వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారితో నిర్వహించబడే రెండు ప్రత్యేక ఆన్‌లైన్ కార్యక్రమాలలో పాల్గొనమని ఎంతో ఆనందంతో మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాలు 2026 ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచ స్నాతకోత్సవం నుండి ప్రత్యక్ష-ప్రసారమవుతాయి.
- బుధవారం, ఆగష్టు 5: మూడు-గంటల ధ్యానం
- శనివారం, ఆగష్టు 8: సత్సంగం
ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచ స్నాతకోత్సవం, పరమహంస యోగానందగారి క్రియాయోగ బోధనలను లోతుగా అధ్యయనం చేసే నిమిత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్యాన్వేషకులను ఒకచోట చేర్చే వార్షిక కార్యక్రమం. ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించే ఈ వారం రోజుల కార్యక్రమం భక్తులకు, ఇతర చిత్తశుద్ధిగల అన్వేషకులతో కలిసి ధ్యానం చేయడం వల్ల మరియు వారి సాంగత్యంలో ఉండటం వల్ల కలిగే ఆనందాన్ని, ఆశీర్వాదాలను అనుభవించే అవకాశాన్ని కల్పిస్తుంది.
స్వామి చిదానంద గిరి గారితో మూడు-గంటల ధ్యానం
(హిందీలో ప్రత్యక్ష అనువాదాన్ని కూడి ఉంటుంది)
బుధవారం, ఆగష్టు 5, 2026
రాత్రి 8:30 – రాత్రి 11:30 (భారతీయ కాలమానం ప్రకారం)
యోగా మరియు దాని ధ్యానశాస్త్రం అందించే శాశ్వతమైన కానుక అయిన గొప్ప అంతర్గత ప్రశాంతతను మీరు అనుభవించాలనుకుంటున్నారా? మీ అంతరాత్మలో కనుగొనబడటానికి వేచి ఉన్న నిజమైన నెరవేర్పును అర్థం చేసుకోవడానికి, స్వామి చిదానంద గిరి గారితో కలిసి మూడు గంటల ధ్యానంలో పాల్గొనండి.
పరమహంస యోగానందగారి బోధనలలో ప్రధానాంశాలైన ధ్యానసంబంధిత శాంతి మరియు ఆనందాలను పాల్గొనేవారు అనుభూతి చెందడానికి స్వామి చిదానంద గారు మార్గదర్శనం చేస్తారు. ఈ నిర్దేశిత ధ్యానంలో భక్తిగీతాలాపన కూడా ఉంటుంది.
స్వామి చిదానంద గిరి గారితో సత్సంగం —
పరమహంస యోగానందగారి క్రియాయోగ బోధనలు
(హిందీ ప్రత్యక్ష ప్రసార అనువాదంతో)
శనివారం, ఆగష్టు 8, 2026
ఉదయం 8:00 – ఉదయం 9:00 (భారతీయ కాలమానం ప్రకారం)
పరమహంస యోగానంద గారి క్రియాయోగ బోధనలలోని జ్ఞానం, ఆనందం మరియు ప్రోత్సాహాన్ని ఆకళింపు చేసుకుంటూ, స్వామి చిదానంద గిరి గారితో దివ్యసాంగత్య భావనలో సమయం గడిపే ఈ విశేష అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

















