వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షుల భారత పర్యటన — 2025

(ప్రత్యక్ష ప్రసారం జరిగే కార్యక్రమాలతో కలిపి)

YSS-SRF-President-Swami-Chidanandaji's-Upcoming-India.Tour-2025-Featured-Image

బెంగళూరు, చెన్నై మరియు అహ్మదాబాద్ కార్యక్రమాలకు మాత్రమే నమోదు అవసరమవుతుంది. మరింత తెలుసుకోండి

స్వామీజీ పర్యటనకు సంబంధించిన ఫోటోలను వీక్షించడానికి, ఇక్కడ క్లిక్ చేయండి.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ గౌరవనీయ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరిగారు ఫిబ్రవరి మరియు మార్చి 2025లో భారతదేశం మరియు నేపాల్లో పర్యటించేందుకు యోచిస్తున్నారని ప్రకటించడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. స్వామిజీ భారతదేశంలోని నాలుగు ముఖ్య నగరాలలో (బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ మరియు నోయిడా) మరియు నేపాల్లోని ఖాట్మండులో పర్యటిస్తారు, ఆయన పర్యటించే ప్రాంతాలలో ప్రత్యేక ఒక-రోజు కార్యక్రమాలు క్రింద తెలిపిన విధంగా నిర్వహించబడతాయి: 

  • ఆదివారం, ఫిబ్రవరి 2: బెంగళూరు
  • ఆదివారం, ఫిబ్రవరి 9: చెన్నై
  • ఆదివారం, ఫిబ్రవరి 23: అహ్మదాబాద్
  • గురువారం, ఫిబ్రవరి 27: నోయిడా
  • శనివారం, మార్చి 1: ఖాట్మండు

2023లో స్వామీజీ సందర్శన ఆధ్యాత్మికంగా ఎంత లాభదాయకంగా మరియు స్పూర్తిదాయకంగా ఉన్నదో మనం ప్రేమగా గుర్తుచేసుకున్నప్పుడు, రాబోయే స్వామీజీ పర్యటన గురించి ఉత్సుకతతో కూడిన నిరీక్షణ, మన హృదయాలను ఆనందంతో నింపుతుంది. ఈ కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా భక్తులందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.

para-ornament

ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలు

ఫిబ్రవరి 23 మరియు ఫిబ్రవరి 27 తేదీలలో అహ్మదాబాద్ మరియు నోయిడాలలో జరిగే స్వామి చిదానందగారి పర్యటన కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయని తెలియజేయడం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. మరిన్ని వివరాలు క్రింద తెలియజేయబడ్డాయి.

నిర్ణీత సమయానికి పాల్గొనలేనివారి కోసం, తరువాత కూడా ఈ కార్యక్రమాలు వీక్షించడానికి అందుబాటులో ఉంటాయి.

అహ్మదాబాద్

ఆదివారం, ఫిబ్రవరి 23, 2025

ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 (భారతీయ కాలమానం) వరకు

స్వామి చిదానంద గిరిగారితో
ప్రత్యేక దీర్ఘ ధ్యానం

2025 భారతదేశ పర్యటనలో భాగంగా, అహ్మదాబాద్ పర్యటనలో, ఒక ప్రత్యేక మూడు-గంటల ధ్యానాన్ని వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి నిర్వహిస్తారని తెలియజేయడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

పరమహంస యోగానందగారి బోధనలకు కేంద్రబిందువైన ధ్యానం యొక్క ప్రశాంతత మరియు ఆనందములను అనుభవించేందుకు ప్రపంచవ్యాప్తంగాను మరియు భారతదేశంలోను ఉన్న వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు మరియు స్నేహితులను స్వామి చిదానందగారు నిర్దేశిస్తారు.

