This event has now concluded.
If you would like to join us for an upcoming event, please visit the events page.

సన్యాసుల పర్యటన, సిమ్లా

మూడు-రోజుల కార్యక్రమం

శుక్రవారం, మే 12, 2023 — ఆదివారం, మే 14, 2023

(క్రియాయోగ దీక్ష:

Sunday, May 14, 2023)

అదనపు సమాచారం

కార్యక్రమ వేదిక:

యోగదా సత్సంగ ఆనంద శిఖర్ సాధనాలయం – సిమ్లా
బనోటి పహల్ రోడ్, పంతి గ్రామం,
సిమ్లా – 171005, హిమాచల్ ప్రదేశ్

సంప్రదించాల్సిన వివరాలు:

ఫోన్:

0177-2650310, 9418638808
9459051087

ఈ-మెయిల్:

చిరునామా:

యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం — సిమ్లా
ద రిడ్జ్, సిమ్లా – 171001, హిమాచల్ ప్రదేశ్

ఈ కార్యక్రమం గురించి

ఆనంద వనాన్ని మీ లోపల ఏర్పాటు చేయడం కోసం, నిశ్శబ్ద ద్వారం ద్వారా ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఈ విశ్వ సంరక్షకుడు మీ హృదయ ద్వారాలను తడుతున్నాడు.

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

పరమహంస యోగానందగారి ఆత్మ-విముక్తి బోధనల పట్ల నిరంతరం పెరుగుతున్న ఆసక్తిని ఈడేర్చడానికి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క సన్యాసులు ప్రతి సంవత్సరం భారతదేశంలోని వివిధ నగరాలలో పర్యటిస్తారు. పరమహంస యోగానందగారి బోధనల గురించి తెలుసుకోవాలనే కొత్తవారికి, అలాగే వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్ధులు వై.ఎస్.ఎస్. ధ్యాన ప్రక్రియలపై లోతైన మార్గదర్శకత్వాన్ని పొందేందుకు ఈ సన్యాసుల పర్యటనలు ఒక అద్భుతమైన అవకాశాన్ని కలుగజేస్తాయి.

ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం వ్యక్తిగత సాధనకు ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది కాబట్టి, వీటిలో పాల్గొనడం వల్ల మీ ఆధ్యాత్మిక ఉత్సాహం పునరుత్తేజం పొందుతుంది, అలాగే ఇతర చిత్తశుద్ధిగల సాధకులతో కలిసి ధ్యానం చేయడం, వారి సాంగత్యంలో గడపడం ద్వారా లభించే ఆనందాన్ని, అనుగ్రహాన్ని పొందేందుకు ఇది మీకు తోడ్పడుతుంది.

ఈ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా, అవిశ్రాంత కార్యకలాపాల నుండి మీ దృష్టిని వెనుకకు మరల్చి అంతర్గత నిశ్శబ్దంపై కేంద్రీకరించి, ఆ విధంగా భగవంతుని దివ్య శాంతి మరియు ఆనందామృతాన్ని మీరు ఆస్వాదించాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు, మీ దైనందిన జీవితంలో గురుదేవుల బోధనలను ఆచరించేందుకు వై.ఎస్.ఎస్. సన్యాసుల మార్గదర్శకత్వాన్ని కూడా మీరు పొందవచ్చు.

కార్యక్రమము యొక్క వివరాలలో ఒక ప్రదేశానికి మరొక ప్రదేశానికి మధ్య మార్పు ఉండవచ్చు, ఒక నమూనా వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది:

మొదటి రోజు - కార్యక్రమం వివరాలు

ఉదయం 09:30 నుండి ఉదయం 10:30 వరకు

ప్రారంభ సత్సంగం

ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు

శక్తిపూరణ వ్యాయామాలపై సమీక్ష
(వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థులకు మాత్రమే)

మధ్యాహ్నం 02:30 నుండి మధ్యాహ్నం 03:30 వరకు

హాంగ్-సా ప్రక్రియపై సమీక్ష
(వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థులకు మాత్రమే)

మధ్యాహ్నం 04:30 నుండి సాయంత్రం 06:15 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

సాయంత్రం 06:30 నుండి రాత్రి 07:30 వరకు

ఆధ్యాత్మిక ప్రసంగం

రాత్రి 07:30 నుండి రాత్రి 08:30 వరకు

గురుదేవులపై వీడియో ప్రదర్శన

రెండవ రోజు - కార్యక్రమం వివరాలు

ఉదయం 06:00 నుండి ఉదయం 09:00 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఉదయం 09:45 నుండి ఉదయం 10:45 వరకు

ఆధ్యాత్మిక ప్రసంగం

ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు

ఓం ప్రక్రియపై సమీక్ష
(వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థులకు మాత్రమే)

మధ్యాహ్నం 02:30 నుండి మధ్యాహ్నం 03:30 వరకు

ప్రశ్నలు-జవాబులు

సాయంత్రం 04:30 నుండి సాయంత్రం 06:15 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

సాయంత్రం 06:30 నుండి రాత్రి 07:30 వరకు

ఆధ్యాత్మిక ప్రసంగం

మూడవ రోజు - కార్యక్రమ వివరాలు

ఉదయం 08:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు

క్రియాయోగ దీక్ష
(అర్హత ఉన్న వై.ఎస్.ఎస్. భక్తులకు మాత్రమే)

మధ్యాహ్నం 02:00 నుండి మధ్యాహ్నం 03:30 వరకు

ముగింపు సత్సంగం మరియు ప్రసాదం

సాయంత్రం 04:00 నుండి సాయంత్రం 06:00 వరకు

క్రియాయోగంపై సమీక్ష మరియు తనిఖీ
(వై.ఎస్.ఎస్. క్రియాబాన్లకు మాత్రమే)

క్రియాయోగ దీక్ష స్వీకరించడం:

అర్హత కలిగిన భక్తులకు దీక్షా ప్రదానం చేయడానికి వై.ఎస్.ఎస్. సన్యాసులు క్రియాయోగ దీక్షా వేడుకను నిర్వహిస్తారు. దానిలో పాల్గొనడానికి మరియు అర్హతకు సంబంధించిన వివరాలను క్రింద గమనించవచ్చు:

క్రియాయోగం స్వీకరించడానికి అర్హత:

  • వై.ఎస్.ఎస్. పాఠాలతో పాటు జత చేయబడిన ప్రశ్నాపత్రానికి సంతృప్తికరమైన సమాధానాలు సమర్పించడంపైన క్రియాయోగం తీసుకోవడానికి అర్హత ఆధారపడి ఉంటుంది.
  • క్రియాయోగాన్ని స్వీకరించాలంటే, మొదటి మూడు ప్రాథమిక యోగదా ప్రక్రియలను నియమముగా కొన్ని నెలల పాటు భక్తుడు సాధన చేస్తూ ఉండాలి. ఈ విషయాన్ని మీరు ప్రశ్నాపత్రంలో గమనించవచ్చు.
  • వై.ఎస్.ఎస్. గురు పరంపర పట్ల మరియు యోగదా సత్సంగ మార్గం పట్ల భక్తి మరియు విధేయతలకు సంబంధించిన క్రియాయోగ ప్రతిజ్ఞా పత్రాన్ని సంతకంతో పాటు సమర్పించవలసి ఉంటుంది.

దయచేసి గమనించండి: మీరు క్రియాయోగం కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నప్పటికీ, ఇంకా ప్రశ్నావళికి సంబంధించిన సమాధానాలను పంపించకపోతే, వాటిని మీరు కార్యక్రమానికి హాజరయ్యే కేంద్రం లేదా మండలి వద్ద సమర్పించవచ్చు, ఆ నగరానికి సన్యాసులు వచ్చినప్పుడు వారు వాటిని పరిశీలిస్తారు.


క్రియాయోగ దీక్ష వేడుకలో పాల్గొనడం:

వేడుకలో క్రియాయోగ దీక్షను తీసుకుందామనుకొనేవారందరు, క్రియాయోగ పాఠాలు ఇప్పటికే పొంది వేడుకలో ఇప్పటివరకు పాల్గొననివారు మరియు అధికారికంగా దీక్ష పొందినా, వేడుకలో హాజరవ్వాలనుకుంటున్న క్రియాబాన్లు, కార్యక్రమం జరిగే కేంద్రాన్ని కనీసం ఒక రోజు ముందుగా సంప్రదించి నమోదు చేసుకోవాలి, మరియు అవసరమైన ప్రవేశ పత్రమును (ఎంట్రీ కార్డును) వేడుకకు తీసుకురావాలి.

క్రియాయోగ దీక్షకు మీరు నమోదు చేసుకుంటున్నప్పుడు, మరియు క్రియాయోగ సమీక్షకు హాజరవుతున్నప్పుడు దయచేసి క్రియాబాన్ గుర్తింపు కార్డు తీసుకువచ్చి చూపించండి.

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో పంచుకోండి