మారుతుందో మన౦ నేర్చుకు౦టాము.

కృతజ్ఞతాభావము ఈశ్వరుని సర్వవ్యాపకత్వాన్ని మన మనసు, హృదయం యొక్క వికాసానికి ఒక నవ్య, దివ్య అవకాశాన్ని తెస్తుంది — ఆయనను మనము ప్రకృతిలో, దేవుని సంక్లిష్టమైన సృష్టి వెనుక, ప్రతి ఆత్మ ఆయన యొక్క ప్రత్యేకమైన ప్రతిబింబంగా, అలాగే అన్నింటిలోన యోగ్యమైనది, సుందరమైనదిగా చూడాలని కోరుకుంటాడు. గురుదేవులు మనకు చెప్పినట్లుగా, “భగవంతుడు తన సృష్టికి దూరంగా లేడు; ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు. ఆయన సన్నిధితో విశ్వమంతా స్పందిస్తుంది.” దైవత్వం మనలో కూడా ఉన్నదని ఆయన మనకు గుర్తు చేస్తాడు. ఆయన లేకుండా మనం ఆలోచించలేము లేదా అనుభూతి చెందలేము, కనీసం శ్వాస కూడా తీసుకోలేము. అయినప్పటికీ, దైన౦దిన జీవితపు ఒత్తిడుల మధ్య, మన సర్వోన్నత శ్రేయోభిలాషి నుండి మన దృష్టిని ఎ౦త సులభ౦గా పక్కకు జరుపుతాము, ఆయన కానుకలను మన౦ ఎ౦త అనాలోచితంగా స్వీకరిస్తామో కదా! కృతజ్ఞతాపూర్వకమైన హృదయాన్ని పె౦పొ౦ది౦చుకోవడ౦ ద్వారానే, మన౦ మాయ అనే ముసుగును దాటి ఆయనను చూడగలుగుతా౦, అనేక తెరల వెనుకనున్న ఆయనను గ్రహి౦చగలుగుతా౦. కృతజ్ఞత మరియు ప్రశంసలతో కూడిన ఆలోచనలు — చిన్న విషయాల గురించి కూడా — మన హృదయాలను తేలికపరుస్తాయి మరియు మన చైతన్యాన్ని ఉద్ధరిస్తాయి, మనల్ని ఆయనకు చేరువ చేస్తాయి, మన జీవితాల్లోకి ఏ ఆటంకాలు లేకుండా ఆయన ఆశీస్సులు ప్రవహించేలా మార్గాన్ని విస్తృతం చేస్తాయి.

మన నుండి ఎలాంటి ప్రశంసలు ఆశించకుండానే దేవుడు మనలను ఆశీర్వదించినప్పటికి, మన ఇష్టానుగుణంగా మనం కృతజ్ఞతను వ్యక్త౦ చేసినప్పుడు, ఆయనతో మన స౦బ౦ధ౦ ఎ౦తో మధుర౦గా, మరి౦త వ్యక్తిగత౦గా మారుతుంది. ఆయనపై మనకున్న విశ్వాసం పెంపొందుతుంది, ఇక మనం ఆయన అనంతమైన సంరక్షణ ఉనికి యొక్క వాస్తవికతతో ప్రతిస్పందించే — వేరే ప్రపంచాన్ని చూడటం ప్రారంభిస్తాము. మన౦ ఆయన కానుకల్లోనే కాక, ఆ దాత యొక్క ప్రేమలో ఆన౦దాన్ని, భద్రతను పొ౦దుతా౦. ఆయన జ్ఞాన౦పై, శాశ్వత ఆదరణపై విశ్వాసముతో, క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన౦ లోతైన అవగాహన, ఆధ్యాత్మిక బల౦ యొక్క నిగూఢమైన రత్నాలను కనుగొనగలుగుతా౦.

కృతజ్ఞతా భావ౦తో జీవి౦చే సామర్థ్య౦ కోరికలు ఫలించటము పైనే ఆధారపడి ఉ౦డాల్సిన అవసర౦ లేదు. బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా మనం ఎల్లప్పుడూ కలిగియున్న ఒకే ఒక అత్యున్నతమైన ఆశీస్సు — దేవుని శాశ్వత ప్రేమ. మనం ప్రతిరోజూ చేసే ధ్యాన మనే మందిరంలో భగవంతుని ఆహ్లాదకరమైన శాంతి మీ అస్తిత్వంలో వ్యాపించినపుడు, ఆయన దివ్యప్రేమ మీ వికసితమైన హృదయాన్ని నింపినప్పుడు ఆ సత్యాన్ని అత్యంత గాఢంగా అనుభూతి చెందవచ్చు. మీ జీవిత౦లో ఆ పరివర్తన శక్తి యొక్క కానుకకు భగవంతునికి మీ కృతజ్ఞతలుగా, ఇతరులుకు మీ సేవ, దయ ప్రవహించుగాక, తద్ద్వారా వారు కూడా మీ ద్వారా భగవంతుని ప్రేమపూర్వక సంరక్షణను అనుభూతి చెందుగాక.

మీకు మరి మీ ఆప్తులందరికీ భగవదర్పిత ధన్యవాదాలు,
స్వామి చిదానంద, అధ్యక్షులు

ఇతరులతో పంచుకోండి