YSS

శ్రీ స్వామి చిదానంద గిరి నుండి నూతన సంవత్సర సందేశం

1 జనవరి, 2018

“ఈ కొత్త సంవత్సరంలో నేను ఒక కొత్త మనిషిని. అజ్ఞానమనే అంధకారాన్నంతా పారద్రోలి, నేను ఎవరి ప్రతిరూపంలో తయారయ్యానో ఆ పరమాత్ముని ప్రకాశవంతమయిన వెలుగును వ్యక్తపరిచే వరకు నా చేతనను మళ్ళీ మళ్ళీ పరివర్తిస్తాను.”

— శ్రీ పరమహంస యోగానంద

పర్వదినపు ఆనందం మరియు అభ్యున్నతి నిండిన ఈ కొత్త సంవత్సరంలోకి మనం అడుగిడుతున్నపుడు, గురుదేవులు పరమహంస యోగానందగారి ఆశ్రమాలలో క్రిస్మస్ ఆనందాన్ని ప్రపంచవ్యాప్తంగా మీ ప్రేమపూర్వక శుభాకాంక్షలతో పెంచిన మన ఆధ్యాత్మిక కుటుంబానికి మరియు స్నేహితులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సెలవుల్లోనూ, ఏడాది పొడవునా మీరు వివిధ రూపాలలో చూపిన దయాశీలతకు మేము ప్రగాఢంగా ముగ్ధులమయ్యాం. భగవంతుడిలోనూ, గురుదేవుల ప్రేమలోనూ మనం పంచుకునే ఆధ్యాత్మిక బంధానికి చెందిన ఈ హృద్యమైన జ్ఞాపికలను స్మృతిగా నిక్షిప్తంచేసుకున్నాం. మీ మనోవాంచిత ఉదాత్త లక్ష్యాలను సాధించడానికి మరియు మీలో ఉన్న దివ్య ప్రతిరూపాన్ని మరింత సువిదితం చేయడానికి మీరు చేసే ప్రయత్నాలను భగవంతుడు అనుగ్రహించాలనే నా ప్రార్థనలు మీ అందరికీ చేరుకుంటాయని తెలుసుకోండి.

మన భవితవ్యానికి మనమే యజమానులుగా ఉ౦డే౦దుకు భగవంతుడు ప్రసాదించిన స్వేచ్ఛను మనలో విముక్తం చేయడానికి ప్రతీ సంవత్సరం మనకు ఒక కొత్త అద్భుతమైన అవకాశాన్ని తెస్తు౦ది. మన౦ స్వతస్సిద్ధంగా జీర్ణించిన, అనుత్పాదక అలవాట్లను, ఆలోచనా ధోరణులను అనుసరి౦చవలసిన అవసర౦ లేదు, ఇంద్రియ, అహ౦కార, ఐహిక పరిసరప్ర భావముల వ౦టి ప్రేరేపణల ద్వారా మన ఆధ్యాత్మిక ఆదర్శాల ను౦డి ఏమరుచుకోవల్సిన అవసర౦ లేదు. వివేకము యొక్క శక్తి ద్వారా మరియు ఈ కొత్త సంవత్సరంలో ఒక తాజా ప్రారంభం యొక్క శక్తివర్ధకమైన ఆలోచనతో పునరావేశం చేయబడిన సంకల్పం ద్వారా, మనం మన దృష్టిని మెరుగు పరచవచ్చు మరియు మన ఆత్మ యొక్క దాగి ఉన్న సామర్థ్యాలను బహిర్గతం చేసే కొత్త బాటలను వెలిగించవచ్చు. గతం మిమ్మల్ని వెనక్కి నెట్టజాలదని లేదా భవిష్యత్తు మిమ్మల్ని భయపెట్టదని తెలుసుకోండి. మీరు ఆ అవగాహనతో వర్తమానంలో జీవించడానికీ అంతేకాక అనంతమైన వనరులు మీ ఆధీనంలోనే ఉన్నాయనే నమ్మకంతోనూ ముందుకు వెళ్ళవచ్చు.

