గురువు సాంగత్యములో ఉండడమంటే, కేవలము ఆయన భౌతిక సన్నిధిలో ఉండుట మాత్రమే కాదు (ఒక్కొక్కసారి ఇది అసాధ్యము కూడా), దీనర్థమేమంటే, ప్రధానంగా గురువును మన హృదయములో నిలుపుకొనుట, సూత్రప్రాయముగా ఆయనతో ఏకమగుట, నిత్యము ఆయనతో అనుసంధానములో ఉండుట.
— శ్రీ శ్రీ స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి, కైవల్యదర్శనం
కైవల్యదర్శనంలో స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి సర్వ మతాలలోని మూల ఏకత్వాన్ని వెల్లడించేందుకు పవిత్ర గ్రంథాల నుండి సమాంతర భాగాలను పరిశోధిస్తూ ప్రపంచానికి ఒక అసాధారణ గ్రంథాన్ని అందించారు. జ్ఞానావతారులు లేక “జ్ఞానం యొక్క అవతారం,” గా గౌరవించబడే స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు మే 10, 1855లో పశ్చిమ బెంగాల్లోని శ్రీరాంపూర్ లో జన్మించారు.
స్వామి శ్రీయుక్తేశ్వర్ గారి ఆవిర్భావ దినోత్సవాన్ని గౌరవించుకొనేందుకు, ఒక ప్రత్యేక స్మారకోత్సవ దీర్ఘ ధ్యానమును ఆదివారం, మే 4న ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించారు. ఆధ్యాత్మికోన్నతిని కలిగించే ఈ ఆంగ్ల కార్యక్రమంలో నియమిత సమయంపాటు భక్తిగీతాలాపన, స్ఫూర్తిదాయక పఠనం మరియు ధ్యానం కూడి ఉన్నాయి.
ఈ శుభ సందర్భంలో, వ్యక్తిగతంగా పాల్గొనే కార్యక్రమాలను కూడా వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళు నిర్వహించాయి.
ఈ పవిత్ర సందర్భంలో, మీరు విరాళం సమర్పించాలనుకొంటే, దయచేసి క్రింద ఉన్న లింక్ ను సందర్శించండి. స్వామి శ్రీయుక్తేశ్వర్ మరియు వై.ఎస్.ఎస్. గురుపరంపర నుండి ప్రవహించే అసంఖ్యాక ఆశీస్సులకు కృతజ్ఞతగా మేము అందుకున్న మీ సహకారానికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాం.