శ్రీ శ్రీ మృణాళినీమాత క్రిస్మస్ సందేశం 2015

"మీ అందరికీ, మీలో ఉన్న అనంత క్రీస్తుకు నా ప్రణామాలు. ఓ క్రీస్తు, ప్రతి దినములోని ప్రతి గడియ, ప్రతి నిమిషం, నీ ఆన౦ద పారవశ్యము మాతో ఉ౦డునట్లు అనుగ్రహించుము."

క్రిస్మస్ 2015

గురుదేవ పరమహంస యోగానందగారి ఆశ్రమాల్లోని మా అందరి నుండి మీకు క్రిస్మస్ ఆశీస్సులు. క్రీస్తు ప్రేమ మరియు ఆనందం యొక్క స్పందనలతో నిండిన ఈ పవిత్ర తరుణంలో, ప్రియతమ ప్రభు ఏసులో మానవ రూపం ధరించిన క్రీస్తు చైతన్యం యొక్క పరివర్తన దాయకమైన ఉనికిని మీ మనో భక్తి యొక్క గ్రాహ్యత ద్వారా మీరు అనుభూతి చెందాలని మేము ప్రార్థిస్తున్నాము. విభేదాత్మకమైన మాయ యొక్క శక్తులచే ఎక్కువగా ప్రేరేపించబడే ఈ ప్రపంచంలో, దివ్య కాంతిని నిండుగా ప్రతిబి౦బి౦చే వార౦దరి జీవితాల ను౦డి ఉద్భవి౦చే వినయ౦, ప్రేమల సంఘటిత శక్తి అయిన శా౦తి ఉపశమనానికి మన ఆత్మలు ఎ౦త లోతుగా ప్రతిస్ప౦దిస్తాయో కదా! ఆ విశ్వచైతన్యం యొక్క యథార్థము మిమ్మల్ని ఆవరించి, మీరు కూడా మీలోని దివ్య ప్రతిబింబాన్ని ప్రకాశమానం చేయగలరనే విశ్వాసాన్ని ఆ విశ్వచైతన్యం మీకు ప్రసాదించుగాక.

మనం ఏసు యొక్క పవిత్ర జన్మదినాన, ఆయన జీవితమనే దివ్య, పవిత్ర గ్రంథం నుండి ఆయన దివ్య ఉనికిని మనలో మేల్కొల్పే గుణములను గ్రహించాలనే, మన నూతన సంకల్పం ద్వారా ఆయన వ్యక్తం చేసిన సజీవ క్రీస్తు చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. మానవ పరిమితులన్నింటి పై ఆయన సాధించిన విజయం నుంచి ధైర్యాన్ని పొందండి. ఇంద్రియ, అహంకార, బాహ్య పరిస్థితుల యొక్క ఆదేశాల నుండి మీ ఆత్మ విముక్తిని పొందడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నంతో, మీరు క్రీస్తు చైతన్యం యొక్క విముక్త శక్తిని మీలో మేలుకొలుపుతున్నారని, ప్రేమ మరియు సత్యం యొక్క నియమాల ద్వారా మీ జీవితాన్ని శాసించడానికి శక్తిని పొందుతున్నారని తెలుసుకోండి. మన మనస్సు మరియు హృదయం యొక్క పరిధిని విస్తరించమని నిరంతరం మనల్ని ప్రేరేపించే శక్తి ఇది. మనకంటే చాలా భిన్నమైన వ్యక్తులు మన యెదుటపడినప్పుడు, మానవ నైజాల యొక్క వ్యత్యాసాలపై మనం దృష్టిని కేంద్రీకరిస్తాం, తరచూ విమర్శించడానికి మొగ్గుచూపుతాం. కానీ ఏసు, కృష్ణుడు, మహాత్ములందరూ కనపరిచిన సర్వతోముఖ ప్రేమ, ప్రతి ఒక్కరినీ దివ్య సంతానంగా చూసే విధం ఎంతటి ఏకీకృతమైనది. మన అవగాహన, సానుభూతి విస్తరణముతో, మన౦ ఇతరులను మన అనంత ఆత్మలో భాగ౦గా చూడడ౦ — మన జీవితంలో క్షమ యొక్క స్వస్థపరచెడు శక్తికి చోటు కల్పించి, ఏసులా సేవ చేయడంలో నిజమైన ఆనందాన్ని అనుభవి౦చడ౦ ప్రార౦భిస్తాం. ఆయన జన్మించిన ఈ తరుణంలో, ఆయన పరిపూర్ణంగా వ్యక్త్యపరించిన ఉత్కృష్ట గుణాలు మరింత అనుభవనీయమవుతాయి, మనలో మరింత కరుణ, ఔదార్యాన్ని మరియు ఇతరులకు చేయూతనివ్వాలనే కోరికను రేకెత్తిస్తాయి. ఆ స్ఫూర్తిలో, ఒక చిన్నపాటి కరుణ కూడా ఆత్మల మధ్య వారధిని నిర్మిస్తు౦ది, మరియు మరొకరి హృదయంలో దేవుని ప్రేమ యొక్క ముద్ర వేయవచ్చు.

క్రీస్తును ప్రతిబింబించే చర్యలు మన జీవితాలను ఉత్తేజపరచగలవు, మార్చగలవు, కాని ఆంతరిక నిశ్శబ్దం అనే పవిత్ర మందిరంలోనే మనం అనంత క్రీస్తు చైతన్యం (కుటస్థ చైతన్యం లేదా కృష్ణ చైతన్యం, భారతదేశ పవిత్ర సంప్రదాయ పరిభాషలో అన్న విధంగా) యొక్క మహిమను ప్రత్యక్షంగా అనుభవిస్తాము. మన జీవితం మరియు అస్తిత్వతపు ఈ చిన్నికెరటం దేవుని ఉనికి యొక్క సువిశాలమైన సాగరంతో పొందే క్షణిక సంపర్కం కూడా, ప్రతి ఆత్మకు ఆశ్రయమిచ్చే ఆ ఈశ్వరుని అతులితమైన కరుణగురించి, మనము పరివర్తన చెందే అవగాహన ఇస్తుంది. మన గురుదేవులు ఇలా అన్నారు: “భగవంతుడు తన భక్తునికి ఇవ్వడానికి ఎంత ప్రేమ ఉన్నదంటే, అది హృదయపు అన్ని హద్దులను బద్దలు కొడుతుంది. భగవంతునిపట్ల ఆ ప్రేమ ఒక వ్యక్తి అస్తిత్వాన్ని నింపినప్పుడు, అది ప్రేమ, సేవ మరియు కరుణ యొక్క విశ్వచైతన్యంలో అందరినీ ఆలింగనం చేసుకుంటుంది.” ఆ దివ్యప్రేమ ఏసులో ఉన్నట్లుగానే మీలో కూడా పుట్టి, మీ ధ్యానంతో కూడిన చైతన్యం ద్వారా మీలో జీవించుగాక.

మీకు మీ ఆప్తులకు ఆనందము, కాంతితో నిండిన క్రిస్మస్ శుభాకాంక్షలు,

Wishing you and your loved ones a Christmas filled with light and joy,

శ్రీ శ్రీ మృణాళినీమాత

ఇతరులతో పంచుకోండి