జీవన సమరంలో విజయం సాధించడం (నా లోపలి కురుక్షేత్రం) – భాగం III (తెలుగులో)

by స్వామి స్మరణానంద గిరి

భగవద్గీత జ్ఞానంపై మా స్ఫూర్తిదాయక ప్రసంగాల శ్రేణిని కొనసాగిస్తూ, వై.ఎస్.ఎస్. సీనియర్ సన్యాసి స్వామి స్మరణానంద గిరిచే తెలుగులో అందించబడే ప్రవచనానికి హాజరు కావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రసంగం, పరమహంస యోగానంద గారి భగవద్గీత అనువాదమైన God Talks With Arjuna అనే గ్రంథం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ప్రియమైన ధర్మగ్రంథమైన భగవద్గీతపై ఆ మహాగురువు యొక్క భగవద్ప్రేరితమైన అనువాదం మరియు విస్కృతమైన వ్యాఖ్యానం.

ఈ ప్రసంగంలో, స్వామి స్మరణానందగారు , మొదటి అధ్యాయంలోని 3-5 శ్లోకాలకు యోగానందగారు చేసిన వ్యాఖ్యానాన్ని ఆధారంగా చేసుకొని, క్రమబద్ధమైన ధ్యానం ద్వారా అభివృద్ధి చెందే ప్రశాంతమైన, జాగృత సహజావబోధం యొక్క ఆంతరిక జ్యోతి ద్వారా చెడు అలవాట్లను ఎలా అధిగమించవచ్చో వివరిస్తారు. ఎలాగైతే పాండవులు విరాటుడు, ద్రుపదుడు, కుంతిభోజుడు వంటి అనేక మంది మిత్రుల సహకారంతో కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారో, అలాగే ఒక ఆధ్యాత్మిక సాధకుడికి కూడా భక్తి, వివేకం, వైరాగ్యం వంటి గుణాల తోడ్పాటు అవసరం; ఈ గుణాలు ధ్యానం ద్వారా కూడా అభివృద్ధి చెందుతాయి.

ఈ ప్రసంగం, తరువాత కూడా వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.

భగవద్గీతపై గత ప్రసంగాలు

ఈ ప్రసంగం యొక్క మొదటి మరియు రెండవ భాగాన్ని తెలుగులో వీక్షించడానికి, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

ఆంగ్లంలో ఈ శ్రేణిని వీక్షించడానికి, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి, ప్రతి ఒక్కటి అనేక భాగాలుగా ఉంది, స్వామి స్మరణానంద గిరిచే ఇవ్వబడింది.

ఈ పవిత్ర గ్రంథంపై వ్యాఖ్యానం గురించి

ఆధ్యాత్మిక మహాకావ్యమైన ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానందగారు భగవద్గీత పై తమ దివ్య అంతర్దృష్టితో వ్యాఖ్యానించారు. తమ వ్యాఖ్యానంలో, దాని మానసిక, ఆధ్యాత్మిక మరియు అధిభౌతిక లోతులను అన్వేషిస్తూ — రోజువారీ ఆలోచనలు మరియు చర్యల యొక్క సూక్ష్మ కారణాల నుండి విశ్వక్రమం యొక్క గొప్ప రూపకల్పన వరకు — జ్ఞానోదయం వైపు ఆత్మ చేసే ప్రయాణం యొక్క విస్తృత వృత్తాంతాన్ని యోగానందగారు పరిశోధిస్తారు.

గీత యొక్క సంతులిత ధ్యానమార్గం మరియు సరైన కార్యాచరణను స్పష్టంగా వివరిస్తూ, ఆధ్యాత్మిక సమగ్రత, ప్రశాంతత, సరళత మరియు ఆనందంతో కూడిన జీవితాన్ని మనం ఎలా సృష్టించుకోవచ్చో పరమహంసగారు చూపిస్తారు. మన జాగృత సహజావబోధం ద్వారా జీవిత మార్గంలోని ప్రతి కూడలిలో తీసుకోవాల్సిన సరైన మార్గాన్ని మనం తెలుసుకుంటాం. ఏ లోపాలు మనల్ని వెనక్కి నెట్టివేస్తున్నాయో, ఏ సానుకూల లక్షణాలు మనల్ని ముందుకు నడిపిస్తున్నాయో గుర్తించగలము, మరియు మార్గంలో ఉన్న ఆపదలను గుర్తించి నివారించగలము.

para-ornament

పరమహంస యోగానందగారు స్థాపించిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క ఆధ్యాత్మిక మరియు మానవతా కార్యకలాపాలకు మీరు మద్దతు ఇవ్వాలనుకుంటే, క్రింద ఉన్న బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా మీరు విరాళం ఇవ్వవచ్చు:

ఈ పేజీకి కొత్త సందర్శకులు

పరమహంస యోగానందగారు మరియు ఆయన బోధనల గురించి మరింత తెలుసుకోవడానికి మీరు ఈ క్రింది కథనాలను కూడా అన్వేషించవచ్చు.

ఇతరులతో పంచుకోండి