YSS

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. నూతన అధ్యక్షుడి ప్రకటన

2 సెప్టెంబరు, 2017

స్వామి చిదానంద - ప్రస్తుత వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యొక్క ఆధ్యాత్మిక అధ్యక్షులు.

స్వామి చిదానంద గిరి వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షుడిగా మరియు ఆధ్యాత్మిక అధిపతిగా ఎన్నికయ్యారు

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్.)కి స్వామి చిదానంద గిరి గారు అధ్యక్షుడిగా మరియు ఆధ్యాత్మిక అధిపతిగా ఎన్నికయ్యారనే వార్తను యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది, జనవరి 2011 నుండి గత నెలలో ఈ పదవిలో పనిచేసిన శ్రీ శ్రీ మృణాళినీమాతగారు పరమపదించిన అనంతరము ఎస్.ఆర్.ఎఫ్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ద్వారా ఏకగ్రీవ ఓటుతో ఆగష్టు 30, 2017 బుధవారం నాడు ఆయన నియామకం చేయబడింది.

దివంగత వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్ష్యురాలైన (సంఘమాత) శ్రీ శ్రీ దయామాత 2010లో పరమపదించడానికి ముందు, శ్రీ మృణాళినీమాత తదనంతర వారసునిగా స్వామి చిదానంద వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షునిగా మరియు ఆధ్యాత్మిక అధిపతిగా ఉండాలని శ్రీ మృణాళినీమాతతో తన సంకల్పాన్ని వ్యక్తం చేశారు. మృణాళినీమాతగారు ఆగస్టు 3, 2017న తాను పరమపదించడానికి కొన్ని నెలల ముందే దీనిని ధృవీకరించారు అలాగే శ్రీ దయామాత సిఫార్సుపై ఆమె తన సమ్మతిని డైరెక్టర్ల బోర్డుకు ధృవీకరించారు.

స్వామి చిదానందగారు నలభై సంవత్సరాలుగా సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్‌లో సన్యాసిగా, అలాగే గత ఎనిమిది సంవత్సరాలుగా వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. డైరెక్టర్ల బోర్డులో సభ్యుడుగానూ ఉన్నారు. దాదాపు ఆయన సన్యాస జీవితం ప్రారంభం నుండి, శ్రీ మృణాళినీమాతతో సన్నిహితంగా పనిచేశారు, ఆమె యొక్క గురు-సంధాన, జ్ఞానపూర్ణితమైన శిక్షణలో శ్రీ పరమహంస యోగానంద రచనల కూర్పు మరియు ప్రచురణ ఇంకా ఇతర వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ప్రచురణలలో ఆమెకు తోడ్పడ్డారు.

భగవంతుని మరియు ఎస్.ఆర్.ఎఫ్.ల సేవకు ఒక ప్రేరేపణ

1953లో మేరీల్యాండ్‌లోని ఏనాపోలిస్‌లో జన్మించిన స్వామి చిదానంద, 1970ల ప్రారంభంలో శాన్ డియాగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సోషియాలజీ మరియు ఫిలాసఫీ విద్యార్థిగా ఉన్నపుడు ఆయన శ్రీ పరమహంస యోగానంద బోధనలకు మరియు ఎన్సినీటస్ లోని సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ కి పరిచితమయ్యారు. సుదీర్ఘకాలంగా భారతదేశము యొక్క ఆధ్యాత్మికతపై ఉన్న ఆసక్తితో, ఆయన యూనివర్సిటీ క్యాంపుకు ఉత్తరాన ఉన్న ఎన్సినీటస్ లోని ఎస్.ఆర్.ఎఫ్. ఆశ్రమ కేంద్రాన్ని సందర్శించారు, ప్రక్కన ఉన్న తీరప్రాంత వాడలలో నివసిస్తున్న చాలా మంది విద్యార్థులకు ఇది ఒక సుపరిచితమైన మైలురాయి.

కొన్ని నెలల తరువాత, ఒక యోగి ఆత్మకథ యొక్క ప్రతిని ఆయన పొందడం జరిగింది అలా ఆ పుస్తక పేజీలలో నిమిడియున్న విశిష్ట జ్ఞానం ఇంకా దివ్య చేతనకు వెనువెంటనే ఆకర్షింపబడ్డారు. తన విశ్వవిద్యాలయం చివరి సంవత్సరంలో, ఆయన సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ పాఠాల కోసం నమోదు చేసుకున్నారు అలాగే ఎన్సినీటస్ ‌లోని ఎస్.ఆర్.ఎఫ్. సేవలకు హాజరుకావడం ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడ మంత్రి (భోదకుడు)గా ఉన్న స్వామి ఆనందమోయ్ యొక్క సూచనలు ద్వారా ఆయన చాలా ప్రేరణ పొందారు మరియు స్వామి ఆనందమోయ్ యొక్క వ్యక్తిగత సలహాల నుండి కూడా ప్రయోజనం పొందారు. పరమహంసగారి స్పందనలతో నిండిన ఆ పవిత్ర వాతావరణంలో—అక్కడ వసించే సన్యాసులు మరియు సన్యాసినులు జీవనంతో ఆయన గాఢంగా ప్రభావితమై, అప్పుడే తన జీవితాన్ని పూర్తిగా భగవంతుని అన్వేషణకు అంకితం చేయాలనీ మరియు శ్రీ పరమహంస యోగానంద కార్యాచరణ సేవలో ఆయన శిష్య సన్యాసిగా జీవితాన్ని గడపాలనే కోరిక జాగృతమయ్యింది.

స్వామి చిదానంద నవంబరు 19, 1977న ఎన్సినీటస్ ‌లోని సన్యాసుల యొక్క సన్యాస ప్రవేశార్ది (పోస్ట్‌లెంట్) ఆశ్రమంలోకి ప్రవేశించి, యువ సన్యాసులకు శిక్షణనిచ్చే, పావన నివాసిత సోదరుడు, శ్రీ స్వామి ప్రేమమోయ్ మార్గదర్శకత్వ ఆధ్వర్యంలో కఠినమైన మరియు ప్రేమపూర్వక శిక్షణలో ఏడాదిన్నరపాటు గడిపారు. ఈ యువ సన్యాసిని ఎస్‌.ఆర్‌.ఎఫ్. సంపాదకీయ విభాగంలోకి తీసుకోవాలని ముందుగా శ్రీ మృణాళినీమాతకు సూచన చేసింది స్వామి ప్రేమమోయ్ గారే. 1979 ఏప్రిల్లో, తన సన్యాస ప్రవేశార్ది శిక్షణను పూర్తి చేసుకొన్న తర్వాత, స్వామి చిదానంద మౌంట్ వాషింగ్టన్‌లోని ఎస్‌.ఆర్‌.ఎఫ్. అంతర్జాతీయ కేంద్ర కార్యాలయమునకు బదిలీ చేయబడ్డారు అలాగే సంపాదకీయ విభాగంలో ప్రచురణల పనికి వెంటనే నియమించబడ్డారు, శ్రీ మృణాళినీమాతా మరియు ఆమెకు సహ సంపాదక అధ్యక్ష్యురాలైన శ్రీ సహజామాత ఆధ్వర్యంలో ఆయన పనిచేశారు, వీరిరువురూ కూడా తన రచనలు మరియు ప్రసంగాల కూర్పు, భవిష్యత్తు ప్రచురణ కోసం గురుదేవుల వద్ద వ్యక్తిగత శిక్షణ పొందినవారు.

1996లో సహజామాత పరమపదించిన కొంతకాలానికే, స్వామి చిదానంద ఎస్.ఆర్.ఎఫ్./ వై.ఎస్.ఎస్. అంతర్జాతీయ ప్రచురుణల సమితికి అప్పటి అధ్యక్షురాలైన శ్రీ దయామాతచే నియమించబడ్డారు, 2010లో దయామాతగారు పరమపదించే వరకు ఆయన శ్రీ దయామాత మరియు శ్రీ మృణాళినీమాతలతో కలిసి పనిచేశారు. ఈ సమయంలో శ్రీ పరమహంసగారి విస్తృత ఆధ్యాత్మిక గ్రంథ వ్యాఖ్యానాలు (గాడ్ టాక్స్ విత్ అర్జున: ద భగవద్గీత మరియు ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్: ద రిసరక్షన్ ఆఫ్ క్రైస్ట్ వితిన్ యూ)తో సహా అనేక రచనల కూర్పుకు ఇంకా 1980 నుండి ఇప్పటి వరకు విడుదలైన ఎస్.ఆర్.ఎఫ్./ వై.ఎస్.ఎస్. ప్రచురణలలో ఈ ఇరువురి అగ్రగణ్య ప్రధమ శిష్యులకు ఆయన తోడ్పడ్డారు. దయామాత, మృణాళినీమాత మరియు సహజామాతల నుండి అనేక వత్సరాల సుసంపన్నమైన, లోతైన శిక్షణను పొందిన తరువాత మృణాళినీమాత తన తదనంతర వారసునిగా, ఆయనను వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ప్రచురణల ముఖ్య సంపాదకుడిగా నిర్దేశింపబడ్డారు.

శ్రీ దయామాత స్వామి చిదానందకు 1997లో చివరి సన్యాస దీక్షనొసగారు. చిదానంద అనే ఆయన సన్యాస నామానికి అర్థం “అనంత దివ్య చైతన్యం (చిత్) ద్వారా ఆనందం (ఆనంద)”. సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క నియమిత మంత్రి (భోదకుడు)గా, శ్రీ పరమహంస యోగానంద బోధనలను ఆయన యునైటెడ్ స్టేట్స్, కెనడా, యూరప్ మరియు భారతదేశంలో ఉపన్యాస పర్యటనలు మరియు ఏకాంత ధ్యాన (రిట్రీట్) కార్యక్రమాలలో—అలాగే లాస్ ఏంజిలిస్ లో వార్షిక ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ స్నాతకోత్సవాలలో పాలుపంచుకొన్నారు. 2009లో ఆయన శ్రీ దయామాత ద్వారా వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. డైరెక్టర్ల బోర్డులో సభ్యునిగా నియమితుడైయ్యారు అలాగే సంఘమాత మార్గదర్శకత్వంలో ఎస్.ఆర్.ఎఫ్. యొక్క అనేక కార్యక్రమాలు మరియు కార్యకలాపాలను పర్యవేక్షించే నిర్వహణ కమిటీ సభ్యునిగా కూడా చాలా సంవత్సరాలు పనిచేశారు.

“మన ఆత్మలన్నీ ఒకే ప్రియతముడైన భగవంతుణ్ణీ ఆకాక్షించడం…”

ఎన్నికల ప్రకటన తర్వాత ఎస్.ఆర్.ఎఫ్./ వై. ఎస్.ఎస్. సన్యాసులతో మాట్లాడుతూ స్వామి చిదానందగారు ఇలా అన్నారు:

“ఎల్లవేళలా ఈ సంస్థకు గురుదేవులు శ్రీ పరమహంస యోగానందే అధిపతిగా ఉన్నారనే చైతన్యంలో వినమ్రతతో, మీ అందరి ప్రార్థనలు మరియు సహాయాన్ని కోరుతూ మన ప్రియతమ శ్రీ దయామాత మరియు శ్రీ మృణాళినీమాతల ఆశయ సాధనకు వారి అడుగుజాడల్లో కొనసాగాలని కోరుకుంటున్నాను. గురుదేవుల ప్రేమకు స్వచ్ఛమైన వాహకంగా (ప్రతిరూపంగా) ఉండాలనే వారి నిబద్ధత—ప్రతి ఆలోచన, నిర్ణయం మరియు చర్యను ఆయన సంకల్పం మరియు మార్గదర్శకత్వానికి అనుగుణంగా మార్చుకున్న వారి దివ్య సోదాహరణగా—ఆశ్రమంలో నా జీవిత స్ఫూర్తిగా; మరి రాబోయే సంవత్సరాల్లో ఈ యొక్క బృహత్ కార్యాన్ని పవిత్ర బాధ్యతా భావముతో నేను మీ అందరి సహాయం, ప్రార్థనలు, సద్భావన మరియు దైవిక స్నేహాన్ని ఆశిస్తూ, భగవంతుడు మరియు గురుదేవుల సేవ చేయడానికి ఎదురు చూస్తున్నాను.

“మీలో ప్రతి ఒక్కరూ గురుదేవులు ఏరికోరి ఎంపిక చేసుకున్న శిష్యులు, అందుకే గురుదేవుని చేలా (శిష్యుల) యొక్క ఐక్య ఆధ్యాత్మిక కుటుంబంగా భావిస్తూ నేను మీ పాద ధూళిని స్వీకరిస్తున్నా, మనమంతా, కలిసి, దివ్య ప్రేమ, ఆనందం మరియు ఆత్మ-సమర్పణ యొక్క స్ఫూర్తితో వై.ఎస్.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. యొక్క ఈ మహాకార్యాన్ని ముందుకు తీసుకెళ్లగలమని—మనందరికీ గురుదేవులు ఉపదేశించిన మరియు వారి భవిష్యవాణిల స్ఫూర్తితో మన ఆత్మలకు ప్రియతముడైన ఆ భగవంతుడిని ఆకాక్షించడమే రాబోయే కాలంలో వారి సంస్థ యొక్క జీవము మరియు శక్తి. జై గురూ! జై మా!”

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వై.ఎస్ ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ఆధ్యాత్మిక కుటుంబానికి, స్వామి చిదానందగారు ఈ క్రింది సందేశాన్ని అందించారు:

“ప్రియతములారా, భగవంతుని మరియు గురుదేవుల ప్రేమతో నేను మీ అందరికి నమస్కరిస్తున్నాను అలాగే శ్రీ పరమహంస యోగానంద ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఈ దివ్యమైన క్రియాయోగ ధ్యానం యొక్క పవిత్ర మార్గంలో పయనిస్తూ మరియు దైవానుసంధానంలో జీవిస్తున్న మనందరికీ వారి నిరంతర ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను. మీ అందరికీ సేవ చేసే అవకాశం కల్పించినందుకు, ఆయన నామస్మరణతో వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ఆశ్రమాలలో ఉన్న సన్యాసులు మరియు సన్యాసినులకు నా వినమ్రపూర్వక కృతజ్ఞుతలు. ప్రపంచవ్యాప్తంగా దైవాన్వేషణ ఆత్మల సమూహంగా—సామాన్య శిష్యులైనా లేదా సన్యాస పధంలోని వారైనా—ఈ బోధనల యొక్క ఆధ్యాత్మిక ఆశీర్వాదాలకు కృతజ్ఞతతో మరియు దేవునితో మరియు మహాత్ములతో మన స్వీయ సాధన మరియు అంతర్గత సాంగత్యాన్ని మరింతగా పెంచుకోవాలనే సంకల్పంతో మనం ఏకమవుదాం. మీలో ప్రతి ఒక్కరు వారి నిరంతరమైన ఆశీర్వాదాలను అనుభవించాలి. జై గురూ!”

Share this on

Share on facebook
Share on twitter
Share on whatsapp