వై.ఎస్.ఎస్. ఆశ్రమాలలో 2026 ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచ స్నాతకోత్సవ
కార్యక్రమ ప్రదర్శన
(దక్షిణేశ్వర్, నోయిడా, చెన్నై, ద్వారాహాట్)
సోమవారం, ఆగస్టు 3, 2026 – ఆదివారం, ఆగస్టు 9, 2026 (భారత కాలమానం ప్రకారం)
ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొనడానికి రిజర్వేషన్లు ఇప్పుడు ప్రారంభమయ్యాయి!
దయచేసి గమనించండి: వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో కంకరరోడ్ల పునర్నిర్మాణం, తోటమార్గాల పునరుద్ధరణ మరియు ఇతర పునరుద్ధరణ పనులతోసహా పలు నిర్మాణ ప్రాజెక్టులు ప్రణాళిక చేయబడినందున, స్నాతకోత్సవం రాంచీ ఆశ్రమంలో ప్రదర్శించబడదు.
ఈ కార్యక్రమం గురించి
నేను జన సమూహం కన్నాఒక ఆత్మను ఎంచుకొంటాను, కానీ ఆత్మల సమూహాలను ప్రేమిస్తాను.
— శ్రీ శ్రీ పరమహంస యోగానంద
2026 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్.) ప్రపంచ స్నాతకోత్సవ కార్యక్రమాలను ప్రదర్శించడానికి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) ఆశ్రమాల్లో ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక సమావేశం నిర్వహించబడుతుంది. ఈ విశిష్టమైన అవకాశం, వై.ఎస్.ఎస్. భక్తులు ఒక యోగదా ఆశ్రమం యొక్క పవిత్ర వాతావరణంలో ఉంటూనే, ఆధ్యాత్మికోన్నతి కలిగించే స్నాతకోత్సవ ప్రకంపనలలో లీనమయ్యే వీలు కల్పిస్తుంది.
ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచ స్నాతకోత్సవం అనేది ఒక వార్షిక కార్యక్రమం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్యాన్వేషకులను, పరమహంస యోగానంద గారి క్రియాయోగ బోధనలను లోతుగా అధ్యయనం చేయడానికి ఒక చోట చేరుస్తుంది. ఆధ్యాత్మిక పరిపుష్టితో నిండిన ఒక వారం రోజుల కార్యక్రమాన్ని ఈ స్నాతకోత్సవం అందిస్తుంది, ఇందులో ఈ క్రింది అంశాలు ఉంటాయి:
- వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారితో ప్రత్యేక ధ్యానం మరియు సత్సంగం
- సామూహిక ధ్యానాలు
- పరమహంస యోగానంద గారి జీవించడంఎలా జ్ఞానబోధనలపై సన్యాసులచే స్ఫూర్తిదాయకమైన సత్సాంగాలు
- వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ధ్యాన ప్రక్రియలపై తరగతులు — శక్తిపూరణ వ్యాయామాలు, హాంగ్-సా, మరియు ఓం ప్రక్రియలపై లోతైన సూచనలు
- కీర్తనలు మరియు భక్తి పూర్వకగానం – ఆత్మను ఉత్తేజపరిచే, భక్తిని పెంపొందించే సమావేశాలు
- వీడియో ప్రదర్శనలు
ఈ ప్రదర్శన కార్యక్రమం నోయిడా, దక్షిణేశ్వర్, చెన్నై మరియు ద్వారాహాట్ లోని వై.ఎస్.ఎస్. ఆశ్రమాలలో ఏకకాలంలో నిర్వహించబడుతుంది. వై.ఎస్.ఎస్.భక్తులు ఆధ్యాత్మికంగా పునరుత్తేజం పొందడానికి, గురుదేవుల బోధనలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి మరియు ధ్యాన పద్ధతుల అభ్యాసాన్ని మెరుగుపరచుకోవడానికి ఇది ఒక అవకాశాన్ని అందిస్తుంది. వై.ఎస్.ఎస్. సన్యాసులు ఉదయం మరియు సాయంత్రం సామూహిక ధ్యానాలను నిర్వహిస్తారు; మరియు అభ్యర్థన మేరకు భక్తులకు ఆధ్యాత్మిక సలహాలను మరియు మార్గదర్శకత్వాన్ని అందిస్తారు.
మీ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పునరుజ్జీవింపజేయడమే కాకుండా, ఇతర చిత్తశుద్ధిగల సాధకులతో కలిసి ధ్యానం చేయడం మరియు వారి సాంగత్యం వల్ల కలిగే ఆనందాన్ని, ఆశీర్వాదాలను అనుభవించడానికి కూడా, ఈ విశిష్టమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. పరమహంస యోగానందగారి జీవన పరివర్తనకారక బోధనలలోకి, మరియు దైవసాన్నిధ్యపు స్పష్టమైన అనుభూతిలోకి లోతుగా ప్రవేశించడానికి మాతో కలిసి పాల్గొనండి — ఇటువంటి కార్యక్రమానికి ప్రత్యేకతను చేకూర్చే ఆశీర్వాదాలు ఇవే.
