భారతదేశపు ప్రియ అవతారమైన భగవాన్ కృష్ణుడి జన్మదిన వార్షికోత్సవం — జన్మాష్టమిని, ప్రతి సంవత్సరం యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వేడుకగా జరుపుతుంది, ఆయన బోధనలు భగవద్గీతలో పొందుపరచబడి ఉన్నాయి. ఈ ఆనందకరమైన వార్షిక వేడుక ఈ సంవత్సరం శనివారం, ఆగష్టు 16న వచ్చింది.
ఈ పవిత్ర దినమున, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారు ప్రత్యేక జన్మాష్టమి మూడు-గంటల ధ్యానమును నిర్వహించారు. లాస్ ఏంజిలిస్ లోని ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం నుండి ఈ కార్యక్రమం రాత్రి 7:30 నుండి రాత్రి 10:30 (భారతీయ కాలమానం) వరకు ప్రత్యక్షప్రసారం చేయబడింది. ఈ ధ్యానం సందర్భంగా భక్తి గీతాలాపన కోసం, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సన్యాసుల కీర్తన బృందం భారతదేశం నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా స్వామి చిదానందగారితో కలిసి పాల్గొంది.
ఈ ప్రత్యేక ధ్యానం ఆంగ్లంలో నిర్వహించబడింది. అంతేకాకుండా, హిందీ మరియు ఇతర అంతర్జాతీయ భాషల్లో అనువాదం కూడా ప్రత్యక్షప్రసార సమయంలో అందించబడినది. వీలైనంత త్వరగా హిందీ, తమిళం, తెలుగు మరియు ఇతర అంతర్జాతీయ భాషల్లో ఉపశీర్షికలు జత చేయడం జరుగుతుంది.
ఈ వీడియో వీక్షించడానికి అందుబాటులోనే ఉంటుంది.
