నిజమైన ప్రేమ దైవపరమైనది, దైవప్రేమే ఆనందం. దహించే కోరికతో మీరు భగవంతుణ్ణి అన్వేషిస్తూ అధికంగా ధ్యానం చేసినకొద్దీ ఆ ప్రేమను అధికంగా మీ హృదయంలో మీరు అనుభవించగలుగుతారు. అప్పుడు తెలుసుకొంటారు మీరు, ప్రేమంటే ఆనందమనీ, ఆనందం భగవంతుడనీ.
— పరమహంస యోగానంద
జనవరి 5వ తేదీ పరమహంస యోగానందగారి ఆవిర్భావ దినం (వార్షిక జన్మదినం), ఆయన భారతదేశంలోని గోరఖ్ పూర్ లో భగవతి మరియు జ్ఞాన ప్రభా ఘోష్ దంపతులకు 1893లో జన్మించారు, ఆయనకు ముకుందలాల్ ఘోష్ అని నామకరణం చేయడం జరిగింది. ఆయన జన్మించడానికి ముందే, పశ్చిమానికి భారతదేశ సనాతన జ్ఞానాన్ని తీసుకువచ్చే కీలకపాత్రను ఆయన పోషించబోతున్నారని జ్ఞానపూర్ణులైన వారి గురుపరంపర ముందుగానే సూచించింది.
మన గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి జన్మోత్సవం యొక్క ఈ పవిత్రమైన సందర్భాన్ని పురస్కరించుకొని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేక ఆన్‌లైన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీన్ని ఆంగ్లంలో ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి ఆదివారం, జనవరి 5, ఉదయం 6:30 నుండి ఉదయం 8:30 (భారతీయ కాలమానం) వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రార్థన, భక్తిగీతాలాపన, పఠనం, మరియు నియమిత సమయంపాటు ధ్యానం, తరువాత ఒక ప్రసంగంతో కూడి ఉంది.
ప్రేమావతారుల పట్ల ప్రేమ, భక్తి మరియు హృదయపూర్వకమైన కృతజ్ఞతతో దేశవ్యాప్తంగా ఉన్న మా ఆశ్రమాలు, ధ్యాన కేంద్రాలు మరియు మండళ్లలో కూడా పరమహంసగారి జన్మోత్సవం వేడుకగా నిర్వహించబడింది.
మరింతగా తెలుసుకొనేందుకు ఈ క్రింద ఉన్న లింక్ లను అన్వేషించడానికి మీరు ఇష్టపడవచ్చు:
ఈ రోజున, జీవితంలో పరివర్తన చేకూర్చే క్రియాయోగ ధ్యాన బోధనలను ప్రపంచానికి అందించినందుకు మరియు తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో వారి మార్గదర్శకత్వానికి మరియు ఆశీస్సులకు కృతజ్ఞతగా భక్తులు పరమహంసగారికి ప్రణామి సమర్పిస్తారు. ఈ పవిత్రమైన సమర్పణ మీరు చేయాలనుకొంటే, దయచేసి క్రింద ఉన్న బటన్ మీద క్లిక్ చేయండి.