శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి నుండి ఒక సందేశం

10 నవంబరు, 2021

ప్రియుతములరా:

శ్రీ పరమహంస యోగానందగారి అనుచరులు మరియు స్నేహితుల మా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబానికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు! మన గురుదేవుల ఒక యోగి ఆత్మకథ యొక్క 75వ వార్షికోత్సవ సంవత్సరంలో, ఈ అద్భుత పుస్తకం నా జీవితంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసంఖ్యాకులైన ఇతరుల జీవితాల్లోకి అనుగ్రహించిన జీవితకాల దీవెనలకు నా హృదయం కృతజ్ఞతలతో నిండిపోయింది. మీలో చాలామందిలాగే, పరమహంస యోగానందగారి క్రియాయోగ బోధనలను నాకు మొట్టమొదట పరిచయం చేసింది ఈ ఆత్మకథే. ఇన్ని సంవత్సరాల తరువాత వెనక్కి తిరిగి చూస్తే, గ్రంథకర్త మరియు ఆయన గురు పరంపర యొక్క భగవత్-సంతృప్త చైతన్య పుటల నుండి నేరుగా నా మనోబుద్ధిల్లోకి ప్రవహించి “కలలోనైనా కనని -సంభావ్యత” అయిన నా ఆత్మ మేల్కొల్పు యొక్క పులకరింత నా స్మరణకొస్తుంది.

నా తొలి పఠనం నుండి కొనసాగిన లెక్కలేనన్ని జీవిత-పరివర్తన ప్రభావాలలో, నిస్సందేహముగా అత్యంత మనోరంజకమైన వాటిలో ఒకటి భూమి నలుదిశలా అదే విధంగా పరివర్తనమొందిన వేలాది మందితో సత్సంగం (దివ్య సాంగత్యము) యొక్క ఆనందం — మీ అందరితో! ఈ పథంలోని భక్తులను కలుసుకునే అదృష్టం నాకు లభించిన ప్రతిసారీ, మన గురుదేవులు ఈ గ్రంథం ద్వారా ఎంతోమంది జీవితాల్లోకి తీసుకువచ్చిన శక్తి, మరియు ఆ పరిచయం తర్వాత మనం పొందిన నిరంతర ప్రేరణ ద్వారా మరియు దైవ సన్నిధి నుండి ప్రవహించిన ఉపదేశాల ద్వారా— వేలాది పేజీల రచనలు, ప్రసంగాలు, మరియు గురుదేవుల ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. పాఠాల ద్వారా అందించబడ్డ క్రియాయోగ ధ్యాన శాస్త్రం యొక్క విముక్తి పద్ధతులతో నేను మరల ముగ్ధుడయ్యాను.దీన్ని వీక్షించాలంటే, క్రియాయోగ మార్గంలోని చిత్తశుద్ధి గల భక్తుల ముఖ, నయనాలను మాత్రం గమనిస్తే చాలు — ధ్యానాన్ని అభ్యసించే వారు; బోధనలను కేవలం తాత్విక లేదా స్ఫూర్తిదాయకమైన విధానానికి అతీతంగా, మరి వాస్తవానికి భగవంతుని గురించి తెలుసుకోవడం కోసం ఆయన ప్రసాదించిన వాటిని రోజువారీ క్రమశిక్షణతో అభ్యాసం చేసే వారి, ఒక దైనందిన సాధన. అంతర్గత కాంతితో మీ ముఖ, నయనాలు ప్రకాశిస్తాయి. అదే ఈ క్రియాయోగ శాస్త్రం యొక్క శక్తి. మనకు పరమాత్ముని అనుసంధానంతో గురుదేవులు మనకు ఎంతటి పెన్నిధి, ఎంతటి జీవిత భాగ్యము మరియు శక్తి యొక్క మూలాన్ని, పునరుద్ధరణను ప్రసాదించారు!

ఇక్కడ పరమహంసగారి అమెరికా ఆశ్రమాలలో, మేము త్వరలో జాతీయ కృతజ్ఞతల సమర్పణ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాము. మన గురుదేవులు ఈ ఆచారం వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని ప్రశంసించారు, ప్రత్యేకించి మన జీవితంలో విశదమైన శుభాలను కృతజ్ఞతతో స్వీకరిస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలపడానికి సమయాన్ని వెచ్చించే ఆచారం. సృష్టికర్తతో వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోని వారికి అనంతమైన పరమాత్ముడు అజ్ఞాత౦గానూ, నిగూఢంగానూ ఉంటాడు; కానీ భగవంతుని ఉనికిని – ప్రత్యేక సెలవు దినాలలో మాత్రమే కాకుండా, ప్రతి రోజూ, ప్రతి సంవత్సరం నిరంతర భక్తి ప్రపత్తిలతో అవగాహనతో సాధన చేసేవారికి – ఆ ప్రియతముడు రక్షణ, మార్గదర్శకత్వం, ప్రేమ మరియు ప్రేరణల ప్రత్యక్ష దాత అవుతాడు, సాటిలేనిదిగా అదే మన ఆత్మలను అమోఘముగా పోషిస్తుంది.

