పరమహంస యోగానందగారి మహాసమాధి దినం

స్మారకోత్సవ ధ్యానం

శుక్రవారం, మార్చి 7, 2025

ఉదయం 6:30

– ఉదయం 8:00

(భారతీయ కాలమానం ప్రకారం)

ఈ కార్యక్రమం గురించి

నా శరీరం పోతుంది; కాని నా పని కొనసాగుతూనే ఉంటుంది. నా ఆత్మ జీవించే ఉంటుంది.

— పరమహంస యోగానంద

భౌతిక శరీరం నుండి దైవసాక్షాత్కారం పొందిన యోగి యొక్క సచేతన నిష్క్రమణకు మహాసమాధి ఆనవాలుగా నిలుస్తుంది. పరమహంస యోగానందగారి మహాసమాధి శుభసందర్భంగా ఒక ఆన్లైన్ ధ్యానాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తిగానం, స్ఫూర్తిదాయక పఠనం మరియు ధ్యానం కూడి ఉన్నాయి.

ఈ సందర్భంగా, వ్యక్తిగతంగా పాల్గొనే స్మారకోత్సవ కార్యక్రమాలను వివిధ ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళు నిర్వహించాయి.

గురుదేవులు తమ జీవితాల్లో కురిపించే ప్రగాఢమైన ఆశీస్సులకు కృతజ్ఞతను వ్యక్తం చేసేందుకు గురు-ప్రణామి సమర్పించడం ద్వారా గురుదేవులను గౌరవించుకోవాలని భక్తులు ఈ దినమును ఒక ప్రత్యేక దినముగా భావిస్తారు. ఆన్లైన్ లో విరాళం సమర్పించేందుకు మీకు స్వాగతం. మీ ఉదారమైన తోడ్పాటు వారి స్ఫూర్తిదాయక బోధనలను వ్యాప్తి చేసేందుకు సహాయపడుతుంది.

నూతన సందర్శకులు

వై.ఎస్.ఎస్. కు మరియు పరమహంస యోగానందగారి బోధనలకు కొత్తవారైతే, క్రింద ఉన్న లింక్ లను అన్వేషించడానికి ఇష్టపడవచ్చు:

ఒక యోగి ఆత్మకథ

ఒక అత్యుత్తమ ఆధ్యాత్మిక రచనగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడుతున్న తమ పుస్తకం గురించి పరమహంసగారు తరచుగా, “నేను లేనప్పుడు ఈ పుస్తకం నా దూత అవుతుంది,” అనే వారు.

వై.ఎస్.ఎస్. పాఠాలు

మీరు ఊహించని విధంగా మీ జీవితాన్ని మార్చడానికి, సమతుల్యతను సాధించటానికి మరియు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మీకు సహాయపడే గృహ-అధ్యయన పాఠ్యక్రమం.

ఇతరులతో పంచుకోండి