భగవంతుడు మిమ్మల్ని సృష్టించినట్లుగా, ప్రశాంతత మరియు ఆనందం యొక్క దివ్య ప్రతిరూపాన్ని వదులుకోకుండా ఈ ప్రపంచంలో జీవించే కళను నేర్చుకోవడం — ఇదే మీరు పరిష్కరించాల్సిన జీవిత రహస్యం. యోగా ఇదే బోధిస్తుంది.
— పరమహంస యోగానంద
Solving the Mystery of Life అనే ఈ వై.ఎస్.ఎస్. ప్రచురణ, రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోడం మీద పరమహంస యోగానందగారి సనాతన విజ్ఞానంపై ప్రసంగాలు మరియు వ్యాసాల కూర్పు శ్రేణిలో నాలుగవది. ఇది నవంబరులో విడుదలవుతుంది. ఈ రోజే మీ కాపీని ముందస్తుగా ఆర్డర్ చేసేందుకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

దీని ముందువాటిలా (మానవుడి నిత్యాన్వేషణ, దివ్య ప్రణయం, మరియు ఆత్మ సాక్షాత్కారం వైపు ప్రయాణం), యోగా యొక్క సార్వత్రిక మార్గంపైన, మరియు విజయవంతంగా, గొప్ప అవగాహనతో ఎలా జీవించాలి అనే అంశాలపై తమ తరగతులు మరియు ప్రసంగాలలో పరమహంస యోగానందగారు ఆశువుగా పంచుకొన్న వ్యక్తిగత సలహాలను, జ్ఞానప్రదమైన దృక్పథాలను ఈ నూతన సంకలనం మీకు అందిస్తుంది.
మూడు దశాబ్దాల కాలంలో యిచ్చిన సుమారు 40 ప్రసంగాలను కలిగియున్న Solving the Mystery of Life, సమాధానాలు లేనట్లుగా అనిపించే ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు అందిస్తుంది: మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం? మన విధి ఏమిటి, మరియు మనం దాన్ని ఎలా నియంత్రించగలం? భగవంతుడంటే ఏమిటి, మరియు భగవంతుడు మంచితనమయితే ఈ ప్రపంచంలో చెడు ఎందుకు ఉంది? మనకు ఎలాంటి సవాళ్ళు ఎదురైనా, గొప్ప ఆనందం మరియు భద్రతను ఎలా అనుభూతి చెందగలం?
జీవిత రహస్యాన్ని తాను స్వయంగా పరిష్కరించిన వ్యక్తియైన పరమహంస యోగానందగారు, స్వభావసిద్ధంగా మనం అనంత సామర్థ్యంతో కూడిన అమర జీవులమని మనకు గుర్తుచేస్తూ, విశ్వంలో పనిచేసే దివ్యనియమాలను మనకు వివరిస్తారు.
పరమహంసగారి బోధనలకు మీరు క్రొత్తవారైనా లేక దీర్ఘకాలిక అనుచరులైనా, ఈ పుస్తకం మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రకాశవంతం చేసే జ్ఞాననిధి అవుతుంది.
Solving the Mystery of Life హార్డ్ బ్యాక్, పేపర్ బ్యాక్, మరియు ఈ-పుస్తకం రూపంలో లభ్యమవుతుంది.