ఇతరుల కోసం ఎలా ప్రార్థించాలి

మన ప్రార్థనలు ఇతరుల జీవితాలను ఎలా ప్రభావితం చేయగలవు? ఆరోగ్యం, విజయం మరియు దివ్య సహాయాన్ని గ్రహించే శక్తుల సానుకూల నమూనాలను చైతన్యంలో నాటడం ద్వారా; అదే విధంగా అవి మన స్వీయ జీవితాలను కూడా వృద్ధి చేస్తాయి.

“నా ప్రార్థనలు ఇతరులకు ఎలా సహాయం చేయగలవు?” అనే గాఢమైన స్ఫూర్తిదాయకమైన ఈ చిన్న వీడియోలో, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యొక్క ప్రియతమ మూడవ అధ్యక్షులు మరియు సంఘమాత అయిన శ్రీ దయామాత, ఇతరుల కోసం ప్రార్థించడంపై పరమహంస యోగానందగారు నిలిపిన ప్రాముఖ్యతను గురించి చర్చించారు. మరియు వ్యక్తుల జీవితాలను, ప్రపంచ గమనాన్ని రెండింటినీ సానుకూలంగా ప్రభావితం చేసేందుకు ఏకాగ్రతతో కూడిన ప్రార్థన యొక్క అద్భుతమైన శక్తిని ఉపయోగించాలని ఆమె ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు.

ప్రభావశీల ప్రార్థన వెనుక ఉన్న యోగశాస్త్ర విజ్ఞానం

పరమహంస యోగానందగారు ఇలా వ్రాశారు:

“అలజడుల నుండి లేదా అశాంతి యొక్క ‘స్థిరత్వం’ నుండి విముక్తి పొందిన మానవ మనస్సు, సంక్లిష్టమైన రేడియో యంత్రాంగం యొక్క అన్ని విధులను నిర్వహించగలిగే శక్తి కలిగి ఉంటుంది — ఆలోచనలను పంపడం, స్వీకరించడం మరియు అవాంఛనీయమైన వాటిని తొలగించడం. రేడియో ప్రసార కేంద్రం యొక్క శక్తి, అది ఉపయోగించగల విద్యుత్ ప్రవాహం ద్వారా నియంత్రించబడుతున్నట్లే, మానవ రేడియో యొక్క సామర్థ్యం ఆ వ్యక్తి యొక్క సంకల్పశక్తి స్థాయిపై ఆధారపడి ఉంటుంది.”

భగవంతుని సంకల్పంతో తమ సంకల్పాన్ని సంపూర్ణంగా అనుసంధానించుకున్న తేజోమూర్తులైన గురువుల మనస్సులు, శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క తక్షణ స్వస్థతను తీసుకురావడానికి దివ్యశక్తిని ప్రసారం చేయగలవు. పరమహంస యోగానందగారి రచనలు మరియు ఉపన్యాసాలు అటువంటి స్వస్థత యొక్క ఉదాహరణలతో పుష్కలంగా నిండి ఉన్నాయి. దివ్యస్వస్థతలు అద్భుతంగా అనిపించినప్పటికీ, అవి సృష్టి యొక్క సార్వత్రిక నియమాలను శాస్త్రీయంగా నెరవేర్చడం వల్ల కలిగే సహజ ఫలితాలేనని ఆయన వివరించారు. దేవుని పరిపూర్ణతా ఆలోచనల నమూనాలను ఇతరుల మనస్సులలో మరియు శరీరాలలో వ్యక్తీకరించడానికి తగినంత సంకల్పశక్తి మరియు బలంతో వాటిని ప్రసరింపజేయడం ద్వారా, విశ్వంలోని ప్రతీదీ ఏ ప్రక్రియ ద్వారా ఏర్పడిందో, అదే విధానాన్ని ఈ జ్ఞానమూర్తులు కూడా అనుసరిస్తారు.

