శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి పాల్గొనే సంగమం,
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులు
(వై.ఎస్.ఎస్. సంగమం 2023)

ఆదివారం, ఫిబ్రవరి 12 నుండి గురువారం, ఫిబ్రవరి 16, 2023 వరకు

(ఫిబ్రవరి 15, 2023 న క్రియాయోగ దీక్ష)

Sangam with YSS/SRF President Sri Sri Swami Chidananda Giri

కార్యక్రమ వేదిక

కాన్హా శాంతి వనం
హార్ట్ ఫుల్ నెస్ యొక్క ప్రపంచ ప్రధాన కార్యాలయం
13-110, కాన్హా గ్రామం, నందిగామ మండలం,
రంగారెడ్డి జిల్లా
తెలంగాణ – 509325

మ్యాప్ ప్రదేశము

చిరునామా

యోగదా సత్సంగ శాఖా మఠం — రాంచీ
పరమహంస యోగానంద పథ్
రాంచీ 834001
ఝార్ఖండ్

ఫోన్

(0651) 6655 555
సోమవారం నుండి శనివారం వరకు, ఉదయం 9.30 – సాయంత్రం 4.30 వరకు)

ఈ-మెయిల్

దయచేసి గమనించండి: కార్యక్రమంలో వ్యక్తిగతంగా పాల్గొనడానికి నమోదు ఇప్పుడు ముగిసింది. అయినప్పటికీ, భక్తులు ఆన్‌లైన్‌ సామూహిక ధ్యానాలలోను మరియు స్ఫూర్తిదాయక ప్రసంగాలలోను పాల్గొనడానికి స్వాగతం. వీటి కోసం నమోదు అవసరం లేదు.

అన్య ఇతర సాఫల్యాల కంటే కూడా మీ సృష్టికర్తను తెలుసుకోవడం చాలా గొప్పది. నక్షత్రాలలో, భూమిలో మరియు మీ ప్రతి భావాలలో దేవుణ్ణి కనుగొనడం నేర్చుకోండి. ఆయన మన హృదయాల్లోనే దాగి ఉన్నాడు — ఇది అత్యంత నిర్లక్ష్యం చేయబడిన వాస్తవికత. మీరు యోగదా సత్సంగ మార్గాన్ని నిలకడగా అనుసరిస్తూ, క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే, మీరు ఆయనను అనంతంగా వ్యాపించి ఉన్న బంగారు కాంతి వస్త్రంలో చూస్తారు.

— పరమహంస యోగానంద

కార్యక్రమం గురించి

జనవరి – ఫిబ్రవరి 2023 మధ్య గౌరవనీయులైన మన అధ్యక్షులు శ్రీ స్వామి చిదానంద గిరి గారు భారతదేశాన్ని సందర్శిస్తారని మీకు తెలియజేయడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. హైదరాబాద్ లో అయిదు రోజులపాటు జరిగే ఈ ప్రత్యేక సంగమ కార్యక్రమానికి చిదానంద గిరి గారు అధ్యక్షత వహిస్తారు. అంతేకాకుండా భారతదేశంలోని గురుదేవుల విశాల కుటుంబంతో సమయం గడపడానికి ఆయన ఉత్సుకతతో ఉన్నారు.

దయచేసి గమనించగలరు: సంగమం సందర్భంగా ఈ క్రింది కార్యక్రమాలను మేము ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం:

  • స్వామి చిదానందగారు మరియు ఇతర సన్యాసులు ఇచ్చే స్ఫూర్తిదాయక ప్రసంగాలు (ఇంగ్లీషులో నిర్వహించబడతాయి)
  • స్వామి చిదానందగారు నిర్వహించే ప్రత్యేక మూడు-గంటల దీర్ఘ ధ్యానం
  • ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం జరిగే ధ్యానాలు

కార్యక్రమం యొక్క పూర్తి వివరాలను దిగువన తెలుసుకోవచ్చు.

కార్యక్రమం యొక్క వివరాలు

అన్ని సమయాలు భారతీయ కాలమానంలో ఉన్నాయి.

అన్ని స్ఫూర్తిదాయక ప్రసంగాలు ప్రత్యక్ష ప్రసారం తరువాత కూడా వీక్షించడానికి అందుబాటులో ఉంటాయి.

వ్యక్తిగత కార్యక్రమాలు

ఫిబ్రవరి 12, ఆదివారం
ఉదయం 7:00 నుండి ఉదయం 8:20 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఈ కార్యక్రమం శక్తిపూరణ వ్యాయామల అభ్యాసంతో ప్రారంభమవుతుంది, తరువాత ధ్యాన కార్యక్రమాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహిస్తారు. ధ్యాన సమయం ప్రారంభ ప్రార్థన, కీర్తన గానం మరియు నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానంతో కూడి ఉంటాయి. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ యొక్క అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో ధ్యానం ముగుస్తుంది.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 12, ఆదివారం
ఉదయం 9:30 నుండి ఉదయం 11:00 వరకు

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారి స్ఫూర్తిదాయక ప్రసంగంతో ప్రారంభ కార్యక్రమం

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారి స్ఫూర్తిదాయక ప్రసంగంతో సంగమ ప్రారంభ కార్యక్రమం భక్తి గీతాలతో మొదలవుతుంది, ఆ తర్వాత వై.ఎస్.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారి స్ఫూర్తిదాయక ప్రసంగం ఉంటుంది. ఆధ్యాత్మిక పునరుద్ధరణ మరియు ఉన్నతి కలిగించే ఈ ఐదు రోజుల కార్యక్రమానికి భారతదేశంలోను మరియు ప్రపంచవ్యాప్తంగాను ఉన్న భక్తులను స్వామీజీ స్వాగతిస్తారు మరియు జీవితంలోని సవాళ్లను అధిగమించేందుకు మరియు మన అత్యున్నత సామర్థ్యాన్ని పొందే ప్రేరణను పంచుకుంటారు.

