నూతన సంవత్సరపు ప్రారంభ ధ్యానం

బుధవారం, డిసెంబర్ 31, 2025

రాత్రి 11:30 (డిసెంబర్ 31)

– 12:15 గంటల వరకు (జనవరి 1)

(భారతీయ కాలమానం ప్రకారం)

నూతన సంవత్సర ప్రారంభ ధ్యానం - డిసెంబర్ 31, 2025

ఈ కార్యక్రమం గురించి

నూతన సంవత్సరాన్ని మీరు నాటవలసిన ఒక తోటగా భావన చెయ్యండి. ఈ నేలలో మంచి అలవాట్లనే విత్తనాలను నాటి, పూర్వం నుండి ఉన్న చింతలు, చెడు కర్మలనే కలుపు మొక్కలను తొలగించండి.

— పరమహంస యోగానంద

నూతన సంవత్సర ఆరంభంలో సామూహిక ధ్యాన సాధన చేసే సంప్రదాయాన్ని పరమహంస యోగానందగారు ప్రారంభించారు. నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో గాఢమైన ధ్యానం చేయమని, మరియు చెడు అలవాట్లను విడిచిపెట్టి వాటి స్థానంలో మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని భక్తులను ఆయన ప్రోత్సహించారు.

ఒక ప్రత్యేక ఆన్‌లైన్‌ నూతన సంవత్సర ప్రారంభ సామూహిక ధ్యానం బుధవారం, డిసెంబర్ 31 రాత్రి 11:30 నుండి గురువారం, జనవరి 1, 12:15 (భారతీయ కాలమానం) వరకు నిర్వహించబడుతుంది. మాతో కలిసి ఇందులో పాల్గొనేందుకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ధ్యానాన్ని ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి ఆంగ్లంలో నిర్వహిస్తారు.

దయచేసి గమనించండి: ఈ ధ్యానంలో పైన పేర్కొన్న సమయంలో పాల్గొనలేనివారి కోసం ఈ కార్యక్రమం యొక్క రికార్డింగు గురువారం, జనవరి 6, రాత్రి 10 (భారత కాలమానం) వరకు యూట్యూబ్ లో వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.

New Year Eve Meditation - December 31, 2025

నూతన సంవత్సరాన్ని ధ్యానంతో ప్రారంభించే ఈ అద్వితీయమైన పద్ధతిని మన వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, మరియు కొన్ని కేంద్రాలు, మండళ్ళు కూడా పాటిస్తాయి. మరిన్ని వివరాల కోసం మీకు దగ్గరలోని వై.ఎస్.ఎస్. కేంద్రంను సంప్రదించండి.

ఈ నూతన సంవత్సర సందర్భంలో, పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక మరియు మానవతావాద కార్యాలకు సహాయం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. విరాళం సమర్పించడానికి దయచేసి క్రింద ఉన్న బటన్ మీద క్లిక్ చేయండి.

నూతన సందర్శకులు

వై.ఎస్.ఎస్. కు మరియు పరమహంస యోగానందగారి బోధనలకు కొత్తవారైతే, క్రింద ఉన్న లింక్ లను అన్వేషించడానికి ఇష్టపడవచ్చు:

ఒక యోగి ఆత్మకథ

ఒక అత్యుత్తమ ఆధ్యాత్మిక రచనగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడుతున్న తమ పుస్తకం గురించి పరమహంసగారు తరచుగా, “నేను లేనప్పుడు ఈ పుస్తకం నా దూత అవుతుంది,” అనే వారు.

వై.ఎస్.ఎస్. పాఠాలు

మీరు ఊహించని విధంగా మీ జీవితాన్ని మార్చడానికి, సమతుల్యతను సాధించటానికి మరియు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మీకు సహాయపడే గృహ-అధ్యయన పాఠ్యక్రమం.

ఇతరులతో పంచుకోండి