ఈ సూత్రాల ప్రకారం ప్రార్థన చేసే ఏ వ్యక్తి అయినా, అతడు లేదా ఆమె యొక్క ప్రార్థనలు కూడా స్పష్టమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయని కనుగొంటారు. ఒక సద్గురువు ప్రసరించగలిగే దానికంటే మన వ్యక్తిగత శక్తి స్పష్టంగా తక్కువగా ఉన్నప్పటికీ, వేలాది మంది ప్రార్థనలు ఏకమైనప్పుడు, శాంతి మరియు దివ్య స్వస్థత యొక్క శక్తివంతమైన ప్రకంపనలు ఆశించిన ఫలితాలను తీసుకువచ్చేందుకు సహాయపడటంలో అమూల్యమైనవి. ఈ మేరకు, పరమహంస యోగానందగారిచే యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ప్రార్థనా విభాగం మరియు ప్రపంచవ్యాప్త ప్రార్థనా వలయం యొక్క ఆవిర్భావం జరిగింది.

ఇతరుల కోసం ప్రభావవంతంగా ప్రార్థించడానికి పరమహంసగారు చెప్పిన పద్ధతులలో ఒకటి ఇక్కడ ఇవ్వబడింది:

ఈ విపత్కర సమయాల్లో, మన కోసం మాత్రమే కాకుండా మన కుటుంబాలకు, మన స్నేహితులకు, మన పొరుగువారికి మరియు ప్రపంచానికి ప్రార్థన యొక్క శక్తి ద్వారా మనం ఎంతో సేవ చేయవచ్చు. యోగదా సత్సంగ పాఠాలకు నమోదు చేసుకోవడం ద్వారా పరమహంస యోగానందగారు బోధించిన ప్రభావశీల ప్రార్థన పద్ధతులను మీరు నేర్చుకోవచ్చు మరియు దేవునితో మీ స్వీయ వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవచ్చు.

వై.ఎస్.ఎస్. పాఠాలలో ఈ క్రింది ప్రక్రియను పరమహంస యోగానందగారు అందించారు (వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. స్వస్థతా ప్రక్రియలతో పాటుగా):

Paramahansa Yogananda with a man on a wheelchair.“మొదట, మీ కనుబొమలను కొద్దిగా ముడవండి, ఆపై మీ కళ్ళు మూసుకోండి. మీరు స్వస్థతా శక్తిని పంపించాలనుకుంటున్న వ్యక్తి గురించి ఆలోచించండి.

“మీ కనుబొమల మధ్య ఉన్న బిందువు వద్ద ఏకాగ్రతతో దృష్టిపెట్టి, మానసికంగా ఇలా పలకండి: ‘పరమపితా, నేను నీ సంకల్పంతో సంకల్పిస్తాను. నా సంకల్పం నీ సంకల్పమే. నీ సర్వవ్యాపక సంకల్పంతో, ఓ తండ్రీ, నా పరిపూర్ణ హృదయంతో, నా పరిపూర్ణ ఆత్మతో ఈ వ్యక్తి స్వస్థత పొందాలని నేను సంకల్పిస్తున్నాను.’

“ఇలా పలుకుతున్నప్పుడు, మీరు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి కనుబొమల మధ్య ఉన్న బిందువులోకి మీ కనుబొమల మధ్య ఉన్న బిందువు గుండా విద్యుత్తు ప్రవహిస్తోందని భావించండి. స్వస్థత పొందాలని మీరు కోరుకుంటున్న వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక నేత్రంలోకి మీ ఆధ్యాత్మిక నేత్రం నుండి విద్యుత్తు పంపిస్తున్నట్లు భావించండి.”

గాఢంగా కేంద్రీకరించినప్పుడు కనుబొమల మధ్య ఉండే బిందువు వద్ద మీరు వేడిని అనుభవిస్తారు. ఈ వేడి అనుభవించడమనేది మీ సంకల్పశక్తి అభివృద్ధి చెందుతోందనడానికి నిదర్శనం.

“ఇంకా గాఢమైన ఏకాగ్రత వహించండి. మానసికంగా ఇలా పలకండి: ‘నీ సంకల్ప బలంతో నేను విశ్వశక్తి యొక్క మెరుపును పంపిస్తాను. తండ్రీ, అది అక్కడ ఉంది.

