శ్రీ స్వామి శాంతానంద గిరి జ్ఞాపకార్థం (1932–2023)

05 జనవరి, 2023

60 సంవత్సరాలకు పైగా పరమహంస యోగానందగారి సన్యాస శిష్యులైన మన పూజ్య స్వామి శ్రీ శాంతానంద గిరి, లాస్ ఏంజిలిస్ లోని సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో బుధవారం, జనవరి 4 (పసిఫిక్ కాలమానం ప్రకారం), 2023 నాడు ప్రశాంతంగా పరమపదించారు.

1932లో యునైటెడ్ స్టేట్స్‌లో జన్మించిన ఆయన, 1963 నుండి 2011 వరకు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు సేవలందించి ఇక్కడే నివసించారు. సంస్థ యొక్క అసంఖ్యాకమైన సభ్యులు ఆయన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకుంటారు, ఆయన ఎన్నో సంవత్సరాలపాటు సంస్థ యొక్క బోర్డు డైరెక్టర్లలో సభ్యులుగా మరియు ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు.

మన ప్రియమైన స్వామి శాంతానందగారు దివ్య కాంతి మరియు ఆనందం యొక్క పావనమైన లోకాలలోకి ప్రవేశిస్తున్న ఈ సమయంలో దయచేసి మాతో కలిసి ప్రార్థించండి. ఆదర్శప్రాయమైన దివ్య సేవ మరియు సాధనతో కూడిన ఆయన జీవితానికి, ఆయన జ్ఞానానికి, భగవంతుడు మరియు గురువు పట్ల ఆయన భక్తికి మరియు ఆయన మార్గంలో తారసపడిన వారందరికీ ఆనందంతో ఆయన ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన ప్రేరణకు మన ప్రేమ మరియు కృతజ్ఞతలను ఆయనకు పంపుదాం.

మన ప్రియతమ శ్రీ స్వామి శాంతానంద గిరి గారి స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గౌరవించే స్మారక సేవా కార్యక్రమం జనవరి 26, గురువారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం) వై.ఎస్ఎస్. సన్యాసులచే నిర్వహించబడుతుంది. యోగదా సత్సంగ శాఖా మఠం, రాంచీ నుండి ప్రత్యక్ష ప్రసారం చేయబడే ఈ స్మారక సేవలో పాల్గొనడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

ఇతరులతో షేర్ చేయండి