యోగా, ధ్యానం అంటే ఏమిటి?

యోగా, ధ్యానం అంటే ఏమిటి?

మనలో చాలా మంది సంతృప్తి కోసం బయట చూడటం అలవాటు చేసుకున్నాము. బయటి సాఫల్యాలు మనకు కావాల్సినవి ఇస్తాయని విశ్వసించే పరిస్థితులలో మనం జీవిస్తున్నాము. మన అనుభవాలు మళ్ళీ మళ్ళీ మనకు చూపిస్తున్నాయి, ఏమిటంటే బాహ్యమయినవి ఏవికూడా మనలో “ఇంకా ఏదో కావాలి ” అనే మన లోతయిన కోరికను తీర్చలేవు.

యోగా అనేది శక్తి మరియు చైతన్యం యొక్క సాధారణ బాహ్య ప్రవాహాన్ని వెనుతిప్పే ఒక సులభమైన ప్రక్రియ, తద్ద్వారా మనస్సు ప్రత్యక్ష అవగాహన యొక్క క్రియాశీల కేంద్రంగా మారుతుంది, అప్పుడు అది తప్పుగా భావించే ఇంద్రియాలపై ఆధారపడకుండ, వాస్తవ సత్యాన్ని అనుభవించగల సామర్థ్యము పొందుతుంది.

యోగా యొక్క దశల వారీ పద్ధతులను అభ్యసించడం ద్వారా భావోద్వేగ కారణాలతో లేదా గుడ్డి విశ్వాసం ద్వారా ఏది నమ్మకుండా, అందరికీ జీవితాన్ని ఇచ్చే, మన సారాంశమైన అనంతమైన మేధస్సు, శక్తి మరియు ఆనందంతో మన ఏకత్వాన్ని తెలుసుకుంటాము.

మార్గదర్శక ధ్యానాలు:

దశ 1: పరిచయం

మీ పనులతో నిండి ఉన్న దినచర్య నుండి విరామం తీసుకోండి మరియు మీకు మీరు నిశ్శబ్దాన్ని బహుమతిగా ఇచ్చుకోండి. శాంతి, ప్రేమ మరియు కాంతి యొక్క ఒయాసిస్లో మునిగిపోండి.

దశ 2: ఒక ధ్యానాన్ని ఎంచుకోండి

మీరు సిద్ధంగా ఉన్నప్పుడు, క్రింది నుండి ఒక ధ్యానాన్ని ఎంచుకోండి. ఒక్కో ధ్యానం దాదాపు 15 నిమిషాల నిడివి ఉంటుంది.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా గురించి

యోగానంద-1

గత 100 సంవత్సరాలుగా, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై‌.ఎస్‌.ఎస్.) దాని వ్యవస్థాపకుడు, పాశ్చాత్య దేశాలలో యోగా పితామహుడిగా విస్తృతంగా గౌరవించబడ్డవారు అయిన శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక మరియు మానవతావాద కృతిని కొనసాగించడానికి అంకితమైంది.

పరమహంస యోగానందగారు రూపొందించిన ఆశయాలు మరియు ఆదర్శాలలో వ్యక్తీకరించబడినట్లుగా, ఈ సంఘము మన ప్రపంచ కుటుంబంలోని విభిన్న ప్రజలు మరియు మతాల మధ్య మరింత అవగాహన మరియు సద్భావన స్ఫూర్తిని పెంపొందించడానికి మరియు అన్ని సంస్కృతులు మరియు జాతీయతలకు చెందిన వారు మరింత పూర్తిగా వారి జీవితాలలో మానవత యొక్క అందం, గొప్పతనం మరియు దైవత్వాన్ని గ్రహించి, వ్యక్తీకరించడానికి సహాయం చేస్తుంది.