దయచేసి గమనించండి:
- ఈ కార్యక్రమానికి వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు మాత్రమే హాజరుకాగలరు.
- 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు అనుమతి లేదు.
- కార్యక్రమాల జాబితా అధికంగా ఉన్నందున, బలహీనమైన ఆరోగ్యం లేదా ప్రత్యేక అవసరాలు ఉన్న భక్తులు దరఖాస్తు చేయవద్దని సలహా ఇస్తున్నాం.
- రిజర్వేషన్ల కోసం అభ్యర్ధనలు, మొదట నమోదు చేసుకొన్నవారికి మొదటి కేటాయింపు ప్రాతిపదికన నిర్ధారించబడతాయి.
కార్యక్రమం యొక్క వివరాలు
ప్రతి ప్రదేశంలోని కార్యక్రమం, సోమవారం, ఆగష్టు 3న ఉదయం ప్రారంభమై, ఆదివారం, ఆగష్టు 9న మధ్యాహ్నం ముగుస్తుంది. ప్రతిరోజు యొక్క తాత్కాలిక కార్యక్రమం ఈ విధంగా ఉండవచ్చు:
ఉదయం 06.30 నుండి ఉదయం 07.50 — శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం
ఉదయం 08:00 నుండి ఉదయం 09:00 — ప్రారంభ సత్సంగం: ఆనందమయమైన జీవన కళ – ఆనందానికి దారితీసే యోగమార్గం
ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 — వై.ఎస్.ఎస్. ప్రత్యేక సత్సంగం: స్నాతకోత్సవం జరిగే వారాన్ని అత్యుత్తమంగా సద్వినియోగం చేసుకోవడం ఎలా
మధ్యాహ్నం 03:00 నుండి మధ్యాహ్నం 04:00 — వీడియో ప్రదర్శన
సాయంత్రం 06:00 నుండి సాయంత్రం 08:00 — శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం
ఉదయం 07:00 నుండి ఉదయం 08:30 — శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం
ఉదయం 09:30 నుండి ఉదయం 10:30 — ధ్యాన ప్రక్రియలలో ప్రావీణ్యత సాధించడం — I భాగం (హాంగ్-సా ఏకాగ్రతా ప్రక్రియ)
ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 — నిత్యయవ్వనం: దాని అర్థం ఏమిటి, దాన్ని ఎలా సాధించగలం?
మధ్యాహ్నం 03:00 నుండి సాయంత్రం 04:00 — విశ్వశక్తితో శరీరాన్ని పునరుత్తేజితం చేసుకోవడం
సాయంత్రం 06:00 నుండి సాయంత్రం 08:00 — శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం
ఉదయం 07:00 నుండి ఉదయం 08:30 — శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం
ఉదయం 09:30 నుండి ఉదయం 10:30 — ధ్యాన ప్రక్రియలలో ప్రావీణ్యత సాధించడం — II భాగం (ఓం ధ్యాన ప్రక్రియ)
ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 — సత్సంగం: దైవానుసంధానం ద్వారా ఆంతరంగిక భద్రత
మధ్యాహ్నం 03:00 నుండి సాయంత్రం 04:00 — సత్సంగం (ప్రశ్నలు మరియు జవాబులు)
రాత్రి 08:30 నుండి రాత్రి 11:30 — స్వామి చిదానంద గిరి గారితో ధ్యానం
ఉదయం 09:30 నుండి ఉదయం 10:30 — సత్సంగం (ప్రశ్నలు మరియు జవాబులు)
ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:30 — వై.ఎస్.ఎస్. సన్యాసిచే నిర్దేశిత ధ్యానం
మధ్యాహ్నం 03:00 నుండి సాయంత్రం 04:00 — సత్సంగం: దివ్యప్రేమ యొక్క సాధనముగా మారడం
సాయంత్రం 05:40 నుండి రాత్రి 09:00 — శక్తిపూరణ వ్యాయామాలు మరియు కీర్తన ధ్యానం
ఉదయం 07:00 నుండి ఉదయం 08:30 — శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం
ఉదయం 09:30 నుండి ఉదయం 10:30 — సత్సంగం (ప్రశ్నలు మరియు జవాబులు)
ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 — సత్సంగం: సద్గురువు – దివ్య స్నేహితుడు మరియు మార్గదర్శకుడు
మధ్యాహ్నం 02:30 నుండి సాయంత్రం 04:00 — కీర్తనలు (భక్తి గీతాలాపన)
