ఈ కార్యక్రమం ముగిసినది.
మీరు ఏదైనా రాబోయే కార్యక్రమంలో పాల్గొనదలచుకొంటే, దయచేసి కార్యక్రమాల పేజీని సందర్శించండి.

Commemorations Honouring
Sri Sri Lahiri Mahasaya

వై.ఎస్.ఎస్. ఓ.డి.కె. లాహిరీ మహాశయుల స్మారకోత్సవ కార్యక్రమాలు — సెప్టెంబర్ 2026

ఈ కార్యక్రమం గురించి

మహనీయులైన ఈ గృహస్థ-గురువుల సామరస్య సంతులిత జీవనం, వేలకొద్దీ స్త్రీపురుషులకు ఉత్ప్రేరణ అయింది.

— పరమహంస యోగానంద

పరమహంస యోగానందగారికి పరమగురువులు అయిన లాహిరీ మహాశయులను వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు, ఆధునిక ప్రపంచానికి క్రియాయోగాన్ని పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించిన యోగావతారులుగా (“యోగా యొక్క అవతారం”), గౌరవిస్తారు. 1828 సెప్టెంబర్ 30న జన్మించిన లాహిరీ మహాశయులు 1895 సెప్టెంబర్ 26న తమ మహాసమాధి సందర్భంగా ఈ ప్రపంచాన్ని వదిలివెళ్లారు. మహాసమాధి అనగా చివరి ధ్యానం లేదా భగవంతునితో సచేతన సంసర్గం; పరిపూర్ణుడైన సద్గురువు ఈ స్థితిలో విశ్వప్రణవమైన ఓంకారంలో లీనమై తమ భౌతిక శరీరాన్ని విడిచిపెడతారు.

లాహిరీ మహాశయుల మహాసమాధి మరియు ఆవిర్భావ వార్షికోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబర్ 2026 లో రెండు ప్రత్యేక ఆన్‌లైన్ ధ్యానాలను వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహిస్తారు:

లాహిరీ మహాశయుల మహాసమాధి దినోత్సవం
స్మారకోత్సవ ధ్యానం

శనివారం, సెప్టెంబర్ 26, 2026
ఉదయం 6:30 – ఉదయం 8:00 (భారతీయ కాలమానం)

1895 సెప్టెంబర్ 26న, ఈ మహాగురువులు మహాసమాధిలో ప్రవేశించారు, మహాసమాధి అనగా శరీరం నుండి దైవ-సాక్షాత్కారం పొందిన యోగి యొక్క సచేతన అంతిమ నిష్క్రమణ. ఈ రోజును పురస్కరించుకుని, వై.ఎస్.ఎస్. సన్యాసి నేతృత్వంలో నిర్వహించబడే ఆన్‌లైన్ ధ్యానంలో పాల్గొనమని మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము.

ఈ కార్యక్రమం ప్రారంభ ప్రార్థనతో మొదలవుతుంది. అనంతరం పఠనం, భక్తి గీతాలాపన, మరియు నియమిత సమయంపాటు ధ్యానం ఉంటాయి. ఆ తరువాత, పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమం సమాప్తమవుతుంది.

దయచేసి గమనించండి: ఈ కార్యక్రమం ఆదివారం, సెప్టెంబర్ 27, రాత్రి 10 (భారతీయ కాలమానం) వరకు వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.

లాహిరీ మహాశయుల ఆవిర్భావ దినోత్సవం
స్మారకోత్సవ ధ్యానం

బుధవారం, సెప్టెంబర్ 30, 2026
ఉదయం 6:30 – ఉదయం 8:00 (భారతీయ కాలమానం)

ఈ యోగావతారుల ఆవిర్భావ దినోత్సవాన్ని (జయంతి వార్షికోత్సవం) పురస్కరించుకుని సెప్టెంబర్ 30న ఒక ప్రత్యేక ఆన్‌లైన్ ధ్యానాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ప్రారంభ ప్రార్థనతో మొదలై, పఠనం, భక్తి గీతాలాపన మరియు ధ్యానంతో కొనసాగుతుంది. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ అభ్యాసం మరియు ముగింపు ప్రార్థనతో ఇది సమాప్తమవుతుంది.

దయచేసి గమనించండి: ఈ కార్యక్రమం గురువారం, అక్టోబర్ 1, రాత్రి 10 (భారతీయ కాలమానం) వరకు వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.

వ్యక్తిగతంగా పాల్గొనే కార్యక్రమాలు

ఈ ప్రత్యేక సందర్భాలలో వ్యక్తిగతంగా పాల్గొనే కార్యక్రమాలు వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళలో నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాల గురించి మరింతగా తెలుసుకొని, పాల్గొనడానికి, మీకు దగ్గరలో ఉన్న ఒక ధ్యాన కేంద్రమును సంప్రదించండి.

విరాళం సమర్పించండి

ఈ పవిత్రమైన రోజులలో మీరు విరాళం సమర్పించాలనుకుంటే, మా వెబ్‌సైట్‌ను సందర్శించి క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా సమర్పించవచ్చు. మీ సహకారం మాకు అనేక మానవతావాద కార్యక్రమాలను చేపట్టడానికి సహాయపడటమే కాకుండా, మహాగురువుల పట్ల మీ శాశ్వతమైన ప్రేమను మరియు అచంచలమైన భక్తిని చూపుతుంది.

నూతన సందర్శకులు

వై.ఎస్.ఎస్. కు మరియు పరమహంస యోగానందగారి బోధనలకు కొత్తవారైతే, క్రింద ఉన్న లింక్ లను అన్వేషించడానికి ఇష్టపడవచ్చు:

ఒక యోగి ఆత్మకథ

ఒక అత్యుత్తమ ఆధ్యాత్మిక రచనగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడుతున్న తమ పుస్తకం గురించి పరమహంసగారు తరచుగా, “నేను లేనప్పుడు ఈ పుస్తకం నా దూత అవుతుంది,” అనే వారు.

వై.ఎస్.ఎస్. పాఠాలు

మీరు ఊహించని విధంగా మీ జీవితాన్ని మార్చడానికి, సమతుల్యతను సాధించటానికి మరియు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మీకు సహాయపడే గృహ-అధ్యయన పాఠ్యక్రమం.

ఇతరులతో పంచుకోండి