ఆదివారం, ఫిబ్రవరి 23, 2025

సాయంత్రం 6:30 నుండి సాయంత్రం 7:30 (భారతీయ కాలమానం) వరకు

స్వామి చిదానంద గిరితో సత్సంగం (ఆంగ్లంలో) —
ధ్యానం: పరమానందం మరియు సమృద్ధికి మార్గం

ధ్యానం ఆధ్యాత్మిక సంపదలైన ప్రశాంతత, ఆనందం మరియు సంతృప్తులను కలుగచేస్తూ, దివ్యానందానికి ఒక పవిత్ర ద్వారాన్ని తెరుస్తుంది. అంతరిక సమృద్ధిలో మనం జాగృతమైనప్పుడు దాని ప్రభావాలు సుసహజంగా ప్రవహిస్తూ, శారీరక, మానసిక, భౌతిక శ్రేయస్సు తో సహా మన జీవితంలో అన్ని విషయాలలోనూ ఉన్నతిని చేకూరుస్తాయి.

జ్ఞానదాయకమైన ఈ ప్రసంగంలో, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారు, అంతర్గత సామరస్యం, శక్తి మరియు భద్రతలకు దారితీసే దివ్యకృప మరియు శక్తి యొక్క అనంతమైన మూలంతో ధ్యానం మనను ఎలా కలుపుతుందో వివరిస్తారు. దైవంతో మన ఆంతరంగిక సంబంధాన్ని పెంపొందించుకోవడం ద్వారా, ఆధ్యాత్మిక సంపదలు మన అంతర్గత జీవితాన్ని మార్చడమే కాకుండా మన బాహ్య జీవితంలో సమతుల్యత, స్పష్టత మరియు సమృద్ధిగా వ్యక్తమవుతాయని మనము కనుగొంటాము.

నోయిడా

గురువారం, ఫిబ్రవరి 27, 2025

సాయంత్రం 6:30 నుండి సాయంత్రం 7:30 (భారతీయ కాలమానం) వరకు

స్వామి చిదానంద గిరిగారితో సత్సంగం —
ధ్యానంతో మన దివ్యశక్తిని మేల్కొల్పడం

మనలో ప్రతి ఒక్కరిలో అనంతశక్తి యొక్క కోశాగారం ఉంది, అది గ్రహించబడడానికి వేచి ఉంది. ఈ గుప్తనిధిని తెరిచేందుకు ధ్యానం కీలకమైనది, మన నిజస్వరూపాల అత్యున్నత వ్యక్తీకరణకు మనల్ని అది నిర్దేశిస్తుంది.

ఈ ప్రసంగంలో, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరిగారు, చిత్తశుద్ధి మరియు నియమంగా ధ్యానసాధన చేయడం, మీలో ఉన్న దివశక్తిని ఎలా మేల్కొల్పుతుందనేదానిపై దృష్టి సారిస్తారు. శరీరం, మనస్సు మరియు ఆత్మను సామరస్యంగా ఉంచడం వల్ల, ధ్యానం ఆంతరిక పరివర్తనకు మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి మార్గం ఏర్పరచి, శాంతి ఆనందాలతో కూడిన ఒక ప్రయోజనాత్మక జీవనానికి శక్తినిస్తుందని వివరిస్తారు.

కార్యక్రమం వివరాలు

వివరాలు

ఆదివారాలలో బెంగళూరు (ఫిబ్రవరి 2), చెన్నై (ఫిబ్రవరి 9), మరియు అహ్మదాబాద్ (ఫిబ్రవరి 23):

  • ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 01:00 — దీర్ఘ ధ్యానం
  • మధ్యాహ్నం 02:30 నుండి మధ్యాహ్నం 03:30 — కీర్తనలు/వీడియో ప్రదర్శన
  • సాయంత్రం 04:30 నుండి సాయంత్రం 06:00 — ధ్యానం
  • సాయంత్రం 06:30 నుండి సాయంత్రం 07:30 — గౌరవనీయ అధ్యక్షుల వారిచే సత్సంగం


నోయిడా (గురువారం, ఫిబ్రవరి 27):

  • సాయంత్రం 04:30 నుండి సాయంత్రం 06:00 — ధ్యానం
  • సాయంత్రం 06:30 నుండి సాయంత్రం 07:30 — గౌరవనీయ అధ్యక్షుల వారిచే సత్సంగం


ఖాట్మండు (శనివారం, మార్చి 1):

  • సాయంత్రం 04:00 నుండి సాయంత్రం 05:00 — ధ్యానం
  • సాయంత్రం 05:00 నుండి సాయంత్రం 06:00 — గౌరవనీయ అధ్యక్షుల వారిచే సత్సంగం

 

కార్యక్రమం వేదికలు

కార్యక్రమ వేదికల చిరునామా మరియు గూగుల్ మ్యాప్ లింక్ లను దయచేసి క్రింద కనుగొనగలరు:

బెంగళూరు

ద రాయల్ సెనేట్
గేట్ నంబర్ 6, ప్యాలస్ గ్రౌండ్స్
జయమహాల్, బెంగళూరు
కర్ణాటక – 560006

గూగుల్ మ్యాప్ లింక్ yssi.org/PITblr

చెన్నై

శ్రీ రామచంద్ర కన్వెన్షన్ సెంటర్, 24/13A
సౌత్ ఎవెన్యూ రోడ్, వాసుదేవనగర్
తిరువన్మియూర్, చెన్నై
తమిళనాడు – 600041

గూగుల్ మ్యాప్ లింక్ yssi.org/PITchn

అహ్మదాబాద్

గోల్డెన్ గ్లోరి హాల్
కర్ణావటి క్లబ్, సర్ఖేజ్ – గాంధీనగర్ హైవే
షల్బి హాస్పిటల్ ఎదుట, స్ప్రింగ్ వ్యాలీ
ముమత్పుర, అహ్మదాబాద్
గుజరాత్ – 380058

గూగుల్ మ్యాప్ లింక్ yssi.org/PITamdbd

నోయిడా

యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం – నోయిడా
పరమహంస యోగానంద మార్గ్
బి-4, సెక్టార్ 62
నోయిడా – 201307
గౌతమ్ బుద్ధా నగర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్

గూగుల్ మ్యాప్ లింక్ yssi.org/PITnoida

ఖాట్మండు

ఉల్లేన్స్ స్కూల్, క్యాంపస్ 1 (కవరు చేయబడిన ప్రాంగణం)
ఖుమల్టర్, లలిత్పూర్-15
నేపాల్

గూగుల్ మ్యాప్ లింక్ yssi.org/PITnepal

నమోదు

బెంగళూరు, చెన్నై మరియు అహ్మదాబాద్ లలో నిర్వహించే కార్యక్రమాలకు నమోదు అవసరమవుతుంది. కాని నోయిడా మరియు ఖాట్మండులో జరిగే కార్యక్రమాలకు ఈ విధమైన నమోదు అవసరం లేదు.

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు మాత్రమే బెంగళూరు, చెన్నై మరియు అహ్మదాబాద్ కార్యక్రమాలకు నమోదు చేసుకోవడానికి అర్హత కలిగి ఉన్నారు, మరియు 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సుగల బాలలకు అనుమతి లేదు. అయినప్పటికీ, నోయిడా మరియు ఖాట్మండు సహా అన్ని ప్రాంతాలలో జరిగే సాయంత్రం కార్యక్రమాలలో భక్తుల కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది.

నమోదు ఇప్పుడు ప్రారంభమయ్యింది!

