ఈ కార్యక్రమం ముగిసినది.
మీరు ఏదైనా రాబోయే కార్యక్రమంలో పాల్గొనదలచుకొంటే, దయచేసి కార్యక్రమాల పేజీని సందర్శించండి.

గురుపూర్ణిమ

(స్మారకోత్సవ ధ్యానం మరియు ప్రవచనం)

వై.ఎస్.ఎస్. ఓ.డి.కె. గురుపూర్ణిమ స్మారకోత్సవ ధ్యానం మరియు ప్రసంగం – జూలై 2026

ఈ కార్యక్రమం గురించి

గురువును గాఢమైన ప్రేమతో గౌరవింపుము. గురువు సాంగత్యములో ఉండడమంటే కేవలము ఆయన భౌతిక సన్నిధిలో ఉండుట మాత్రమే కాదు (ఒక్కొక్కసారి ఇది అసాధ్యము కూడా), దీనర్థమేమంటే ప్రధానంగా గురువును మన హృదయములో నిలుపుకొనుట, సూత్రప్రాయముగా ఆయనతో ఏకమగుట, నిత్యము ఆయనతో అనుసంధానములో ఉండుట.

— స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి

పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా, పూజ్యులైన వై.ఎస్.ఎస్. గురుపరంపరకు — ప్రత్యేకంగా మన ప్రియతమ గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారికి వై.ఎస్.ఎస్. భక్తులు హృదయపూర్వక వందనాలు అర్పిస్తారు. గురుదేవుల దివ్యప్రేరణ మరియు మార్గదర్శకత్వం మనలను ఆత్మసాక్షాత్కార మార్గంలో నడిపిస్తూనే ఉంటాయి.

ఈ పర్వదినాన్ని జరుపుకోవడానికి మరియు పవిత్రమైన గురు-శిష్య సంబంధాన్ని గౌరవించడానికి, ఈ జూలైలో జరుగబోయే ఈ క్రింది కార్యక్రమాలలో మాతో కలసి పాల్గొనడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము:

వై.ఎస్.ఎస్. సన్యాసిచే హిందీలో ప్రత్యేక ప్రసంగం

बलिहारी गुरु आपने, गोविंद दियो बताय

(భగవంతుడి వద్దకు మనల్ని నడిపించే సద్గురువుకు జయము జయము)

మంగళవారం, జూలై 28, 2026
సాయంత్రం 6:30 – 7:30 (భారతీయ కాలమానం ప్రకారం)

ఈ ప్రసంగంలో, వై.ఎస్.ఎస్. సన్యాసి, స్వామి వాసుదేవానంద గిరి, పరమహంస యోగానందగారి జ్ఞానప్రబోధాలను ఆధారంగా తీసుకుని, మానవుల ఆత్మను భగవంతుడితో కలిపే ప్రత్యక్షమైన, సజీవమైన వారధి గురువు అని వివరిస్తారు; అలాగే, మన జాగృతి యొక్క మూలాన్ని గుర్తించకుండా ఆధ్యాత్మిక పురోగతి అసాధ్యమని; మరియు, గురుపూర్ణిమ పర్వదినం ఆచారబద్ధమైన పూజలకు మాత్రమే పరిమితమైన రోజు కాదని, అది ముఖ్యంగా మన అంతరంగంలో ఉన్న చీకటిని పారద్రోలే జ్ఞానజ్యోతి యొక్క ఉత్సవమని మనకు గుర్తుచేస్తారు.

ఈ ప్రసంగం యొక్క హిందీ శీర్షిక, “बलिहारी गुरु आपने, गोविंद दियो बताय” (మనను భగవంతుడి వద్దకు నడిపించే సద్గురువుకు జయము జయము).

“गुरु गोविंद दोऊ खड़े, काके लागूं पाँय
बलिहारी गुरु आपने, गोविंद दियो बताय”

15వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ మార్మికుడు మరియు కవి అయిన కబీర్ యొక్క ఈ సుందరమైన పద్యాన్ని ఆధారంగా చేసుకుని, స్వామి వాసుదేవానంద, సద్గురువు యొక్క అనుగ్రహం, ఆయన యొక్క జ్ఞానం మరియు మార్గనిర్దేశం లేనిదే, సాధకుడు సర్వవ్యాపియైన భగవంతుడి దివ్యమైన ఉనికిని తెలుసుకోలేని “అంధుడిగా” మిగిలిపోతాడని వివరిస్తారు. మనస్సనే అద్దాన్ని మెరుగుపెట్టి, అజ్ఞానం (అవిద్య) అనే అంధకారాన్ని తొలగించి, భగవంతుడి వద్దకు దారి చూపేది సద్గురువే. అందువల్లనే, అంతిమ గమ్యానికి (భగవంతుడికి) ముందే, భగవత్-సాక్షాత్కారానికి మాధ్యమమైన సద్గురువును మనం గౌరవిస్తాము.

ఈ ప్రసంగాన్ని మీ కుటుంబం మరియు మిత్రులతో కలసి చూడమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

దయచేసి గమనించండి: ఈ ప్రసంగం, జూలై 30, రాతి 10 గంటల వరకు (భారతీయ కాలమానం ప్రకారం) వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.

స్మారకోత్సవ ధ్యానం

బుధవారం, జూలై 29, 2026
ఉదయం 6:30 – 8:30 (భారతీయ కాలమానం ప్రకారం)

జూలై 29న, ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి ఒక ప్రత్యేక ఆన్‌లైన్ ధ్యానాన్ని నిర్వహిస్తారు. అందులో కొద్దిసేపు కీర్తన మరియు ధ్యానాల తరువాత, ఒక ప్రసంగం ఉంటుంది.

దయచేసి గమనించండి: ఈ ప్రసంగం, ఆగస్టు 1, శనివారం రాతి 10 గంటల వరకు (భారతీయ కాలమానం ప్రకారం) వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.

వ్యక్తిగతంగా పాల్గొనే కార్యక్రమాలు

గురుపూర్ణిమను జరుపుకోవడానికి వ్యక్తిగతంగా పాల్గొనే ప్రత్యేక కార్యక్రమాలు కూడా వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళలో నిర్వహించబడతాయి. వీటి గురించి మరింతగా తెలుసుకోడానికి, వీటిలో ఒకదానిలో పాల్గొనడానికి, మీ సమీపంలో ఉన్న ధ్యాన కేంద్రంను సంప్రదించండి.

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు స్వామి చిదానంద గిరిగారి సందేశం

ఈ సందర్భంగా, మన పూజ్య అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరిగారి సందేశాన్ని చదవడం కోసం ఈ క్రింది బటన్ ను క్లిక్ చేయండి:

ఈ పవిత్ర దినమున విరాళం సమర్పించాలన్న ప్రేరణ మీకు కలిగినట్లయితే, ఈ క్రింది బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు సమర్పించవచ్చు. వై.ఎస్.ఎస్. గురుపరంపర ద్వారా లభించే అనేక ఆశీర్వాదాలకు హృదయపూర్వకమైన కృతజ్ఞతగా వాటిని మేము భావిస్తాము. మీ ఔదార్యానికి మా కృతజ్ఞతలు.

మన గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు మరియు వై.ఎస్.ఎస్. గురు పరంపర, మీ జీవితంలో కురిపించిన అపారమైన ఆశీస్సులకు ప్రేమను మరియు కృతజ్ఞతలను మీరు వ్యక్తం చేయాలనుకున్నా, మరియు వారి దివ్య కార్యాచరణకు సేవలందించేలా మన నిబద్ధతను పునరుద్ఘాటించుకొనేందుకు, గురుపూర్ణిమ విజ్ఞప్తిని చదవమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం:

To make an offering on this special occasion, please click the button below:

నూతన సందర్శకులు

వై.ఎస్.ఎస్. కు మరియు పరమహంస యోగానందగారి బోధనలకు కొత్తవారైతే, క్రింద ఉన్న లింక్ లను అన్వేషించడానికి ఇష్టపడవచ్చు:

ఒక యోగి ఆత్మకథ

ఒక అత్యుత్తమ ఆధ్యాత్మిక రచనగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడుతున్న తమ పుస్తకం గురించి పరమహంసగారు తరచుగా, “నేను లేనప్పుడు ఈ పుస్తకం నా దూత అవుతుంది,” అనే వారు.

వై.ఎస్.ఎస్. పాఠాలు

మీరు ఊహించని విధంగా మీ జీవితాన్ని మార్చడానికి, సమతుల్యతను సాధించటానికి మరియు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మీకు సహాయపడే గృహ-అధ్యయన పాఠ్యక్రమం.

ఇతరులతో పంచుకోండి