శ్రీ శ్రీ మృణాళినీమాత నుండి క్రిస్మస్ సందేశం

"క్రిస్మస్ పవిత్ర దినాన విశ్వజనీన సౌభ్రాతృత్వం, సకల జీవరాశులపట్ల ప్రేమ అనే నవీన చైతన్యాన్ని మీలో అనుభూతి చెందడానికి ధ్యానం చేసి మీ మనస్సును ఆయత్తపఱచడమే, నిజమైన క్రిస్మస్ పండుగ."

క్రిస్మస్ 2012

క్రిస్మస్ శుభాశీస్సులు, ఏసు ప్రభువు యొక్క పరిమిత శిశువు రూపంలో జననాన్ని ఆరాధిద్దాం, ఆ శిశువులోనే అనంతమైన క్రీస్తు అవతారాము, సృష్టిలోని దేవుని సర్వవ్యాపకత్వాన్ని ఉన్నాయి. ఏసులో వ్యక్త౦ చేయబడిన విశ్వజనీనమైన క్రీస్తు ప్రేమ, శాంతి, ఆన౦దాలు మీ హృదయ౦లో, ఆత్మలో అనుభూతి చెందాలని నేను ప్రార్థిస్తున్నాను. భగవంతుని చైతన్యాన్ని నిరంతరము వికసింపజేయు ప్రేమ మరియు కాంతుల అంతర్గత ఆధ్యాత్మిక అవగాహనతో క్రిస్మస్ ను జరుపుకోండి — యుగయుగాలుగా భగవంతుడు తన అవతారాల ద్వారా అనుగ్రహించిన నిరంతర, అదృశ్య సహాయ, సహకారములు. ఈ పవిత్ర తరుణంలో విశిష్టమైన ప్రేమ, కృపలతో మీకు అనుగ్రహించబడుతున్న ఆధ్యాత్మిక అభ్యున్నతి యొక్క ఈశ్వరుని కానుకలను నిండుగా అందుకునే౦దుకు, మీ ఆలోచనలు మరియు భావాలను విశ్వాసంతో ఆ ఆశీర్వాదములపై ఉంచండి. మీ వేడుకలలో శా౦తి, ఆన౦దాల స్పందనలు, దైన౦దిన సంరక్షణల బరువును, అనిశ్చితుల భారాన్ని ఎత్తివేస్తాయి — ఏసు ధృవపరిచిన విధముగా భగవంతుణ్ణి ప్రతిబి౦బి౦చే గుణాలు, పరిమితిని అధిగమి౦చే సామర్థ్యాలు, మన జన్మహక్కు అనే సహాజావబోధ హామీని మీ యొక్క నిశ్చల లోతులో తెలుసుకోగలుగుతారు. ఆ అవగాహన పొందటానికి ఆయన మనకు మార్గాన్ని చూపి౦చారు: ప్రప్రదమముగా “నీ పూర్ణహృదయముతోను, ఆత్మతోను, శక్తితోను, మనస్సుతోను” దేవుని ప్రేమి౦చు; రెండవది, “నీలా నీ పొరుగువారిని ప్రేమించు” — భగవంతునిలో తల్లీనమైన ఆరాధనాత్మక ధ్యానం మరియు ఆత్మ-గుణాలచే నిర్దేశించబడిన కరుణ, సేవ మరియు నడవడితో నిండిన జీవితాన్ని గడపండి.

మన గురుదేవులైన పరమహంస యోగానందగారు ఏసు గురి౦చి ఇలా అన్నారు: “మానవ దృష్టికి ఆయన బెత్లెహేములో పుట్టిన చిన్న శిశువు, రోగులను స్వస్థపరచి, చనిపోయినవారిని బ్రతికించిన రక్షకుడు. దైవ దృష్టికి ఆయన సర్వాంతర్యామి మరియు ప్రతి పరమాణువులోనూ ఉన్న క్రీస్తు-చైతన్యం. మీలో ఉన్నఅటువంటి క్రీస్తును తెలుసుకోవాలని మీరు ఆకాంక్షించాలి.” గురుదేవులు ప్రతి ఏడాది క్రిస్మస్ కు ముందు ఒక ప్రత్యేక ధ్యాన దినాన్ని నిర్వహించే సంప్రదాయాన్ని ప్రారంభించారు. సుదీర్ఘమైన, గాఢమైన ధ్యాన౦ ద్వారా “ఆధ్యాత్మిక క్రిస్మస్” ను జరుపుకోవడ౦, ఏసు ప్రభులోని క్రీస్తు యొక్క నిజమైన అర్థాన్ని గ్రహి౦చాలనే భక్తితో, ఆత్మ తపనతో ప్రయత్నము చేయటముతో, మానవ అవగాహనకు అందని క్రీస్తు-శా౦తి రాజ్యాన్ని మన౦ క్షణ కాలము వీక్షించ గలుగుతాము. మన౦ కూడా క్రీస్తు జీవి౦చిన చైతన్య౦లో — నిర్భయ౦గా, ఆన౦ద౦గా — పరిస్థితులచే పాలి౦పబడకు౦డా లేదా భ్రాంతికరమైన కోరికలు, అనుబ౦ధాలతో, అహ౦కార మోహ౦తో ప్రభావితం కాకు౦డా జీవి౦చగలమనే విశ్వాస౦తో నింపబడతాము. మన జీవితాలలో నిస్వార్థప్రేమ మరియు సత్యంలో లంగరు వేయడమంటే, ఈ ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు కూడా పరమాత్మతో మనకున్న శాశ్వత బంధము గురించిన అవగాహనలో మేల్కొని ఉండటమే.

ఈ పవిత్ర తరుణంలో క్రిస్మస్ కానుకలుగా భగవంతుని, క్రీస్తు మరియు మహా గురువుల ప్రేమ, ఆశీస్సులు సమృద్ధిగా పొందుదురు గాక.

వారి నిరంతర ప్రేమ, ఆశీర్వాదాలలో,

 

శ్రీ మృణాళినీమాత

కాపీరైట్ © 2012 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులు ఆరక్షితం.

ఇతరులతో పంచుకోండి