ఉదయం 11:00 నుండి ఉదయం 11:30 వరకు

కార్యక్రమ నేపధ్యం వివరాలు మరియు ప్రకటనలు

కాన్హా శాంతి వనంలో మన భక్తుల రాకను మరియు వారి నివాసాన్ని వీలైనంతవరకు సులభంగా మరియు సుఖంగా చేయడానికి, ఒక నేపధ్య సమావేశం నిర్వహించబడుతుంది. వివిధ ప్రదేశాలలో తరగతులు, వై.ఎస్.ఎస్. విభాగాలు (క్రియ నమోదు, పుస్తక విక్రయశాల వంటివి, మొదలైనవి) మరియు కాన్హా శాంతి వనంలోని ఇతర సౌకర్యాల గురించి ముఖ్య సమాచారం తెలియజేయబడుతుంది.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడదు.

ఫిబ్రవరి 12, ఆదివారం
మధ్యాహ్నం 2:00 నుండి మధ్యాహ్నం 2:25 వరకు

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షుల ప్రారంభ ప్రసంగం యొక్క అనువాదం
(హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో ఉంటుంది)

సంగమ కార్యక్రమంలో పాల్గొనేవారి కోసం – హిందీ, తమిళం మరియు తెలుగులో – స్వామి చిదానందగారి ప్రారంభ ప్రసంగం యొక్క అనువాదాలను వై.ఎస్.ఎస్. సన్యాసులు ఈ కార్యక్రమంలో పంచుకుంటారు.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడదు.

ఫిబ్రవరి 12, ఆదివారం
మధ్యాహ్నం 2:30 నుండి మధ్యాహ్నం 4:00 వరకు

శక్తిపూరణ వ్యాయామాల సమీక్ష
(ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో)

శక్తిపూరణ వ్యాయామాలు: పరమహంస యోగానందగారు బోధించిన క్రియాయోగంలోని ఆవశ్యకమైన ప్రక్రియలలోని ఒక దాని గురించి దశలవారీగా సూచనలను స్వీకరించడానికి ఈ సమీక్షా తరగతిలో పాల్గొనండి.

విశ్వశక్తితో శరీరాన్ని మరియు మనస్సును సంకల్పానుసారంగా పునరుజ్జీవింపజేయడం, ఒత్తిడిని తొలగించడం మరియు చైతన్యం యొక్క ఉన్నత స్థితులను చేరుకోవడానికి ధ్యాన సమయంలో శక్తిని మరింత సులభంగా లోపలికి మళ్లించడం కోసం శరీరాన్ని శుద్ధి చేయడం మరియు బలోపేతం చేయడం నేర్చుకోండి.

ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో నిర్వహింపబడే ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడదు.

ఫిబ్రవరి 12, ఆదివారం
సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:00 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఈ కార్యక్రమం శక్తిపూరణ వ్యాయామాల అభ్యాసంతో ప్రారంభమవుతుంది, తరువాత ధ్యానాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహిస్తారు. ధ్యాన సమయం ప్రారంభ ప్రార్థన, కీర్తన గానం మరియు నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానంతో కూడి ఉంటాయి. నిశ్శబ్ద ధ్యానం యొక్క సమయాలలో మార్పు ఉండవచ్చు, కాని సాధారణంగా 45 నిమిషాల నిడివి కలిగి ఉంటాయి. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో ధ్యానం ముగుస్తుంది.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 13, సోమవారం
ఉదయం 7:00 నుండి ఉదయం 8:20 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఈ కార్యక్రమం శక్తిపూరణ వ్యాయామల అభ్యాసంతో ప్రారంభమవుతుంది, తరువాత ధ్యాన కార్యక్రమాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహిస్తారు. ధ్యాన సమయం ప్రారంభ ప్రార్థన, కీర్తన గానం మరియు నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానంతో కూడి ఉంటాయి. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ యొక్క అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో ధ్యానం ముగుస్తుంది.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 13, సోమవారం
ఉదయం 9:30 నుండి ఉదయం 10:30 వరకు

హాంగ్-సా ప్రక్రియపై సమీక్ష
(ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో)

హాంగ్-సా అనే ఈ పురాతన మరియు శక్తివంతమైన ప్రక్రియ, మనస్సు యొక్క గుప్తమైన ఏకాగ్రతా శక్తులను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. క్రమమైన అభ్యాసం ద్వారా బాహ్యమైన పరధ్యానాల నుండి ఆలోచన మరియు శక్తిని ఉపసంహరించుకోవడాన్ని ఒకరు నేర్చుకుంటారు, తద్ద్వారా వారు సాధించాల్సిన ఏదైనా లక్ష్యం లేదా పరిష్కరించాల్సిన సమస్యపై దృష్టి పెట్టవచ్చు లేదా విజయవంతమైన అభ్యాసం ద్వారా కలిగే ఏకాగ్రతా దృష్టిని ఆంతరికంగా ఉన్న దివ్య చైతన్యాన్ని గ్రహించడానికి మళ్లించవచ్చు.

ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో నిర్వహించబడే ఈ సమీక్షా తరగతిలో పాల్గొనండి.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడదు.

ఫిబ్రవరి 13, సోమవారం
ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు

“క్షమించడంలోని స్వస్థతా శక్తి” అనే అంశంపై స్ఫూర్తిదాయక ప్రసంగం

(ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో)

“ఏ హాని జరిగినా, ఒకరు క్షమించాలి. మనిషి క్షమించడం వల్లనే మానవ జాతి కొనసాగుతోందని చెప్పబడింది. క్షమ బలవంతుల బలం.”

