దక్షిణేశ్వర్ కోల్‌కతాలో ఉంటుంది. కోల్‌కతా నగరాన్ని, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వాయు మరియు రైలు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.
- సమీప విమానాశ్రయం – డమ్ డమ్ లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం.
- సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్లు – హౌరా, సియాల్దా, సాంత్రాగాఛీ, షాలిమార్ మరియు కోల్‌కతా.
- నగరం లోపల ప్రయాణించడానికి, సబర్బన్ రైళ్లు, మెట్రో, ఫెర్రీ మరియు బస్సుల వ్యవస్థ సులభంగా అందుబాటులో ఉంది.
వై.ఎస్.ఎస్. దక్షిణేశ్వర్ ఆశ్రమం యొక్క పూర్తి చిరునామా మరియు మ్యాప్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
దయచేసి క్రింది విభాగాలను చదివి మీకు అనుకూలమైన విధానాన్ని ఎంచుకోండి:
విమానం ద్వారా
డమ్ డమ్ లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం, కోల్‌కతాను భారతదేశం మరియు విదేశాలలోని అనేక నగరాలను కలుపుతుంది.
- విమానాశ్రయం నుండి టాక్సీ బుక్ చేసుకునేటప్పుడు, దక్షిణేశ్వర్లో శారదా మఠం మరియు ఆద్యాపీఠ్ దగ్గరలో ఉన్న అరియాదహాలోని “యోగదా మఠం (వై.ఎస్.ఎస్. ఆశ్రమం)” అని అడగండి.
- సుమారుగా దూరం – 11 కి.మీ.
రైలు ద్వారా
సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్లు – హౌరా, సియాల్దా, సాంత్రాగాఛీ, షాలిమార్ మరియు కోల్‌కతా.
- హౌరా ఇతర ప్రధాన నగరాలతో బాగా అనుసంధానించబడి ఉంది, ఉదాహరణకు ఢిల్లీ (∼1450 కి.మీ.), ముంబై (∼1970 కి.మీ.), మరియు చెన్నై (∼1660 కి.మీ.).
- సియాల్దా స్టేషన్ – ఉత్తరం, ఈశాన్య ప్రాంతాల నుండి వచ్చే రైళ్లకు మరియు కొన్ని సబర్బన్ లోకల్ రైళ్లకు చివరి స్టేషన్.
- సౌత్(దక్షిణ), సౌత్-ఈస్టర్న్(ఆగ్నేయ), సౌత్-సెంట్రల్(దక్షిణ మధ్య), సౌత్ వెస్టర్న్(నైరుతి), సౌత్-ఈస్ట్ సెంట్రల్(ఆగ్నేయ మధ్య) జోన్లకు సంబంధించిన రైళ్లు సాంత్రాగాఛీ, షాలిమార్ మరియు కోల్‌కతా స్టేషన్ల నుండి నడుస్తాయి.
ట్యాక్సీ ద్వారా:
- ప్రీపెయిడ్ టాక్సీని బుక్ చేసుకుని దక్షిణేశ్వర్లో శారదా మఠం మరియు ఆద్యాపీఠ్ సమీపంలోని అరియాదహాలో ఉన్న “యోగదా మఠం (వై.ఎస్.ఎస్. ఆశ్రమం)” అని అడగండి.
- శారదా మఠం నుండి వై.ఎస్.ఎస్. ఆశ్రమం సుమారు 200 మీటర్ల దూరంలోను మరియు ఆద్యాపీఠ్ నుండి సుమారు 1 కి.మీ. దూరంలోను ఉంది.
- సుమారుగా దూరం:
- శ్యామ్ బజార్ మీదుగా – 10 కి.మీ.
- జి.టి. రోడ్డు మీదుగా – 12 కి.మీ.
ఫెర్రీ ద్వారా:
- హౌరా రైల్వే స్టేషన్ నుండి ఉత్తరపారా వరకు లోకల్ రైలు ఎక్కండి.
