The Spiritual Expression of Friendship — త్వరలో విడుదల కానుంది

18 నవంబరు, 2025

స్నేహం: అన్ని సంబంధాలకు పునాది

మీ ఆత్మ యొక్క గొప్ప లక్షణాలను సాకారం చేసుకునే ప్రయాణంలో పరమహంస యోగానంద గారు మిమ్మల్ని మార్గనిర్దేశం చేస్తుండగా, అందరికీ స్నేహితుడిగా ఉండటం వల్ల కలిగే ఆనందాన్ని The Spiritual Expression of Friendship లో కనుగొనండి.

అందంగా చిత్రించబడిన హార్డ్ కవర్ బహుమతి ముద్రణ జనవరిలో లభిస్తుంది

మీ సంబంధాల స్వరూపాలను మార్చుకోండి

నిజమైన స్నేహం యొక్క స్ఫూర్తి ప్రతి సంబంధాన్ని ప్రేమ, అభివృద్ధి మరియు దివ్యమైన ఐక్యతల అనుభవంగా ఎలా మార్చగలదో ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానందగారు చూపిస్తారు.

రచయిత గురించి

ఒక గొప్ప రచయిత మరియు ఉపన్యాసకులైన యోగానంద గారు, ధ్యానం మరియు సమతుల్య జీవనంపై విస్తారంగా రచనలు చేశారు. అత్యంత ప్రజాదరణ పొందిన తమ ఆధ్యాత్మిక మహాకావ్యం ఒక యోగి ఆత్మకథ, మరియు ఇతర ప్రభావవంతమైన రచనల ద్వారా, యోగానందగారి జీవితం మరియు బోధనలు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక అన్వేషకులకు ప్రేరణనిస్తూనే ఉన్నాయి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆచరణాత్మక మార్గదర్శకత్వంతో మిళితం చేసే యోగానందగారి సామర్థ్యాన్ని The Spiritual Expression of Friendship ప్రముఖంగా ప్రకటిస్తుంది.

పరమహంస యోగానందగారి జన్మోత్సవం 03

ఈ పుస్తకం గురించి

తమ సంబంధాలలో హృదయ-కేంద్రీకృత సంబంధాలను కోరుకునే వారికి The Spiritual Expression of Friendship మార్గదర్శక వెలుగునిస్తుంది. యోగానందగారు 1930లలో వ్రాసిన రచనల నుండి కూర్చబడిన ఈ పుస్తకం, స్నేహంలో సాధారణంగా అర్థంకాని ఆధ్యాత్మిక కోణాలను వెల్లడిస్తుంది. స్నేహాన్ని మనం దాని స్వచ్ఛమైన రూపంలో కొనసాగించినప్పుడు, అన్ని జీవులతోనూ ఒక ఐక్యతాపూర్వకమైన దివ్యబాంధవ్యాన్ని మనం అనుభవించగలగే ఉన్నత చైతన్యానికి మనల్ని తీసుకెళ్లే సామర్థ్యం స్నేహానికుందని యోగానందగారు విశదీకరించారు.

సమయోచితమైన ఐక్యతా సందేశం

మానవ చైతన్యం సర్వాన్నీ అనుసంధానించే అంతర్లీన సూత్రాన్ని అన్వేషించమని మరియు అందరితో బంధుత్వాన్ని అనుభవించమని యోగానందగారు మనల్ని ఆహ్వానిస్తున్నారు. నిస్వార్థ సేవ, దయ మరియు కరుణ వంటి దివ్యమైన స్నేహ సూత్రాలను ఆచరించడం ద్వారా మనం దేశం, జాతి మరియు మతం యొక్క విభజనలను అధిగమించి, అంతిమంగా మన నిజస్వభావమైన ఆత్మతో ఒకటవ్వగలము. నిజమైన స్నేహం అనేది ఆత్మ-సాక్షాత్కారానికి సార్వత్రిక మార్గంలోను మరియు ఆత్మలన్నిటిని ప్రేమలో ఏకం చేసే దివ్య ప్రణాళికలోను అంతర్భాగం.