ఈ వాక్యాలతో, మన పట్ల తప్పుగా ప్రవర్తించినవారిని క్షమించడం ఎంత అత్యున్నతమైనదో మహాభారతం ఉద్ఘాటిస్తుంది. క్షమించే వ్యక్తి ప్రక్షాళన పొందినట్లుగాను మరియు మనోహరమైన స్వేచ్ఛను పొందిన అనుభవం పొందుతాడు. క్షమాపణ అనే దివ్య గుణాన్ని ఆచరించడం వలన, క్షమాపణ పొందిన వ్యక్తి కంటే క్షమించే వ్యక్తికి ఎంత ప్రయోజనం ఉంటుందో ఈ ప్రసంగం ఉద్ఘాటిస్తుంది, అదే సమయంలో అంతర్గత శాంతికి మరియు ప్రశాంతతకు తలుపులు తెరుస్తుంది.

ఈ అంశంపై ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో మన సన్యాసులు ఏకకాలంలో ప్రసంగిస్తారు.

ఇంగ్లీషులో జరిగే స్వామి స్మరణానంద గిరి గారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 13, సోమవారం
మధ్యాహ్నం 2:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు

“అంతర్గత మరియు బాహ్య జీవితాలలో శాంతికి యువరాజుగా ఉండటం” పై స్ఫూర్తిదాయకమైన ప్రసంగం
(ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో)

పరమహంసగారు ఇలా అన్నారు: “ప్రశాంతంగా క్రియాశీలత మరియు క్రియాశీలకంగా ప్రశాంతతతో ఉండడం — సమతుల్యతా సింహాసనంపై కూర్చున్న శాంతి యువరాజు, కార్యాచరణ రాజ్యాన్ని నిర్దేశించడం — ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండటమే.” మన విధులను నిష్ఠగా నిర్వర్తిస్తున్నప్పుడు గాఢంగా ధ్యానం చేయడం మరియు అనంతర ప్రభావాలను గ్రహించడం ద్వారా మనం శాంతిని ఎలా పెంపొందించుకోవచ్చు మరియు దానిలో ఎలా నిమగ్నమై ఉండవచ్చు అనే అంశంపై ఈ ప్రసంగం కాంతిని ప్రసరిస్తుంది. మరియు ఎల్లవేళలా దైవానికి అనుశ్రుతిలో ఉండాలనే స్పృహతో కూడిన మానసిక ప్రయత్నం ద్వారా, ప్రేమ, సద్భావన మరియు సామరస్యం యొక్క ఆలోచనలను పంపడం ద్వారా మన అంతరిక శాంతిని ధృడ పరచుకోవచ్చు.

ఇంగ్లీషులో జరిగే స్వామి సుద్ధానందగారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 13, సోమవారం
సాయంత్రం 4:40 నుండి రాత్రి 8:00 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు
మరియు
శ్రీ స్వామి చిదానంద గిరి ద్వారా నిర్వహించబడే ప్రత్యేక దీర్ఘ ధ్యానం

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి ఈ సంగమం సందర్భంగా మూడు గంటల ప్రత్యేక ధ్యానాన్ని నిర్వహిస్తారని తెలియజేయడం మాకు సంతోషాన్ని కలిగిస్తోంది. పరమహంస యోగానందగారి బోధనల హృదయంలో ఉన్న ధ్యానం యొక్క శాంతి మరియు ఆనందాల అనుభవాన్ని పొందడంలో భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు మరియు స్నేహితులకు స్వామి చిదానందగారు మార్గనిర్దేశం చేస్తారు.

ధ్యానానికి ముందు శక్తిపూరణ వ్యాయామాల అభ్యాసం నిర్వహించబడుతుంది.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 14, మంగళవారం
ఉదయం 7:00 నుండి ఉదయం 8:20 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఈ కార్యక్రమం శక్తిపూరణ వ్యాయామల అభ్యాసంతో ప్రారంభమవుతుంది, తరువాత ధ్యాన కార్యక్రమాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహిస్తారు. ధ్యాన సమయం ప్రారంభ ప్రార్థన, కీర్తన గానం మరియు నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానంతో కూడి ఉంటాయి. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ యొక్క అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో ధ్యానం ముగుస్తుంది.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 14, మంగళవారం
ఉదయం 9:30 నుండి ఉదయం 10:30 వరకు

ఓం ప్రక్రియపై సమీక్ష
(ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో)

హాంగ్-సా ప్రక్రియను అభ్యసించడం ద్వారా, శరీరాన్ని సడలించడం మరియు మనస్సును కేంద్రీకరించడాన్ని విద్యార్థి నేర్చుకున్న తర్వాత, ఈ ఉన్నతమైన ఓం ధ్యాన ప్రక్రియ, శరీరం మరియు మనస్సు యొక్క పరిమితులను మించి ఒకరి అవగాహనను అనంత సామర్థ్యం యొక్క సంతోషకరమైన సాక్షాత్కారానికి విస్తరింపజేస్తుంది.

పరమహంస యోగానందగారు బోధించిన క్రియాయోగంలోని ఆవశ్యకమైన ప్రక్రియలలోని ఒక దాని గురించి దశలవారీ సూచనలను తెలుసుకోవడానికి ఈ ధ్యాన ప్రక్రియ సమీక్షా తరగతిలో పాల్గొనండి.

ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో నిర్వహింపబడే ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడదు.

ఫిబ్రవరి 14, మంగళవారం
ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు

“మీ ఆలోచన దేవుణ్ణి అనుమతించినంత వరకే, ఆయన మీకు దగ్గరగా ఉంటాడు” అనే అంశంపై స్ఫూర్తిదాయక ప్రసంగం
(ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో)

దయామాతాజీ ఇలా అన్నారు: “గుర్తుంచుకోండి మీ ఆలోచన దేవుణ్ణి అనుమతించినంత వరకే, ఆయన మీకు దగ్గరగా ఉంటాడు. ఈ క్షణంలో ఆయన మీతో ఉన్నాడని మీరు అంగీకరిస్తే, మూసిన మీ కళ్ళ వెనుక, ఆయన సాన్నిహిత్యాన్ని అనుభవిస్తారు.” దేవుడు కేవలం ఒక ఆలోచనకు దూరంగా ఉన్నాడని మరియు ఎల్లప్పుడూ మన పట్ల ప్రేమపూర్వకమైన శ్రద్ధతో ఉన్నాడన్న విశ్వాసం మీకు ఉన్నప్పుడు, ఎంత తరచుగా మనం ఆయన వైపు తిరుగుతున్నాము మరియు ఆయన సహవాసంలో ఆనందిస్తున్నాము?

ఈ అంశంపై మన సన్యాసులు ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగులో ప్రసంగిస్తారు.

ఇంగ్లీషులో జరిగే స్వామి శ్రద్ధానందగారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 14, మంగళవారం
మధ్యాహ్నం 2:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు

“ధ్యానం ద్వారా జ్ఞానము మరియు శక్తి యొక్క అంతర్గత మూలాన్ని సృజించడం” అనే అంశంపై స్ఫూర్తిదాయక ప్రసంగం
(ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో)

దైనందిన జీవితంలోని భారాలు మరియు ఒత్తిళ్లలో నిమగ్నమైపోయి, ఇతరులు మరియు సమాజం మనపై ఉంచిన ఆకాంక్షల వల్ల మన దివ్య అన్వేషణలో పరధ్యానంగా ఉండటం చాలా సులభం. కానీ మనలో ఇప్పటికే అన్నిటినీ సాంత్వనపరిచే శాంతి, జ్ఞానం మరియు మైమరపించే ఆనందం ఉన్నాయి. దాగి ఉన్న ఈ ఊటను స్పృశించడానికి, ప్రతి ఒక్కరు పరమహంస యోగానందగారు బోధించిన శాస్త్రీయ మరియు సార్వత్రిక యోగ మార్గాన్ని అనుసరించి రోజువారీ ధ్యాన అభ్యాసాన్ని పెంపొందించుకోవాలి.

ఈ అంశంపై మన సన్యాసులు ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో ప్రసంగిస్తారు.

ఇంగ్లీషులో జరిగే స్వామి కమలానందగారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 14, మంగళవారం
సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:00 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఈ కార్యక్రమం శక్తిపూరణ వ్యాయామాల అభ్యాసంతో ప్రారంభమవుతుంది, తరువాత ధ్యానాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహిస్తారు. ధ్యాన సమయం ప్రారంభ ప్రార్థన, కీర్తన గానం మరియు నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానంతో కూడి ఉంటాయి. నిశ్శబ్ద ధ్యానం యొక్క సమయాలలో మార్పు ఉండవచ్చు, కాని సాధారణంగా 45 నిమిషాల నిడివి కలిగి ఉంటాయి. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో ధ్యానం ముగుస్తుంది.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 15, బుధవారం
ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు

క్రియాయోగ దీక్ష
(ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో)

వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. కు చెందిన క్రియాబాన్ లు మరియు క్రియాయోగ దీక్ష తీసుకోవడానికి అర్హత పొందినవారు మాత్రమే క్రియాయోగ దీక్ష వేడుకకు అనుమతించబడతారు. ఈ వేడుకలో పాల్గొనే క్రియాబాన్ లు, క్రియా నమోదు విభాగం వద్ద తమ ప్రవేశ కార్డులను స్వీకరించగలరు (దయచేసి మీ క్రియాబాన్ గుర్తింపు కార్డును తీసుకురండి).

వేదిక వద్ద ఉన్న వేరు వేరు ప్రాంగణాలలో ఏకకాలంలో ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో క్రియాయోగ దీక్ష నిర్వహించబడుతుంది.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడదు.

ఫిబ్రవరి 15, బుధవారం
ఉదయం 9:30 నుండి ఉదయం 11:00 వరకు

క్రియాయోగ దీక్షలో పాల్గొననివారి కోసం ధ్యానం మరియు సత్సంగం
(ఇంగ్లీషులో)

నియమిత సమయంపాటు ధ్యానాన్ని ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహిస్తారు మరియు పరమహంస యోగానందగారి బోధనలు “జీవించడం ఎలా” పై సత్సంగం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడదు.

ఫిబ్రవరి 15, బుధవారం
మధ్యాహ్నం 2:30 నుండి మధ్యాహ్నం 4:00 వరకు

క్రియాయోగ సమీక్షా తరగతి
(ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో)

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. కు చెందిన క్రియాయోగ దీక్షాపరులందరూ క్రియ సమీక్షా తరగతికి అనుమతించబడతారు. ఈ తరగతి ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో ఏకకాలంలో నిర్వహించబడుతుంది.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడదు.