భారతదేశంలో సహస్రాబ్దాల క్రితం ఉద్భవించిన పవిత్రమైన ఆధ్యాత్మిక శాస్త్రమైన క్రియాయోగా యొక్క సార్వత్రిక బోధనలను అందుబాటులోకి తేవడానికి పరమహంస యోగానందగారు 1917లో యోగదా సత్సంగ సొసైటీని స్థాపించారు. ఈ సార్వత్రిక బోధనలు సర్వతోముఖ విజయం మరియు శ్రేయస్సును సాధించడానికి పూర్తి తత్వశాస్త్రం మరియు జీవన విధానాన్ని కలిగి ఉంటాయి, అలాగే జీవిత అంతిమ లక్ష్యాన్ని (పరమాత్మతో ఆత్మ యొక్క ఐక్యత) సాధించడానికి కావలసిన ధ్యాన పద్ధతులు ఉన్నాయి.

గృహ-అధ్యయన కోసం వై‌.ఎస్‌.ఎస్. పాఠాలు

పరమహంస యోగానందగారు ప్రచురించిన రచనలు అన్నిటిలో పాఠాలు ప్రత్యేకమైనవి, అవి క్రియాయోగం తో పాటు ఆయన బోధించిన ధ్యానం, ఏకాగ్రత మరియు శక్తినిచ్చే యోగ పద్ధతుల్లో ఆయన దశల వారీ సూచనలను అందిస్తాయి.

ఈ సరళమైనప్పటికి అత్యంత ప్రభావవంతమైన యోగ పద్ధతులు ప్రత్యక్షంగా ప్రాణ శక్తి మరియు చైతన్యముతో పని చేసి, శరీరాన్ని శక్తితో పునరావేశం చేయడానికి, మనస్సు యొక్క అపరిమితమైన శక్తిని మేల్కొల్పడానికి మరియు మీ జీవితంలో పరమాత్మ గురించి ఎప్పటికప్పుడు లోతైన అవగాహనను అనుభవించేలా చేసి మిమ్మల్ని – అంతిమంగా ఆధ్యాత్మిక చైతన్యం మరియు దేవునితో ఐక్యత యొక్క అత్యున్నత స్థితికి చేరుస్తుంది.

యోగం అనేది ఒక నిర్దిష్ట విశ్వాసాలకు కట్టుబడి కాకుండా అభ్యాసం మరియు అనుభవంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, అన్ని మతాల అనుచరులు—అలాగే మతపరమైన మార్గంతో అనుబంధించని వారు—పాఠాల యొక్క ప్రాథమిక క్రమములోని ఆధ్యాత్మిక బోధనల నుండి మరియు అందులో నేర్పిన ప్రక్రియల నుండి ప్రయోజనం పొందవచ్చు. క్రమం తప్పకుండా సాధన చేసినప్పుడు, ఈ పద్ధతులు ఆధ్యాత్మిక జ్ఞానం మరియు అవగాహన యొక్క లోతయిన స్థాయిలకు తప్పకుండా చేరుస్తాయి.

పరమహంస యోగానందగారి పరిచయ పాఠాన్ని చదవండి

ఆత్మసాక్షాత్కారం ద్వారా అత్యున్నత విజయాలు

“ఆత్మ-సాక్షాత్కారం ద్వారా అత్యున్నత విజయాలు” అనే పాఠాల క్రమము యొక్క పరిచయ శీర్షికలో పరమహంస యోగానందగారు పాఠాలలోని బోధనల యొక్క స్ఫూర్తిదాయకమైన మరియు లోతైన అవలోకనం ఇచ్చారు.

మొదటి దశగా, ఈ పరిచయ పాఠంలోని ఆలోచనలను మీరు చదివి గ్రహించాలని మేము సూచిస్తున్నాము. క్రియాయోగా దీక్షకు సిద్ధం చేసే ధ్యాన పద్ధతులను బోధించే పద్దెనిమిది పాఠాల పాఠ్యక్రమం కోసం నమోదు చేసుకోవడం ద్వారా మీరు స్వీయ-సాక్షాత్కార ప్రయాణంలో మరింత ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా, అని నిర్ణయించుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది.