2017_శరద్_సంగం2_రాంచీ_3450-సవరించు
ధ్యానం-హృదయం-మరియు-ఆత్మ-యొక్క-అన్యోన్యక్రియ

హృదయం మరియు ఆత్మ యొక్క అన్యోన్యక్రియ

కవిత్వం, వచనం, దివ్యసంకల్పాలు మరియు లోతైన ఆధ్యాత్మిక అన్వేషణల మిశ్రమమైన The Spiritual Expression of Friendship, గాఢాలోచన చేసే ప్రశాంతమైన సమయాలలో తోడుగా ఉంటుంది. ప్రతి పేజీ మిమ్మల్ని ఉద్ధరిస్తుంది, మీకు స్ఫూర్తినిస్తుంది మరియు సున్నితంగా మిమ్మల్ని మీ అంతరంగంలోకి ఆకర్షిస్తూ, మీతోను, ఇతరులతోను మరియు యోగానంద గారు “స్నేహితులందరి వెనుకా దాగి ఉన్న ఏకైక స్నేహితుడు” అని పిలిచే దైవంతోను అనుబంధానికి ద్వారం తెరుస్తుంది.

ఈ పుస్తకంలోని విషయాలు

మానవజాతితో మీ బంధుత్వాన్ని గ్రహించండి

నిజమైన స్నేహం యొక్క ముఖ్యాంశం — ఒకరికొకరు సేవ చేసుకోవడం

మీ పట్ల మరియు ఇతరుల పట్ల నిజాయితీగా ఉండండి

పుస్తకం నుండి ప్రేరణ

“స్నేహితుల మధ్య ఉండే సంబంధం మానవ ప్రేమలన్నిటిలోకి అత్యంత శ్రేష్టమైనది….మనం ప్రేమించిన వ్యక్తికి పరిపూర్ణత సిద్ధించాలని కోరడం, ఆ ఆత్మను తలుచుకోడంలో పరిశుద్ధానందాన్ని అనుభూతి పొందడం దైవప్రేమ. నిజమయిన స్నేహమయ ప్రేమ అదే.”

“స్నేహం ద్వారా శుద్ధి చేయబడిన హృదయం, ఐక్యతకు తెరచిన ద్వారాన్ని అందిస్తుంది. దాని ద్వారా మీరు ఇతర ఆత్మలను — మిమ్మల్ని ప్రేమించే వారిని, మిమ్మల్ని ప్రేమించని వారిని కూడా, ఆ సోదర ప్రేమాలయంలోకి ప్రవేశించమని ఆహ్వానిస్తుంది.”

“ప్రేమను అన్వేషించేవారు చాలా మంది ఉంటారు, కానీ ప్రేమ అంటే ఏమిటో లేదా దానిని ఎలా కనుగొనవచ్చో కొద్దిమందికే తెలుసు. ప్రేమ అనేది అనంత హృదయం నుండి మానవ ఆత్మలు మరియు అన్ని వస్తువుల మార్గాలలోకి ప్రవహించే ఆనందపు అదృశ్య జలాశయం. ఇతరుల నిజమైన సంతోషంలోని ఆనందమే ప్రేమ.”

“మీ పట్ల మరియు ఇతరుల పట్ల నిజాయితీగా ఉండండి, అప్పుడు మీరు దేవుని స్నేహాన్ని పొందుతారు. మీరు మీ ప్రేమను ఇతరులలో అనుభవించేలా చేసిన తర్వాత, అది అన్ని హృదయాలలో ప్రవహించే ఏకైక విశ్వప్రేమగా మారే వరకు విస్తరిస్తుంది.”

“రెండు ఆత్మల మధ్య నిజమైన స్నేహం ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక ప్రేమను మరియు దేవుని ప్రేమను వారు కలిపి కోరుకొనేటప్పుడు, వారి ఏకైక కోరిక ఒకరికొకరు సేవ చేసుకోవడమే అయినప్పుడు, వారి స్నేహం ఆత్మ వికాసాన్ని పెంపొందిస్తుంది.”

హృదయానికి హత్తుకునే పఠనం

అందరితోనూ ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన సంబంధాలను పెంపొందించుకోవడానికి స్పష్టమైన, ఆచరణాత్మక విధానాన్ని “The Spiritual Expression of Friendship” అందిస్తుంది. ప్రేరణ, అనుసంధానం లేదా ఆలోచనాత్మక బహుమతిని కోరుకునే పాఠకులకు ఇది సరియైనది; శాశ్వత మార్గదర్శియైన ఈ పుస్తకం ఉత్తేజకరమైన ఆలోచనలను అందిస్తుంది, మరియు ప్రతి అనుభవంలోనూ మనకు తోడుగా నడిచే ఏకైక మిత్రుడి — భగవంతుడి — దివ్యమైన ఉనికిని కూడా కలిపేలా స్నేహం గురించి మన అవగాహనను విస్తరింపజేస్తుంది.

ఇతరులతో పంచుకోండి