
అంతర్జాతీయ యోగా దినోత్సవం
యోగా ధ్యానం యొక్క ప్రాచీన ప్రక్రియలను సత్యాన్వేషకులకు పరిచయం చేయడానికి ఆయన జీవితం అంకితమైనందున, ప్రపంచం ఇప్పుడు యోగం యొక్క తత్త్వశాస్త్రం మరియు విజ్ఞాన శాస్త్రానికి ప్రతి సంవత్సరం నివాళులర్పిస్తున్నదని తెలుసుకున్నప్పుడు పరమహంసగారు ఎంతో సంతోషిస్తారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, యోగాపై ప్రస్తుత ప్రపంచం చూపుతున్న ఆసక్తి, వంద సంవత్సరాల క్రితం పరమహంస యోగానందగారు భారతదేశం నుండి అమెరికాకు అందించిన బోధనల పర్యవసానమే. “అంతర్జాతీయ యోగా దినం జరపాలన్న భారతదేశపు ఆలోచనకు ఐక్యరాజ్యసమితిలో సులభంగా ఆమోదం లభించిందంటే, అమెరికాలో భారతదేశపు ప్రప్రథమ గురువు అయిన శ్రీ పరమహంస యోగానందగారికే ఆ ఖ్యాతి దక్కుతుంది. నూరు సంవత్సరాల క్రితం అమెరికాలో యోగానికి పునాదిరాయి వేయడంలో ఆయన ఒక బృహత్ పాత్ర పోషించారు,” అని ఒక ఆన్‌లైన్ సమాచార పత్రిక వెల్లడించింది.
అత్యంత ప్రశంసలు పొందిన భగవద్గీత అనువాదం మరియు వ్యాఖ్యానం (God Talks With Arjuna) లో, శ్రీ పరమహంస యోగానందగారు ఇలా వివరించారు: “యోగ అనే పదం పరమాత్మతో మనస్సు యొక్క అనుసంధానం ఫలితంగా పరిపూర్ణమైన సమస్థితిని లేదా మానసిక సమతుల్యతను సూచిస్తుంది. యోగ అనేది ధ్యానం యొక్క ఆధ్యాత్మిక ప్రక్రియను కూడా సూచిస్తుంది, దీని ద్వారా పరమాత్మతో ఐక్యతను సాధిస్తారు. ఇంకా, యోగ అనేది ఈ దివ్య అనుసంధానికి దారితీసే ఏదైనా ఒక చర్యను సూచిస్తుంది.”
ఈ కార్యక్రమాల గురించి
జూన్ 21న జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క శ్రేయస్సు కోసం యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) ఆన్‌లైన్ మరియు వ్యక్తిగత కార్యక్రమాలు రెండిటినీ నిర్వహించింది.
ఈ ఆన్‌లైన్ కార్యక్రమాల రికార్డింగ్‌లు దిగువన అందుబాటులో ఉన్నాయి.
అన్ని ఆన్‌లైన్ కార్యక్రమాలు
“క్రియాయోగ ధ్యానానికి పరిచయం”
(నిర్దేశిత ధ్యాన సమయం కూడా కలిగి ఉంది)
యోగ-ధ్యానం గురించి పరిచయ కార్యక్రమాలను ఆంగ్లం మరియు వివిధ భారతీయ భాషల్లో వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహించారు. సత్యాన్వేషకులు, దైనందిన జీవితంలో ఆంతరిక సంతులనం మరియు ప్రశాంతతను అన్ని పరిస్థితుల్లోను ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకొనేందుకు ఈ సమావేశాలు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి — పరమహంస యోగానందగారి క్రియాయోగ బోధనలను అభ్యాసం చేయడం వల్ల ఆంతరిక ఆనందం జాగృతమై అంతిమంగా ఆత్మసాక్షాత్కారానికి దారి తీస్తుంది.
పరమహంస యోగానందగారు మరియు వారి బోధనల గురించిన పరిచయంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం, సరియైన ఆసనం, ప్రాథమిక శ్వాసాభ్యాసాలు, దివ్యసంకల్పం మరియు మానసిక ఊహాచిత్రణతో కూడిన ఒక నిర్దేశిత ధ్యాన కార్యక్రమాన్ని ప్రేక్షకుల కోసం వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహించారు.
ఆంగ్ల సమావేశం
(స్వామి లలితానంద గిరి)