ఫిబ్రవరి 15, బుధవారం
మధ్యాహ్నం 2:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు

క్రియాయోగ దీక్ష తీసుకోని వారికి సత్సంగం
(హిందీలో)

పరమహంస యోగానందగారి “జీవించడం ఎలా” బోధనలపై ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి స్ఫూర్తిదాయక సత్సంగం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడదు

ఫిబ్రవరి 15, బుధవారం
సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:00 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు, కీర్తనా గానంతో ధ్యానం

ఈ కార్యక్రమం శక్తిపూరణ వ్యాయామాల అభ్యాసంతో ప్రారంభమవుతుంది, తరువాత ధ్యానాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహిస్తారు. ధ్యాన సమయం ప్రారంభ ప్రార్థన, కీర్తన గానం మరియు నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానంతో కూడి ఉంటాయి. నిశ్శబ్ద ధ్యానం యొక్క సమయాలలో మార్పు ఉండవచ్చు, కాని సాధారణంగా 45 నిమిషాల నిడివి కలిగి ఉంటాయి. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో ధ్యానం ముగుస్తుంది.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 16, గురువారం
ఉదయం 7:00 నుండి ఉదయం 8:20 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఈ కార్యక్రమం శక్తిపూరణ వ్యాయామల అభ్యాసంతో ప్రారంభమవుతుంది, తరువాత ధ్యాన కార్యక్రమాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహిస్తారు. ధ్యాన సమయం ప్రారంభ ప్రార్థన, కీర్తన గానం మరియు నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానంతో కూడి ఉంటాయి. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ యొక్క అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో ధ్యానం ముగుస్తుంది.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 16, గురువారం
ఉదయం 9:30 నుండి ఉదయం 11:00 వరకు

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారి స్ఫూర్తిదాయక ప్రసంగంతో ముగింపు కార్యక్రమం

పరమహంస యోగానందగారి బోధనలలో ఐదు రోజులపాటు నిమగ్నమైన తర్వాత, ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం కలిసిన వారందరూ దివ్య సాన్నిధ్యం యొక్క ప్రత్యక్ష అనుభవాన్ని పొందాలని ఆశిస్తారు — ఇటువంటి సంగమాల యొక్క ప్రమాణ చిహ్నమయిన ఆశీస్సులు. సంగమ స్ఫూర్తిని ఇంటి వరకు ఎలా కొనసాగించాలి అనే దాని గురించి మరియు నిజమైన సమతుల్య జీవితం గడపడానికి మరియు దైవంతో అన్యోన్య సంబంధాన్ని పొందేందుకు పరమహంసగారు ప్రసాదించిన సాధనను ఎలా అనుసరించాలనే దాని గురించి స్వామి చిదానందగారు ముగింపు ప్రసంగంలో పంచుకుంటారు.

స్వామీజీ ప్రసంగానికి ముందు భక్తిగీతాల గానం నిర్వహించబడుతుంది.

మధ్యాహ్నం 2:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షుల ముగింపు ప్రసంగానికి అనువాదం
(హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో)

సంగమ కార్యక్రమంలో పాల్గొనేవారి కోసం ముగింపు కార్యక్రమం సందర్భంగా స్వామి చిదానందగారి స్ఫూర్తిదాయక ప్రసంగం యొక్క అనువాదాలు వై.ఎస్.ఎస్. సన్యాసులచే మూడు భాషలలో – హిందీ, తమిళం మరియు తెలుగులో – అందించబడతాయి.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడదు.

ఫిబ్రవరి 16, గురువారం
సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:00 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఈ కార్యక్రమం శక్తిపూరణ వ్యాయామాల అభ్యాసంతో ప్రారంభమవుతుంది, తరువాత ధ్యానాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహిస్తారు. ధ్యాన సమయం ప్రారంభ ప్రార్థన, కీర్తన గానం మరియు నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానంతో కూడి ఉంటాయి. నిశ్శబ్ద ధ్యానం యొక్క సమయాలలో మార్పు ఉండవచ్చు, కాని సాధారణంగా 45 నిమిషాల నిడివి కలిగి ఉంటాయి. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో ధ్యానం ముగుస్తుంది.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ప్రత్యక్ష ప్రసారాలు

ఫిబ్రవరి 12, ఆదివారం
ఉదయం 7:05 నుండి ఉదయం 8:20 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఈ కార్యక్రమం శక్తిపూరణ వ్యాయామల అభ్యాసంతో ప్రారంభమవుతుంది, తరువాత ధ్యాన కార్యక్రమాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహిస్తారు. ధ్యాన సమయం ప్రారంభ ప్రార్థన, కీర్తన గానం మరియు నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానంతో కూడి ఉంటాయి. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ యొక్క అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో ధ్యానం ముగుస్తుంది.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 12, ఆదివారం
ఉదయం 9:30 నుండి ఉదయం 11:00 వరకు

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారి స్ఫూర్తిదాయక ప్రసంగంతో ప్రారంభ కార్యక్రమం