“ఇలా పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు సాధన చెయ్యాలి. మీరు దీన్ని చేస్తున్నప్పుడు, మీ సంకల్పశక్తి అభివృద్ధి చెందుతుంది; మరియు, ఏమి జరిగినా సరే, అవసరమైనప్పుడు మీకు మరియు ఇతరులకు సహాయం చేయడానికి, ఈ అభివృద్ధి చెందిన సంకల్పశక్తి నిరంతరం మీతోపాటే ఉంటుంది.”

ప్రార్థనతో మనం దేవుని శక్తిని వ్యక్తం చేయగలం

Daya Mata: Third president of YSS/SRF.కొన్నిసార్లు జనులు ఇలా అడుగుతారు, “ఇతరుల కోసం ప్రార్థించే ఉత్తమ మార్గం ఏమిటి?” శ్రీ శ్రీ దయామాత ఇలా చెప్పారు:

“ఇతరుల కోసం ప్రార్థించడమన్నది సరయినది, మంచిది… అప్పుడు వాళ్ళు ప్రధానంగా భగవంతుడి అనుగ్రహాన్ని గ్రహించే శక్తి కలవాళ్ళయి ఉండాలని, తత్ఫలితంగా ప్రత్యక్షంగా ఆ దివ్యవైద్యుని దగ్గరి నుంచి భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సహాయాన్ని అందుకోవాలని మీరు ప్రార్థిస్తున్నారు. అన్ని రకాల ప్రార్థనలకూ ఇదే ఆధారం. దేవుడి ఆశీర్వచనం ఎప్పుడూ అందుబాటులోనే ఉంది; గ్రహించే శక్తి తరచుగా కొరవడుతోంది. ప్రార్థన, గ్రహణశక్తిని బాగా పెంచుతుంది.

“మీకోసం గాని, ఇతరులకోసం గాని స్వస్థత కోసం మీరు దివ్యసంకాల్పాన్ని మననం చేస్తున్నప్పుడు, భగవంతుడికున్న స్వస్థత చేకూర్చే శక్తితాలూకు బ్రహ్మాండమైన శక్తి మీకు, లేదా ఎవరికోసమైతే మీరు ప్రార్థిస్తున్నారో వారి చుట్టూరా ఒక తెల్లని కాంతిలా పరివేష్టించి ఉన్నట్లు దర్శించండి; రోగాన్నీ లోపాలన్నిటినీ అది కరిగించివేస్తున్నట్టుగా అనుభూతి చెందండి. మనం ఆలోచించే ప్రతి ఉదాత్తమైన ఆలోచనా, మనం పలికే ప్రతి ప్రార్థనా, మనం చేసే ప్రతి మంచిపనీ భగవంతుడి శక్తితో నింపి ఉంది. భగవంతుడిపట్ల మనకు గల విశ్వాసం దృఢతరమవుతున్నకొద్దీ, ఆయన మీద మన ప్రేమ గాఢతరమవుతున్నకొద్దీ, ఈ శక్తిని మనం ఇంకా గొప్ప గొప్ప రీతుల్లో అభివ్యక్తం చేయగలం.”

“ఆలోచన అన్నది ఒక శక్తి; దానికి అపారమైన బలం ఉంటుంది. అందుకే పరమహంస యోగానందగారు ప్రారంభించిన ప్రపంచవ్యాప్త ప్రార్థనా వలయంపై నాకు గాఢమైన నమ్మకం ఉంది. మీరందరూ ఇందులో పాలుపంచుకుంటున్నారని ఆశిస్తున్నాను. ప్రపంచవ్యాప్త ప్రార్థనా వలయంలో ఉపయోగించే స్వస్థతా ప్రక్రియలో లాగా, శాంతి, ప్రేమ, సద్భావన, క్షమ యొక్క ఏకాగ్రమైన, సానుకూల ఆలోచనలను ప్రజలు పంపినప్పుడు, అది గొప్ప శక్తిని ఉత్పత్తి చేస్తుంది. జనబాహుళ్యం ఇలా చేస్తే, అది ప్రపంచాన్నే మార్చేలా మంచితనం యొక్క ప్రకంపనను సృష్టిస్తుంది.”

ప్రార్థన ద్వారా ప్రపంచ శాంతి మరియు స్వస్థతను తీసుకురావడానికి మీరు ఎలా సహాయపడగలరు

ఇతరులతో పంచుకోండి