వేలాది మంది ప్రార్థనలు ఐక్యమైనప్పుడు, దాని ద్వారా ఉత్పన్నమయ్యే శాంతి మరియు దివ్య స్వస్థత యొక్క అమూల్యమైన శక్తివంతమైన ప్రకంపనలు ఆశించిన ఫలితాలను తీసుకువచ్చేందుకు సహాయపడతాయి.
ఒక నవీకరణ: మన దేశంలో పరిస్థితి స్థిరపడినందున, ప్రేమ మరియు స్వస్థత యొక్క ఈ నిస్వార్థ సేవలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమం ముగించబడింది. మే 23, శుక్రవారం జరిగిన సమావేశం తర్వాత అది ముగిసింది.
మీ దైనందిన ధ్యానాల సమయంలోను మరియు ఇతర సమయాల్లోను, ప్రార్థనలు చేయమని, మరియు మన ప్రియ గురుదేవులు పరమహంస యోగానందగారు బోధించిన స్వస్థతా ప్రక్రియను అభ్యసించడం కొనసాగించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము — తద్ద్వారా మీ ప్రియమైనవారిని మరియు ప్రపంచాన్ని దివ్యకాంతి మరియు స్వస్థతలో నింపండి.
మన దేశంలో వివిధ ప్రాంతాలలో పెరుగుతున్న ఉద్రిక్తత మరియు అనిశ్చితి దృష్ట్యా, మన భక్తులకు మరియు బాధితులయిన వారందరికీ ఆశ, ఓదార్పు మరియు భరోసాలతో కూడిన ప్రకంపనలను పంపడంలో సహాయపడేందుకు మేము రోజువారీ ఆన్‌లైన్ ప్రార్థన సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది. కోవిడ్-19 మహమ్మారి కాలంలో అనుభవించినట్లుగా, మన సామూహిక ధ్యానాలు మరియు ప్రార్థనలు అదృశ్యంగా కీలక పాత్రను పోషిస్తాయి.
ప్రతి ప్రార్థన సమావేశం సుమారు 20 నిమిషాలపాటు ఉండేది. ప్రారంభ ప్రార్థనతో మొదలై, తరువాత సంక్షిప్తంగా ఒక స్ఫూర్తిదాయక పఠనం, లేక గీతాలాపన, లేక దివ్యసంకల్పం యొక్క అభ్యాసం ఉండేవి. దీని తరువాత ఒక సంక్షిప్త నిశ్శబ్ద ధ్యానం, ఇందులో వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచవ్యాప్త ప్రార్థనా మండలి ద్వారా సహాయం కోరినవారి కోసం మనం మానసికంగా ప్రార్థించడం జరిగేవి. తమ ప్రియమైనవారి కోసం లేదా తాము స్వయంగా సవాళ్లను ఎదుర్కొనేందుకు — భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగేది. పరమహంస యోగానందగారు బోధించిన స్వస్థతా ప్రక్రియ అభ్యాసంతో మరియు ముగింపు ప్రార్థనతో ఈ సమావేశాలు ముగిసేవి.
ప్రపంచవ్యాప్త ప్రార్థనా వలయం
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రచురించిన ప్రపంచవ్యాప్త ప్రార్థనా వలయం చిన్నపుస్తకం (PDF రూపంలో), క్రింద ఉన్నదాన్ని చదవమని కూడా మేము ప్రోత్సహిస్తున్నాం.
వై.ఎస్.ఎస్. ఆశ్రమాలన్నిటిలో అవసరమైనవారందరి కోసం మా సన్యాసులు గాఢంగా ప్రార్థించడాన్ని కొనసాగిస్తారని హామీ ఇస్తున్నాం. మీ కోసం గాని లేదా ఇతరుల కోసం గాని, మేము ప్రార్థించాలని మీరు కోరుకుంటే, ఇక్కడ క్లిక్ చేయండి:
