ఒక యోగి ఆత్మకథ యొక్క 75వ వార్షికోత్సవ వేడుకలను జరుపుకోవడం

29 అక్టోబరు, 2021

లక్షలాదిమంది జీవితాలను మార్చిన పుస్తకం​

ఒక-యోగి-ఆత్మకథ-75వ వార్షికోత్సవ-చిత్రం(1)

నేను ఒక యోగి ఆత్మకథ పుస్తకాలను ఇంటిలో కుప్పలుగా ఉంచుతాను మరియు దానిని నిరంతరం ప్రజలకు అందిస్తాను. ప్రజలు మళ్ళీ గాడిలో పడాలనుకున్నప్పుడు, నేను దీనిని చదవమని చెబుతాను. ఎందుకంటే ఇది ప్రతి మతం యొక్క హృదయాన్ని ఛేదిస్తుంది.

— జార్జ్ హరిసన్ (స్వర్గీయ బీటెల్స్ మాజీ సభ్యులు)

"ఒక యోగి ఆత్మకథ" మీ జీవితాన్ని ఎలా మార్చింది?

మీ కథను మాతో పంచుకోండి!

ఒకరోజు పరమహంసగారు ఒక యోగి ఆత్మకథపై పని చేస్తున్నప్పుడు, తనతో ఉన్నవారితో నిశ్శబ్దంగా ఇలా అన్నారు, “నేను ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టినప్పుడు, ఈ పుస్తకం లక్షలాదిమంది ప్రజల జీవితాలను మారుస్తుంది.” డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ప్రచురించబడినప్పటి నుండి ఆధ్యాత్మిక మహాకావ్యంగా విస్తృతంగా ప్రశంసించబడిన ఒక యోగి ఆత్మకథ ప్రభావం నిరంతరం పెరుగుతూ, ప్రపంచవ్యాప్తంగా పాఠకుల జీవితాలకు ప్రేరణనిస్తూ, పరివర్తన కలిగిస్తోంది.

యోగానందగారి ఆత్మకథ పాఠకులను బహుముఖ ప్రయాణంలో తీసుకువెళ్తుంది. రచయిత యొక్క వ్యక్తిగత జీవితం మరియు ఆధ్యాత్మిక అన్వేషణలో లోతైన, తీక్షణమైన అంతర్దృష్టి నుండి అనేకమంది సాధువుల మరియు యోగుల (ప్రసిద్ధులు మరియు ప్రసిద్ధులు కానివారు) మనోహరమైన చిత్రాలు, భారతదేశ ఆధ్యాత్మికత యొక్క నిగూఢమైన అంశాల లోతైన వివరణల వరకు తీసుకువెళ్తుంది. తమలో ఉన్న దైవాన్ని అనుభవించాలనే గాఢమైన కోరికను, చాలామందిలో ఒక యోగి ఆత్మకథ కలిగించింది.

ఒక నిరంతర ప్రేరణకు మూలాధారం

1946 శీతాకాలంలో ఒక యోగి ఆత్మకథ తొలిసారిగా ప్రచురించబడినప్పుడు, పాఠకులు మరియు ప్రపంచ పత్రికల నుండి ప్రశంసల వర్షం కురిసింది.

కొలంబియా యునివర్సిటి ప్రెస్ ఇలా వ్రాసింది, “ఇంతకుముందు ఇంగ్లీషులోగానీ లేదా మరే ఇతర భాషలోగానీ యోగముపై ఇలాంటి వివరణ వ్రాయబడలేదు.” న్యూస్ వీక్ పత్రిక ఇలా వ్రాసింది, “యోగానందగారి పుస్తకం శరీరం గురించి కాకుండా ఆత్మను గురించి వివరించిన కథ….మనోహరంగా మరియు స్పష్టంగా వివరించిన అధ్యయనం.” మరియు న్యూయార్క్ టైమ్స్ ఇలా వర్ణించింది, “ఒక అరుదైన వృత్తాంతం.”

అప్పటి నుండి, పుస్తకం యొక్క విస్తృతమైన ఆకర్షణ మరియు ప్రజాదరణ కొనసాగుతూనే ఉంది. 1999లో ఈ పుస్తకం “శతాబ్దపు 100 ఉత్తమ ఆధ్యాత్మిక పుస్తకాలలో,” ఒకటిగా పేర్కొనబడింది.