కొన్నేళ్ళ క్రిందట, మన దివంగత పూజ్య సంఘమాత, శ్రీ దయామాత, కృతజ్ఞతల సమర్పణ సందర్భంగా పరమహంస యోగానందుల అనుచరులను ఉద్దేశించి ఈ సందేశం ఇచ్చారు. ముఖ్యంగా ఈ సందర్భానికి ఆ సందేశం సార్ధకత మీరు గ్రహిస్తారని భావిస్తున్నాను:

“మనందరి సృష్టికర్త మరియు పరిరక్షకుడిని సంస్మరించుకోవడానికి అంకితమైన ఈ రోజున, తరచూ కల్లోలభరితమ్మైన బాహ్యజీవనం క్రింద మన దివ్య పిత, జగన్మాత, స్నేహితుడి యొక్క శాశ్వతమైన, సురక్షిత హామీని, మీరు పునరావిష్కరింపచేసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ ఐహిక నాటకపు నిరంతరం మారు దృశ్యాలు మరియు ఆయన సృష్టి యొక్క మిరుమిట్లు గొలిపే వైవిధ్యం వెనుక దేవుడు తన సర్వవ్యాకత మరియు సర్వశక్తిని మరుగు పరిచాడు. అయినప్పటికీ, ఆయన మన చైతన్యం యొక్క తలుపును ఎప్పుడూ తడుతూ ఉంటాడు. మన ఆత్మలలో అచంచలమైన ఆయన సన్నిధికాక, కష్టాలు మరియు విపత్సమయాల్లో దృఢంగా ఉండాలనే విశ్వాసం మరియు ధైర్యాన్ని మనలో పురికొల్పేది ఏది? ఆయన కరుణామయ ప్రేమ మనలో గుసగుసలాడకపోతే, అవసరమైన వారికి మన వద్ద ఉన్నదాన్ని పంచుకోవాలనే కోరికను మనలో ఎవరు రేకెత్తిస్తారు? సూర్యాస్తమయం యొక్క గొప్పతనానికి మన హృదయాలు ఎందుకు ఉల్లాసమౌతాయి లేదా శరదృతుపు ఆకు అందమైన వర్ణం మరియు సంక్లిష్టమైన వివరాలను చూసి ఎందుకు కదిలి౦చబడతాయి? ఈ లోకంలో ఉత్తేజపరిచే, స్ఫూర్తిదాయకమైన వాటన్నింటిలో మన ఆత్మలు వీక్షించేది ఆయన సౌందర్యమే. మనం ప్రతి పవిత్ర భావనను, ప్రతి ఉదాత్తమైన చర్యను, పొందే ప్రతీ మేలును వాటి మూలానికి వెళ్ళినప్పుడు, మనం ఆయన దాగివున్న స్థానము కనుగొంటాము.

“స్మరణ అనే సరళమైన అభ్యాసం ద్వారా,ఆయన సుస్థిర ప్రేమను మరియు రక్షణ యొక్క నిరంతర ఆశీర్వాదంలో మీరు మీ చైతన్యాన్ని సంధానం చేయవచ్చు.”

ప్రియతములారా, మనలో లెక్కకు రాని వేలాది మందికి ఒక యోగి ఆత్మకథ ద్వారా వాస్తవరూపడైన భగవంతుడు — ప్రపంచానికి దూతగా నిలిచిన ఈ పుస్తకంలోని ఆశీర్వాద పుటలను మనం తిరిగి సందర్శించిన ప్రతిసారీ, మరి ప్రత్యేకించి మన క్రియాయోగ శాస్త్ర సాధనాభ్యాసంలో, మనలో ప్రేమ మరియు పరివర్తన ఉనికిని తాజాగా పునరుద్ధరించుకునే భగవంతుడు — ఇప్పుడు మరియు ఎల్లప్పుడూ, మీకు వెలుగును, ఆనందం, మరియు దివ్య వారసునిగా మీ స్వీయ దివ్యత్వం యొక్క అభయమును ప్రసాదించుగాక.

భగవంతుని మరియు గురుదేవుల నిరంతర ఆశీస్సులు,

స్వామి చిదానంద గిరి

ఇతరులతో పంచుకోండి