YSS

భారతదేశంలోని ఆశ్రమాలను సందర్శించిన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు స్వామి శ్రీ చిదానందగారు

20 నవంబర్, 2017

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షులు స్వామి చిదానంద గిరి గారు ఇటీవల పరమహంస యోగానందగారి సంస్థకు ఆధ్యాత్మిక నాయకులుగా తన మొదటి విదేశీ పర్యటనను ప్రారంభించారు. ఆయన అక్టోబర్ 28న లాస్ ఏంజిలిస్ లోని ఎస్‌.ఆర్‌.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం నుండి బయలుదేరి, పరమహంస యోగానందగారి స్వదేశం చేరే ముందు, ఆయన లండన్‌లో కొద్దిసేపు గడపడం కోసం ఆగారు. భారతదేశంలో వారు నవంబర్ 18 వరకు ఉన్నారు. ఈ సమయంలో ఆయన వై‌.ఎస్‌.ఎస్. ఆశ్రమాలను సందర్శించారు మరియు 2017 శరద్ సంగం సందర్భంగా జరిగిన కొన్ని ముఖ్య కార్యక్రమాలకు అధ్యక్షత వహించారు. ఈ ఏడాది వై‌.ఎస్‌.ఎస్. శత జయంతిని జరుపుకోవడం ఆయన పర్యటనకు మరింత ప్రత్యేకతను సంతరింపజేసింది.

స్వామి చిదానందగారితో పాటు దీర్ఘకాలిక సన్యాసి మరియు వై‌.ఎస్‌.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. డైరెక్టర్ల బోర్డు సభ్యులు స్వామి విశ్వానంద మరియు బ్రహ్మచారి సౌజన్యానంద ఉన్నారు.

వారి పర్యటనలోని కొన్ని ముఖ్యాంశాలు క్రింది విధంగా ఉన్నాయి. మరింత సమాచారం కోసం రాబోయే వారాల్లో ఇదే పేజీని మళ్లీ సరిచూసుకోండి.

అక్టోబర్ 28న ఎస్‌.ఆర్‌.ఎఫ్. మదర్ సెంటర్ నుండి బయలుదేరుట

లాస్ ఏంజిలిస్ లోని ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కేంద్రం నుండి బయలుదేరిన సన్యాసులపై, మదర్ సెంటర్‌లో నివసించే సన్యాసులు మరియు సన్యాసినులు తమ హృదయపూర్వక వీడ్కోలు సందర్భంగా, గులాబీ రేకుల వర్షం కురిపించారు.

వీడియో ముఖ్యాంశాలు:

అక్టోబర్ 29న ఎస్‌.ఆర్‌.ఎఫ్. లండన్ సెంటర్‌ సందర్శన

లండన్‌లో ఎనిమిది గంటలు ఆగడం, ఎస్.ఆర్.ఎఫ్. లండన్ సెంటర్ ను కాసేపు సందర్శించే అవకాశాన్ని కలుగజేసింది. యు.కె. నలుమూలల నుండి వచ్చిన అనేక వందల మంది ఎస్‌.ఆర్‌.ఎఫ్. సభ్యుల కోసం స్వామి చిదానందగారు ఒక చిన్న ఉపన్యాసమిస్తూ ధ్యానానికి నాయకత్వం వహించారు. సన్యాసులు తమ ప్రయాణం యొక్క తదుపరి దశ ఏర్పాట్లలో భాగంగా భారతీయ దుస్తులను ధరించారు.

భారతదేశానికి రాక, అక్టోబర్ 30

స్వామి చిదానందజీ మరియు సన్యాస సహచరులు న్యూఢిల్లీకి చేరుకున్నారు. వారిని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వామి స్మరణానంద మరియు స్వామి శుద్ధానందతో పాటు ఇతర సీనియర్ వై.ఎస్.ఎస్. సన్యాసులు మరియు వై.ఎస్.ఎస్. ఢిల్లీ కేంద్రం సభ్యులు స్వాగతం పలికారు. వారిని, వారి సన్యాస సహచరులను కేంద్రానికి తీసుకువెళ్ళారు, అక్కడ పెద్ద సంఖ్యలో వై.ఎస్.ఎస్. భక్తులు వారికి ఆనందంగా స్వాగతం పలికారు.