ఒక వ్యక్తికి నమోదు రుసుము ₹ 1000 ఈ రుసుము భోజనంతో కూడి ఉంటుంది. అయినప్పటికీ, భక్తులు నివసించే రోజుల సంఖ్యను బట్టి, వసతి సౌకర్యాల నిమిత్తం అదనపు రుసుము చెల్లించవలసి ఉంటుంది. వసతి యొక్క ధరలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • అహ్మదాబాద్: ఒక వ్యక్తికి ఒక రాత్రికి ₹ 500
  • బెంగళూరు: ఒక వ్యక్తికి ఒక రాత్రికి ₹ 800
  • చెన్నై: ఒక వ్యక్తికి ఒక రాత్రికి ₹ 800

నమోదు రుసుము చెల్లించడంలో మీకు ఇబ్బంది కలిగితే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

para-ornament

మీరు ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాలలో కార్యక్రమాలకు హాజరు కావడానికి ఆసక్తి కలిగి ఉంటే, అలా పాల్గొనడానికి మీకు స్వాగతం. నమోదు పద్ధతికి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇవ్వబడింది:

డివోటీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ నమోదు:

త్వరగా మరియు తేలికగా నమోదు చేసుకోవడానికి, దయచేసి క్రింద ఉన్న బటన్ క్లిక్ చేసి నమోదు చేసుకోండి.

వై.ఎస్.ఎస్. సహాయ కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా నమోదు:

రాంచీ ఆశ్రమం సహాయ కేంద్రానికి (0651) 6655 555 ఫోన్ చేసి లేక ఈ-మెయిల్ ద్వారా క్రింది వివరాలను అందజేయండి:

  • మీ పూర్తి పేరు
  • వయస్సు
  • చిరునామా
  • ఈ-మెయిల్
  • టెలిఫోన్ నంబర్
  • వై.ఎస్.ఎస్. పాఠాల నమోదు సంఖ్య (లేక ఎస్.ఆర్.ఎఫ్. సభ్యత్వ సంఖ్య)
  • మీ ప్రతిపాదిత ఆగమనం మరియు నిష్క్రమణ తేదీలు

మీ మొబైల్ కు లేక ఈ-మెయిల్ అడ్రస్ కు పంపబడే చెల్లింపు లింక్ ద్వారా డబ్బు చెల్లించవచ్చు.

ఎస్.ఆర్.ఎఫ్. భక్తుల కోసం నమోదు:

ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు, వై.ఎస్.ఎస్. సహాయ కేంద్రాన్ని ఈ-మెయిల్ ద్వారా సంప్రదించి పైన పేర్కొన్న తమ వివరాలన్నిటినీ అందజేయమని అభ్యర్థిస్తున్నాం.

కాగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎస్.ఆర్.ఎఫ్. భక్తులను కూడా ఆహ్వానిస్తున్నాం, వేదిక వద్ద ఉన్న ప్రాంగణంలోనే వారు భోజనం చేయవచ్చు, తమ స్వంత వసతిని ఏదో ఒక సమీపంలోగల హోటళ్ళు లో ఏర్పాటు చేసుకోవలసిందిగా విజ్ఞప్తి.

para-ornament

దయచేసి గమనించండి:

  • విజయవంతంగా నమోదైన తరువాత, మీ నమోదును ధృవీకరిస్తూ మీకొక ఈ-మెయిల్ లేక ఎస్.ఎం.ఎస్. పంపించబడుతుంది. మీకు అటువంటి సందేశం అందకపోతే, దయచేసి వై.ఎస్.ఎస్. రాంచీ సహాయ కేంద్రాన్ని ఫోన్ (0651) 6655 555 లేక ఈ-మెయిల్ [email protected] ద్వారా సంప్రదించండి.
  • మొదట వచ్చిన వారికి, మొదటి కేటాయింపు ప్రాతిపదిక: వివిధ ప్రాంతాలలో ఉన్న పరిమితమైన వసతి సౌకర్యాల కారణంగా, మొదట నమోదు చేసుకొన్నవారికి మొదటి కేటాయింపు ప్రాతిపదికపై వసతి అవసరం ఉన్నవారి నమోదులు ధృవీకరించబడతాయి.
  • మీ నమోదు ధృవీకరించబడి మీరు హాజరయ్యే అవకాశం లేకపోతే, మీ నమోదు రుసుము తిరిగి ఇవ్వబడదు లేక వేరే వ్యక్తికి బదిలీ చేయబడదు.
వసతి

