భగవద్గీత జ్ఞానంపై మా స్ఫూర్తిదాయక ప్రసంగాల శ్రేణిని కొనసాగిస్తూ, వై.ఎస్.ఎస్. సీనియర్ సన్యాసి స్వామి స్మరణానంద గిరిచే తెలుగులో అందించబడే ప్రవచనానికి హాజరు కావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రసంగం, పరమహంస యోగానంద గారి భగవద్గీత అనువాదమైన God Talks With Arjuna అనే గ్రంథం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ప్రియమైన ధర్మగ్రంథమైన భగవద్గీతపై ఆ మహగురువు యొక్క భగవద్ప్రేరితమైన అనువాదం మరియు విస్తృతమైన వ్యాఖ్యానం.
ఈ ప్రసంగంలో, స్వామి స్మరణానందగారు I వ అధ్యాయంలోని 2వ శ్లోకానికి యోగానందగారి వ్యాఖ్యానాన్ని ఆధారంగా చేసుకుని, భౌతిక కోరికలు మరియు చెడు అలవాట్లు భక్తుడు ఆధ్యాత్మిక సాధనలో ప్రయత్నం చేయకుండా ఎలా నిరుత్సాహపరుస్తాయో మరియు క్రమమైన ధ్యానం ద్వారా వాటిని ఎలా అధిగమించవచ్చో తెలియచేస్తారు.
భగవద్గీతపై గత ప్రసంగాలు
ఈ ప్రసంగం యొక్క మొదటి భాగాన్ని తెలుగులో వీక్షించడానికి, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

















