“ధ్యానం ఎలా చేయాలో, ప్రశాంతంగా ఎలా ఉండాలో నాకు చివరకు తెలిసింది.”
“[మా అబ్బాయి] వారాంతాల కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూసేవాడు, సెషన్లలో చాలా శ్రద్ధగా పాల్గొనేవాడు. అతనిలో కొన్ని మార్పులను [మేము] గమనించాము, ముఖ్యంగా ధ్యానం మరియు ప్రార్థనలలో అతని నిమగ్నత.”
ఆన్లైన్ టీన్ రీచార్జ్ స్టేషన్ (OTRS) — వర్షాకాల సమావేశం, వై.ఎస్.ఎస్. యువజన సేవా విభాగం ఆధ్వర్యంలో జూలై 18 నుండి ఆగస్టు 16, 2026 మధ్య ఐదు వారాంతాల పాటు నిర్వహించబడింది.
భారతదేశం నలుమూలల నుండి 140 మందికి పైగా యుక్తవయస్కులు శని, ఆదివారాల్లో జరిగిన పది వారాంతపు సమావేశాలలో పాల్గొన్నారు. వారు కొత్త విద్యా సంవత్సరాన్ని ఆధ్యాత్మిక ఉత్సాహంతో ప్రారంభించేందుకు ఈ సమావేశాలు సహాయపడ్డాయి. అనుభవజ్ఞులైన దోహదకారులచే (ఫసిలిటేటర్లు) నిర్వహించబడిన ప్రతి సమావేశంలో, ఒక ముఖ్యమైన అంశంపై పదిహేను నిమిషాల పారస్పరిక బోధన మరియు ముప్పై నిమిషాల నిర్దేశిత ధ్యానం, దివ్యసంకల్పం యొక్క అభ్యాసం ఉండేవి.
జీవించడం-ఎలా తరగతులు
వినోద కార్యకలాపాలు, కథల ద్వారా సందేశాలను అందించే విధానం, మరియు రోజువారీ జీవితంలో ఉపయోగించగల ఉపయోగకరమైన పద్ధతులు నాకు నచ్చాయి.
— ఎస్.ఏ., యుక్తవయస్కులు, 15 ఏళ్ళు, కర్ణాటక
పరీక్షలు మరియు స్నేహితుల ఒత్తిడిని, అలాగే పాఠ్యేతర అంశాల యొక్క అనేక ఆవశ్యకతలను ఎదుర్కొంటున్న యుక్తవయస్కులు, ఊపిరి సలపనీయకుండా ఉండే వారి దైనందిన కార్యకలాపాలను నిర్వర్తిస్తూనే, అదే సమయంలో వారి ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడానికి కూడా సహాయపడ్డ ఈ జీవించడం-ఎలా తరగతులను స్వాగతించారు.
చర్చించబడిన విషయాలు:
- ఏకాగ్రత
- సంకల్పశక్తి
- స్నేహం
- నిర్భయత్వం
- విశ్వాసం, మరియు
- భక్తి
40 మందికి పైగా శిక్షణ పొందిన దోహదకారులు (ఫెసిలిటేటర్లు) మరియు అషర్లు ఈ కార్యక్రమంలో సేవలందించారు. ఒక యోగి ఆత్మకథ మరియు మేజ్దా పుస్తకాల నుండి తీసుకున్న కథలు ముఖ్యంగా ప్రశంసించబడ్డాయి, ఎందుకంటే ఇవి ఆధ్యాత్మిక సూత్రాలను యుక్తవయస్కుల రోజువారీ అనుభవాలకు దగ్గరగా తీసుకురావడంలో సహాయపడ్డాయి.
చురుకైన సాహచర్యం
ఆన్లైన్ ఆకృతి, యుక్తవయస్కులు చురుకైన పరస్పర-స్పందనల ద్వారా నేర్చుకునే మాధ్యమాన్ని అందించింది. పాల్గొన్న వారు సామూహిక చర్చలు, అభిప్రాయ సేకరణ (పోల్స్) మరియు సంభాషణ సందేశాలను (చాట్ మెసేజీలు) విరివిగా ఉపయోగించారు.
ప్రత్యేక వై.ఎస్.ఎస్. సన్యాసుల సమావేశం
OTRS యొక్క మరొక ప్రత్యేక ఆకర్షణ, స్వామి శంకరానందతో జరిగిన ప్రత్యేక సమావేశం – దీనిలో ఆయన బుద్ధుని కథను దృశ్య కథనం ద్వారా పంచుకున్నారు. నాలుగు సాధారణ దృశ్యాలు (వృద్ధాప్యం, అనారోగ్యం, మరణం మరియు ఒక ప్రశాంతమైన సన్యాసి) ఆ యువ రాజకుమారుడిని సత్యాన్వేషణ వైపు ఎలా నడిపించాయో, మరియు బోధి వృక్షం కింద కూర్చుని, జ్ఞానోదయం పొందే వరకు ధ్యానం నుండి లేవనని ఆయన ఎలా ప్రతిజ్ఞ చేశారో యుక్తవయస్కులు తెలుసుకున్నారు; చిన్నపాటి రోజువారీ ప్రయత్నాలలో సైతం స్థిరమైన పట్టుదలతో ఉండడం సాధకుడిని ఎలా ముందుకు నడిపిస్తుందనడానికి ఇది ఒక గుర్తు.
