వై.ఎస్.ఎస్. పాఠాల తెలుగు సంచిక కోసం నమోదు ఇప్పుడు ప్రారంభమయినది!

3 డిసెంబర్, 2022

ఆత్మ-సాక్షాత్కారానికి సంబంధించిన యోగదా సత్సంగ పాఠాలు ఇప్పుడు తెలుగులో అందుబాటులో ఉన్నాయని మరియు ఈ తెలుగు ప్రాథమిక పాఠాల శ్రేణికి నమోదు ఇప్పుడు ప్రారంభమయినదని తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము.

పరిచయ-పాఠం-తెలుగు-చిత్రం

బోధనలలో అత్యంత ప్రధానమైన యోగదా సత్సంగ పాఠాలను ప్రపంచ నాగరికత కోసం ప్రపంచానికి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక దైవవిధిగా తీసుకురావడానికి తాను నియుక్తులైనట్లు పరమహంస యోగానందగారు భావించారు.

డిసెంబర్ 3 నుండి, మీరు మన డివోటీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ పాఠాల కోసం సభ్యత్వాన్ని పొందవచ్చు. మీకు డివోటీ పోర్టల్ ఖాతా లేనట్లయితే, దయచేసి ఇప్పుడే ఖాతాను ఏర్పాటు చేసుకోండి. పాఠాల గురించి మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఏవైనా సందేహాల కోసం, దయచేసి సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 9:00 నుండి సాయంత్రం 4.30 వరకు ఫోన్ (0651) 6655 555 ద్వారా వై.ఎస్.ఎస్. సహాయ కేంద్రాన్ని సంప్రదించండి (భారత కాలమానం ప్రకారం), లేదా ఈ-మెయిల్ చేయండి: [email protected].

ఇతర భారతీయ భాషలలో – హిందీ మరియు బెంగాలీలో అనువాదాలు జరుగుతున్నాయి. పరమహంస యోగానందగారి బోధనల ప్రకాశాన్ని వీలైనంత ఎక్కువ మంది సాధకులకు అందుబాటులో ఉంచేలా సమీప భవిష్యత్తులో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని మేము ఆశిస్తున్నాము.

ఇతరులతో పంచుకోండి