ఒక యోగి ఆత్మకథ ఆడియో పుస్తకం — ఉచిత డౌన్‌లోడ్

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క గురుదేవులు మరియు వ్యవస్థాపకులు అయిన పరమహంస యోగానందగారి అత్యధికంగా విక్రయించబడే ఒక యోగి ఆత్మకథ గ్రంథం యొక్క ఉచిత తెలుగు ఆడియో పుస్తకాన్ని మీకు అందిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం.

దయచేసి మీ ఈ-మెయిల్ అడ్రస్ పంపించండి, మరియు ఉచితంగా తెలుగు ఆడియో పుస్తకాన్ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి మేము మీకొక లింక్ ను పంపిస్తాము.

ఒక యోగి ఆత్మకథ – ఉచిత డౌన్‌లోడ్

(ఒక యోగి ఆత్మకథ — తెలుగు)

"*" అనేది అవసరమైనవాటిని సూచిస్తుంది

This field is for validation purposes and should be left unchanged.

లేదా

ఆధ్యాత్మిక నిధిగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన, అత్యధికంగా విక్రయించబడుతున్న ఈ గ్రంథం లక్షలాది మందిని ఒక కొత్త మరియు అత్యంత సఫలమైన జీవనవిధానంవైపుకు పరివర్తన చెందుతూ వారి వ్యక్తిగత ప్రయాణం ప్రారంభించేందుకు ప్రేరణనిచ్చింది. పరమహంస యోగానందగారి అసాధారణమైన జీవిత గాథలోని జ్ఞానము, హాస్యము,మరియు ప్రేరణ అంతా ఆ క్షణంలోనే తెలియజేయబడుతుంది.

ఈ పుస్తకమును కొత్తగా చదివినవారు, అలాగే దీనిని చిరకాల సహవాసిగా చేసుకుని విలువైన నిధిగా భావించేవారు, నిపుణుడైన వ్యాఖ్యాత చదివిన ఈ సున్నితమైన మరియు తప్పనిసరైన పఠనమును స్వాగతిస్తారు. ఆయన సూక్ష్మమైన నాటకీయత పరమహంస యోగానందగారి అనేకమైన మనోరంజక వృత్తాంతముల శోభను అందజేస్తుంది, రచయిత కళ్ళకు కట్టినట్లుగా వివరించిన మనుష్యుల అనుభవాలకు, సంఘటనలకు, మరియు ఆయన ప్రకాశవంతమైన అన్వేషణలకు, జీవితము యొక్క నిగూఢమైన మర్మములకు జీవము పోసి స్పష్టముగా తెలియజేశారు.

ఈ అసంక్షిప్త MP3 ఆడియో సంచిక ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.

పరమహంస యోగానందగారి క్రియాయోగ బోధనలు

పవిత్రమైన క్రియాయోగ శాస్త్రము ఉన్నతమైన ధ్యాన ప్రక్రియలను కలిగి ఉంటుంది, భక్తివిశ్వాసాలతో దీనిని సాధన చేయడం వల్ల, దైవసాక్షాత్కారానికి మరియు అన్ని రకాల బానిసత్వం నుండి ఆత్మవిముక్తికి తోడ్పడుతుంది. ఇది రాజోచితం లేదా సర్వోన్నతం అయిన యోగ ప్రక్రియ, దివ్యకలయిక.

ధ్యానాలను అనుభూతి చెందండి

ధ్యానం చేయడానికి కొన్ని ప్రాథమిక సూచనలను తెలుసుకోండి, వాటిని ఇప్పుడే ఆచరించడం ద్వారా ధ్యానం ప్రసాదించే శాంతిని మరియు దైవానుసంధానాన్ని అనుభూతి చెందండి.

ఒక యోగి ఆత్మకథ వినండి (తెలుగు ఆడియో పుస్తకం)

Copyright © 2019 Self-Realization Fellowship. అన్ని హక్కులు ఆరక్షితం.

ఈ MP3ని డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించుకోవడానికి షరతులు

ఈ వెబ్‌పేజీలో చూపబడిన ఆడియో సంచికను మీ వ్యక్తిగత ఉపయోగం కోసం అందించడం మా విశేషాధికారంగా భావిస్తున్నాం. ఈ రికార్డింగును మీ స్వంత డిజిటల్ పరికరాలలో డౌన్‌లోడ్ చేసుకోమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము — ఇది మీ వ్యక్తిగత (వాణిజ్యేతర) వినియోగానికి సరిపోతుందని మీరు భావించవచ్చు. అయితే, ఈ ఆడియో సంచికను పొందడం ద్వారా, జాతీయ మరియు అంతర్జాతీయ కాపీరైట్ చట్టాలకు కట్టుబడి ఉంటామని, మరియు ఈ ఆడియో సంచిక యొక్క విషయాలను ప్రచురణకర్తల వ్రాతపూర్వక అనుమతి లేకుండా ఇతరుల కోసం పునరుత్పత్తి చేయడం/లేదా పంపించడం (కాపీ చేయడం, పంపిణీ చేయడం, ఈ-మెయిల్ చేయడం, పోస్ట్ చేయడం, ప్రసారం చేయడం మొదలైనవి) చేయమని మీరు అంగీకరిస్తున్నారని దయచేసి గమనించండి. మా వ్యవస్థాపకులైన శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక వారసత్వానికి సంబంధించి లాభాపేక్షలేని మా ప్రచురణ ప్రయత్నాలను ప్రోత్సహిస్తున్నందుకు మీకు మా ధన్యవాదాలు.

వై.ఎస్.ఎస్. పుస్తకాలు మరియు ఇతర ప్రచురణలు

పరమహంస యోగానందగారి మరియు ఆయన ప్రత్యక్ష శిష్యుల పుస్తకాలు మరియు ఇతర ప్రచురణల గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి క్రింది లింక్‌ను క్లిక్ చేయండి: