పరమహంస యోగానందగారు 1925లో మౌంట్ వాషింగ్టన్ పర్వతంపై స్థాపించిన సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలము యొక్క 100వ వార్షికోత్సవం సందర్భంగా యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన స్వామి చిదానంద గిరి గారు ప్రత్యేకంగా ప్రసంగించారు.
ఆయనచే ప్రేమగా ఎస్.ఆర్.ఎఫ్. మదర్ సెంటర్ గా నామకరణం చేయబడిన ఈ ప్రదేశం, ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులకు ఒక శిక్షణా కేంద్రంగాను మరియు క్రియాయోగం యొక్క ప్రాచీన శాస్త్రాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేసేందుకుగాను యోగానందగారిచే స్థాపించబడింది.
1935లో మదర్ సెంటర్ లో జరిగిన ఒక భక్తిపూర్వక కార్యక్రమం సందర్భంగా ఆయన ఇలా ప్రార్థించారు: “పరమేశ్వరా…నీ పట్ల మాకు గల ప్రేమ ద్వారా మౌంట్ వాషింగ్టన్‌ను భూమిపై స్వర్గంగా మార్చేలా మమ్మల్ని ఆశీర్వదించు…. నిన్ను అన్వేషించడానికి ఇక్కడకు వచ్చే ప్రతిఒక్కరి హృదయంలో ఒక చిన్నపాటి స్వర్గం స్థాపితమగు గాక.”
స్వామి చిదానందగారి ప్రత్యేక కార్యక్రమం లాస్ ఏంజిలిస్ లోని ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం నుండి ప్రత్యక్ష-ప్రసారం చేయబడింది.

















