పరమహంస యోగానంద గారు మరియు స్వామి శ్రీయుక్తేశ్వర్ గార్ల
గౌరవార్థం స్మారకోత్సవాల నిర్వహణ

మహాసమాధి స్మారకోత్సవ ధ్యానాలు, మార్చి 2026

ఈ కార్యక్రమం గురించి

పరమహంస యోగానంద గారి మహాసమాధి — పరమాత్మతో ఏకత్వ స్థితిలో శరీరం నుంచి ఒక మహా యోగి యొక్క అంతిమ సచేతన నిష్క్రమణ — వార్షికోత్సవం మార్చి 7న జరుగుతుంది. ఆయన గురుదేవులైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గారి మహాసమాధి వార్షికోత్సవం మార్చి 9న జరుగుతుంది. పరమహంస యోగానంద గారు మరియు స్వామి శ్రీయుక్తేశ్వర్ గార్ల గౌరవార్థం, ఈ క్రింది ప్రత్యేక ఆన్‌లైన్ కార్యక్రమాలను యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సన్యాసులు నిర్వహిస్తారు:

పరమహంస యోగానంద
మహాసమాధి స్మారకోత్సవ ధ్యానం

శనివారం, మార్చి 7, 2026
ఉదయం 6:30 – ఉదయం 8:00 (భారతీయ కాలమానం)

మార్చి 7, 1952లో పరమహంస యోగానంద గారు మహాసమాధి చెందారు. ఈ దినోత్సవాన్ని భారతదేశమంతటా ప్రత్యేక ధ్యాన కార్యక్రమాలతో జరుపుకుంటారు. వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించే ప్రత్యేక ఆన్‌లైన్ ధ్యానంలో పాల్గొనేందుకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో కీర్తన గానం, స్ఫూర్తిదాయక పఠనం మరియు ధ్యానం ఉంటాయి.

దయచేసి గమనించండి: ఈ కార్యక్రమం ఆదివారం, మార్చి 8, రాత్రి 10 గంటల (భారతీయ కాలమానం) వరకు వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.

పరమహంస యోగానంద మరియు స్వామి శ్రీయుక్తేశ్వర్
స్మారకోత్సవ ఆరు-గంటల ధ్యానం

ఆదివారం, మార్చి 8, 2026
ఉదయం 9:40 – సాయంత్రం 4:00 (భారతీయ కాలమానం)

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. మార్గంలోని భక్తులకు ప్రియతమ గురుదేవులైన పరమహంస యోగానందగారు మరియు పరమ గురుదేవులైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గార్ల మహాసమాధి ప్రత్యేక దినోత్సవాలను జరుపుకొనేందుకు ఆదివారం, మార్చి 8న వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహించే ఆరు-గంటల ఆన్‌లైన్ ధ్యానంలో పాల్గొనేందుకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

ఈ కార్యక్రమం శక్తిపూరణ వ్యాయామాలతో ప్రారంభమవుతుంది, అనంతరం ప్రార్థన, స్ఫూర్తిదాయక పఠనం మరియు నియమిత సమయాల పాటు కీర్తనగానం మరియు ధ్యానం ఉంటాయి. పరమహంస యోగానంద గారి స్వస్థతా ప్రక్రియ మరియు ముగింపు ప్రార్థనతో ఇది సమాప్తమవుతుంది.

కార్యక్రమం యొక్క పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • శక్తిపూరణ వ్యాయామాలు – ఉదయం 9:40 నుండి ఉదయం 10:00 గంటల (భారతీయ కాలమానం) వరకు
  • మొదటి సమావేశం – ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 గంటల (భారతీయ కాలమానం) వరకు
  • విరామం – మధ్యాహ్నం 1:00 నుండి మధ్యాహ్నం 1:30 గంటల (భారతీయ కాలమానం) వరకు
  • రెండవ సమావేశం – మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 4:00 గంటల (భారతీయ కాలమానం) వరకు


దయచేసి గమనించండి:
ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొనలేనివారి కోసం, ఈ కార్యక్రమం మంగళవారం, మార్చి 10, రాత్రి 10 గంటల (భారతీయ కాలమానం) వరకు వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది..

స్వామి శ్రీయుక్తేశ్వర్
మహాసమాధి స్మారకోత్సవ ధ్యానం

సోమవారం, మార్చి 9, 2026
ఉదయం 6:30 – ఉదయం 8:00 (భారతీయ కాలమానం)

“జ్ఞానం యొక్క అవతారం,” లేదా జ్ఞానావతారులుగా పూజించబడే స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు, పరమహంస యోగానంద గారి గురుదేవులు మరియు లాహిరీ మహాశయుల శిష్యులు. మార్చి 9, 1936లో స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు మహా సమాధిలో ప్రవేశించారు — ఆ రోజును యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రత్యేక ధ్యానాలతో గౌరవిస్తుంది.

స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి గారి గౌరవార్థం సోమవారం, మార్చి 9న వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించే ఒక ప్రత్యేక ఆన్‌లైన్ స్మారకోత్సవ ధ్యానంలో పాల్గొనేందుకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం; ఇందులో కీర్తనగానం, స్ఫూర్తిదాయక పఠనం మరియు ధ్యానం ఉంటాయి.

దయచేసి గమనించండి: ఈ కార్యక్రమం మంగళవారం మార్చి 10, రాత్రి 10 గంటల (భారతీయ కాలమానం) వరకు వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.

ఈ శుభ సందర్భంలో, గురుదేవులు మరియు పరమ గురుదేవుల గౌరవార్థం వ్యక్తిగతంగా పాల్గొనే స్మారకోత్సవ కార్యక్రమాలను వివిధ ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళు కూడా నిర్వహిస్తాయి. మీకు దగ్గరలోని కేంద్రాన్ని సంప్రదించేందుకు దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

గురుదేవుల నుండి సమృద్ధిగా లభించిన ఆధ్యాత్మిక ఆశీస్సులకు గుర్తుగా ఆ రోజున భక్తులు కృతజ్ఞతతో, ప్రేమతో గురు-ప్రణామిని సమర్పిస్తారు. ఈ ప్రత్యేక సందర్భంలో మీరు విరాళం సమర్పించాలనుకొంటే, క్రింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ఆన్‌లైన్ ద్వారా సమర్పించవచ్చు.

నూతన సందర్శకులు

వై.ఎస్.ఎస్. కు మరియు పరమహంస యోగానందగారి బోధనలకు కొత్తవారైతే, క్రింద ఉన్న లింక్ లను అన్వేషించడానికి ఇష్టపడవచ్చు:

ఒక యోగి ఆత్మకథ

ఒక అత్యుత్తమ ఆధ్యాత్మిక రచనగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడుతున్న తమ పుస్తకం గురించి పరమహంసగారు తరచుగా, “నేను లేనప్పుడు ఈ పుస్తకం నా దూత అవుతుంది,” అనే వారు.

వై.ఎస్.ఎస్. పాఠాలు

మీరు ఊహించని విధంగా మీ జీవితాన్ని మార్చడానికి, సమతుల్యతను సాధించటానికి మరియు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మీకు సహాయపడే గృహ-అధ్యయన పాఠ్యక్రమం.

ఇతరులతో పంచుకోండి