మీరు ఈ పేజీలోని “పాఠాల కోసం దరఖాస్తు” ట్యాబ్‌లోని సూచనలను అనుసరించడం ద్వారా వెంటనే పాఠాల కోసం నమోదు చేసుకోవచ్చు.

ధ్యానం చేయడం నేర్చుకోండి:

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు క్రియాయోగ ధ్యాన శాస్త్రాన్ని ఎలా అభ్యసించాలో వారు స్వయంగా ఇచ్చిన సూచనలు, ముప్పై సంవత్సరాల క్రితం వారు ఇచ్చిన తరగతుల నుండి తీసుకోబడినవి. అవి, యోగదా సత్సంగ పాఠాల ద్వారా సవివరంగా అందించబడ్డాయి.

అదనంగా, ఈ పాఠాలు సమతుల్య శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును పొందడం కోసం ఆయన ఆచరణాత్మక మార్గదర్శకత్వం మరియు పద్ధతులను అందిస్తాయి – జీవితంలోని ప్రతి అంశంలో యోగం మనకు ఆరోగ్యం, స్వస్థత, విజయం మరియు సామరస్యం అందిస్తుంది. ఈ “జీవించడం ఎలా” అనే సూత్రాలు విజయవంతమైన ధ్యాన సాధనలో చాలా ముఖ్యమైన భాగం.

పరమహంస యోగానందగారు మరియు వై‌.ఎస్‌.ఎస్. గురించి

పరమహంస యోగానందగారు జన్మించిన ఒక శతాబ్దం తర్వాత, ఆయన మన కాలంలోని ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తులలో ఒకరిగా గుర్తించబడ్డారు; మరియు ఆయన జీవితం మరియు కృతి యొక్క ప్రభావం పెరుగుతూనే ఉంది. ఆయన దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టిన అనేక మతపరమైన మరియు తాత్విక భావనలు మరియు పద్ధతులు ఇప్పుడు విద్య, మనస్తత్వ శాస్త్రం, వ్యాపారం, వైద్యం మరియు ఇతర ప్రయత్నాలలో వ్యక్తీకరణను పొందుతున్నాయి – మానవుని జీవితం యొక్క మరింత సమగ్రమైన, మానవీయ మరియు ఆధ్యాత్మిక దృష్టికి సుదూర మార్గాల్లో దోహదం చేస్తున్నాయి.

పరమహంస యోగానందగారి బోధనలు అనేక విభిన్న రంగాలలో, అలాగే విభిన్న తాత్విక మరియు అధిభౌతిక గమనాలకు ఆనవాలుగా వ్యాఖ్యానించబడుతున్నాయి మరియు సృజనాత్మకంగా అన్వయించబడుతున్నాయనే వాస్తవం, ఆయన బోధించిన గొప్ప ఆచరణాత్మక ప్రయోజనాన్ని సూచించడమే కాకుండా, ఆయన విడిచిపెట్టిన ఆధ్యాత్మిక వారసత్వం కాలక్రమేణా పలుచన, విచ్ఛిన్నం లేదా వక్రీకరించబడకుండా చూసుకోవడానికి కొన్ని మార్గాల అవసరాన్ని కూడా ఇది స్పష్టం చేస్తుంది.

జ్ఞానం, సృజనాత్మకత, భద్రత, ఆనందం, షరతులు లేని ప్రేమ — మనకు నిజమైన మరియు శాశ్వతమైన ఆనందాన్ని కలిగించే వాటిని కనుగొనడం నిజంగా సాధ్యమేనా?

మన ఆత్మలోని దైవత్వాన్ని అనుభవించడం, దైవిక ఆనందాన్ని మన స్వంత ఆనందంగా పొందటం – ఇవి పరమహంస యోగానందగారి క్రియాయోగ బోధనలు మనలో ప్రతి ఒక్కరికి అందిస్తాయి.

క్రియాయోగం యొక్క పవిత్ర శాస్త్రం ధ్యానం యొక్క అధునాతన పద్ధతులను కలిగి ఉంది, దీని అంకితమైన అభ్యాసం భగవంతుని సాక్షాత్కారానికి మరియు అన్ని రకాల బంధాల నుండి ఆత్మను విముక్తి చేయడానికి దారితీస్తుంది. ఇది యోగ, దైవిక ఐక్యత యొక్క రాజ లేదా అత్యున్నత ప్రక్రియ. (“యోగం అంటే నిజంగా ఏమిటి?” చదవండి)

క్రియాయోగ మార్గం యొక్క ధ్యాన పద్ధతులు

‘దేవుడు తన అనుగ్రహాలను వారికి ప్రసాదించడానికి ఇష్టపడే హృదయాలను వెతకుతాడు….’ అది చాలా అందంగా ఉంది మరియు అదే నేను నమ్ముతాను. దేవుడు తన బహుమతుల ప్రసాదం కోసం సిద్ధంగా ఉన్న హృదయాలను వెతకుతాడు. ఆయన మనకు ప్రతిదీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనము స్వీకరించే ప్రయత్నం చేయడానికి ఇష్టపడము.

పరమహంస యోగానందగారు తన ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో క్రియాయోగ వివరణను అందించారు. పరమహంస యోగానందగారు బోధించిన మూడు సిద్ధము చేయునట్టి ప్రక్రియలను కొంతకాలం ప్రాథమిక అధ్యయనం మరియు అభ్యాసం చేసిన తర్వాత యోగదా సత్సంగ పాఠాల విద్యార్థులకు అసలు ప్రక్రియ ఇవ్వబడుతుంది.

ఒక సమగ్రమైన వ్యవస్థగా కలిపి తీసుకుంటే, ఈ ధ్యాన పద్ధతులు అభ్యాసకుడుకి పురాతన యోగ శాస్త్రం యొక్క అత్యధిక ప్రయోజనాలను మరియు దివ్య లక్ష్యాన్ని సాధించేలా చేస్తాయి.

1. శక్తిపూరణ వ్యాయామాలు

ధ్యానం కోసం శరీరాన్ని సిద్ధం చేయడానికి 1916లో పరమహంస యోగానందగారు అభివృద్ధి చేసిన సైకోఫిజికల్ వ్యాయామాల శ్రేణి. క్రమమైన అభ్యాసంతో మానసిక మరియు శారీరక విశ్రాంతిని అభివృద్ధి చేస్తుంది మరియు గతిశీలమైన (డైనమిక్) సంకల్ప శక్తిని అభివృద్ధి చేస్తుంది. శ్వాస, ప్రాణశక్తి మరియు ఏకాగ్రతతో కూడిన దృష్టిని ఉపయోగించడం ద్వారా, ఈ ప్రక్రియ శరీరంలోకి సమృద్ధిగా శక్తిని పొందేలా చేస్తుంది, క్రమంగా అన్ని శరీర భాగాలను శుద్ధి చేస్తుంది మరియు బలోపేతం చేస్తుంది. శక్తిపూర్వక వ్యాయామాలు, నిర్వహించడానికి సుమారు 15 నిమిషాలు పడుతుంది, ఇవి ఒత్తిడి మరియు నాడీ ఒత్తిడిని తొలగించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. ధ్యానానికి ముందు వాటిని అభ్యసించడం వల్ల ప్రశాంతమైన, అంతర్గత అవగాహన స్థితిలోకి ప్రవేశించడానికి గొప్ప సహాయం కలుగుతుంది.

2. హాంగ్-సా ఏకాగ్రత ప్రక్రియ

ఏకాగ్రత యొక్క హాంగ్-సా ప్రక్రియ ఒకరి ఏకాగ్రత యొక్క గుప్త శక్తులను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఈ ప్రక్రియ యొక్క అభ్యాసం ద్వారా బాహ్య పరధ్యానాల నుండి ఆలోచనను మరియు శక్తిని ఉపసంహరించుకోవడం నేర్చుకుంటారు, తద్ద్వారా వారు సాధించాల్సిన ఏదైనా లక్ష్యం లేదా పరిష్కరించాల్సిన సమస్యపై దృష్టిని కేంద్రీకరించగలరు. లేదా అంతర్గత దైవ చైతన్యమును గ్రహించడం వైపు దృష్టి కేంద్రీకరించవచ్చు.

3. ఓం ప్రక్రియ

ఓం ధ్యాన ప్రక్రియ అనేది ఒకరి స్వంత నిజమైన స్వీయము యొక్క దైవిక లక్షణాలను కనుగొనడానికి మరియు అభివృద్ధి చేయడానికి ఏకాగ్రత శక్తిని అత్యున్నత మార్గంలో ఎలా ఉపయోగించాలో చూపిస్తుంది. ఈ పురాతన పద్ధతి, సర్వవ్యాప్తమైన దైవిక ఉనికిని ఓం పదం లేదా పవిత్రాత్మగా ఎలా అనుభవించాలో నేర్పుతుంది, ఓం పదం లేదా పరిశుద్ధాత్మ, అది సమస్త సృష్టికి ఆధారము మరియు సృష్టిని నిలబెట్టేది. ఈ ప్రక్రియ మన అవగాహనను శరీరం మరియు మనస్సు యొక్క పరిమితులను దాటి అనంతమైన సామర్థ్యం యొక్క ఆనందకరమైన సాక్షాత్కారానికి విస్తరిస్తుంది.

4. క్రియయోగ ప్రక్రియ

క్రియా అనేది ప్రాణాయామం (జీవ-శక్తి నియంత్రణ) యొక్క అధునాతన రాజయోగ ప్రక్రియ. క్రియా వెన్నెముక మరియు మెదడులోని ప్రాణ శక్తి (ప్రాణ) యొక్క సూక్ష్మ ప్రవాహాలను బలోపేతం చేస్తుంది మరియు పునరుజ్జీవింపజేస్తుంది. భారతదేశంలోని పురాతన జ్ఞానులు (ఋషులు) మెదడు మరియు వెన్నెముకను జీవిత వృక్షంగా భావించారు. జీవం మరియు చైతన్యం (చక్రాలు) యొక్క సూక్ష్మ మేదోమేరు (సెరెబ్రోస్పైనల్) కేంద్రాల నుండి అన్ని నాడులు మరియు శరీరంలోని ప్రతి అవయవం మరియు కణజాలానికి జీవం పోసే శక్తులు ప్రవహిస్తాయి. క్రియాయోగం యొక్క ప్రత్యేక ప్రక్రియ ద్వారా వెన్నెముకపై నిరంతరం జీవ ప్రవాహాన్ని తిప్పడం ద్వారా, ఒకరి ఆధ్యాత్మిక పరిణామం మరియు అవగాహనను బాగా వేగవంతం చేయడం సాధ్యమవుతుందని యోగులు కనుగొన్నారు.

క్రియాయోగ యొక్క సరైన అభ్యాసం ద్వారా గుండె మరియు ఊపిరితిత్తులు మరియు నాడీ వ్యవస్థ యొక్క సాధారణ కార్యకలాపాలు సహజంగా నెమ్మదిస్తాయి, శరీరం మరియు మనస్సు యొక్క అఘద అంతర్గత నిశ్చలతను ఉత్పత్తి చేస్తుంది మరియు ఆలోచనలు, భావోద్వేగాలు మరియు ఇంద్రియ అవగాహనల యొక్క సాధారణ అల్లకల్లోలం నుండి శ్రద్ధను విముక్తి చేస్తుంది. ఆ అంతర్గత నిశ్చలత యొక్క స్పష్టతలో, ఒక వ్యక్తి తన ఆత్మతో మరియు భగవంతునితో లోతైన అంతర్గత శాంతి మరియు సామరస్యతను అనుభవిస్తాడు.

ఇతరులతో షేర్ చేయండి