హిందీ సమావేశం
(స్వామి చైతన్యానంద గిరి)

తమిళ సమావేశం
(స్వామి శుద్ధానంద గిరి)

తెలుగు సమావేశం
(స్వామి కేదారానంద గిరి)


శ్రీ పరమహంస యోగానంద గురించి
తన సమగ్రమైన బోధనలతో శ్రీ పరమహంస యోగానందగారు లక్షలాది మంది జీవితాలపై గాఢమైన ప్రభావం చూపించారు. “పశ్చిమ దేశాలలో యోగ పితామహునిగా” విశేషంగా గౌరవించబడుతున్న పరమహంసగారు శాస్త్రీయ ప్రాణాయామ (ప్రాణశక్తి నియంత్రణ) ప్రక్రియలు కలిగి ఉన్న బోధనలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చిన ఆద్యుడు. తాను సర్వజ్ఞుడినని, సర్వవ్యాపకుడైన ఆత్మనని గ్రహించడమే యోగా యొక్క అత్యున్నత లక్ష్యం. శ్రీ యోగానందగారి కార్య ప్రణాళిక — యోగదా సత్సంగ పాఠాలలో వివరించబడింది — మతంలో అంతర్లీనంగా ఉండే మూలాలకు ఆచరణాత్మక మార్గాన్ని సమకూరుస్తుంది. మరియు ఇది మరింత ఎక్కువ మంది జనులను ఆకర్షించే ఒక వ్యవస్థ: ఇది హఠ యోగం యొక్క భౌతిక ప్రయోజనాలపై మాత్రమే కాకుండా, మానసిక సామర్థ్యాలను మరియు ఆన్నిటినీ మించి తమ ఆధ్యాత్మిక సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో ఆసక్తి ఉన్నవారికి ఒక ప్రణాళికను అందిస్తుంది.
ఆయన బోధించిన బోధనలు మరియు ధ్యాన ప్రక్రియలు ఇప్పుడు వీటి ద్వారా అందుబాటులో ఉన్నాయి:
- యోగదా సత్సంగ పాఠాలు, శ్రీ యోగానందగారు స్వయంగా రూపొందించిన ఒక సమగ్ర గృహ అధ్యయన శ్రేణి. ఇవి డిజిటల్ యాప్ రూపంలో కూడా లభిస్తాయి
- తన బోధనలను విశ్వమంతా వ్యాప్తి చేయడానికి ఆయన స్థాపించిన సంస్థ వై.ఎస్.ఎస్. నుండి పుస్తకాలు, రికార్డింగులు, మరియు ఇతర ప్రచురణలు
- యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకి చెందిన సన్యాసులు దేశవ్యాప్తంగా పర్యటిస్తారు. సన్యాసులు నిర్వహించే పర్యటనలలో వారు శక్తిపూరణ, ఏకాగ్రత, మరియు ధ్యానం వంటి శాస్త్రీయ యోగప్రక్రియల గురించి వివరిస్తారు
- సన్యాసులు నిర్వహించే ఏకాంత ధ్యాన వాసాలు
- సాధనా సంగమాలు
- బాలల కోసం ధ్యానం మరియు ఆధ్యాత్మిక జీవనంపై కార్యక్రమాలు
ఇతరులు ఏమన్నారు
“1935లో నేను శ్రీ పరమహంస యోగానందగారిని కలకత్తాలో కలిశాను. అప్పటి నుండి అమెరికాలో వారు చేపడుతున్న కార్యక్రమాలను తెలుసుకుంటున్నాను. ప్రపంచములో యోగానందగారి సన్నిధి చిమ్మచీకటిలో గొప్ప తేజోవంతమైన వెలుగులాంటిది. నిజమైన అవసరం ఉన్నప్పుడు మాత్రమే, అరుదుగా అటువంటి మహాత్ముడు భూమిపై అవతరిస్తాడు.”

“ప్రపంచం నలుమూలల ఉన్న యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాలు యోగానందగారి కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. ఆ కేంద్రాలు సర్వతోముఖవ్యాప్తి చెందుతాయి; అవి గొప్ప ఆధ్యాత్మిక అయస్కాంత వలయముగా ఏర్పడి ప్రపంచానికి శాంతి సౌభాగ్యాలనందిస్తాయి.”

