పరమహంస యోగానందగారి ఆశ్రమాల నుండి జన్మాష్టమి సందేశం

8 ఆగస్టు, 2022

ప్రియతములారా,

ప్రతి సంవత్సరం జన్మాష్టమినాడు, భగవాన్ శ్రీ కృష్ణుని జయంతిని మనం ఆనందంగా జరుపుకుంటాము. ఈ పవిత్ర సమయంలో మన ధ్యానాలలోను మరియు భక్తి స్మరణలలో, ఆయన సజీవ సాన్నిధ్యాన్ని మరియు అనంతమైన ప్రేమను స్వీకరించేందుకు సిద్ధంగా ఉందాము. ప్రత్యేకంగా యుగయుగాలకు దైవం యొక్క సంపూర్ణ అవతారముగా, ఆత్మ యొక్క సర్వవ్యాపక ఏకత్వంలో, ఆయన మనకు మరియు ప్రపంచానికి శాశ్వతంగా అందుబాటులో ఉంటాడు — ఈ రోజున అత్యంత అవసరమైన అపరిమిత అనుగ్రహాన్ని మరియు స్వస్థత చేకూర్చే ఆశీస్సులను మనపై కురిపించడానికి సంతోషంతో సిద్ధంగా ఉన్నాడు.

భగవాన్ శ్రీకృష్ణుడు జీవించే అనేక మార్గాలలో పవిత్రమైన భగవద్గీత ద్వారా ఒకటి — మరియు ఎక్కడా లేని విధంగా మన పరమహంస యోగానందగారు తెలియజేసిన దాని ఆత్మ మేల్కొలుపు జ్ఞానంలో మరింత స్పష్టముగా. కృష్ణుడు మరియు ఆయన శిష్యుడైన అర్జునుడి మధ్య జరిగిన ఈ పవిత్ర సంభాషణ పేజీలను మనము ధ్యానము చేసిన తరువాత మరియు భక్తితో మనల్ని మనం కేంద్రీకరించుకున్న తరువాత తెరిచి కొంచెమైనా చదివితే, మన చైతన్యాన్ని విస్తరింపజేసే సత్యం యొక్క ప్రకంపనా ప్రవాహాన్ని అనుభవిస్తాము. తిరిగి పరమాత్మ వైపు చేసే ప్రయాణంలో అది మనల్ని ఆశీర్వదించి సుసంపన్నం చేస్తుంది. ఈ విధంగా గ్రంథంలో ఉన్న ఆయన సాన్నిధ్యాన్ని ధ్యానించడం ద్వారా, అర్జునుడిని ఆయన ఉద్ధరించి, మద్దతు ఇచ్చినట్లే, మన స్వంత దైనందిన కురుక్షేత్ర యుద్ధభూమిలో, శ్రీకృష్ణుడిలో మూర్తీభవించిన దివ్యశక్తిని, ఉద్ధరించేతత్వాన్ని మరియు మద్దతును మన గొప్ప లక్ష్యమైన ఆత్మ విముక్తిని పొందేవరకు అనుభూతి చెందగలము.

ఈ ప్రపంచాన్ని రక్షించి, మార్గనిర్దేశం చేసే భగవంతునితో మరియు మహాత్ములతో సజీవ సంబంధాన్ని కొనసాగించడానికి, క్రమం తప్పకుండా హృదయపూర్వకంగా మరియు గాఢంగా ధ్యానంలో నిమగ్నమవడమనేది అత్యంత ప్రాముఖ్యమైనది, వారి ప్రేమపూర్వక సాన్నిధ్యంలో చైతన్యాన్ని సంపూర్ణంగా లీనం చేయడం. అప్పుడు, ఆ పవిత్ర లోతుల్లో, ప్రతి పరధ్యానం నుండి విముక్తి పొంది — మనకు ఇష్టమైన రూపంలో — మన అత్యున్నత ప్రేమ, శరణాగతి, మరియు భక్తిని భగవంతునికి సమర్పించగలము. అటువంటి హృదయపూర్వకమైన ఆత్మ పిలుపుకు, అనంతుడైన భగవంతుడు తప్పకుండా, వ్యక్తిగతంగా స్పందిస్తాడు.

అచంచలమైన దృఢనిశ్చయం మరియు ప్రేమతో, మీ వ్యక్తిగత జీవితంలోని అద్వితీయ మధుర గీతం ఖగోళంలో కలిసిపోయేవరకు యోగప్రభువైన శ్రీకృష్ణుడు మరియు ఇతర మహాత్ముల జ్ఞానం మరియు ధ్యాన బోధనలను మీరు అనుసరించుగాక.

జై శ్రీ కృష్ణా! జై గురు!

స్వామి చిదానంద గిరి

ఇతరులతో పంచుకోండి