స్వామి చిదానంద గిరి గారి క్రిస్మస్ సందేశం 2019

7 డిసెంబరు, 2019

ప్రియతమ,

మీకు మరియు శ్రీ పరమహంస యోగానంద యొక్క ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక కుటుంబానికి మరియు స్నేహితులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు! ఈ సంతోష సమయంలో దివ్య రాజ్యాల నుండి అసాధారణమైన తేజస్సుతో ప్రకాశించే క్రీస్తు ప్రేమ యొక్క శాంతి నొసగే, సమన్వయ కాంతిని మీ స్వీకార హృదయాలలో అనుభూతి చెందాలని నేను ప్రార్థిస్తున్నాను.

అనంతమైన ఆ క్రీస్తు చైతన్యం (కూటస్థ చైతన్యం) – సృష్టిలో పరమాత్ముని ద్వారా వ్యక్తీకరించబడిన ఏకీకృత మేధో ప్రయోజనం – అన్ని జీవులు, దేశాలు, జాతులు మరియు విశ్వాసాలను ఒకే కుటుంబంగా ఆలింగనం చేస్తూంది, భగవంతునిచే అందరూ సమానంగా ప్రేమించబడ్డారు. ఈ మాయా ప్రపంచంలో మనల్ని విభజించేలా ఏవైనా తేడాలు కనిపించినా, అవి పైపైవే నని గుర్తుంచుకోవడానికి వ్యవధిని వెచ్చిద్దాం. దేవుని పిల్లలుగా మనం పంచుకునే బంధుత్వం చాలా లోతైనది. “భూమిపై శాంతి మరియు అందరిపట్లా సద్భావన” అనే విశ్వజనీన క్రిస్మస్ సందేశంతో మన హృదయాలు పరిణితి చెందాలి. అదే ఏసు తన జీవితంలో వ్యక్తపరచిన సర్వ సహిత స్ఫూర్తి మరియు భేషరతు ప్రేమ; అంతేకాదు అది మన ప్రతి ఒక్కరిలోనూ తిరిగి ఉదయించవచ్చు.

ఏసుక్రీస్తు సమస్యాత్మక జీవన పరిస్థితుల్లో అవతరించి, ద్వేషం యొక్క విధ్వంసం కంటే ప్రేమ, అవగాహన, క్షమ మరియు కరుణ యొక్క శక్తి చాలా గొప్పదని, ఎంతో శాశ్వతమైనదని ప్రపంచానికి నిరూపించాడు. ఆయన ఉదాహరణ నుండి ధైర్యం పొందండి అంతేకాదు ప్రతి మంచి ఆలోచన మరియు చర్యతో మీరు కూడా దేవుని ప్రేమను ఈ ప్రపంచంలోకి తీసుకువస్తున్నారని తెలుసుకోండి. ఆయన సర్వోన్నతంగా ప్రస్పుటపరిచిన ఆదేశంను అనుసరించి జీవించడానికి మనం ఎక్కువగా పాటుపడినప్పుడు మన సమగ్ర అస్తిత్వంలో అద్భుతమైన విముక్తి, చేతన-విస్తరించే పరివర్తన జరుగుతుంది: “నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో, మరియు పూర్ణ శక్తితో దేవుణ్ణి; మరియు నీవలె నీ పొరుగువారిని ప్రేమించు.”

మన హృదయాలను మరియు చర్యలను ఆధ్యాత్మిక చైతన్యం యొక్క ప్రేమ మరియు కాంతితో ఎలా నింపాలి? ఒక పద్ధతి ఏమిటంటే, లోతైన మరియు సుదీర్ఘ మైన దైవిక సంధానం కోసం సమయాన్ని, ముఖ్యంగా క్రిస్మస్ సమయంలో, కేటాయించాలి.  యోగదా సత్సంగ ఆశ్రమాలు/కేంద్రాలు/మండలిలు నిర్వహించే రోజంతా క్రిస్మస్ ధ్యానాలలో ఏదైనా ఒకదానిలో చేరమని నేను మిమ్మల్ని కోరుతున్నాను – లేదా మీ స్వంత నివాసంలో ఒకటి ఏర్పాటు చేసుకోండి. అంతర్గత నిశ్శబ్దం యొక్క పవిత్ర స్థానంలో మనం అనంతుని ప్రేమ మూలాల్ని తాకినప్పుడు, మన గురుదేవుల యొక్క మాటలలోని సత్యాన్ని మనం అనుభూతి చెందుతాము: “పరిశుద్ధత, శాంతి, ఊహకు మించిన ఆనందం, మీ ఆత్మలో ప్రకాశిస్తూ నృత్యం చేస్తాయి. మీ అంతర్గత శాంతిని అద్భుతమైన, అనంతమైన శాంతిలో ఏకం చేయండి. మీరు ఆ నిత్య తేజస్సులో లీనమయ్యారు. మీ పూర్తి అస్తిత్వం క్రీస్తు యొక్క సర్వవ్యాపకమైన ఆశీర్వాద ప్రకాశంతో నిండి ఉంది.  మీ శరీరం మరియు శ్వాసకు మించి, క్రీస్తు శాంతి ఆనందాల నిత్య-జీవన కాంతి మీరు.

విశ్వవ్యాప్త క్రీస్తు యొక్క ప్రేమ మరియు శాంతి మీ జీవితాన్ని నింపుగాక – మిమ్మల్ని, మీ ప్రియమైన వారిని మరియు మీరు ప్రార్థించే ప్రతి ఒక్కరినీ – ఈ క్రిస్మస్ మరియు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ.

దివ్య స్నేహంలో

స్వామి చిందనంద గిరి

ఇతరులతో పంచుకోండి