“శ్రీ శ్రీ పరమహంస స్థాపించిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా మరియు సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాలలో సర్వోన్నత ఆధ్యాత్మిక చింతన, ప్రేమ, సేవ మొదలైన లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.”

“ఈ పుస్తకము నాకు చాలా ఇష్టమైనది. తమ ఆలోచనలు మరియు భావజాలాలను సవాలు చేయగలిగే ధైర్యం ఉన్న వారందరు దీనిని తప్పక చదవాలి. ఈ పుస్తకంలోని జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తే, మీ జీవితం మరియు దృక్పథం పూర్తిగా మారిపోతాయి. దైవం మీద నమ్మకం ఉంచండి మరియు మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి #onelove #begrateful #helponeanother”

“నేను పరమహంస యోగానందగారిని రెండు సందర్భాలలో కలిశాను....నేను ఆ పుస్తకాన్ని. (ఒక యోగి ఆత్మకథ) చదవడం ప్రారంభించిన క్షణమే నేను వర్ణించలేనిదేదో చేసింది. నేను యోగముపై యోగులు రచించిన చాలా పుస్తకాలు చదివాను. కానీ ఈ పుస్తకం ఆకట్టుకున్నంతగా ఏదీ నన్ను ఆకట్టుకోలేదు.. ఇందులో ఏదో ఇంద్రజాలం ఉంది.”

“నేను ఇంట్లో ఒక యోగి ఆత్మకథను కుప్పలుగా ఉంచుతాను మరియు నేను దానిని అందరికీ నిరంతరం అందిస్తాను. ప్రజలు మళ్ళీ గాడిలో పడదలచుకున్నప్పుడు, నేను దీన్ని చదవమని చెబుతాను, ఎందుకంటే ఇది ప్రతి మత అంతరంగమును ఛేదిస్తుంది.”


యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా గురించి
గడచిన 100 సంవత్సరాలుగా, సంస్థ వ్యవస్థాపకులు మరియు పశ్చిమంలో యోగపితామహులుగా ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక మరియు మానవతా కార్యకలాపాలను యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) అంకితభావంతో కొనసాగిస్తోంది.
భారతదేశంలో సహస్రాబ్దుల క్రితం ఉద్భవించిన పవిత్ర ఆధ్యాత్మిక సశాస్త్రీయమైన క్రియాయోగం యొక్క విశ్వజనీన బోధనలను అందుబాటులోకి తీసుకురావడానికి శ్రీ పరమహంస యోగానందగారు 1917లో యోగదా సత్సంగ సొసైటీ (వై.ఎస్.ఎస్.) సంస్థను స్థాపించారు. ఏ మతమునకు సంబంధం లేనటువంటి ఈ బోధనలు సర్వతోముఖ విజయం మరియు శ్రేయస్సును సాధించడానికి సంపూర్ణ తత్త్వశాస్త్రం మరియు జీవన విధానాన్ని, అలాగే జీవిత అంతిమ లక్ష్యాన్ని — పరమాత్మతో జీవాత్మ యొక్క ఐక్యత సాధించడానికి ధ్యానం యొక్క పద్ధతులు కలిగి ఉంటాయి.
అత్యంత ప్రశంసలు పొందిన భగవద్గీత అనువాదం మరియు వ్యాఖ్యానం (God Talks With Arjuna) లో, శ్రీ పరమహంస యోగానంద ఇలా వివరిస్తారు: “యోగ అనే పదం పరమాత్మతో మనస్సు యొక్క అనుసంధానం ఫలితంగా పరిపూర్ణమైన సమస్థితిని లేదా మానసిక సమతుల్యతను సూచిస్తుంది. యోగా అనేది ధ్యానం యొక్క ఆధ్యాత్మిక ప్రక్రియను కూడా సూచిస్తుంది, దీని ద్వారా పరమాత్మతో ఐక్యతను పొందవచ్చు. ఈ దివ్య సమ్మేళనానికి దారితీసే ఏ చర్యనైనా యోగం సూచిస్తుంది.”