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారి స్ఫూర్తిదాయక ప్రసంగంతో సంగమ ప్రారంభ కార్యక్రమం భక్తి గీతాలతో మొదలవుతుంది, ఆ తర్వాత వై.ఎస్.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారి స్ఫూర్తిదాయక ప్రసంగం ఉంటుంది. ఆధ్యాత్మిక పునరుద్ధరణ మరియు ఉన్నతి కలిగించే ఈ ఐదు రోజుల కార్యక్రమానికి భారతదేశంలోను మరియు ప్రపంచవ్యాప్తంగాను ఉన్న భక్తులను స్వామీజీ స్వాగతిస్తారు మరియు జీవితంలోని సవాళ్లను అధిగమించేందుకు మరియు మన అత్యున్నత సామర్థ్యాన్ని పొందే ప్రేరణను పంచుకుంటారు.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 12, ఆదివారం
సాయంత్రం 5:35 నుండి రాత్రి 8:00 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఈ కార్యక్రమం శక్తిపూరణ వ్యాయామాల అభ్యాసంతో ప్రారంభమవుతుంది, తరువాత ధ్యానాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహిస్తారు. ధ్యాన సమయం ప్రారంభ ప్రార్థన, కీర్తన గానం మరియు నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానంతో కూడి ఉంటాయి. నిశ్శబ్ద ధ్యానం యొక్క సమయాలలో మార్పు ఉండవచ్చు, కాని సాధారణంగా 45 నిమిషాల నిడివి కలిగి ఉంటాయి. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో ధ్యానం ముగుస్తుంది.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 13, సోమవారం
ఉదయం 7:05 నుండి ఉదయం 8:20 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఈ కార్యక్రమం శక్తిపూరణ వ్యాయామల అభ్యాసంతో ప్రారంభమవుతుంది, తరువాత ధ్యాన కార్యక్రమాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహిస్తారు. ధ్యాన సమయం ప్రారంభ ప్రార్థన, కీర్తన గానం మరియు నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానంతో కూడి ఉంటాయి. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ యొక్క అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో ధ్యానం ముగుస్తుంది.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 13, సోమవారం
ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు

“క్షమించడంలోని స్వస్థతా శక్తి” అనే అంశంపై స్ఫూర్తిదాయక ప్రసంగం

(ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో)

“ఏ హాని జరిగినా, ఒకరు క్షమించాలి. మనిషి క్షమించడం వల్లనే మానవ జాతి కొనసాగుతోందని చెప్పబడింది. క్షమ బలవంతుల బలం.”

ఈ వాక్యాలతో, మన పట్ల తప్పుగా ప్రవర్తించినవారిని క్షమించడం ఎంత అత్యున్నతమైనదో మహాభారతం ఉద్ఘాటిస్తుంది. క్షమించే వ్యక్తి ప్రక్షాళన పొందినట్లుగాను మరియు మనోహరమైన స్వేచ్ఛను పొందిన అనుభవం పొందుతాడు. క్షమాపణ అనే దివ్య గుణాన్ని ఆచరించడం వలన, క్షమాపణ పొందిన వ్యక్తి కంటే క్షమించే వ్యక్తికి ఎంత ప్రయోజనం ఉంటుందో ఈ ప్రసంగం ఉద్ఘాటిస్తుంది, అదే సమయంలో అంతర్గత శాంతికి మరియు ప్రశాంతతకు తలుపులు తెరుస్తుంది.

ఈ అంశంపై ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో మన సన్యాసులు ఏకకాలంలో ప్రసంగిస్తారు.

ఇంగ్లీషులో జరిగే స్వామి స్మరణానంద గిరి గారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 13, సోమవారం
మధ్యాహ్నం 2:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు

“అంతర్గత మరియు బాహ్య జీవితాలలో శాంతికి యువరాజుగా ఉండటం” పై స్ఫూర్తిదాయకమైన ప్రసంగం
(ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో)

పరమహంసగారు ఇలా అన్నారు: “ప్రశాంతంగా క్రియాశీలత మరియు క్రియాశీలకంగా ప్రశాంతతతో ఉండడం — సమతుల్యతా సింహాసనంపై కూర్చున్న శాంతి యువరాజు, కార్యాచరణ రాజ్యాన్ని నిర్దేశించడం — ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండటమే.” మన విధులను నిష్ఠగా నిర్వర్తిస్తున్నప్పుడు గాఢంగా ధ్యానం చేయడం మరియు అనంతర ప్రభావాలను గ్రహించడం ద్వారా మనం శాంతిని ఎలా పెంపొందించుకోవచ్చు మరియు దానిలో ఎలా నిమగ్నమై ఉండవచ్చు అనే అంశంపై ఈ ప్రసంగం కాంతిని ప్రసరిస్తుంది. మరియు ఎల్లవేళలా దైవానికి అనుశ్రుతిలో ఉండాలనే స్పృహతో కూడిన మానసిక ప్రయత్నం ద్వారా, ప్రేమ, సద్భావన మరియు సామరస్యం యొక్క ఆలోచనలను పంపడం ద్వారా మన అంతరిక శాంతిని ధృడ పరచుకోవచ్చు.

ఈ అంశంపై ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో మన సన్యాసులు ఏకకాలంలో ప్రసంగిస్తారు.

ఇంగ్లీషులో జరిగే స్వామి సుద్ధానందగారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 13, సోమవారం
సాయంత్రం 4:45 నుండి రాత్రి 8:00 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు
మరియు
శ్రీ స్వామి చిదానంద గిరి ద్వారా నిర్వహించబడే ప్రత్యేక దీర్ఘ ధ్యానం

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి ఈ సంగమం సందర్భంగా మూడు గంటల ప్రత్యేక ధ్యానాన్ని నిర్వహిస్తారని తెలియజేయడం మాకు సంతోషాన్ని కలిగిస్తోంది. పరమహంస యోగానందగారి బోధనల హృదయంలో ఉన్న ధ్యానం యొక్క శాంతి మరియు ఆనందాల అనుభవాన్ని పొందడంలో భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు మరియు స్నేహితులకు స్వామి చిదానందగారు మార్గనిర్దేశం చేస్తారు.

ధ్యానానికి ముందు శక్తిపూరణ వ్యాయామాల అభ్యాసం నిర్వహించబడుతుంది.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 14, మంగళవారం
ఉదయం 7:05 నుండి ఉదయం 8:20 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఈ కార్యక్రమం శక్తిపూరణ వ్యాయామల అభ్యాసంతో ప్రారంభమవుతుంది, తరువాత ధ్యాన కార్యక్రమాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహిస్తారు. ధ్యాన సమయం ప్రారంభ ప్రార్థన, కీర్తన గానం మరియు నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానంతో కూడి ఉంటాయి. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ యొక్క అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో ధ్యానం ముగుస్తుంది.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 14, మంగళవారం
ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు

“మీ ఆలోచన దేవుణ్ణి అనుమతించినంత వరకే, ఆయన మీకు దగ్గరగా ఉంటాడు” అనే అంశంపై స్ఫూర్తిదాయక ప్రసంగం
(ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో)

దయామాతాజీ ఇలా అన్నారు: “గుర్తుంచుకోండి మీ ఆలోచన దేవుణ్ణి అనుమతించినంత వరకే, ఆయన మీకు దగ్గరగా ఉంటాడు. ఈ క్షణంలో ఆయన మీతో ఉన్నాడని మీరు అంగీకరిస్తే, మూసిన మీ కళ్ళ వెనుక, ఆయన సాన్నిహిత్యాన్ని అనుభవిస్తారు.” దేవుడు కేవలం ఒక ఆలోచనకు దూరంగా ఉన్నాడని మరియు ఎల్లప్పుడూ మన పట్ల ప్రేమపూర్వకమైన శ్రద్ధతో ఉన్నాడన్న విశ్వాసం మీకు ఉన్నప్పుడు, ఎంత తరచుగా మనం ఆయన వైపు తిరుగుతున్నాము మరియు ఆయన సహవాసంలో ఆనందిస్తున్నాము?

ఈ అంశంపై మన సన్యాసులు ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగులో ప్రసంగిస్తారు.

ఇంగ్లీషులో జరిగే స్వామి శ్రద్ధానందగారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 14, మంగళవారం
మధ్యాహ్నం 2:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు

“ధ్యానం ద్వారా జ్ఞానము మరియు శక్తి యొక్క అంతర్గత మూలాన్ని సృజించడం” అనే అంశంపై స్ఫూర్తిదాయక ప్రసంగం
(ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో)

దైనందిన జీవితంలోని భారాలు మరియు ఒత్తిళ్లలో నిమగ్నమైపోయి, ఇతరులు మరియు సమాజం మనపై ఉంచిన ఆకాంక్షల వల్ల మన దివ్య అన్వేషణలో పరధ్యానంగా ఉండటం చాలా సులభం. కానీ మనలో ఇప్పటికే అన్నిటినీ సాంత్వనపరిచే శాంతి, జ్ఞానం మరియు మైమరపించే ఆనందం ఉన్నాయి. దాగి ఉన్న ఈ ఊటను స్పృశించడానికి, ప్రతి ఒక్కరు పరమహంస యోగానందగారు బోధించిన శాస్త్రీయ మరియు సార్వత్రిక యోగ మార్గాన్ని అనుసరించి రోజువారీ ధ్యాన అభ్యాసాన్ని పెంపొందించుకోవాలి.

ఈ అంశంపై మన సన్యాసులు ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో ప్రసంగిస్తారు.

ఇంగ్లీషులో జరిగే స్వామి కమలానందగారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 14, మంగళవారం
సాయంత్రం 5:35 నుండి రాత్రి 8:00 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఈ కార్యక్రమం శక్తిపూరణ వ్యాయామాల అభ్యాసంతో ప్రారంభమవుతుంది, తరువాత ధ్యానాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహిస్తారు. ధ్యాన సమయం ప్రారంభ ప్రార్థన, కీర్తన గానం మరియు నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానంతో కూడి ఉంటాయి. నిశ్శబ్ద ధ్యానం యొక్క సమయాలలో మార్పు ఉండవచ్చు, కాని సాధారణంగా 45 నిమిషాల నిడివి కలిగి ఉంటాయి. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో ధ్యానం ముగుస్తుంది.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 15, బుధవారం
సాయంత్రం 5:35 నుండి రాత్రి 8:00 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు, కీర్తనా గానంతో ధ్యానం

ఈ కార్యక్రమం శక్తిపూరణ వ్యాయామాల అభ్యాసంతో ప్రారంభమవుతుంది, తరువాత ధ్యానాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహిస్తారు. ధ్యాన సమయం ప్రారంభ ప్రార్థన, కీర్తన గానం మరియు నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానంతో కూడి ఉంటాయి. నిశ్శబ్ద ధ్యానం యొక్క సమయాలలో మార్పు ఉండవచ్చు, కాని సాధారణంగా 45 నిమిషాల నిడివి కలిగి ఉంటాయి. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో ధ్యానం ముగుస్తుంది.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 16, గురువారం
ఉదయం 7:05 నుండి ఉదయం 8:20 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఈ కార్యక్రమం శక్తిపూరణ వ్యాయామల అభ్యాసంతో ప్రారంభమవుతుంది, తరువాత ధ్యాన కార్యక్రమాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహిస్తారు. ధ్యాన సమయం ప్రారంభ ప్రార్థన, కీర్తన గానం మరియు నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానంతో కూడి ఉంటాయి. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ యొక్క అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో ధ్యానం ముగుస్తుంది.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 16, గురువారం
ఉదయం 9:30 నుండి ఉదయం 11:00 వరకు

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారి స్ఫూర్తిదాయక ప్రసంగంతో ముగింపు కార్యక్రమం

పరమహంస యోగానందగారి బోధనలలో ఐదు రోజులపాటు నిమగ్నమైన తర్వాత, ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం కలిసిన వారందరూ దివ్య సాన్నిధ్యం యొక్క ప్రత్యక్ష అనుభవాన్ని పొందాలని ఆశిస్తారు — ఇటువంటి సంగమాల యొక్క ప్రమాణ చిహ్నమయిన ఆశీస్సులు. సంగమ స్ఫూర్తిని ఇంటి వరకు ఎలా కొనసాగించాలి అనే దాని గురించి మరియు నిజమైన సమతుల్య జీవితం గడపడానికి మరియు దైవంతో అన్యోన్య సంబంధాన్ని పొందేందుకు పరమహంసగారు ప్రసాదించిన సాధనను ఎలా అనుసరించాలనే దాని గురించి స్వామి చిదానందగారు ముగింపు ప్రసంగంలో పంచుకుంటారు.

