ప్రతి సంవత్సరం క్రిస్టమస్ సమయంలో సాధారణంగా ఉండే వాటికంటే ఎక్కువగా, శక్తివంతమైన క్రీస్తు-ప్రేమ మరియు ఆనందం యొక్క ప్రకంపనలు స్వర్గ లోకాల నుండి భూమిపైకి ప్రసరిస్తాయి. ఏసు జన్మించినప్పుడు భూమిపై ప్రకాశించినట్లుగానే ఆకాశం అనంతమైన కాంతితో నిండిపోతుంది. భక్తి మరియు గాఢమైన ధ్యానం ద్వారా అనుసంధానంలో ఉన్న వ్యక్తులు, ఏసుక్రీస్తులో ఉన్న సర్వవ్యాపక చైతన్యపు పరివర్తనకారక ప్రకంపనలను స్పష్టమైన రీతిలో అద్భుతంగా అనుభవిస్తారు.
— పరంహంస యోగానంద
డిసెంబర్ 25 గురువారంనాడు పవిత్ర క్రిస్టమస్ సందర్భంగా ఏసుక్రీస్తు జన్మదినాన్ని గౌరవించుకొనేందుకు వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించే ఒక ప్రత్యేక ఆన్‌లైన్ ధ్యానంలో మాతో కలిసి పాల్గొనండి.
ఈ కార్యక్రమంలో ప్రారంభ ప్రార్థన, కీర్తనగానం, తరువాత స్ఫూర్తిదాయక పఠనం మరియు నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానం ఉంటాయి. కార్యక్రమం చివరలో, ఇతరుల కోసం ప్రార్థించి, పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియను ఆచరించి, ఆ తరువాత ముగింపు ప్రార్థనతో మనం ముగిస్తాము.
ఈ స్మారకోత్సవ ధ్యానంలో మీ కుటుంబం మరియు స్నేహితులతో పాల్గొనమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.
దయచేసి గమనించండి: ఈ కార్యక్రమం శుక్రవారం, డిసెంబర్ 26, రాత్రి 10 (భారతీయ కాలమానం) గంటల వరకు వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.
క్రిస్టమస్ పర్వదినం సందర్భంగా స్మారకోత్సవ ధ్యానాలు, వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్లలో కూడా నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమం జరిగే ఏదో ఒక కేంద్రంలో వ్యక్తిగతంగా పాల్గొనేందుకు మీకు స్వాగతం. మరిన్ని వివరాల కోసం దయచేసి మీకు దగ్గరలోని ఒక వై.ఎస్.ఎస్. కేంద్రంను సంప్రదించండి.
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు స్వామి చిదానంద గిరి గారి క్రిస్టమస్ సందేశం
క్రిస్టమస్ సందర్భంగా వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన స్వామి చిదానంద గిరి గారి ప్రత్యేక సందేశం చదవడానికి దయచేసి క్రింద ఉన్న బటన్ మీద క్లిక్ చేయండి.
ఈ పవిత్ర సందర్భంలో విరాళం సమర్పించాలని మీరు భావిస్తే, క్రింద ఉన్న లింక్ ద్వారా సమర్పించవచ్చు. మీ మద్దతు ఎంతో అభినందనీయం.

