నవంబర్ 1, నోయిడా ఆశ్రమంలో సత్సంగం

ఢిల్లీ కేంద్రం నుండి, స్వామి చిదానందగారు మరియు ఆయన సన్యాస సహచరులు వై‌.ఎస్‌.ఎస్. నోయిడా ఆశ్రమానికి పన్నెండు మైళ్ల యాత్ర చేశారు, అక్కడ 100 మందికి పైగా భక్తులు వారికి స్వాగతం పలికారు. ఆ సాయంత్రం స్వామి చిదానంద గిరి గారి సత్సంగానికి 1500 మంది భక్తులు హాజరయ్యారు. కార్యక్రమం ఒక గంట ధ్యానం మరియు కీర్తనతో ప్రారంభమైంది, ఆ తర్వాత స్ఫూర్తిదాయకమైన ప్రసంగం జరిగింది, ఈ సందర్భంగా స్వామి చిదానందగారు వై‌.ఎస్‌.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. అధ్యక్షులైన తర్వాత భారతదేశాన్ని సందర్శించాలనే బలమైన కోరిక గురించి ప్రస్తావించారు మరియు భారతదేశంలో ఆయనకు లభించిన బ్రహ్మండమైన స్వాగతానికి తన ప్రగాఢమైన ప్రశంసలను వ్యక్తం చేశారు.

2017_అధ్యక్షుడు_స్వచిదానందజీ_నోయిడా_ఢిల్లీ_03(1)

నవంబర్ 2–5, రాంచీలో శరద్ సంగం

నవంబర్ 2వ తేదీన వై‌.ఎస్‌.ఎస్. రాంచీ ఆశ్రమానికి స్వామి చిదానందగారు చేరుకున్నారు. అక్కడ నవంబర్ 3వ తేదీ ఉదయం శరద్ సంగంలో తొలిసారి ప్రసంగించారు. ఈ సమావేశంలో ఆయన శ్రీ మృణాళినీమాతగారు రచించిన విజిటింగ్ ది సెయింట్స్ ఆఫ్ ఇండియా విత్ శ్రీ దయామాత అనే వై‌.ఎస్‌.ఎస్. సంచికను పరిచయం చేశారు.

2017_శరద_సంగం1_రాంచీ_04

నవంబర్ 5న స్వామి చిదానందగారి శరద్ సంగం యొక్క మొదటి వారం ముగింపు సత్సంగాన్ని ఇచ్చారు, అక్కడ వేదికపై సీనియర్ వై‌.ఎస్‌.ఎస్. సన్యాసులు వారిని అనుసరించారు. పరమహంసగారి దైనందిన జీవితంలో ‘జీవించడం ఎలా’ అనే సూత్రాలను వర్తింపజేయడంపై ఆయన మళ్ళీ ఆచరణాత్మక మరియు ఆత్మానంద ప్రసంగాన్ని ఇచ్చారు.

2017_శరద_సంగం1_రాంచీ_05(1)

అనంతరం, అక్కడ హాజరైన సుమారు 1,700 మంది భక్తులు, ఆయన నుండి ప్రసాదం మరియు జ్ఞాపికను స్వీకరించడానికి ముందుకు వచ్చారు, అలాగే శ్రీ మృణాళినీమాతగారి ఆశీర్వదించిన, వెనుక భాగంలో గులాబీ రేకుతో ఉన్న వై‌.ఎస్‌.ఎస్. శత జయంతి లోగోతో ఉన్న లామినేషన్ చిత్రాన్ని కూడా భక్తులు స్వీకరించారు. “ఆయన అద్భుతమైన, ప్రకాశించే సాన్నిధ్యం అందరికీ స్ఫూర్తినిస్తుంది,” అని ఒక భక్తుడు స్వామి చిదానందగారి గురించి రాశాడు, హాజరైన చాలా మంది మనోభావాలను అతను వ్యక్తం చేశాడు.

2017_శరద_సంగం1_రాంచీ_01

వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమం మైదానంలోని స్మృతి మందిరంలో స్వామి చిదానందగారితో (ఎడమ నుండి కుడికి) స్వామి విశ్వానంద, స్వామి కృష్ణానంద, బ్రహ్మచారి సౌజన్యానంద, స్వామి శ్రద్ధానంద, మరియు స్వామి నిర్వాణానంద

నవంబర్ 6, దక్షిణేశ్వరం ఆశ్రమానికి రాక

స్వామి చిదానందగారి తదుపరి గమ్యస్థానం దక్షిణేశ్వర ఆశ్రమం, అక్కడ నవంబర్ 6వ తేదీ ఉదయం వై‌.ఎస్‌.ఎస్. సన్యాసులు, సేవకులు (వలంటీర్లు) మరియు శిష్యుల నుండి గులాబీ రేకుల స్వాగతం పొందారు. హారతి మరియు కృతజ్ఞతా పలుకుల తర్వాత, స్వామి చిదానందగారి రాకను పురస్కరించుకుని అందంగా అలంకరించబడిన ఆశ్రమ పర్యటనకు వారిని తీసుకువెళ్ళారు.

2017_స్వచిదానంద_డిఎకె_విజిట్_04

నవంబర్ 6, పరమహంస యోగానందగారి బాల్య గృహ సందర్శన

ఆ సాయంత్రం స్వామి చిదానందగారు మరియు ఆయన బృందం కోల్‌కతాలోని వై‌.ఎస్‌.ఎస్. గర్పార్ కేంద్రాన్ని, అలాగే గర్పార్ కేంద్రానికి కొద్దిపాటి నడక దూరంలో ఉన్న 4 గర్పార్ రోడ్‌లోని పరమహంసగారి చిన్ననాటి ఇంటిని సందర్శించారు. శ్రీ సోమనాథ్ ఘోష్ (పరమహంస యోగానందగారి సోదరుడు సనంద లాల్ ఘోష్ మనవడు) మరియు ఆయన భార్య శ్రీమతి సరితా ఘోష్ సన్యాసులను అత్యంత ఆదరంతో స్వాగతించారు.

PY_బాల్యం_ఇల్లు_01

నవంబర్ 7, శ్రీరాంపూర్ మరియు దక్షిణేశ్వరం

స్వామి చిదానందగారు మరియు ఆయన బృందం, శ్రీ రాంపూర్ లో ఒకప్పుడు శ్రీయుక్తేశ్వర్ గారి ఆశ్రమం ఉన్న మైదానంలోని కొంత భాగంలో నిర్మించబడిన శ్రీయుక్తేశ్వర్ గారి స్మృతి మందిరాన్ని సందర్శించారు. 1977లో వై‌.ఎస్‌.ఎస్. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ మృణాళినీమాతగారు ఈ మందిరాన్ని అంకితం చేయడం జరిగింది.

2017_శరద_సంగం2_రాంచీ

సాయంత్రం దక్షిణేశ్వరం ఆశ్రమానికి తిరిగి వచ్చిన స్వామి చిదానందగారు సుమారు 600 మంది భక్తులకు బహిరంగ సత్సంగాన్ని అందించారు.

నవంబర్ 14, రాంచీలో రెండవ శరద్ సంగమం

నవంబర్ 12-17 మధ్య జరిగిన రెండవ వై‌.ఎస్‌.ఎస్. శరద్ సంగంలో పాల్గొనేందుకు రాంచీ ఆశ్రమానికి స్వామి చిదానందగారు తిరిగి వచ్చారు. 2,000 మందికి పైగా భక్తులు మరియు స్నేహితులు హాజరయ్యారు, నలభై సంవత్సరాల కార్యక్రమాల చరిత్రలో ఇదే అతిపెద్ద సంఖ్య. నవంబర్ 14 ఉదయం స్వామి చిదానందగారు సభను ఉద్దేశించి ప్రసంగించారు, అనంతరం ప్రసాద వితరణ చేశారు.