మరియు ఇటీవల ఫైనాన్షియల్ న్యూస్ వైర్ 24/7 వాల్ సెయింట్, ఒక యోగి ఆత్మకథను ఒక ప్రత్యేక నివేదికలో “అన్ని కాలాల్లోనూ అత్యంత ప్రజాదరణ పొందిన 20 ఆత్మకథలలో ఒకటిగా పేర్కొంది.” ప్రదర్శించబడిన 900 రచనల నుండి హెలెన్ కెల్లర్ యొక్క ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ మరియు నెల్సన్ మండేలా యొక్క లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, వంటి ఇతర రచనలు, ఒక యోగి ఆత్మకథతో పాటు ఎంపిక చేయబడ్డాయి.

“మానవ ఆత్మశక్తి యొక్క సంతోషకరమైన ధృవీకరణ” (వెస్ట్ కోస్ట్ రివ్యూ ఆఫ్ బుక్స్) గా పరిగణించబడుతోంది—బయట తరచుగా కల్లోలంగా ఉండేదానికి విరుద్ధంగా, ఆధ్యాత్మిక సమతుల్యత మరియు ఆంతరిక శాంతిని పొందడంలో ఆసక్తి కారణంగా ఇటీవలి సంవత్సరాలలో ధ్యానం పట్ల పెరుగుతున్న ఆసక్తి మరియు పరివర్తన కలిగించే పరమహంస యోగానందగారి బోధనల పట్ల కొనసాగుతున్న ఔచిత్యం కారణంగా ఒక యోగి ఆత్మకథ పట్ల ఆకర్షణ నిలకడగా పెరుగుతోంది.

నోబెల్ బహుమతి గ్రహీత ధామస్ మాన్, యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ (ఆయన స్మారకార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుస్తకాన్ని ఇచ్చే ఏర్పాటు చేశారు), ప్రఖ్యాత సంగీత విద్వాంసులుగా కొనియాడబడుతున్న జాన్ కోల్ట్రేన్, రవిశంకర్, బీటిల్ జార్జ్ హారిసన్ మరియు అంతర్జాతీయ క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ వంటి వివిధ రంగాల వారిని ఈ పుస్తకం సంవత్సరాలుగా ఆకర్షిస్తోంది.

ఒక యోగి ఆత్మకథ గురించి మీరు, ఏమనుకుంటున్నారో పంచుకోండి

శ్రీ పరమహంస యోగానందగారి ఆత్మకథ నన్ను అనేక విధాలుగా ఆశీర్వదించింది. నేను తరచుగా ధ్యానం చేయడానికి మరియు నా భౌతిక, ఆధ్యాత్మిక జీవితంలో సమతుల్యతపై దృష్టి కేంద్రీకరించడానికి ఆయన జీవితకథ ప్రేరణనిచ్చింది, అలాగే, దేవుడు అంటే తెలుసుకోవడానికి ఉత్తమ అంతర్దృష్టి కలిగించింది…

— సి.ఎం., పుణె

శ్రీ పరమహంస యోగానందగారి ఒక యోగి ఆత్మకథ యొక్క 75వ వార్షికోత్సవంలో భాగంగా, మీ స్వంత జీవితంపై పుస్తకం యొక్క ప్రభావం గురించి మీ వ్యక్తిగత జ్ఞాపకాలను పంచుకోవడం ద్వారా పుస్తకం యొక్క శాశ్వత వైభవంలో పాలుపంచుకోవాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

లక్షలమందిలో మార్పు తీసుకొచ్చినట్లుగా, మీ జీవితాన్ని ఒక యోగి ఆత్మకథ ఏ విధంగా మార్చిందో నేర్చుకోవడానికి మరియు మా వెబ్ సైట్, సోషల్ మీడియాలో పంచుకోవడానికి మేము ఎదురుచూస్తున్నాము! మీ స్వంత సోషల్ మీడియా పేజీలలో నేరుగా ఈ పుస్తకంతో మీ కథలను భాగస్వామ్యం చేయాలనుకుంటే, దయచేసి మీ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్ లో @yoganandayss వద్ద మమ్మల్ని ట్యాగ్ చేయండి.

మా వెబ్ సైట్ లోని ఒక యోగి ఆత్మకథ పేజీని కూడా సందర్శించమని, మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.

ఇతరులతో పంచుకోండి