స్వామీజీ ప్రసంగానికి ముందు భక్తిగీతాల గానం నిర్వహించబడుతుంది.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఫిబ్రవరి 16, గురువారం
సాయంత్రం 5:35 నుండి రాత్రి 8:00 వరకు

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఈ కార్యక్రమం శక్తిపూరణ వ్యాయామాల అభ్యాసంతో ప్రారంభమవుతుంది, తరువాత ధ్యానాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహిస్తారు. ధ్యాన సమయం ప్రారంభ ప్రార్థన, కీర్తన గానం మరియు నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానంతో కూడి ఉంటాయి. నిశ్శబ్ద ధ్యానం యొక్క సమయాలలో మార్పు ఉండవచ్చు, కాని సాధారణంగా 45 నిమిషాల నిడివి కలిగి ఉంటాయి. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో ధ్యానం ముగుస్తుంది.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

రవాణా మరియు వసతి సౌకర్యాలు

ఫిబ్రవరి 10, 11, మరియు 12 తేదీలలో సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి), మరియు కాచిగూడ రైల్వే స్టేషన్లు మరియు హైదరాబాద్ విమానాశ్రయం నుండి వచ్చేవారి కోసం, మరియు ఫిబ్రవరి 16, మరియు 17 తేదీలలో వెళ్ళిపోయేవారి కోసం కాన్హా శాంతి వనం నుండి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది.

విమానాశ్రయం దగ్గర ఉన్న హోటళ్ళలో ఉండేవారి కోసం, అందరికీ అనుకూలమైన ఒక ప్రదేశం నుండి ఉదయం తీసుకు వెళ్ళడానికి మరియు అదే ప్రదేశంలో సాయంత్రం తిరిగి విడిచి పెట్టడానికి ఒక నిర్ణీత సమయంలో వై.ఎస్.ఎస్. ద్వారా రవాణా సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది. విమానాశ్రయం దగ్గర ఉన్న ఈ హోటళ్ళ నుండి వేదిక వద్దకు ప్రయాణించడానికి దాదాపు 45 నిమిషాల (25-30 కిలోమీటర్ల) సమయం పడుతుంది.

ప్రతి వ్యక్తికీ ఒక మంచము, పరుపు, దిండు తో కూడిన ఎయిర్ కండిషన్డ్ డార్మిటరి తరహా వసతి సౌకర్యం కల్పించబడుతుంది. స్త్రీలకు మరియు పురుషులకు విడివిడిగా వసతి ఏర్పాటు చేయబడుతుంది, కాబట్టి కుటుంబ సభ్యులు దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవలసినదిగా మనవి. ఆ సమయంలో హైదరాబాద్ లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి వెచ్చదనం కోసం దుస్తులు తెచ్చుకోవలసిన అవసరం ఉండదు.

మీ మద్దతు అవసరం

బయటి ప్రదేశంలో ఇంత పెద్ద ఎత్తున అయిదు రోజుల కార్యక్రమం నిర్వహించడానికి సంబంధించిన ఖర్చులు గణనీయంగా ఉంటాయి. ఒకరు హాజరవడానికి మేము అంచనా వేసిన ఖర్చులు ₹ 12000/- గా ఉన్నాయి. అయినప్పటికీ, పాల్గొనేవారికి ఖర్చులు ఆటంకపరచకుండా ఉండడానికి నమోదు రుసుమును రాయితీతో ₹ 4000/- కు తగ్గించాము.

దీన్ని దృష్టిలో ఉంచుకొని, ఈ ఖర్చులను భరించడంలో భక్తుల సహకారాన్ని మేము అభ్యర్థిస్తున్నాము. పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వడం ద్వారా ఈ రాయితీని భక్తులందరికీ అందించడానికి సహాయపడే భక్తులకు మేము చాలా కృతజ్ఞులమై ఉంటాము. తద్ద్వారా ఈ విశాలమైన ఆధ్యాత్మిక కుటుంబంలోని సభ్యులందరికీ గురుదేవుల ఆతిథ్యాన్ని అందించగలము.

మీ ఆధ్యాత్మిక పురోగతి మరియు ఆంతరిక ఆనందం, శాంతి వృద్ధి పొందటానికికు మా ప్రార్థనలను స్వీకరించండి.

దయచేసి గమనించండి: ఈ కార్యక్రమం యొక్క నిర్వహణ, మరియు అధ్యక్షులవారు అందులో పాల్గొనడం అనేది, కార్యక్రమానికి ముందు ఆ ప్రాంతంలో అమలులో ఉన్న కోవిడ్ ప్రయాణ పరిమితులు మరియు భద్రతా నిర్వహణ నియమాలపై ఆధారపడి ఉంటుంది.

నమోదు కోసం సంప్రదించాల్సిన వారి వివరాలు

యోగదా సత్సంగ శాఖా మఠం — రాంచీ
పరమహంస యోగానంద పథ్
రాంచీ 834001
ఝార్ఖండ్

ఫోన్: (0651) 6655 555
(సోమవారం నుండి శనివారం వరకు, ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.30 వరకు)

ఈ-మెయిల్: [email protected]

గత సందర్శనల చిత్రాలు:

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో షేర్ చేయండి