బెంగళూరు, చెన్నై మరియు అహ్మదాబాద్ వద్ద

బెంగళూరు, చెన్నై మరియు అహ్మదాబాద్ లలో జరిగే ఒక-రోజు కార్యక్రమాల కోసం భక్తులు, కార్యక్రమం జరిగే ముందు రోజు సాయంత్రమే చేరుకోవచ్చు, మరియు కార్యక్రమం ముగిసిన తరువాత రోజు ఉదయం వరకు నివసించవచ్చు. ఈ ప్రాంతాలలోని వసతి సౌకర్యాలను మీరు వినియోగించుకోవాలనుకొంటే, ప్రతి భక్తుడు నివసించాలనుకొన్న రోజులను బట్టి అదనపు ఛార్జీలు (పైన పేర్కొన్న నమోదు విభాగం క్రింద) ఉంటాయి.

నోయిడా మరియు ఖాట్మండు దగ్గర

నోయిడా ఆశ్రమంలో వసతి కావలసినవారు, పరిమితమైన లభ్యత కారణంగా దయచేసి ఆశ్రమాన్ని నేరుగా సంప్రదించండి. అలాగే, ఖాట్మండులో జరిగే కార్యక్రమంలో మీరు పాల్గొనాలని భావిస్తే, ఖాట్మండు కేంద్రానికి చేరుకోగలరు. నోయిడా ఆశ్రమం మరియు ఖాట్మండు కేంద్రానికి సంబంధించిన వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం – నోయిడా
పరమహంస యోగానంద మార్గం
బి-4, సెక్టార్ 62
నోయిడా – 201307
గౌతంబుద్ధానగర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్

ఫోన్: 9899811808, 9899811909,
(0120) 2400670, (0120) 2400671

ఈ-మెయిల్: [email protected]

పరమహంస యోగానంద ధ్యాన సమాజ్ నేపాల్ (PYDSN) – కొపుండోల్
ఖాట్మండు, నేపాల్
కొపుండోల్

ఫోన్: (+977) 5452837, (+977) 5423610, (+977) 5420183,
(+977) 9851084325, (+977) 9801039667, (+977) 9801009131

ఈ-మెయిల్: [email protected]

దయచేసి గమనించండి

  • మొదట వచ్చిన వారికి, మొదటి కేటాయింపు ప్రాతిపదిక: వివిధ ప్రాంతాలలో ఉన్న పరిమితమైన వసతి సౌకర్యాల కారణంగా, మొదట నమోదు చేసుకొన్నవారికి మొదటి కేటాయింపు ప్రాతిపదికపై వసతి అవసరం ఉన్నవారి నమోదులు ధృవీకరించబడతాయి.
  • పురుషులకు మరియు స్త్రీలకు విడివిడిగా, ఇతరులతో పంచుకొనే విధంగా వసతి ఏర్పాటు చేయబడుతుంది. కుటుంబ సభ్యులు దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోగలరు.
  • ఆహారం లేక వసతి విషయంలో ప్రత్యేక అవసరాలు ఉన్న భక్తులు దయచేసి తమ స్వంత ఏర్పాట్లను చేసుకోగలరు. దగ్గరలోగల హోటళ్ళ జాబితా క్రింద ఇవ్వబడింది.

నమోదుకు మరియు ఇతర వివరాలకు సంప్రదించండి

యోగదా సత్సంగ శాఖా మఠం – రాంచీ
పరమహంస యోగానంద పథ్
రాంచీ 834001
ఝార్ఖండ్

ఫోన్: (0651) 6655 555
(సోమవారం-శనివారం, ఉదయం 09:30 నుండి సాయంత్రం 04:30)

ఈ-మెయిల్: [email protected]

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో పంచుకోండి