గురుదేవులు మనల్ని నూతన సంవత్సర మార్గనిర్దేశానికి ఆత్మపరిశీలనం మరియు ధ్యానం ద్వారా మన చైతన్యాన్ని భగవంతుని సువ్యాప్తమైన సహాయితా చైతన్యముతో అనుసంధానమవ్వాలని, అటుపిమ్మట ఆలోచనా శక్తి మరియు సంకల్పం అనే దివ్య వరాలును మన జీవిత బాధ్యతలు చేపట్టడానికి ఉపయోగించమని ప్రోత్సహించారు. స్వకీయ-సంశయము, గత తప్పిదాల చింతన ఇంకా ఇతర రకాల ప్రతికూల ఆలోచనలను మనస్సు నుండి విడనాడటం చాలా ముఖ్యమైన మొదటి మెట్టు. ఆ అడ్డంకులను తొలగించిన తర్వాత, మీరు వ్యక్తీకరించాలనుకునే లేదా సాధించాలనుకుంటున్న సానుకూల గుణమును లేదా లక్ష్యాన్ని మీ సుస్పష్టమైన చైతన్యముపై ధృవీకరించి ముద్రించండి. గురుదేవులు మనకు ఉపదేశించినట్లు, “మీరు మీ మనస్సులో బలమైన ఆలోచనను ప్రేరేపిస్తే, మీ ప్రస్తుత చేతనలో మీరు ఏ ధోరణినైనా పెంపొందించవచ్చు; అప్పుడు మీ చర్యలు అలాగే మీ పూర్తి అస్తిత్వం ఆ ఆలోచనకు లోబడి ఉంటాయి.” ప్రశాంతంగా, ఓపికతో పట్టుదలతో సంకల్పం యొక్క క్రియాశీల శక్తిని వర్తింపజేయడం ద్వారా—మీరు ప్రయత్నిస్తున్న నిర్దిష్ట లక్ష్యాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రతిరోజూ మార్గాలను శోధించడం ద్వారా—మీరు నిర్ధారించినది వాస్తవికతదాల్చడం మీరు చూస్తారు.

మీ ప్రయత్నాల్లో మీరు ఒంటరిగా లేరని కూడా గుర్తుంచుకోండి. దైనందిన ధ్యానం యొక్క నిశ్శబ్దంలో మీరు సర్వ శక్తికి మూలాధారమైన భగవంతునితో సంభాషిస్తే, మీ ఆలోచనల క్రింద ఆయన శక్తి ప్రవహిస్తున్నట్లు మీరు మరింత ఎక్కువగా అనుభూతి చెందుతారు, ఆయన శక్తివంతమైన సంకల్పం మీ సంకల్పాన్ని బలపరుస్తుంది, మరియు ఆయన జ్ఞానం మరియు ప్రేమ మీకు మార్గనిర్దేశం చేస్తాయి. గురుదేవులు మనకు ఉపదేశించినట్లు, “ప్రతీ నిమిషం మీకు మరియు భగవంతుడికి మధ్య ఒక బంధం.” ఆ అవగాహనలో జీవించడం ద్వారా, మీ చైతన్యం ఉపరితలం క్రింద ప్రవహించే నిశ్శబ్ద నదిని మీరు కనుగొంటారు, మీ మొత్తం అస్తిత్వాన్ని మరియు మీ ఉదాత్త ఆకాంక్షలను పరిపోషిస్తారు. మీలో అంతర్గత పరివర్తన ద్వారా మరియు మీ ఆత్మ లక్షణాల ఆవిష్కృతం ద్వారా, మీరు ఇతరులలోని మంచిని వెలికితీస్తారు మరియు తమ నిజమైన దివ్య ఆత్మను కనుగొని, వ్యక్తపరచడానికి వారిని ప్రోత్సహిస్తారు.

మీకు మరియు మీ ప్రియతములకు భగవంతుని ప్రేమ మరియు నిరంతర పూర్ణ ఆశీస్సులతో నూతన సంవత్సర శుభాకాంక్షలు.
శ్రీ స్వామి చిదానంద గిరి

Share this on

Share on facebook
Share on twitter
Share on whatsapp