అనుభవాలు
“నేను ప్రశాంతతను అనుభూతి చెందేలా చేసిన శ్వాసాభ్యాసాల గురించి... కొన్ని శారీరక వ్యాయామాలు నా కండరాలను సేదతీర్చి, నా మనస్సును మరింత స్పష్టంగా చేసిన శారీరక వ్యాయామాలను తెలుసుకున్నాను.”
"సమావేశం ఎంతో ప్రశాంతంగా మరియు సానుకూలంగా అనిపించడం నాకు నచ్చింది. ఇది నేను ఆత్మపరిశీలన చేసుకోవడంలో సహాయపడింది."
“సమావేశాలకు హాజరు కావడం గొప్ప అనుభవం. నాకు ప్రశాంతంగాను, తక్కువ ఒత్తిడిగాను, మరింత శక్తివంతంగాను ఉన్నట్లు అనిపించింది. ధ్యానం ఎలా చేయాలో కూడా నేను నేర్చుకున్నాను.”
“నా బిడ్డ యొక్క వైఖరి బాధ్యతల వైపు మరింతగా మళ్ళింది. అతను ఉల్లాసంగా మరియు శ్రద్ధగా ఉంటున్నాడు. మాతో ప్రతీదీ విప్పి మాట్లాడుతున్నాడు మరియు తక్కువ ఒత్తిడితో ఉంటున్నాడు.”
తల్లిదండ్రులు మరియు టీనేజర్లు ఆన్లైన్ సమావేశాల పట్ల బలమైన ఆసక్తిని వ్యక్తం చేసి, వాటిని కొనసాగించాలని అభ్యర్థించారు. ఇకపై, OTRS యువజనసేవా విభాగం యొక్క ద్వైవార్షిక కార్యక్రమంగా మారుతుంది –వసంత మరియు వర్షాకాల సమావేశాలతో నిర్వహించబడుతుంది.
తరువాతి ఆన్లైన్ యుక్తవయస్కుల సత్సంగం (OTS) యొక్క ప్రకటన
వసంత మరియు వర్షాకాల సమావేశాలలో అందించే OTRS తోపాటు యుక్తవయస్కులు ప్రతి సంవత్సరం వేసవి మరియు శీతాకాల సమావేశాలలో అందించే ఆన్లైన్ టీన్ సత్సంగము (OTS) కు కూడా హాజరు కావచ్చు. యుక్తవయస్కుల అభ్యాసం మరియు ఆన్లైన్ స్నేహం, రెండూ కూడా కొనసాగేటట్లుగా ఈ కార్యక్రమాలు ప్రణాళిక చేయబడ్డాయి.
OTS యొక్క శీతాకాల సమావేశం నవంబర్ 2026 నుండి జనవరి 2027 వరకు నిర్వహించబడుతుంది; ఇందులో పరమహంస యోగానందగారి జీవించడం-ఎలా బోధనలు మరింత లోతుగా పరిశోధించబడతాయి.
ఆన్లైన్ టీన్ సత్సంగ్ — శీతాకాల సమావేశం 2026–27 లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు మరియు యుక్తవయస్కులు క్రింది ఫారం ద్వారా తమ ఆసక్తిని నమోదు చేసుకోవచ్చు:
పిల్లలు మరియు యుక్తవయస్కుల కోసం ఇతర యువజన సేవా కార్యక్రమాల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి [email protected] కు వ్రాయండి.
యుక్తవయస్కుల శిబిరాలు మరియు ఆదివారం సత్సంగాలు
వై.ఎస్.ఎస్. యువజనసేవా విభాగం మే-జూన్ 2026లో సోలన్లోని శూలిని విశ్వవిద్యాలయంలో బాలలు మరియు యుక్తవయస్కుల (టీనేజర్ల) కోసం వేసవి శిబిరాన్ని నిర్వహించింది. కొన్ని వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళలలో ప్రత్యక్షంగా యుక్తవయస్కుల కార్యక్రమాలను కూడా ఇది నిర్వహిస్తుంది.
శూలిని విశ్వవిద్యాలయం, సోలన్ లో జరిగిన 2026 వేసవి శిబిరం గురించి చదవండి
దయచేసి గమనించండి: పిల్లలు మరియు యుక్తవయస్కుల కోసం తదుపరి వై.ఎస్.ఎస్. శిబిరం, సోలన్, శూలినీ విశ్వవిద్యాలయంలో మే 23–29, 2027 తేదీల్లో నిర్వహించేందుకు తాత్కాలికంగా నిర్ణయించబడింది.




