- ఉత్తరపారా రైల్వే స్టేషన్లో దిగి, స్టేషన్ నుండి సుమారు 1.5 కి.మీ. దూరంలో ఉన్న ఫెర్రీ సర్వీస్ పాయింట్ వైపు వెళ్లండి.
- గంగానదిని ఫెర్రీలో దాటి అరియాదహా ఫెర్రీ డ్రాప్ పాయింట్ వద్ద దిగండి.
- డ్రాప్ పాయింట్ నుండి సుమారుగా దూరం – 500 మీటర్లు.
మెట్రో ద్వారా:
- హౌరా మెట్రో స్టేషన్, హౌరా రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం సమీపంలో ఉంది.
- ఎస్ప్లనేడ్ వైపు వెళ్లే గ్రీన్ లైన్ మెట్రో ఎక్కండి.
- ఎస్ప్లనేడ్ అనేది మెట్రో లైన్లు మారే ఒక ప్రధాన ఇంటర్చేంజ్ స్టేషన్, అక్కడి నుండి దక్షిణేశ్వర్ వైపు వెళ్లే బ్లూ లైన్ మెట్రో ఎక్కండి.
- దక్షిణేశ్వర్ మెట్రో స్టేషన్ నుండి సుమారు దూరం – 2 కి.మీ.
- సైకిల్ రిక్షాలు మరియు మూడు-చక్రాల వాహనాలు సులభంగా అందుబాటులో ఉంటాయి.
- సుమారుగా దూరం – 13 కి.మీ.
- దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్ వరకు లోకల్ రైలు ఎక్కండి.
- స్టేషన్ నుండి వై.ఎస్.ఎస్. ఆశ్రమం సుమారుగా 2 కి.మీ. దూరంలో ఉంటుంది.
- దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్ నుండి సైకిల్ రిక్షాలు, టాక్సీలు, క్యాబ్‌లు మరియు మూడు-చక్రాల వాహనాలు సులభంగా అందుబాటులో ఉంటాయి.
- సుమారుగా దూరం:
- సాంత్రాగాఛీ రైల్వే స్టేషన్ నుండి – 21.4 కి.మీ.
- షాలిమార్ రైల్వే స్టేషన్ నుండి – 27 కి.మీ.
- హౌరా రైల్వే స్టేషన్ వరకు లోకల్ రైలు ఎక్కండి. హౌరా రైల్వే స్టేషన్ నుండి వై.ఎస్.ఎస్. ఆశ్రమానికి చేరుకునే వివిధ మార్గాల కోసం పైన ఉన్న విభాగాన్ని చూడండి.
- ప్రత్యామ్నాయంగా, ఈ రైల్వే స్టేషన్ల నుండి నేరుగా టాక్సీలో వెళ్ళవచ్చు.
- సుమారుగా దూరం – 10 కి.మీ.
- దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్ వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి.
- శ్యాంబజార్ లేదా బెల్గాచియా మెట్రో స్టేషన్ల నుండి దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్ వరకు మీరు మెట్రోలో కూడా రావచ్చు.
- యోగదా మఠం (వై.ఎస్.ఎస్. ఆశ్రమం) దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్ నుండి సుమారు 2 కి.మీ దూరంలో ఉంది.
- దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్ నుండి సైకిల్ రిక్షాలు, టాక్సీలు, క్యాబ్‌లు మరియు మూడు-చక్రాల వాహనాలు సులభంగా అందుబాటులో ఉంటాయి.
మెట్రో ద్వారా (ఇంటర్సిటీ)
నగరాల మధ్య మరియు కోల్‌కతా లోపల ప్రయాణించడానికి మెట్రో నెట్వర్క్ కూడా అందుబాటులో ఉంటుంది. ఆశ్రమానికి సమీప మెట్రో స్టేషన్ – దక్షిణేశ్వర్ మెట్రో స్టేషన్. ఇది కోల్‌కతా మెట్రో నెట్వర్క్ లోని బ్లూ లైన్లో ఉంటుంది.

















