సమాజ సామాన్యానికి తెలియకుండానే, కాశీలో ఒక మారుమూల 1861లో, మహత్తరమైన ఒకానొక ఆధ్యాత్మిక పునరుజ్జీవనం ఆరంభమయ్యింది. పూలవాసనని ఎవ్వరూ అణిచిపెట్టలేరు; అలాగే, ఆదర్శ గృహస్థుగా ప్రశాంతంగా జీవిస్తున్న లాహిరీ మహాశయులు, సహజసిద్ధమైన తమ మహిమను దాచి ఉంచలేకపోయారు. భక్తభ్రమరాలు, ఈ విముక్త సిద్ధపురుషుల దివ్యామృతాన్ని వెతుక్కుంటూ, భారతదేశంలోని ప్రతిభాగం నుండీ రావడం మొదలుపెట్టాయి…
— ఒక యోగి ఆత్మకథ లో పరమహంస యోగానంద
శ్రీ శ్రీ లాహిరీ మహాశయులు, పరమహంస యోగానందగారికి పరమగురువులు మరియు “యోగం యొక్క అవతారం” లేక ఒక యోగావతార్ గా గౌరవించబడతారు.
క్రియాయోగ వ్యాప్తికి లాహిరీ మహాశయులు వారి గురువైన మహావతార్ బాబాజీచే ఎన్నుకోబడ్డారు, మరియు బాబాజీ దాన్ని ప్రపంచవ్యాప్తంగా కొనసాగించేందుకు పరమహంస యోగానందగారిని ఆశీర్వదించారు.
శ్రీ శ్రీ లాహిరీ మహాశయులు ఆవిర్భవించిన రోజున, ఈ యోగావతారుల జీవితాన్ని గౌరవించేందుకు సెప్టెంబర్ 30న ఒక ప్రత్యేక ఆన్‌లైన్ స్మారక ధ్యానాన్ని ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించారు. ఈ స్మారకోత్సవ ధ్యానం ప్రారంభ ప్రార్థన, ఒక పఠనంతో మొదలయ్యింది, తరువాత భక్తిగీతాలాపన మరియు తరువాత నియమిత సమయంపాటు ధ్యానం ఉన్నాయి. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ మరియు ఒక ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగిసింది.
శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 30న వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళు వ్యక్తిగతంగా పాల్గొనే కార్యక్రమాలను నిర్వహించాయి.
మీరు వీటిని కూడా అన్వేషించడానికి ఇష్టపడవచ్చు:
ఈ సందర్భంలో శ్రీ శ్రీ లాహిరీ మహాశయులకు మరియు వై.ఎస్.ఎస్. గురుపరంపరకు నివాళులు అర్పిస్తూ ఒక సాంప్రదాయక తోడ్పాటును మీరు అందించాలనుకుంటే, దయచేసి క్రింద ఉన్న మా వెబ్సైట్ ను సందర్శించండి.