నవంబర్ 15న వై.ఎస్.ఎస్. కొత్త పుస్తకాన్ని విడుదల చేసిన భారత రాష్ట్రపతి

నవంబర్ 15న రాంచీ ఆశ్రమంలో, భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ అధికారికంగా గాడ్ టాక్స్ విత్ అర్జున: ది భగవద్గీత యొక్క హిందీ అనువాదాన్ని విడుదల చేశారు, భారతదేశం యొక్క ఈ ప్రియమైన గ్రంథంపై పరమహంస యోగానందగారు అద్భుతమైన వ్యాఖ్యానం ఇచ్చారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి కోవింద్‌తో పాటు ఝార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు గవర్నర్ పాల్గొన్నారు.

2017_శరద_సంగం2_రాంచీ_07

వక్తలు మరియు ప్రముఖులు అందరూ, దాదాపు 3,000 మంది ప్రేక్షకులకు పరిచయం చేయబడ్డారు. (ఎడమ నుండి కుడికి) స్వామి ఈశ్వరానంద; స్వామి నిత్యానంద; స్వామి చిదానందగారు; ఝార్ఖండ్ గవర్నర్ శ్రీమతి ద్రౌపది ముర్ము; భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ రఘువర్ దాస్; స్వామి స్మరణానంద; స్వామి విశ్వానంద.

2017_శరద_సంగం2_రాంచీ_04

భారత జాతీయ గీతాన్ని ఆలపించిన తరువాత, శ్రీ కోవింద్ మరియు ఇతరులు లాంచనప్రాయంగా నూనె దీపాన్ని వెలిగించారు.

ప్రభుత్వ ప్రముఖులకు పూలమాలలు, శాలువాలు అందించి రాంచీలోకి స్వాగతం పలికారు.

2017_శరద_సంగం2_రాంచీ_03(1) గీత హిందీ

గౌరవనీయులైన అతిథులకు గాడ్ టాక్స్ విత్ అర్జున ప్రతులను అందించారు.

(ఎడమ వైపు) స్వామి చిదానందగారు పరమహంస యోగానందగారి గాడ్ టాక్స్ విత్ అర్జున యొక్క ఆవిర్భావం గురించి మరియు ఈ పరిమాణంలో ఉన్న ఒక గ్రంథం ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా ఎలా ఉద్ధరించగలదో వివరించారు.

(కుడి) శ్రీ కోవింద్, భారతీయ రాజయోగ శాస్త్రాన్ని పశ్చిమ దేశాలకు వ్యాప్తి చేయడంలో పరమహంస యోగానందగారి అపారమైన సహకారం గురించి ప్రేక్షకులను ఉద్దేశించి హిందీలో ప్రసంగించారు. యోగానందగారి బోధనలకు ప్రాచుర్యం కల్పిస్తున్నందుకు మరియు అనేక ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు వై.ఎస్‌.ఎస్.ను కూడా ఆయన ప్రశంసించారు.

భారత రాష్ట్రపతి_చే_రాంచీ_ఆశ్రమాన్ని_సందర్శించండి

భారత రాష్ట్రపతి రాంచీ ఆశ్రమ సందర్శన గురించి చాలా వార్తా సంస్థలు నివేదికలను అందించాయి. ఈ కార్యక్రమం జరిగిన మరుసటి రోజు భారతీయ వార్తాపత్రిక ది టెలిగ్రాఫ్‌ లో ఈ కథనం వచ్చింది.

నవంబర్ 18, ఎస్.ఆర్‌.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయానికి తిరిగి వెళ్ళుట

స్వామి చిదానందగారు మరియు ఆయన సహచరులు ఎస్‌.ఆర్‌.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కేంద్రంలోని తమ గృహానికి తిరిగి వచ్చారు, వారి తోటి సన్యాసులు ఉత్సాహపూరితంగా మరియు సంతోషభరితంగా స్వాగతం పలికారు.

Share this on

Share on facebook
Share on twitter
Share on whatsapp