సాయంత్రం 06:00 నుండి రాత్రి 08:00 — శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం
ఉదయం 06:30 నుండి ఉదయం 07:50 — శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం
ఉదయం 08:00 నుండి ఉదయం 09:00 — పరమహంస యోగానందగారి క్రియాయోగ బోధనలు: స్వామి చిదానంద గిరి గారి సత్సంగం
ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30 — క్రియాయోగ సమీక్ష మరియు తనిఖీ
ఉదయం 10:30 నుండి ఉదయం 11:30 — క్రియాబాన్ కానివారికి వీడియో తరగతి
మధ్యాహ్నం 03:30 నుండి సాయంత్రం 04:30 — వై.ఎస్.ఎస్. సన్యాసులతో సాంగత్యం
సాయంత్రం 05:40 నుండి రాత్రి 09:00 — శక్తిపూరణ వ్యాయామాలు మరియు నిర్దేశిత ధ్యానం
ఉదయం 07:00 నుండి ఉదయం 08:30 — శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం
ఉదయం 10:30 నుండి ఉదయం 11:00 — కీర్తనలు
ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 — సత్సంగం: ధ్యానంలోని ప్రశాంతతను మన సంబంధాలలోకి తీసుకురావడం
మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 12:30 — ముగింపు వ్యాఖ్యలు మరియు ప్రసాదవితరణ
సాయంత్రం 04:00 నుండి రాత్రి 07:30 — శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం
మరింత సమాచారం
బస యొక్క వ్యవధి:
- భక్తులందరికీ, అదనంగా మూడు రోజులు ఉండేందుకు అవకాశం ఉంటుంది – వారు కార్యక్రమానికి రెండు రోజుల ముందుగా చేరుకొని, కార్యక్రమం ముగిసిన తర్వాత అదనంగా మరొక రోజు ఉండవచ్చు.
- గురుదేవుల ఆశ్రమంలో వరుసగా పది రోజుల వరకు గడపడం ద్వారా, భక్తులకు విశ్రాంతికి, సేదతీరడానికి, ఆధ్యాత్మిక పునరుత్తేజం పొందడానికి పుష్కలమైన సమయం లభిస్తుంది. దానికి అనుగుణంగా మీరు మీ రాకపోక తేదీలను నిర్ణయించుకోవచ్చు.
వసతి:
- మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ఇంకొకరితో కలిపి ఉమ్మడి-వసతి కల్పించబడుతుంది. కుటుంబసభ్యులు దయచేసి తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకొని, సామాను సర్దుకోగలరు.
- వసతి లేదా ఆహారం విషయంలో ప్రత్యేక అవసరాలు ఉన్న భక్తులు దయచేసి వారి స్వంత ఏర్పాట్లు చేసుకోగలరు.
మొదట నమోదు చేసుకొన్నవారికి మొదటి ప్రాధాన్యత:
- నాలుగు ప్రదేశాలలోనూ వసతి సౌకర్యాలు పరిమితంగా ఉన్నందున, మొదట నమోదు చేసుకొన్నవారికి మొదటి కేటాయింపు అనే ప్రాతిపదికన రిజర్వేషన్లు నిర్ధారించబడతాయి.
- మీ రిజర్వేషన్ ధృవీకరించబడి మీరు హాజరు కాలేకపోతే, రిజర్వేషన్ రుసుము వాపసు ఇవ్వబడదు లేదా మరొక వ్యక్తికి బదిలీ చేయబడదని దయచేసి గమనించండి.
చెల్లింపులు:
- రిజర్వేషన్ రుసుము ఒక వ్యక్తికి ₹ 2,500. ఈ రుసుములో వసతి మరియు భోజన ఖర్చులు కూడి ఉంటాయి. ఈ రుసుము చెల్లించడం మీకు కష్టంగా ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
- భోజనం లేదా వసతి అవసరంలేని భక్తులు ఈ కార్యక్రమానికి ఉచితంగా హాజరుకావచ్చు.
ఈ ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొనడానికి రిజర్వేషన్లు ఇప్పుడు ప్రారంభమయ్యాయి!
భక్తులు ఆన్‌లైన్ వై.ఎస్.ఎస్. డివోటీ పోర్టల్ ద్వారాగానీ, వై.ఎస్.ఎస్. సహాయ కేంద్రానికి ఫోన్ చేయడం ద్వారా గానీ, లేదా ప్రదర్శన జరుగుతున్న ఆశ్రమాలలో ఒకదాన్ని సందర్శించడం ద్వారా గానీ రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది.
రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ క్రింద విధంగా ఉన్నాయి:
డివోటీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ రిజర్వేషన్:
త్వరగా మరియు తేలికగా రిజర్వేషన్ చేసుకోవడం కోసం, భక్తులు ఆన్‌లైన్ డివోటీ పోర్టల్ ద్వారా తమ రిజర్వేషన్ అభ్యర్థన సమర్పించవచ్చు./p>
సహాయ కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా రిజర్వేషన్:
దయచేసి (0651 6655 555) నంబరుకు ఫోన్ చేయండి లేదా [email protected] కు ఈ-మెయిల్ చేసి ఈ క్రింద వివరాలను అందించండి:
- మీ పూర్తి పేరు
- వయస్సు
- చిరునామా
- ఈ-మెయిల్ మరియు టెలిఫోన్ నెంబర్
- వై.ఎస్.ఎస్. పాఠాల నమోదు సంఖ్య (లేదా ఎస్.ఆర్.ఎఫ్. సభ్యత్వ సంఖ్య)
- మీ ప్రతిపాదిత ఆగమన మరియు నిష్క్రమణ తేదీలు
మీ మొబైల్ లేదా ఈ-మెయిల్ చిరునామాకు పంపబడే చెల్లింపు లింక్ ద్వారా మీరు రుసుమును చెల్లించవచ్చు.
దయచేసి గమనించండి:
- ఒక నిర్దిష్ట ఆశ్రమంలో రిజర్వేషన్ల కోసం అభ్యర్థనలు గరిష్ట పరిమితికి చేరుకుంటే, ఆ ప్రదేశం యొక్క రిజర్వేషన్లు ముందుగానే ముగిసిపోవచ్చు.
- రిజర్వేషన్ విజయవంతమయ్యాక, మీకు ఈ-మెయిల్, వాట్సప్ లేదా SMS ద్వారా నిర్ధారణ సందేశం వస్తుంది. ఒకవేళ మీకు అలాంటి నోటిఫికేషన్ రాకపోతే, దయచేసి వై.ఎస్.ఎస్. సహాయ కేంద్రాన్ని (0651 6655 555) ఫోన్ ద్వారా లేదా ఈ-మెయిల్ ([email protected]) ద్వారా సంప్రదించండి.
- ఈ కార్యక్రమానికి వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు మాత్రమే హాజరుకావచ్చు.
- 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు అనుమతి లేదు.
ఎప్పటిలాగే, రిజర్వేషన్ విభాగం, వసతి, ఆడియో-విజువల్స్, భోజనశాల, పారిశుధ్యం, లోపలకు ప్రవేశపెట్టుట మరియు ఇతర విభాగాల్లో వివిధ ప్రాంతాలలో సేవ చేయడానికి భక్తులైన వాలంటీర్లు అవసరమవుతారు. వీటిలోని కొన్ని విభాగాలలో కొంతమంది వాలంటీర్లు, కార్యక్రమం ప్రారంభం కావడానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు అవసరమవుతారు. మీరు దీనిలో వాలంటీరుగా ఉండాలనుకుంటే, దయచేసి రిజర్వేషన్ చేసుకొనే ఫారంలో తదనుగుణంగా తెలియజేయండి.
రిజర్వేషన్లు మరియు విచారణల కోసం సంప్రదించాల్సిన వివరాలు
యోగదా సత్సంగ మఠం — దక్షిణేశ్వర్
21, U. N. ముఖర్జీ రోడ్, దక్షిణేశ్వర్
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ – 700 076
ఫోన్: +91 8420873743, +91 9073581656, +91 7439825373
ఈ-మెయిల్: [email protected]
యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం — నోయిడా
పరమహంస యోగానంద మార్గ్, B–4, సెక్టార్ 62
గౌతమ్ బుద్ధ నగర్, ఉత్తరప్రదేశ్ – 201 307
ఫోన్: +91 9899811808, +91 9899811909
ఈ-మెయిల్: [email protected]
యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం — చెన్నై
మాన్నూర్ గ్రామం, P.O. వల్లార్ పురం
శ్రీపెరంబుదూర్, కాంచీపురం, తమిళనాడు – 602 105
ఫోన్: +91 7550012444, +91 7305861965
ఈ-మెయిల్: [email protected]
యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం — ద్వారాహాట్
ద్వారాహాట్
అల్మోరా, ఉత్తరాఖండ్ – 263 653
ఫోన్: +91 9756082167, +91 9411708541
ఈ-మెయిల్: [email protected]
ప్రత్యామ్నాయంగా, మీరు క్రింద ఇవ్వబడిన వివరాలను ఉపయోగించి వై.ఎస్.ఎస్. సహాయ కేంద్రాన్ని కూడా సంప్రదించవచ్చు:
ఫోన్: (0651) 6655 555
ఈ-మెయిల్: [email protected]

















